Gunde Ninda Gudi Gantalu September 3rd: ప్రభావతిపై మండిపడ్డ బాలు.. మీనా తల్లికి ఘోర అవమానం

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక సెప్టెంబర్ 2వ తేదీ 501వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా లాగా రోహిణి మనోజ్ ఇంట్లోనే ఉండటం లేదు కదా అని ప్రభావతి అంటుంది. అందుకే మీనానే వంట చేయాలని చెబుతుంది. వ్యాపారం అంటే చాలా తిరగాల్సి ఉంటుంది. నాలుగు చోట్లకి వెళ్లాల్సి ఉంటుంది. అంతా తిరగాల్సి ఉన్నప్పుడు వాళ్ళకి ఒంట్లో శక్తి ఉండాలి కదా, అందుకే వాళ్లు పుష్టిగా తినాలని చెబుతున్నాను. ఇదే సమయంలో వాళ్లకు వంట చేసుకోవడానికి అసలు సమయం ఉండదు. కాబట్టి మీనానే వంట చేయాల్సి ఉంటుందని చెబుతున్నానని ప్రభావతి అతిగా మాట్లాడుతుంది. దాంతో మీనా, బాలు మండి మండి పడుతారు. అక్కడే ఉన్న సత్యం కూడా ప్రభావతి మాటలకు కోసం తెచ్చుకుంటాడు. ఇక బాలు తల్లి ప్రభావతి మాటలకు కౌంటర్ ఇస్తూనే ఉంటాడు.

ఇంకా వ్యాపారమే మొదలు పెట్టలేదు. అప్పుడే ఎలా బిజీ అయిపోయారని ప్రశ్నిస్తాడు బాలు. దాంతో ప్రభావతి బాలును మౌనంగా ఉండమని హెచ్చరిస్తుంది. ఇక రోహిణిని మీరు ఏం తింటారో చెబితే మీనా అదే వంట చేస్తుందని అంటుంది. వెంటనే వెజిటేబుల్ బిర్యానీ చేయమని చెప్పండని రోహిణి ప్రభావతితో చెబుతుంది. అక్కడే ఉన్న మీనా స్పందిస్తూ కిచెన్ లో ఎక్కువగా కూరగాయలు లేవని చెబుతుంది. నేను తెప్పిస్తానని రోహిణి అంటుంది. ఇక మనోజ్ ను కూరగాయలు తీసుకు రమ్మని బయటికి పంపిస్తుంది. 500 పట్టుకెళ్లిన మనోజ్ ఒక్క రూపాయితో తిరిగి వస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. కిలో కూరగాయలకు ఐదు వందలు అవ్వడం ఏంట్రా అని ప్రశ్నిస్తారు. ఇలాగైతే నువ్వు వ్యాపారం చేసినట్టే అని అంటారు. ఇక ఆ తర్వాత మీనా వాళ్ల అమ్మ ఇంటికి వస్తుంది. ఈ సందర్భంగా ప్రభావతి వాళ్ల అమ్మను చూడగానే సూటిపోటు మాటలతో ఇబ్బంది పెడుతుంది. ఈక్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక సెప్టెంబర్ 3వ తేదీ 502 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 502 September 3rd

మీనా వాళ్ల అమ్మ పార్వతీ ఇంటికి వస్తుంది. ఇక తన తల్లి మీనాను చూసిన వెంటనే మీనా షాక్ అవుతుంది. తనకు చెప్పకుండా రావొద్దని ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మ వినిపించుకోదని మనస్సులో అనుకుంటుంది. ఇక లోపలికి వచ్చి పార్వతీ కూర్చొంటుంది. వెంటనే ప్రభావతి మీనా ను కావాలనే పిలిచి కాఫీ ఇవ్వమని అంటుంది. పార్వతమ్మ తనకే అనుకొని నేను ఇప్పుడు తాగను వదినమ్మ అని అంటుంది. నేను కాఫీ చెప్పింది నీకు కాదు నాకు అని ప్రభావతి షాకింగ్ గా సమాధానం ఇస్తుంది. దాంతో మీనా, సత్యం, పార్వతీ అందరూ షాక్ అవుతారు. మీనా మండి పోతుంది. వెంటనే ప్రభావతిపై విరుచుకు పడుతుంది. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ల ముందే మనం తాగితే బాగుండదని మీనా అంటుంది. ఇప్పుడే తాగాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత తాగొచ్చులే అని మొహం మీదనే చెబుతుంది. దాంతో ప్రభావతి నా ఇంట్లో నేను తాగుతున్నాను కదా మీ ఇంట్లో ఏం తాగడం లేదు కదా అని తల తిక్క సమాధానాలు ఇస్తుంది. ఇదే సమయంలో బాలు, రవి, శృతి, రోహిణి, మనోజ్ అందరూ హాలులోకి వస్తారు. పార్వతమ్మ అందరినీ పలకరిస్తుంది. వార మంచి చెడులు తెలుసుకుంటుంది. ఈ క్రమంలో అసలు నువ్వు వచ్చిన పనేంటనీ ప్రభావతి ప్రశ్నిస్తుంది.

