Gunde Ninda Gudi Gantalu September 5th: మీనాని హత్తుకున్న ప్రభావతి.. ఆస్తి రాసివ్వాలంటే కండీషన్ పెట్టిన సుశీల

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక సెప్టెంబర్ 4వ తేదీ 503వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనాల పెళ్లిరోజు వేడుకలకు మౌనిక, సంజూలను ఆహ్వానిస్తుంది సుశీల. మీ ఇంటికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని అంటాడు సంజూ. అయితే తల్లి చీవాట్లు పెట్టడంతో బాలు ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. మౌనికను పుట్టింటిలో చూసి బాలు కుటుంబం సంతోషిస్తుంది. సంజూ నానామాటలతో బాలుని ఇబ్బంది పెట్టాలని చూడగా.. మీనా రివర్స్‌లో తగులుకుంటుంది.

ఇంటి అల్లుడికి అన్ని మర్యాదలు సక్రమంగా జరగాలని మీనాకు ప్రభావతి ఆర్డర్స్ వేస్తుంది. ఇక సంజూ ఉన్నంతసేపు నోరు అదుపులో పెట్టుకోమని బాలు నుంచి మాట తీసుకుంటుంది మీనా. సంజూ- మౌనికలకు బెడ్ రూమ్ ఖాళీ చేయాల్సిందిగా రోహిణిని అడుగుతుంది ప్రభావతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 5వ తేదీ, 504వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 504 September 5th 2025 here is full story

సుశీల, సంజూల కోసం మీ బెడ్‌రూం ఇవ్వమని రోహిణిని అడుగుతుంది ప్రభావతి. మనోజ్‌కి ఆ రూంలో తప్పించి ఎక్కడా నిద్రపట్టదని చెబుతుంది రోహిణి. నేను నా రూమ్‌ని మౌనికకి అయితే ఇస్తాను కానీ, అతని కోసమైతే ఇవ్వనని తేల్చిచెబుతుంది శృతి. మన రూమ్ ఇచ్చేద్దామని సత్యంతో ప్రభావతి అంటుంది. ఉన్న మూడు రూమ్‌లు మీరు ముగ్గురు పంచుకుంటే బాలు, మీనాలు ఎక్కడ పడుకుంటున్నారని సుశీల ప్రశ్నిస్తుంది. బాలు, మీనాలు హాల్‌లోనే పడుకుంటున్నారని శృతి చెప్పడంతో సుశీల రగిలిపోతుంది.

అల్లుడుగారు వచ్చేసరికి ఎవరో ఒకరు బెడ్‌రూం త్యాగం చేయమని చెబుతుంది ప్రభావతి. వాళ్లకి ఏ బెడ్‌రూం నచ్చితే అది తీసుకుంటారని అంటాడు సత్యం. ఈ మాటలు విన్న సంజూ.. బాలు రూమ్‌ని తీసుకుని వాడిని బయటికి గెంటేయాలని మనసులో అనుకుంటాడు. భోజనాల దగ్గర సుశీల, బాలులు పక్కపక్కనే కూర్చొంటారు. కూర్చీలు ఇక లేవని బాలు చెప్పగా.. ఫర్వాలేదు ఇప్పటి వరకు నాకు మూర్ఖులతో కూర్చొనే అవసరం రాలేదు, కూర్చోలేదని అంటాడు సంజూ. నాకొచ్చింది నేను కూర్చొన్నా.. మీరు కాదు, మా మనోజ్ అన్నయ్య అని కవర్ చేస్తాడు బాలు.

భోజనాలు వడ్డిస్తుండగా సంజూకి మామూలు ప్లేట్ కాకుండా వెండి ప్లేట్ తీసుకొచ్చి పెడుతుంది ప్రభావతి. మీ ఇంట్లో వెండి ప్లేట్స్ కూడా ఉన్నాయా? అని సంజూ అడగ్గా..ఇది మా సుశీల డార్లింగ్ నా కోసం చేయించిందని చెబుతాడు బాలు. ఒకరు తిన్న ప్లేట్‌లో నేను తిననని, విస్తారాకులో వడ్డించమని అంటాడు సంజూ. మరి మీరు రెస్టారెంట్స్‌కి వెళ్తుంటారు కదా.. అక్కడ ఎవరెవరో తిన్న ప్లేటులలోనే కదా తినాలి, ఖైదీలు పట్టుకెళ్లినట్లు మీ వెండి ప్లేట్ మీరే పట్టుకెళ్తారా అని సెటైర్లు వేస్తాడు బాలు. నీ పెళ్లికి నేను ఎలాగూ వడ్డించలేదు.. ఇప్పుడు వడ్డించనా? నేను వడ్డింపు మొదలు పెడితే ఆపనని అంటాడు బాలు.

ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఉండగా.. ఇవన్నీ నిన్నటి కూరలా? ఫ్రీజ్‌లో పెట్టి తెచ్చారా అని మండిపడతాడు సంజూ. అన్ని ఇప్పుడే చేశామని ప్రభావతి చెప్పగా.. మరి ఇంత చల్లగా ఉన్నాయేంటీ? అని అడుగుతాడు సంజూ. బావగారికి పొయ్యి మీదున్న సాంబారు తీసి విస్తరులో పోయమని అంటాడు బాలు. భోజనాలు ముగిసిన తర్వాత నాకు నిద్ర వస్తోందని సంజూ అనగా.. మేం కూడా దాని గురించే ఎదురుచూస్తున్నామని లోపలికి తీసుకెళ్తారు ముగ్గురు అన్నదమ్ములు. ఏ రూమ్‌‌లోకైనా వెళ్లండి గానీ ఆ రూమ్‌లోకి వెళ్లొద్దని బాలు అనడంతో నాకు ఆ రూమే కావాలని పట్టుబడతాడు సంజూ. ఇది బాలుగాడి రూమ్ అనుకుంటా, అందుకే వద్దు అంటున్నాడు.. ఈరోజు వాడు పెళ్లాంతో పాటు బయట పడుకోవాల్సిందేనని మనసులో అనుకుంటాడు సంజూ. అది మనోజ్ రూమ్ కావడంతో బాలు దగ్గరికొచ్చి మండిపడతాడు.

సంజూ మన రూమ్ తీసుకున్న విషయాన్ని రోహిణికి చెబుతాడు మనోజ్. అయితే అందరం మేడ మీద పడుకుందామని అంటారు. శృతి, రవిలు పైన పడుకుంటూ ఉండటంతో మనోజ్ - రోహిణిలు వాళ్ల రూమ్ తీసుకుంటామని చెబుతారు. మేడపైన అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా మౌనిక వస్తుంది. ఆ రావణాసురుడు రానిచ్చాడా? అని శృతి అడుగుతుంది. అయినా అంత దుర్మార్గుడిలా ఉన్నాడేంటీ? అని సుశీల నిలదీస్తుంది. ఆయనకు నీ మీదే కోపమని, నా మీద ఏం లేదని చెబుతుంది మౌనిక. మీ ఆయన ఎవరితోనైనా భౌ భౌ అంటున్నట్లుగా ఉందని రవి అంటాడు. ఆయన మీ బావగారు, ఈ ఇంటి అల్లుడు.. అతను ఎలాంటి వాడైనా సరే గౌరవించాలని చెబుతుంది సుశీల.

అదంతా మీ కాలంలో, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని తోడబుట్టినదానిని ఒక్క మాట అన్నా ఎవ్వరూ ఊరుకోవడం లేదని.. నేను అస్సలు ఊరుకోనని చెబుతాడు బాలు. నేను మీతో సరదాగా ఉందామని వచ్చానని, మీరంతా ఏదేదో మాట్లాడుతున్నారని అంటుంది మౌనిక. నీకు ఏదైనా ప్రాబ్లమ్ అయితే చెప్పు.. మీనా ఇటుక రాయి తీసుకొని వస్తుంది, నేను క్రికెట్ బ్యాట్ తీసుకుని వస్తానని అంటుంది శృతి. మరి నేను అని రవి అడగ్గా.. పెద్ద గరిట పట్టుకుని రా చెఫ్‌వి కదా అని సెటైర్లు వేస్తుంది. దాంతో అందరూ నవ్వేస్తారు. విన్నాడంటే జీవితంలో మౌనికను ఇంటికి రానివ్వడని సుశీల చెప్పడంతో అంతా సైలెంట్ అవుతారు.

