Gunde Ninda Gudi Gantalu August 21st: ప్రభావతికి పసరు మందు పెట్టిన మీనా.. నొప్పితో అత్త అవస్థలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 20వ తేదీ 492వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు పై కావాలని తాగుబోతు నిందారోపణ చేసిన గుణ సంతోషం వ్యక్తం చేస్తాడు. తన అనుకున్నట్టుగానే బాలు పై చిత్రీకరించిన ఫేక్ వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుంది. దాంతో బాలు పరువు మొత్తం పోతుంది. అంతేకాకుండా బాలు కారును కూడా పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు. లైసెన్స్ కూడా రద్దు చేస్తారు. మరోవైపు ఇంట్లో అందరూ బాలును నిందిస్తారు. తప్ప తాగి కారు నడపడం నీకున్న బుద్ధి అని మనోజ్, రోహిణి, ప్రభావతి బాలును తిట్టిపోస్తారు. మరోవైపు బాలు తను తాగలేదని ఎంత చెప్పినా కూడా వినిపించుకోరు. మీనా కూడా బాలును అసహ్యించుకుంటుంది. దాంతో బాలు చాలా బాధపడతాడు.

చివరికి మౌనిక ఫోన్ చేసి బాలు ను సమర్థిస్తుంది. నువ్వు తాగలేదు అనే విషయం నాకు తెలుసు అన్నయ్య కానీ ఆ వీడియో ఎవరు తీశారు అనేది అర్థం కావడం లేదు అని అంటుంది. ఆ విషయమే నాకు కూడా తెలియదు అని బాలు బదిలిస్తారు. మొత్తానికి నువ్వు ఒక్కదానివైనా నన్ను అర్థం చేసుకున్నావు అమ్మ అని ధైర్యం తెచ్చుకుంటాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులతో కూడా చెప్పుకుంటూ బాలు కాస్త ధీమా వ్యక్తం చేస్తాడు. అసలు నేను తాగలేదు అంటే మీరేనా నమ్ముతున్నారా అని వారిని ప్రశ్నిస్తాడు. దాంతో బాలు స్నేహితులు తప్పకుండా నమ్ముతున్నాం బాలు, డ్యూటీలో ఉన్నప్పుడు తాగితే మమ్మల్ని తిట్టే వాడివి. ఇంక నువ్వు తాగావంటే ఎలా నమ్ముతాం బాలు అని చెబుతారు. ఇక తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది. ఇక ఆగస్టు 21వ తేదీ 493 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 493 August 21st

మీనా తన పూల వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఉంది. అప్పటికే బాలు కారు పోలీసులు తీసుకెళ్లడంతో ఇక తన చేతిలో ఉన్న పూల వ్యాపారంపై మరింత శ్రద్ధ వహిస్తుంది. ఇంటింటికి వెళ్లి డోర్ డెలివరీ గా పూలు అందిస్తుంటుంది. ఇదే సమయంలో దారి మధ్యలో మీ నాకు శివ స్నేహితుడు గుణ కనిపిస్తాడు. అక్కయ్య అని పలకరిస్తాడు. మీ ఆయన వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రైనింగ్ అవుతుంది కదా అక్కయ్య అని అంటాడు. ఎప్పటికీ మమ్మల్ని తాగుబోతులు అని తిట్టేదానివి, ఇప్పుడు నీ భర్త తాగుబోతు అని ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. ఇప్పుడు దీనికి ఏమని అంటావు అక్కయ్య అని మీనా ను ప్రశ్నిస్తాడు. పైగా కార్ కూడా పోలీసులు తీసుకెళ్లారంట కదా, ఇక ఇప్పుడు మీ కుటుంబాన్ని నువ్వే పోషించాలి అని ఎగతాళిగా మాట్లాడుతాడు. అసలు ఆ వీడియో తీసిన వ్యక్తి గుణ అనే సంగతి మీ నాకు తెలియకపోవడంతో ఏం మాట్లాడినా సైలెంట్ గా ఉంటుంది. ఇక గుణ నానా మాటలు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా పూల ఆర్డర్ ఇచ్చేసి తిరిగి ఇంటికి వెళుతుంది.