అందుకు పార్వతమ్మ స్పందిస్తూ రేపు బాలు, మీనాల పెళ్లి రోజు ఉండటంతో వచ్చానని అంటుంది. వారి పెళ్లి రోజును మా ఇంట్లో చేయడానికి పిలుస్తున్నానని, అందుకే ఇంటి వరకు వచ్చానని అంటుంది. పెళ్లి రోజు జరిపిస్తావా? ఓ 50 లక్షలు తెచ్చావా అని ఎటకారంగా మాట్లాడుతుంది. రోహిణి వాళ్ల నాన్న 40 లక్షలు పంపించాడని అంటుంది. రోహిణి వాళ్ల నాన్న జైలులో ఉన్నారు కదా? ఆయన జైలులో ఉండి కూడా డబ్బులు పంపించారంటే గొప్ప విషయమే అంటుంది. ఇక మేము డబ్బులు మా స్థాయిలో మేము జరిపిస్తామని చెబుతుంది. ఓ ఫంక్షన్ హాలు బుక్ చేస్తావా? అని ప్రభావతి మీనా వాళ్ల తల్లిని అడుగుతుంది. దాంతో ఆమె మాకు అంత స్థోమత లేదని చెబుతుంది. శృతి వాళ్ల అమ్మానాన్న పెద్ద ఫంక్షన్ లో చేశారు తెలుసా అని చెబుతుంది. ఇక నీ కూతురుకి ఏమాత్రం బంగారం పెడుతున్నావన అడుగుతుంది. ఇక అప్పటికే ఓపిక నశించి పోయిన పార్వతమ్మ ప్రభావతికి షాక్ ఇచ్చేలా సమాధానం ఇస్తుంది. మీరూ ఓ ఇంటికి మీ కూతురుని కోడలిగా పంపించారు కదా, మీరు ఎన్ని తులాల బంగారం పెట్టారని అడుగుతుంది. దాంతో ప్రభావతి నోరు మూసుకుంటుంది. తిక్క కుదిరిందని సత్యం అనుకుంటాడు. ఆ తర్వాత శృతి మీనా వాళ్ల అమ్మ పార్వతితో మాట్లాడుతుంది.

మీరు నాకోసం అప్పుడు పంపించిన జంతికలు చాలా బాగా ఉన్నాయని అంటుంది. దాంతో మీనా వాళ్ల తల్లి పార్వతీ అయ్యో ఇప్పుడు కూడా తీసుకొచ్చాను తల్లి అని తన సంచిలోంచి అప్పాలను తీసి ఇస్తుంది. ఇక శృతి, రవి తలా ఒకటి తీసుకుని తింటారు. మరోవైపు ప్రభావతి తినకండి అని అంటుంది. ఆమె ఏ నూనెతో వాటిని చేసిందో తెలియదు కదా అని అవమానిస్తుంది. అయ్యో మంచి వంట నూనేతోనే వాడను వదినా అని చెబుతుంది. ఆ తర్వాత తన మనస్సు బాధ అనిపించి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మీనాపై ప్రభావతి రెచ్చిపోతుంది. ఇంట్లో విషయాలన్నీ మీ అమ్మకు ఎందుకు చెబుతున్నావే అని మండి పడుతుంది. జరిగిందే చెప్పాను. లేనిది ఏమీ చెప్పలేదు కదా అని అంటుంది. ఇదే సమయంలో సుశీలమ్మ ఇంటికి వస్తుంది. దాంతో సత్యం, బాలు, మీనా, రవి, శృతి అందరూ సంతోషిస్తారు. బాలు మీనాల పెళ్లి రోజును గ్రాండ్ గా చేద్దామని సుశీలమ్మ అనడంతో సరేనని అంటారు. ఇప్పుడు ఇళ్లంతా నిండుగా ఉందని ఒక మౌనికాను కూడా పిలిస్తే బాగుటుందని చెబుతుంది. కానీ మీనా వద్దని అంటుంది. ఏ నా కూతురు రావడం నీకు ఇష్టం లేదా అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. అలా అని కాదు, బాలుకు సంజూకు పడదు కదా మళ్లీ ఏదైనా గొడవ జరిగే అవకాశం ఉంటుందని మీనా సమాధానం ఇస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X