Gunde Ninda Gudi Gantalu August 28th: మనోజ్‌ను దెబ్బ తీసిన బాలు.. తిరగబడ్డ రోహిణి
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 27వ తేదీ 497వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మౌనికాతో సంజూ గొడవ పడుతాడు. తన వల్లనే కారు, లైసెన్స్ పోయింని మీ అన్నయ్యకు చెబుతావా? అని మౌనికాను బెదిరిస్తాడు. మౌనికాపై చేయి చేసుకోబోతాడు కూడానూ. ఇదే సమయానికి మీనా ఎంట్రీ ఇస్తుంది. సంజూ చేయిని అడ్డుకుంటుంది. సంజూను వెనక్కి నెట్టి వేస్తుంది. తిరిగి కొట్టేందుకు తన చేయి పైకి లేపుతుంది. దాంతో సంజూ షాక్ అవుతాడు. మీనా కోపంతో ఊగిపోతుంది. సంజూకు గట్టి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు మౌనికాను ఎంత హింసిస్తున్నావో అంతా నాకు తెలుసు అని అంటుంది. ఇంకోసారి మౌనికా పై చేయి చేసుకుంటే మాత్రం అస్సలు ఊరుకునేది లేదని హెచ్చరిస్తుంది. ప్రస్తుతాని ఈ విషయం నాకు మాత్రమే తెలుసని, ఇక నా భర్త బాలుకు తెలిస్తే మాత్రం నిన్ను బతకనివ్వడని వార్నింగ్ ఇస్తుంది.
మరోవైపు మనోజ్, రోహిణిలు ఊహించని షాక్ ఇస్తారు. ఇప్పటికే బాలు కారు కొనుక్కున్నాడని మనోజ్ కూడా పట్టుబట్టి కారు కొనుగోలు చేస్తాడు. అది కూడా సెకండ్ హ్యాండ్ కారును తీసుకుంటాడు. కారును తీసుకొని వచ్చి ఇంట్లో వాళ్లందరినీ బయటికి పిలిచి మరీ తన కారును చూపిస్తాడు మనోజ్. మనోజ్ కారు కొన్నాడని తల్లి ప్రభావతి ఉప్పొంగి పోతుంది. పొగడ్తలతో మనోజ్ ను ఆకాశానికి ఎత్తెస్తుంది. ఎప్పటికైనా మనోజ్ కార్లలోనే తిరిగే స్థాయికి ఎదుగుతాడని నాకు ముందే తెలుసని అంటుంది. అయితే బాలు మాత్రం ఆ కారు రీడింగ్ చూసి ఈ కారుకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టావని మనోజ్ ను ప్రశ్నిస్తాడు. 4.5 లక్షలు అని మనోజ్ చెబుతాడు. దాంతో బాలు షాక్ అయ్యి మోసపోయావురా అని అంటాడు. ఈ కారును 2.5 లక్షలకు ఖరీదు చేయడమే ఎక్కువ అని బదులిస్తాడు. ఇలాగైతే నువ్వు బిజినెస్ ఎలా చేస్తావని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత అందరు కలిసి సెల్ఫీ తీసుకుంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 28వ తేదీ 498 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

కారు కొన్న సందర్బంగా మనోజ్ ఇద్దరు తమ్ముళ్లు బాలు, రవికి బీరు పార్టీ ఇస్తాడు. వాళ్లు ముగ్గురు బిల్డింగ్ పై కూర్చొని తాగుతారు. అయితే ఎక్కువ తాగొద్దని ఒక్క బీరు మాత్రమే తాగమని మనోజ్ కు రోహిణి, రవికి శృతి హెచ్చరించి పంపిస్తారు. ఇక బాలును మాత్రం అస్సలు తాగొద్దని మీనా అంటుంది. ఇక బాలుతో ప్రామీస్ కూడా చేయించుకుంటుంది. బాలు కూడా మీనాకు తాగనని ప్రామీస్ చేసి వెళ్తాడు. ఇక బాలును వెళ్లిన తర్వాత మీనా తను మిగిలిన పూలను అల్లుకుంటూ కూర్చొంటుంది. ఈ సమయంలో మీనా దగ్గరకు రోహిణి, శృతి కూడా వస్తారు. ఇక ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఎలాంటి బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు అని శృతి రోహిణిని ప్రశ్నిస్తుంది.ఇంకా ఏదీ డిసైడ్ అవ్వలేదని రోహిణి అంటుంది. పై నుంచి శబద్ధాలు రావడంతో నేను ఒక్క బీరు మాత్రమే తాగమని చెప్పానని శృతి అంటుంది. ఇక నేను కూడా మనోజ్ కు ఒక్క బీరు వరకే పర్మిషన్ ఇచ్చానని రోహిణి అంటుంది. మరీ పై నుంచి శబ్ధాలు ఏంటని ప్రశ్నిస్తుంది శృతి. ఇంకెవరు మీనా భర్త బాలు అని రోహిణి అవమానిస్తుంది.
రోహిణిని మాటలకు మీనా ఫైర్ అవుతుంది. అసలు మా ఆయన ఇవ్వాళ తాగనని నాకు ముందే చెప్పాడని మీనా అంటుంది. కానీ రోహిణి మాత్రం మీనా మాటలను తీసిపారేస్తుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరు తాగకుండా ఉన్నా కూడా బాలు మాత్రం ఉండలేడని అంటుంది. బాలుకు ఎవ్వరి మాటలతో అవసరం లేదని అంటుంది. మందంటే బాలు ముందు ఉంటాడని రోహిణి హేళన చేస్తుంది. లేదు మా ఆయన అస్సలు తాగనని నాకు చెప్పి వెళ్లాడని ఏమాత్రం తాగి ఉండడని అంటుంది. కావాలంటే పందెం వేసుకుందామా? అని రోహిణి మీనాకు సవాల్ విసిరుతుంది. ఇక శృతి ఈ మాత్రం దానిక పందెం ఎందుకు పైకి వెళ్లి డైరెక్ట్ గా చూస్తే సరిపోతుంది కదా అని అంటుంది. బిల్డింగ్ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇదే సమయంలో మనోజ్ కు ఫుల్ ఎక్కేస్తుంది. ఇక బిల్డింగ్ పైన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సోయి లేకుండా ప్రవర్తిస్తాడు. ఇక రోహిణితో పాటు మీనా, శృతి పైకి వచ్చి చూసే సరికి మనోజే పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటాడు. పార్క్, గుడి మెట్లు అటూ ఇటూ తిరుగుతుంటాడు. అది చూసిన రోహిణి షాక్ అవుతుంది.
ఇక శృతి ఇందాక గట్టిగా అరిచింది ఎవరని ప్రశ్నిస్తుంది. దాంతో ఇంకెవ్వరు మనోజ్ అన్నయ్యనే అని రవి బదులిస్తాడు. దాంతో పందెం అని వచ్చిన రోహిణి మాట చెల్లలేదని షాక్ అవుతుంది. రోహిణికి కోపం వచ్చి మనోజ్ పై బకెట్ నీళ్లు తీసుకొని వచ్చి పోస్తుంది. ఆ తర్వాత కిందికి తీసుకెళ్లి పడుకోబెడుతుంది. తాగి మత్తులో నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావని, కల్పనా డబ్బులు ఇచ్చిందని వాగుతున్నావని రోహిణి మనోజ్ పై మండి పడుతుంది. నేను అడ్డుకోకపోతే మనం ఈ పాటికి రోడ్డుపైన ఉండేవాళ్లమని చెబుతుంది. మరోవైపు బాలు రైడ్ కోసమని బయటికి వెళ్తాడు. ఒక ఫర్నీచర్ షాప్ యజమానిని అతని షాప్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడ ఇద్దరు రౌడీలు ఆయన్ని బెదిరిస్తుంటే బాలు జోక్యం చేసుకొని వారిని తన్ని తరిమేస్తాడు. బాలుకు సాయం చేసినందుకు ఆ షాప్ యజమాని ధన్యవాదాలు చెబుతాడు. ఇక తన ఫర్నీచర్ షాప్ అమ్మేసి అమెరికాకు వెళ్తున్నానని ఎవరైనా ఉంటే చెప్పమని అంటాడు. మా అన్నయ్య ఉన్నాడని చెబుతాడు బాలు. ఇక ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి చెబుతాడు. బాలు మాటలకు రోహిణి అవమానిస్తూ మాట్లాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications










