Gunde Ninda Gudi Gantalu August 18th: తాగుబోతుగా మారిపోయిన బాలు.. కారు ఎత్తుకెళ్లిన పోలీసులు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 15వ తేదీ 489వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణికి కొత్త సమస్య వస్తుంది. మీనా తన తల్లిగారి ఇంటికి వెళ్తుంది. ఈ సందర్భంగా అక్కడ తన తల్లి పార్వతీకి జ్వరం వస్తుంది. దాంతో రెస్ట్ తీసుకోమని సూచనలు చేస్తూ ఉంటుంది. ఇక ఇదే సమయంలో మీనా తమ్ముడు శివ ఫైనాన్షియర్ గుణతో కలిసి అక్కడికి వస్తాడు. గుణతో శివను చూసిన మీనా మండి పోతుంది. అసలు నిన్ను గుణతో తిరగవద్దని ఎన్నిసార్లు చెప్పాలని ప్రశ్నిస్తుంది. నీకు కూడా మా తమ్ముడిని వదిలేయమని చాలా సార్లు చెప్పాను. అయినా నువ్వు వినడం లేదు. మరోసారి నా తమ్ముడు శివతో కలిసి నువ్వు కనిపిస్తే ఏమాత్రం ఊరుకోనని గుణను మీనా హెచ్చరిస్తుంది. ఈ తాగుబోతుతో నీకు పనేంటిరా అని తమ్ముడు శివను మీనా బెదిరిస్తుంది. ఎన్ని సార్లు చెప్పినా నువ్వు వినడం లేదు ఎందుకు అని నిలదీస్తుంది. శివ నేను కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని గుణ చెప్పే ప్రయత్నం చేసినా మీనా పట్టించుకోదు.

ఇక తాగుబోతు అని మీనా తనను అవమానించడంతో గుణ హార్ట్ అవుతాడు. ఎలాగైనా మీనాపై పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఏదైనా అవకాశం రాకపోతుందా? అని మనస్సుల్లో అనుకుంటూ వెళ్లిపోతాడు. మరోవైపు బాలుకు సోదీ చెప్పే వాళ్లు తనకు ఈ ఒక్కరోజు ఏమాత్రం బాగాలేదని చెబుతారు. తన నోటీ దురద వల్లే సమస్యల్లో ఇరుక్కునే ప్రమాదం ఉందని అంటాడు. ఈరోజు ఎవరితోనూ గొడవ పెట్టుకోకని అంటాడు. ఇక బాలు స్నేహితులు కూడా ఈ ఒక్క రోజు ఇంటికి వెళ్లి తిని పడుకోరా అని బాలుకు సలహానిస్తారు. బాలు కూడా అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే సమయంలో తనకు పూలమాలలు ఆర్డర్ ఇచ్చిన రాజకీయ నేత కాల్ చేసి వెంటనే రమ్మని అంటాడు. ఓవైపు ఇవ్వాళ ఎక్కడికి వెళ్లకని తన స్నేహితులు చెప్పినా పట్టించుకోడు. ఇక బాలు వెంటనే ఆ పొలిటిషన్ దగ్గరకు వెళ్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఆగస్టు 18వ తేదీ 490 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 490 August 18th

బాలు ఆ పొలిటీషియన్ దగ్గరకు రాగానే బాలును తన స్నేహితుడికి పరిచయం చేస్తాడు. తన మిత్రుడు బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడని చెబుతాడు. ఇక క్వారీల బిజినెస్ చేస్తున్నానని వివరిస్తాడు. ఇక ఈ వ్యాపార పనుల్లో తిరిగేందుకు కొత్త కారు కొంటానని చెప్పాడు. కొద్ది రోజులకు కొత్త కారు ఎందుకని నేనే వద్దని చెప్పాను. ఇక సెకండ్ హ్యాండ్ లో ఒక మంచి కారు చూపించు అని బాలును అడుగుతాడు. దాంతో బాలు సరే అన్న అని తను కారుకొన్న కన్నల్టెన్సీకే వీరిద్దరిని తీసుకొని వెళ్తాడు. అయితే అక్కడ అప్పటికే మనోజ్ ఉంటాడు. మనోజ్ కూడా ఒక కారు తీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక ఉదయం నుంచి కారు కన్సల్టెన్సీలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లన్నింటినీ చూస్తాడు. ఇక ఆ ఓనర్ నువ్వు కారు కొంటావా? లేదా? సెకండ్ హ్యాండ్ కార్లు అన్నాకా ఇలాగే ఉంటాయి. నచ్చితే కొను, లేదంటే కొత్త కారు కొనుక్కో అని మండి పడుతాడు. లేదు లేదు నేను ఈ కారును ఎంపిక చేసుకున్నాను. ఇదే తీసుకుంటానని మనోజ్ చెబుతాడు.

