Gunde Ninda Gudi Gantalu August 26th: బాలు, మీనాలకు షాకింగ్ న్యూస్.. పూలగంపకు మరో సవాల్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 25వ తేదీ 495వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బారుకు వెళ్లి మీనా యజమాని అనుమతితో సీసీ టీవీ ఫుటేజీలను చూస్తుంది. అందులో బాలు బారు లోపలికి వచ్చి కూర్చొని ఉన్నట్టు ఉంటుంది. పక్కన ఉన్న పొలిటీషియన్స్ ఎంత తాగమని ఒత్తిడి చేసినా బాలు మాత్రం తాగనని చెబుతాడు. ఆ దృశ్యం చూసిన తర్వాత మీనా బాలు తప్పు చేయలేదని స్పష్టం చేసుకుంటుంది. ఆ తర్వాత బాలు తాగినట్టుగా ముక్కలు ముక్కలు వీడియో తీయించిన గుణ కూడా సీసీ టీవీ ఫుటేజీలో కనిపిస్తాడు. ఒక వ్యక్తి వచ్చి బాలు గురించి తీసిన వీడియోను గుణకు ఇస్తాడు. వాడే అసలు దొంగ అని మీనా మండి పోతుంది. బార్ ఓనర్ అనుమతితో మీనా వెంటనే ఆ వీడియోను బాలు తమ్ముడు మీనాకు మరిది రవికి పంపిస్తుంది. రవికి తను ఫోన్ చేసి వెంటనే మీ అన్న బాలు దగ్గరకు వెళ్లు అని చెబుతుంది. రవి ఆ వీడియోను తీసుకొని బాలు దగ్గరకు వెళ్తాడు.
ఇక బాలు ఆ వీడియో చూసి షాక్ అవుతాడు. మరోవైపు ఆ వీడియోను మీనా పోలీసులకు చేరవేస్తుంది. దాంతో పోలీసులకు కూడా బాలు మంచి వాడనే విషయం అర్థం అవుతుంది. ఇక బాలును అందరూ తాగుబోతని అనుకోవడంతో మీడియా ప్రత్యేకంగా ఒక వీడియో తీయించి ఫేక్ వీడియోను, అసలు వీడియోను, ఆ తర్వాత తమకు ఎవ్వరు అపార్థం చేసుకోవద్దనే అంశాలతో కొత్త వీడియోను రెడీ చేసి సోషల్ మీడియాలో వదులుతారు. ఇక మీనా బాలు దగ్గరకు చేరుకొని ఏడుస్తుంది. మిమ్మల్ని నేను అనవసరంగా తప్పు పట్టానని అంటుంది. ఇక బాలు మీనాను ఓదార్చుతాడు. ఇక గుణను పోలీసులకు అప్పగిస్తారు. పోలీసులు గుణను అరెస్ట్ చేసి సెల్ లో వేస్తారు. ఆ తర్వాత బాలు కారును బాలుకు ఇస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 26వ తేదీ 496 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

మీనా చేసిన సాహసానికి బాలు ఎమోషనల్ అవుతాడు. నువ్వే లేకుంటే ఈరోజు పరిస్థితి మరోలా ఉండేదని మీనాతో అంటాడు. ఇక రవి కూడా మీనా పట్టుదలకు మెచ్చుకుంటాడు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉందని తెలుపుతాడు. ఏదేమైనా మళ్లీ ఇలాంటి కుట్ర పూరితమైన వలలో చిక్కుకోకూడదని మీనా బాలుకు సూచిస్తుంది. దాంతో బాలు సరేనని చెబుతారు. ఇక బాలు తన కారును తీసుకొని పోలీస్ స్టేషన్ నుంచి బయల్దేరుదామని అనుకుంటాడు. ఇదే సమయంలో మీనా వాళ్ల తమ్ముడు శివ అదే పోలీస్ స్టేషన్ కు వస్తాడు. అక్కడ శివను చూసిన మీనా మండి పోతుంది. నీకు ఎన్ని సార్లు చెప్పినా కూడా నీ బుద్ధిని మార్చుకోవారా? అని ప్రశ్నిస్తుంది. ఆ వెదవ గుణ వల్ల మీ బావ, నేను నవ్వుల పాలు కావాల్సి వచ్చింది. వాడు ఫేక్ వీడియోలు తీసి మా పరువు మొత్తం తీశాడు. అలాంటిది నువ్వు వాడి కోసం పోలీస్ స్టేషన్ కు రావడం ఏంట్రా అని ప్రశ్నిస్తుంది. నీకు ఎన్ని సార్లు ఆ గుణగాడితో స్నేహం చేయవద్దని చెప్పినా వినిపించుకోవడం లేదు, ఇకపై ఇంకా జాగ్రత్తగా ఉండు. మీ బావ మళ్లీ నిన్ను కొట్టినా, చంపినా నన్ను మాత్రం ఏమీ అడుగొద్దని మీనా శివను హెచ్చరిస్తుంది.