ఇంటికి వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో మరో పూల కొట్టు దగ్గర అవుతుంది. అక్కడ మీనాకు తెలిసిన ఒక అక్క ఉండడంతో మాట్లాడుతుంది. ఇక వాళ్లు కూడా బాలు తప్ప తాగినట్టుగా చిత్రీకరించిన ఫేక్ వీడియో ను చూసి షాక్ అయినట్టు చెబుతారు. దాంతో మీనా వాళ్ళ ముందు బాధపడుతుంది. బాలు అన్ని విషయాల్లో మారాడు కానీ, ఈ తాగడం విషయంలో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే బాట పడుతున్నాడని మీనా వారికి చెప్పుకుంటూ బాధపడుతుంది. దాంతో అ పూల కొట్టు అక్క మీ నాకు ఒక ఉపాయం చెబుతుంది. బాలు తాగడం మానాలంటే ఒక నాటు వైద్యం ఉందని చెబుతోంది. అది పాలలో గాని, జ్యూస్ లో గాని కలిపి ఇస్తే రెండు రోజుల్లో తాగడం మానేస్తాడని అంటుంది. ఇక పౌడర్ తీసుకొని మీనా ఇంటికి వెళుతుంది. వెంటనే బాలు తో తాగుడు మాన్పించేయాలని అనుకుంటుంది. అందుకోసం మీనా బాలుకు ఆరెంజ్ జ్యూస్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇదే సమయంలో మామ సత్యం పిలవడంతో బయటికి వెళుతుంది.

మామ సత్యం మీనా ను పిలిచి ఒక ఆర్డర్ వచ్చిందని చెబుతాడు. తన స్నేహితుడు ఇంట్లో ఫంక్షన్ ఉందని అందుకు నాలుగు పూలదండలు, కొన్ని పూలు కావాలని ఆర్డర్ ఇచ్చాడని చెబుతాడు. ఆ వెంటనే డబ్బులు కూడా ఇస్తాడు. ఇక బాలు ఇంటికి వచ్చాడా అని ప్రశ్నిస్తాడు. ఇంకా రాలేదని మీనా చెబుతుంది. వాడొక్కడు త్వరగా మారితే బావుండు అని కోడలు మీనా తో సత్యం అంటాడు. త్వరగానే మారిపోతాడు లే అని మీనా మామ సత్యంతో చెబుతుంది. ఇక తర్వాత తిరిగి ఇంట్లోకి వెళుతుంది. అక్కడ ప్రభావతి బాలు కోసం మీనా తయారు చేసిన జ్యూస్ ని తాగుతుంది. అందులో మీనా నాటు వైద్యానికి సంబంధించిన పొడిని కలుపుతుంది. ఆ విషయం తెలియని ప్రభావతి పూర్తిగా తాగేస్తుంది. దాంతో మీనా కంగారుపడుతుంది. అత్త ప్రభావతికి ఏమవుతుందని ఆందోళన చెందుతుంది. ప్రభావతి అలా జ్యూస్ తాగగానే వెంటనే బయటికి వెళ్లి విరుగుడు మందు తేవడానికి మళ్లీ అదే అక్క దగ్గరికి వెళ్తుంది.

అక్క వెంటనే అయ్యో ఇలా ఎందుకు జరిగిందని విరుగుడు మందు ఇస్తుంది. తాగుడు అలవాటు ఉన్నవాళ్లు ఆ పౌడర్ తాగితే తాగుడు మానేస్తారు. ఇక తాగడం అలవాటు లేని వాళ్ళు ఆ పౌడర్ ను వాడితే విపరీతమైన మోషన్స్ అవుతాయని చెబుతుంది. ఇక విరుగుడు మందు తీసుకొని మీనా పరుగు పరుగున ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ప్రభావతి తీవ్ర విరోచనాలతో బాధపడుతుంది. ఇక తన ఒంట్లో శక్తినంత పోయి బెడ్ పై అలా పడిపోతుంది. సత్యం మనోజ్ రోహిణి వదిన కామాక్షి అందరూ ప్రభావతికి ఇలా అయింది ఏంటని కంగారు పడతారు. ఇక బాలు వెంటనే వెళ్లి డాక్టర్ని తీసుకుని వస్తాడు. పరీక్షించిన డాక్టర్ ఫుడ్ పాయిజన్ అయినట్లుగా లక్షణాలు ఉన్నాయని చెప్తుంది. ఫుడ్ పాయిజన్ అయ్యేలా ఏం తిన్నావ్ అని ఇంట్లో వాళ్ళందరూ ప్రభావతిని అడుగుతారు. ఇక అదే సమయంలో మీనా ఇంటికి తిరిగి వచ్చి విరుగుడు మందును జ్యూస్ లో కలిపి ఇస్తుంది. ఈ జ్యూస్ తాగినప్పుడు నుంచే నాకు ఇలా అవుతుందని చెబుతుంది. ఇక మీనా నిజం ఒప్పుకుంటుంది. అది పాలు కోసం తయారు చేశానని అందులో పసరు కలపాలని, అందుకే ఇప్పుడు విరుగుడు మందు కలిపి ఇచ్చాను అని చెబుతోంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X