కానీ, నా భార్య కూడా ఒకసారి చూసిన తర్వాత అడ్వాన్స్ కట్టేస్తానని అంటాడు. సరే త్వరగా రమ్మనండి అని చెబుతాడు. ఇక మనోజ్ రోహిణిని రిసీవ్ చేసుకునేందుకు బయటికి వెళ్తాడు. ఇదే సమయంలో బాలు ఆ పొలిటీషియన్స్ ను తీసుకొని అదే కన్సల్టెన్సీలో మనోజ్ సెలెక్ట్ చేసిన కారునే ఎంపిక చేస్తాడు. ఆ కారు కన్సల్టెన్సీ ఓనర్ బాలుకు బాగా తెలియడంతో వెంటనే కారును ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు. ఇక పేమెంట్ కూడా సింగిల్ హ్యాండ్ లో ఇస్తానని చెబతాడు. కానీ అప్పటికే ఒక బిజినెస్ మెన్ ఈ కారును చూశాడని బాలుతో ఓనర్ అంటాడు. ఆయనతో నేను మాట్లాడి ఒప్పిస్తానని అంటాడు. ఇంతకీ ఎవరు అతను అని బాలు తెలుసుకుంటాడు. మనోజ్ అని తెలియడంతో షాక్ అవుతాడు. ఇక ఈయన అయితే కారు డౌన్ పేమెంట్ కడుతాడేమో ఈఎంఐ మాత్రం గ్యారెంటీ లేదని చెబుతాడు. అదే నేను తీసుకొచ్చిన సార్ వాళ్లు ఫుల్ పేమెంట్ కట్టేసి కారు తీసుకొని వెళ్తారు అని అంటారు. ఇక మనోజ్ ఆ కారే నాకు కావాలని ఎంత ప్రయత్నించినా కూడా సదరు కారు కన్సల్టెన్సీ ఓనర్ ఇవ్వడు. బాలు చెప్పినట్టుగానే పొలిటిషీయన్ కే ఇస్తాడు. దాంతో మనోజ్, రోహిణి బాలుపై రగిలిపోతారు.

ఇక కారు కొన్న తర్వాత భోజనం చేద్దామని మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుతారు. ఇక బాలును కొంచెం మందు తీసుకుందాం రమ్మని అంటారు. కానీ బాలు నేను రాను అన్న అని చెప్పి రెస్టారెంట్ బయటనే ఉంటాడు. ఇక త్వరగా వస్తామని వెళ్లిన వాళ్లు ఎంతకూ బయటికి రారు. ఇదే సమయంలో బాలుకు ఒక లాంగ్ రైడ్ పడుతుంది. దీంతో వెంటనే వెళ్లాల్సి ఉందని ఆ పొలిటీషియన్ తో చెప్పడానికి రెస్టారెంట్ లోపలికి వెళ్తాడు బాలు. అక్కడ బాలును చూసిన గుణ మీనా మాటలను గుర్తుకు చేసుకుంటాడు. నన్నే తాగుబోతు అంటుందా? ఇప్పుడు బాలును తాగుబోతుగా మార్చేస్తానని అనుకుంటాడు. ఇక బాలు అక్కడ తాగకపోయినా.. వాళ్లతో కలిసి కూర్చొన్నందుకు, వారికి మందు కలిపి ఇచ్చినందుకు బాలునే తాగుతున్నాడని అర్థం వచ్చేలా వీడియో తీస్తాడు. ఇక కాలు అడ్డంపెట్టి కింద పడబోయేలా చేసి తూగుతున్నట్టు వీడియోలో చూపిస్తాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టి బాలును తాగుబోతుగా ముద్ర వేయాలని అనుకుంటాడు.. ప్రోమోలో ఆ వీడియో ద్వారా బాలు తాగుబోతు అని ఇంటా బయట ప్రచారం జరుగుతుంది. దీంతో బాలు కారును ట్రాఫిక్ పోలీస్ లు కూడా లాకెళ్లిపోరు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X