Gunde Ninda Gudi Gantalu September 8th: సంజూకి బుద్ధి చెప్పిన బాలు.. నోరుజారిన పార్వతమ్మ, చిక్కుల్లో మీనా
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక సెప్టెంబర్ 5వ తేదీ 504వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మౌనిక, సంజూల కోసం బెడ్ రూం ఖాళీ చేయమని రోహిణిని ప్రభావతి అడుగుతుంది. మీ అబ్బాయికి అక్కడే నిద్రపడుతుందని రోహిణి తేల్చి చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది. భోజనాల దగ్గర బాలుని, తన అత్తగారి కుటుంబాన్ని అవమానించాలని సంజూ అనుకుంటాడు. అల్లుడిగారి కోసం వెండి పళ్లెం తీసుకొచ్చి పెడుతుంది ప్రభావతి. ఒకరు తిన్న ప్లేటులో నేను తినను అని చెప్పడంతో మీరు హోటల్‌కి వెళ్లినప్పుడు ఖైదీలా బొచ్చె తీసుకుని వెళ్తారా అంటూ బాలు సెటైర్లు వేస్తాడు. ఆ దెబ్బకు సంజూ నోరుమూసుకుంటాడు.
భోజనాల తర్వాత బాలు, మీనా, సుశీల డార్లింగ్, శృతి, రవిలు మిద్దెపై మాట్లాడుకుంటూ సంజూపై సెటైర్లు వేస్తారు. ఆ మాటలు విన్న సంజూ.. వెంటనే మౌనికను కిందకి లాక్కెళ్లి నువ్వు ఇంటికి వెళ్లాక నిన్ను ఏడిపిస్తానని వార్నింగ్ ఇచ్చి తలుపు సందులో పెట్టి వేళ్లు విరిచేస్తాడు. అది చూసిన బాలు.. వాడిని చంపేస్తానని ఊగిపోతాడు. దాంతో బాలుని మీనా శాంతింపజేస్తుంది. పెళ్లి రోజు కావడంతో అందరి దగ్గరా ఆశీర్వాదం తీసుకుంటారు బాలు - మీనా. నువ్వు నీ కోడలికి నా ముందే నుదిటిన ముద్దు పెట్టాలని సుశీలమ్మ చెప్పడంతో చేసేది లేక మీనా నుదిటిన ముద్దుపెడుతుంది ప్రభావతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 8వ తేదీ, 505వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

బాలు, మీనాలకి ఎక్కడ సుశీల ఆస్తి రాసిస్తుందోనని ప్రభావతి భయపడుతుంది. ఎవరు ముందుగా నా చేతిలో ముని మనవడిని పెడతారో? వారికే నా ఆస్తి రాసిస్తానని అంటుంది సుశీల డార్లింగ్. మా అమ్మకి ఇప్పుడు ఎంత తృప్తిగా ఉందో.. ఎక్కడ నాకు ఆస్తి దక్కుతుందోనని తెగ కంగారుపడిపోయిందని అంటాడు బాలు. నేను నీలాగా కోడళ్లని వేరు వేరుగా చూడనని అంటాడు. ఆ తర్వాత సత్యం, రవి, శృతిలు కలిసి.. బాలు, మీనాలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతారు. ఈ సంవత్సరం బాగానే ఉన్నారు.. ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనోజ్ విష్ చేస్తాడు. నీ చొక్కా బాగుందని సుశీల కాంప్లిమెంట్ ఇవ్వడంతో మీనా వాళ్ల అమ్మ పెట్టిందని అంటాడు బాలు. షర్ట్ ఇచ్చి ప్యాంట్ ఇవ్వడం మరిచిపోయారు అనుకుంటా అని సెటైర్లు వేస్తుంది ప్రభావతి.
బాలు, మీనాల పెళ్లి రోజు కావడంతో వారిద్దరికి బంగారు ఉంగరాలు చేయిస్తుంది సుశీల డార్లింగ్. అది చూసి మనోజ్, రోహిణిలు కుళ్లుకుంటారు. ఈసారి మనం కూడా పెళ్లి రోజు చేసుకుందామని, మీ అమ్మ మనకి ఏం ఇస్తుందో చూద్దామని అంటుంది ప్రభావతి. ఆ తర్వాత బాలు, మీనాలు ఉంగరాలు మార్చుకుంటారు. ఉంగరం చూసి ఎలా మురిసిపోతుందో చూశావా అని బాలు ఆటపట్టిస్తాడు. బంగరాన్ని చూసి కాదు మురిసిపోయేది, బంగారం లాంటి అమ్మమ్మగారు ఇచ్చారు కదా అందుకే అని చెబుతుంది మీనా. మీ అత్తగారింటికి వెళ్లి అక్కడ కూడా ఆశీర్వాదం తీసుకుని రమ్మని చెబుతాడు సత్యం. నీకు మీ అమ్మానాన్న ఎంత ముఖ్యమో మీనాకు కూడా అంతేనని అంటాడు.
ఇంతలో మౌనిక వచ్చి బాలు, మీనాలను విష్ చేస్తుంది. మరి మీ ఆయన ఎక్కడ అని సత్యం అడగ్గా.. ఇంకా లేవలేదని చెబుతుంది. మనం గుడికి వెళ్లి మీనా, బాలుల పేరు మీద అర్చన చేయించాలని చెప్పడంతో ఎందుకు అని ప్రభావతి అడగటంతో ఏంటీ? ఏంటీ? అని అందరూ అడుగుతారు. ఆ దెబ్బకు ప్రభావతి భయపడిపోయి సరేనని అంటుంది. సంజూకి మౌనిక కాఫీ తీసుకెళ్తుండగా దానిని నేను ఇస్తానని చెప్పి తీసుకెళ్తాడు. ఆ విషయం తెలుసుకున్న మీనా కంగారు పడుతుంది. కాఫీ తీసుకెళ్లిన బాలు.. సంజూ వేళ్లని కప్పులో ముంచేస్తాడు. ఆ వేడికి ఉలిక్కిపడి లేచిన సంజూ మీద కాఫీ పడుతుంది.
రాత్రి చెల్లెలు చేయి నలిగింది.. పొద్దున్నే బావగారి చేయి కాలిందని ఇదంతా విధి ఆడే వింత నాటకమని అంటాడు బాలు. ఆ మాటలతో బాలు తనపై రివేంజ్ తీర్చుకుంటున్నాడని అనుకుంటాడు సంజూ. ఇదంతా మీరు కావాలనే చేశారు కదా అని మీనా అడగ్గా నాకేంద తెలియదని చెబుతాడు బాలు. ఇంట్లో వాళ్లంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా సంజూ కోపంగా వచ్చి ఈ ఇంట్లో గీజర్ కూడా లేదా అని అడుగుతాడు. చన్నీళ్లతో నేను స్నానం చేయలేనని సంజూ అనగా.. మౌనిక వేడినీళ్లు పెడతానని చెప్పిందని, కానీ బావగారికి ఇంకా వేలు కాలుతుందని నేనే వద్దని చెప్పానని అంటాడు బాలు.
వేడినీళ్లు కాగిన తర్వాత నీళ్లు నేను తీసుకెళ్తానని అంటాడు బాలు. ఈసారి ఏం చేయనని జాగ్రత్తగా చూసుకుంటానని చెబుతాడు బాలు. కాసేపటికి సంజూ మంట అని అరుస్తూ కిందకి వస్తాడు. స్నానం చేయడానికి వేడి నీళ్లు పెడతావా? అని మౌనికపై మండిపడతాడు సంజూ. చన్నీళ్లతో స్నానం చేసే అలవాటు లేదని బావ చెప్పాడని అలాగే తీసుకెళ్లి పెట్టానని అంటాడు బాలు. మరిగే మరిగే నీళ్లు కావాలా? గోరు వెచ్చటి నీళ్లు కావాలా? అని నేను ముందే అడిగానని మీరే నాకు ఆన్సర్ ఇవ్వలేదని అంటాడు బాలు. జరిగిన దానికి నన్ను క్షమించాలని సంజూతో అంటాడు బాలు. వీడు కావాలనే ఓవరాక్షన్ చేస్తున్నాడని సంజూకి అర్ధమవుతుంది. అతను వెళ్లిపోయాక మీనా, సుశీల, రవి, శృతిలు నవ్వుకుంటారు.
