Gunde Ninda Gudi Gantalu August 29th: ప్రభావతిని మోసం చేసిన మనోజ్.. బాలుకు మైండ్ బ్లాక్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 28వ తేదీ 498వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్, రోహిణి సెకండ్ హ్యాండ్ కారును కొనుక్కుంటారు. దాంతో ఇంట్లో వాళ్లందరికీ చూపిస్తారు. మనోజ్ కారు కొనడంతో తల్లి ప్రభావతి అతిగా పొగడుతూ ఆకాశానికి ఎత్తేస్తుంది. మనోజ్ ఎప్పుడో ఇంత పెద్ద స్థాయికి చేరుకుంటాడని, కార్లలో తిరిగే స్థాయికి వస్తాడని అనుకుంటూనే ఉన్నానని చెబుతుంది. ఇక మనోజ్ కారు కొనడంతో అందరూ కలిసి సెల్పీ దిగుతారు. ఆ తర్వాత మనోజ్ తన తమ్ముళ్లు రవి, బాలుకు బీర్ దావత్ ఇస్తాడు. అయితే మీనా, శృతి, రోహిణి వాళ్లను ఎక్కువగా తాగకూడదని చెబుతుంది. మీనా మాత్రం బాలును అస్సలే తాగొద్దని హెచ్చరిస్తుంది. బాలు కూడా అస్సలు తాగనని మీనాకు మాట ఇస్తాడు. అయితే మనోజ్ కాస్తా తాగగానే నోటికి వచ్చింది మాట్లాడుతూ కేకలు వేస్తాడు. ఆ మాటలు విన్నాక రోహిణి బాలునే అలా తాగి అరుస్తున్నాడని అంటుంది. ఇక అలా రోహిణి మాట్లాడిన మాటలకు మీనా ఫైర్ అవుతుంది.
దాంతో మీనా వెంటనే రోహిణికి గట్టిగా బదులు ఇస్తుంది. అస్సలు ఇవ్వాళ బాలును తాగవద్దని చెప్పాను. అస్సలు తాగడు కూడా అని అంటుంది. కానీ రోహిణి మాత్రం బాలును మరింతగా తప్పు పడుతుంది. బాలు మందు కనిపిస్తే చాలు ముందు ఉంటాడని చెబుతుంది. ఇక వాళ్లందరూ కలిసి పైకి వెళ్లి చూద్దామని అనుకుంటారు. ఇదే సమయంలో మనోజ్ తాగి తూగుతూ ఉంటాడు. అసలు ఏం చేస్తుంటాడో ఆయనే అర్థం కాదు. పైగా పార్కు, గుడి అంటూ నానా చెత్త మాట్లాడుతూ ఉంటాడు. ఇక కేకలు వేసింది ఎవరు అని శృతి రోహిణిని ప్రశ్నిస్తుంది. అందుకు బాలు మనోజ్ అని బదులిస్తాడు. దాంతో తోటి కోడళ్ల ముందు రోహిణి పరువు పోతోంది. ఇక వెంటనే బాలును పైనుంచి కిందికి తీసుకొని వస్తుంది. మళ్లీ తాగొద్దని మనోజ్ కు గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇదిలా ఉంటే.. బాలు రైడ్ కు వెళ్లిన సమయంలో మనోజ్ కు మంచి బిజినెస్ అవకాశం కనిపిస్తుంది. అదే విషయాన్ని వచ్చి ఇంట్లో చెబుతాడు. కానీ ప్రభావతి మాత్రం బాలు మాటలను తీసి పారేస్తుంది. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 29వ తేదీ 499 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

బాలు కారు డ్రైవింగ్ కు వెళ్లినప్పుడు ఒక ఫర్నీచర్ షాప్ ఓనర్ బాలు కారులోకి ఎక్కుతాడు. ఈ సమయంలో ఫర్నీచర్ షాప్ దగ్గర ఆయన్ని బాలు దింపేస్తాడు. అదే సమయంలో కొందరు రౌడీలు ఆ ఓనర్ ను బెదిరిస్తారు. ఇక బాలు వాళ్లను తన్ని తరిమేసి ఆ ఓనర్ ను రక్షిస్తాడు. దాంతో ఆ షాప్ ను అమ్మేయాలని చూస్తున్నానని బాలుతో చెబుతాడు. ఇదే అమ్మేసేటట్టు ఉంటే మా అన్నయ్యకు ఇవ్వండి అని అడుగుతాడు. నీకైతే ఇంకా తక్కువకే ఇస్తానని ఆ ఓనర్ చెబుతాడు. ఇక ఇంటికెళ్లిన బాలు మనోజ్ కు మంచి బిజినెస్ చూశానని చెబుతాడు. బాలు అలా చెప్పడంతో ప్రభావతి మండి పడుతుంది. నువ్వు ఎలాంటి ఐడియాలు ఇస్తావో మాకు బాగా తెలుసులే అని అంటుంది. ఏ పూలకొట్టో, పంక్ఛర్ షాప్ లు పెట్టుకోమనే గా చెబుతావని ప్రభావతి అంటుంది. పూల కొట్టు కూడా బాగా చూసుకుంటే బొకే షాప్ అవుతుందని, అలాంటి వాటిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దని చెబుతాడు. అబ్బో పెద్దపెద్ద వ్యాపారాల గురించి నీకేం తెలుస్తుందని అంటుంది. మనోజ్ ఎంతో చదువుకున్నాడు. వాడికి అన్ని విషయాలు తెలిసి ఉంటాయని అంటుంది. ఇక మీనా జోక్యం చేసుకొని అసలు మా ఆయన బాలు ఏం చెప్పాలని అనుకున్నాడో వింటే సరిపోతుందని అంటుంది.
దాంతో ప్రభావతి బాలును మరింతగా తీసి పారేస్తూ ఉంటుంది. వాడికి వ్యాపారం గురించి పెద్దగా ఏం తెలుస్తుందంటూ చులకన చేసి మాట్లాడుతుంది. దీంతో సత్యం ప్రభావతిపై ఫైర్ అవుతాడు. నువ్వు కాస్తా నోరు మూస్తావా? అని అంటాడు. నీకు ఏ విషయంలోనూ మాట్లాడే అర్హత లేదని సత్యం ప్రభావతిపై మండి పడుతాడు. ఇక ప్రభావతి నోరు మూసుకుంటుంది. బాలు మాట్లాడుతూ తను చూసి ఫర్నీచర్ షాప్ అని చెబుతాడు. దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ ఆ షాప్ ఫ్రాంచైజీలో ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బు దానికి సరిపోతుంది. మంచిగా వ్యాపారం చేసుకొని కమీషన్ తీసుకుంటే సరిపోతుందని చెబుతాడు. దాంతో సత్యం చక్కటి వ్యాపారం గురించి చెప్పావురా అని బాలును పొగుడుతాడు. ఇక ఒకసారి వెళ్లి చూసి వద్దామని అంటాడు. దాంతో అందరూ కలిసి ఆ ఫర్నీచర్ షాప్ కు వెళ్తారు. షాప్ చాలా పెద్దగా ఉండటం చూసి ప్రభావతి, మనోజ్, రోహిణి, సత్యం సంతోషిస్తారు. బాలు కూడా మొత్తానికి తన అన్నయ్యకు ఒక వ్యాపారం సెట్ అవుతుందని ఆనంద పడుతాడు. ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా, నేనూ మనోజ్ ను ఎంతలా మాటలు అన్నా కూడా వాడు బాగుండాలనే కోరుకుంటానని బాలు మీనాతో అంటాడు.
ఇక ఫర్నీచర్ షాప్ లోని అన్ని రకాల ఫర్నీచర్ ఐటెమ్స్ ను చూసి ఆ షాప్ ను తీసుకుందామని అనుకుంటారు. దాంతో వెళ్లి ఓనర్ ను కలిసి మాట్లాడుతారు. ఈ సమయంలో ఓనర్ బాలు గురించి గొప్పగా మాట్లాడుతాడు. బాలు పెద్దలను తన తండ్రిలాగే చూసుకుంటారని, ఇక తండ్రిగా ఉన్న మిమ్మల్ని ఇంకెంత బాగా చూసుకుంటున్నారో అని ఆ ఓనర్ సత్యంతో అంటాడు. బాలు మంచి మనస్సుకు ఈ షాప్ ను మీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెబుతాడు. ఇక బాలును పొగడటంతో రోహిణి మండుతుంది. షాప్ అమ్మకానికి ఉందని బాలు అడ్రస్ మాత్రమే చెప్పుడు కాదు. అందులో పెద్ద గొప్పేమీ లేదని అంటుంది. ఇక ఆ ఓనర్ స్పందిస్తూ అవునమ్మ మనం దారి మాత్రమే చూపించగలం, వేలు పట్టుకొని నడిపించలేము కదా అని అంటాడు. దాంతో రోహిణి నోరు మూసుకుంటుంది. ఆ ప్రాఫిట్ వియాషలు చెప్పండి అని శృతి అడుగుతుంది. ఆ విషయాలన్నీ మనోజ్, నేను వచ్చి ప్రత్యేకంగా మాట్లాడుకుంటామని అంటుంది. ఇక ఆ తర్వాత ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. ఆ తర్వాత షాప్ కు తల్లి ప్రభావతి పేరు పెట్టడానికి మనోజ్ ఒప్పుకోడు. మా అమ్మ పేరు పెట్టిన పార్లర్, పూలకొట్టు మూసేయాల్సి వచ్చిందని, అందుకని ఈ షాప్ నకు వేరే పెడుదామని అనుకుంటారు. ఇక మీనా సుశీలమ్మ గారి పేరు పెడితే బాగుంటుందని సలహానిస్తుంది. అందరూ అవును ఆ పేరే బాగుంటుందని అంటారు. దాంతో ప్రభావతి మండి పడుతుంది. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