మనోజ్ గురించి రవి చెబుతుండగా అందరూ నవ్వేస్తారు. కానీ మౌనిక డల్‌గా ఉండటంతో ఏం జరిగిందని బాలు అడుగుతాడు. మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడా? లేదా? అని అడుగుతాడు. అందరినీ మిస్ అవుతున్నానని గుర్తొచ్చి బాధగా ఉందని చెబుతుంది మౌనిక. చెల్లాయి దేని గురించో బాధపడుతున్నట్లుగా ఉందని అంటాడు బాలు. నేను కూడా మా పుట్టింట్లో అమ్మ, చెల్లి, తమ్ముడితో ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉంటానని అంటుంది మీనా. వాళ్లని వదిలిపెట్టి వచ్చేటప్పుడు నాకు కూడా బాధగా ఉంటుందని చెబుతుంది. ఒకవేళ మీ ఆయన నిన్ను ఏమైనా అంటే చెప్పు బాలు జాకీ తెస్తాడు, రవి గరిటె తెస్తాడు, నేను మైక్ తీసుకొస్తానని, మీనా ఇటుకరాయి తీసుకొస్తాడని శృతి అంటుండగా ఆ మాటలు సంజూ వింటాడు. మీ ఆయనకి నేను కొట్టిన దెబ్బలు గుర్తుండే ఉంటాయని, నీ జోలికి రాడని అంటాడు బాలు.

ఇంతో సంజూ వచ్చి మౌనికను తీసుకుని కిందకి వెళ్తాడు. నా పేరు మధ్యలో ఎందుకొచ్చింది? శృతి, మీ అన్న కలిసి నా మీద జోకులు వేస్తుంటే విరగబడి నవ్వుతున్నావని ఫైర్ అవుతాడు సంజూ. మీ అన్నకి బాగా కొవ్వెక్కువైందని, ఏదో ఒక రోజు వాడి కొవ్వు మొత్తం కరగదీస్తానని వార్నింగ్ ఇస్తాడు. నీ నవ్వంతా ఇంటికి వెళ్లాక ఏడుపులుగా మారుస్తానని అంటాడు. లోపలికి వస్తానని మౌనిక ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా వాళ్ల దగ్గరే పడుకుని కబుర్లు చెప్పుకోమని డోర్ వేసి వెళ్లిపోతాడు సంజూ. దాంతో మౌనికకు దెబ్బ తగలగా బాలు వచ్చి వాడిని చంపేస్తానని రగిలిపోతాడు. వాడు కావాలనే ఇలా చేశాడని మీనా ఊహించి, బాలుని పక్కకి తీసుకెళ్తుంది.

మౌనిక మనతో మాట్లాడటం భరించలేక తన వేలిని కావాలని నలిగేలా చేశాడని పైన అందరితో చెబుతాడు బాలు. ఆ మాటలతో అందరూ షాక్ అవుతారు. వాడికెంత ధైర్యమని శృతి కూడా రగిలిపోతుంది. పెళ్లయిన నాటి నుంచి సంజూతో మీరు గొడవ పెట్టుకుంటూనే ఉన్నారని, మౌనిక ఏమైనా చిన్నపిల్లా? అంత శాడిస్ట్ అయితే అక్కడే ఎందుకుంటుంది? అని అడుగుతుంది మీనా. నిజంగానే మౌనికని ఆ కుర్రాడు ఇబ్బంది పెడుతుంటే ఇంతకాలం ఓపికగా ఎందుకుంటుందని సుశీల కూడా ప్రశ్నిస్తుంది. నిజం తెలుసుకోకుండా నువ్వెళ్లి గొడవ పెట్టుకుంటే మౌనికకు ఇబ్బందులు తప్పవని చెబుతుంది. దాంతో బాలు శాంతిస్తాడు.

పెళ్లి రోజు కావడంతో ఉదయాన్నే సుశీల ఆశీర్వాదం తీసుకుంటారు బాలు - మీనా. నా జోలికి రాకుండా హాయిగా ఉండమని దీవిస్తుంది ప్రభావతి. నాకు అంతకుమించి దీవించడం రాదని ప్రభావతి చెప్పడంతో మీనాను దగ్గరికి తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకోమంటుంది సుశీల. నువ్వు ఏనాడూ ఈ కోడల్ని ప్రేమగా చూడటం నేను చూడలేదని అంటుంది సుశీల. ఇప్పుడు మీనాని నువ్వు దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటూనే బాగా చూస్తున్నావని అనుకుంటానని చెబుతుంది. దాంతో చేసేదేం లేక అలాగే చేస్తుంది ప్రభావతి. ఆ సన్నివేశాన్ని బాలు ఫోటో తీస్తాడు. మనోజో ఈ ఇంటికి పెద్ద కొడుకైనా, ముందుగానే మీ ఇద్దరికీ పెళ్లయ్యింది కాబట్టి.. మీనానే ఈ ఇంటికి పెద్ద కోడలని చెబుతుంది సుశీల. ముందుగా ఎవరు నా చేతిలో మునిమనవడిని రాసిస్తే వాళ్లకే నా ఆస్తి రాసిస్తానని చెబుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X