ఉదయాన్నే ఏం టిఫిన్ చేశావని మీనాని అడుగుతాడు రవి.. మీ అందరికీ ఇష్టమైన పూరి, కుర్మా చేశానని చెప్పడంతో మనోజ్ తెగ సంబరపడిపోతాడు. నేను ఆయిల్ ఫుడ్ తినను అని సంజూ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నా నోరు కాలిపోవాలని ప్లాన్ చేశావా? అని బాలుపై మండిపడతాడు సంజూ. నాకు మీ టిఫిన్ ఏం పెట్టొద్దని.. నేను ఆర్డర్ పెట్టుకున్నానని సంజూ చెప్పడంతో మా ఇంటికి ఇచ్చి మీరు ఆర్డర్ పెట్టుకోవడం ఏంటని అంటాడు బాలు. ఇంతలో పిజ్జా డెలివరీ బాయ్ రావడంతో నేను వెళ్లి తీసుకొస్తానని చెబుతాడు బాలు. ఆ వెంటనే దానిపై కారం, మిరియాల పొడి చల్లి తీసుకొచ్చి ఇస్తాడు బాలు.
పిజ్జాని చూడగానే మనోజ్‌కి నోరూరిపోతుంది. దాంతో సంజూ అతనికి కూడా పెడతాడు. నోట్లో పెట్టుకోగానే వాళ్లిద్దరికి కారం ఘాటు నషాళానికి అంటుతుంది. దానిలో కారం కలిపానని రవి, శృతిలకు కన్ను కొడతాడు బాలు. ఆ దెబ్బకి వాళ్లిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. కారం దెబ్బకి మనోజ్ బాత్‌రూంకి పరుగులు తీస్తాడు. సంజూ లేచి వెళ్లిపోవడంతో అతనికి తినిపిస్తాడు బాలు. కారం ఘాటుకి మంచినీళ్లు తాగేస్తాడు సంజూ. ఏం చేశావో మర్యాదగా చెప్పమని సుశీల డార్లింగ్ అడగటంతో నా చెల్లెలి వేలికి గాయం చేస్తాడా? అని కోపంగా అంటాడు బాలు.
ఇక్కడే ఉంటే ఆయన ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడని మేం మా ఇంటికి వెళ్లొస్తామని సుశీలమ్మతో చెబుతుంది మీనా. దాంతో కారులో బాలు, మీనా వెళ్తుండగా.. నువ్వు మా నాన్న కలిసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారని మీనాతో అంటాడు బాలు. మేం ఏం చేశామని మీనా అడగ్గా.. మీ అమ్మగారి ఆశీర్వాదం తీసుకుని మనం వెంటనే వెళ్లిపోదామని చెబుతాడు బాలు. భోజనం చేసి సాయంత్రం వరకు ఉందామని అంటుంది బాలు. మీనా, బాలులను చూసి అప్పుడే మీ పెళ్లి జరిగి ఏడాది అయిపోయిందా అని ఇరుగుపొరుగు వారు అడుగుతారు. లోపలికి వెళ్లగానే అల్లుడిగారికి దిష్టి తీయాలని చెబుతుంది పార్వతమ్మ. మీరు కారు నడిపిన వీడియో బయటికి వచ్చింది కదా అందుకేనని అంటుంది. మా శివని అపార్ధం చేసుకోవద్దని చెబతుుంది పార్వతమ్మ. నా షర్ట్ బాగుందని అందరూ అంటున్నారని, ఎక్కడ కొన్నారని బాలు అడగ్గా.. నాకు తెలియదని శివ కొన్నాడని చెబుతుంది పార్వతమ్మ. ఆ మాటలతో బాలు రగిలిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