ఇక రవి కూడా శివను మందలిస్తాడు. అసలు నీకు ఆ గుణతో పనేంటి. బుద్ధి చదువుకొని నీ జీవితం ఏంటో చూసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి అక్కడినుంచి ముగ్గురు వెళ్లిపోతారు. ఆ తర్వాత శివ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లి సెల్ లో ఉన్న గుణను కలుస్తాడు. ఇక గుణ మరో కొత్త నాటకానికి తెర లేపుతాడు. అసలు ఆ రోజు నేను వీడియో తీయమని చెప్పాను. కానీ సోషల్ మీడియాలో మాత్రం నేను అప్ లోడ్ చేయలేదు. నా పక్కన ఉన్న వాడే ఇదంతా చేశాడు. అసలు దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను ఎవ్వరూ నమ్మినా నమ్మకపోయినా నువ్వు మాత్రం నమ్మాలి అని గుణ శివతో అంటాడు. నేను బయటికి వచ్చే వరకు అన్ని పనులు నువ్వే చూసుకోవాలని చెబుతాడు. ఇక అందరూ శివ చెప్పినట్టుగానే వినాలని శివ వెంట వచ్చిన తన అనుచరులకు సూచిస్తాడు. మరోవైపు మీనా ఒక పోలీసు అధికారి ఇంటికి పూలు ఇవ్వడానికి వెళ్తుంది. ఈ సమయంలో అప్పటికే వారు బాలు మీనాలు సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను చూస్తారు. ఇక మీనాకు బాలును పట్టించింది ఈ వీడియో కాదని, సంజూ అని పేరున్న వ్యక్తి కమీషనర్ కు చెప్పి కారు, లైసెన్స్ ను తీసుకునేలా చేశారని చెబుతాడు. దాంతో మీనా సంజూపై రగిలిపోతుంది.
మరోవైపు సత్యం బయటి నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. భార్య ప్రభావతితో పాటు పిల్లల్ని అందరినీ బయటికి పిలుస్తాడు. మీ అందరికీ మతి పోయింది. నాకు కొడుకు బాలు ఎలాంటి తప్పు చేయడని చెప్పినా కూడా మీరు అస్సలు నమ్మడం లేదు కదా. ఒక్కసారి ఆ వీడియో చూడండి అని మనోజ్ ల్యాప్ టాప్ లో బాలుమీనాల కొత్త వీడియోను చూపిస్తాడు. అసలు ఇందుకు కారణం ఎవరో తెలుసుకోకుండా బాలును అపార్థం చేసుకున్నారు. అంతే కాదు ఇంట్లో ఉండే మీనాను కూడా నానా మాటలు అన్నారు. పైగా ఎప్పుడూ బాలుపై గర్వంగా ఉండే నాతోనూ మాటలు అనిపించేలా చేశారు. ఇప్పటికైనా కళ్లు తెరుచుకోండని మండి పడుతాడు. ఇక ఇదే సమయంలో బాలు, మీనా, రవి ఇంటికి తిరిగి వస్తారు. దీంతో బాలుకు సత్యం ఇంట్లో ఆడవాళ్లతో దిష్టి తీయించి తన కొడుకు బాలుగా పిలుస్తున్నానని చెబుతాడు. దాంతో బాలు ఇంట్లోకి వస్తాడు. సత్యం క్షమాపణలు కోరుతాడు. బాలు అలా అనొద్దు నాన్న అని అంటాడు. మొత్తానికి బాలు పరువు కాపాడినందుకు జీవితభాగస్వామిగా మంచి పేరు సాధించావని మీనాను ప్రశంసిస్తాడు. ఆ తర్వాత మీనా సంజూ ఇంటికి వెళ్తుంది. అప్పటికే మౌనికా సంజూను నిలదీస్తూ ఉంటుంది. దాంతో బాలు మౌనికాను కొట్టబోతాడు. మీనా ఎంట్రీ ఇచ్చి అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications










