శేఖర్ మాస్టర్ గురించి షాకింగ్ విషయం..2003లోనే పోయాడట, అసలు విషయం ఏంటంటే ?

టాలీవుడ్లో సీనియర్ డాన్స్ మాస్టర్లలో ఒకరైన రాకేష్ మాస్టర్ వద్ద శిష్యరికం చేసి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డాన్స్ మాస్టర్లలో ఒకరుగా రాణించడంతో పాటు ఢీ 10 లాంటి డాన్స్ రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్. అయితే ఆయన గురించి గూగుల్ షాకింగ్ విషయం చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే

రాకేష్ మాస్టర్ శిష్యుడిగా

రాకేష్ మాస్టర్ శిష్యుడిగా

బుల్లితెరపై, సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ చేసే రచ్చ అందరికీ తెలిసిందే.రాకేష్ మాస్టర్ శిష్యుడిగా ఢీ2 షోలో ఎంట్రీ ఇచ్చి పార్టిసిపేట్ చేసిన శేఖర్ మాస్టర్, ఢీ5 జోడీ స్పెషల్లోనూ పార్టిసిపెంట్ గా పాల్గొన్నాడు. ఆ తర్వాత ఢీ7 నుంచి ఇప్పుడు నడుస్తున్న ఢీ13 సీజన్‌ కి జడ్జిగా వ్యవహారిస్తున్నాడు.

అక్కడా-ఇక్కడా

అక్కడా-ఇక్కడా

ఇక టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్‌గా పేరు సంపాదించిన శేఖర్ మాస్టర్ బుల్లితెరపై సెటైర్లు, పంచ్‌లతో నానా రచ్చ చేస్తుంటాడు. ఢీ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన పాపులారిటీని సరిగ్గా వాడుకున్న శేఖర్ మాస్టర్, కామెడీ స్టార్స్, జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్‌ల్లో కూడా మెరుస్తూ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

సోషల్ మీడియాలో రచ్చ

సోషల్ మీడియాలో రచ్చ

అయితే తాజాగా ఆయన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గూగుల్‌ శేఖర్‌ మాస్టర్‌ ని చంపేసింది. అదేంటి అనుకుంటున్నారా ? మనకు సందేహం వచ్చినప్పుడు, సమాధానం అడగడం ద్వారా ఇతరులకు మన అజ్ఞానాన్ని చూపించాల్సిన అవసరం లేదని భావిస్తాం కదా. అందుకే మనం గుడ్డిగా గూగుల్‌ సెర్చ్ చేస్తాం. గూగుల్ లో వచ్చేది ఖచ్చితమైన సమాధానం అని ఫీలవుతాం.

మరణ తేదీ

మరణ తేదీ

అయితే గూగుల్ 100% ఖచ్చితమైనదని నమ్మకూడదు.ఎందుకంటే మీకు సందేహం ఉంటే, తెలుగు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి గూగుల్ చేయండి. అతని పేరును శోధిస్తే ఫలితం వెంటనే మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మనకి శేఖర్ మాస్టర్ ఫోటో గ్రాఫ్ లను చూపిస్తుంది అలాగే ఆయన మరణ తేదీని 2003గా చూపిస్తుంది.

Recommended Video

Shekar Master Daughter Turns Anchor, Interview Promo | Filmibeat Telugu
అసలు విషయం ఏంటంటే

అసలు విషయం ఏంటంటే

అయితే టెన్షన్ పడకండి. అసలు విషయం ఏంటంటే.. తమిళనాడుకు చెందిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ జేవీ శేఖర్‌ని అక్కడ అందరూ మాస్టర్‌ శేఖర్‌ అని పిలిచేవారు. దాదాపు 50పైగా చిత్రాల్లో నటించిన ఆయన జూలై 8, 2003న మరణించారు. ఆయన పేరుకు గూగుల్‌ పొరపాటున కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఫోటోలని ఎటాచ్ చేసింది. అలా ఇదంతా జరుగుందన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X