Gunde Ninda Gudi Gantalu September 9th: షర్ట్ విప్పి శివ ముఖాన కొట్టిన బాలు.. నిజం రాబట్టాలని ప్రభావతి ఎత్తులు
Gunde Ninda Gudi Gantalu: బాలు, మీనాల పెళ్లి రోజు సందర్భంగా అందరి ఆశీర్వాదం తీసుకుంటారు. వాళ్లకు అందరూ విషెస్ తెలియజేస్తారు. ఇంతలో సంజూకి మౌనిక కాఫీ తీసుకెళ్తుండగా బాలు తాను తీసుకెళ్తానని చెప్పి వేడి వేడి కాఫీలో సంజూ వేళ్లు పెడతాడు. ఆ కంగారులో ఉలిక్కిపడి లేచిన సంజూపై కాఫీ పడటంతో మండిపడతాడు. ఆ తర్వాత స్నానానికి మరిగే మరిగే నీళ్లు తీసుకెళ్లడంతో సంజూ రగిలిపోతాడు. భోజనాల దగ్గర మీనా పూరి, కుర్మా కూర తయారు చేస్తే వద్దని నేను సెపరేట్‌గా పిజ్జా ఆర్డర్ చేసుకున్నానని చెబుతాడు.
ఆ పిజ్జాపై కారం, మిరియాల పొడి చల్లి తీసుకొచ్చి ఇస్తాడు బాలు. పిజ్జాను చూడగానే మనోజ్‌కు నోరూరడంతో అతనికి పిజ్జా పెడతాడు మనోజ్. కారం దెబ్బకు మనోజ్ బాత్‌రూమ్‌లోకి పరుగులు తీస్తాడు. సంజూ మాత్రం ఎలాగైనా కవర్ చేయాలని బలవంతంగా తింటాడు. ఇదంతా మన పనేనని, వాడు నా చెల్లెలి వేళ్లు విరిచేస్తాడా? అని బాలు అందరికీ చెబుతాడు. దాంతో అందరూ నవ్వుకుంటారు. బాలును మీనా పుట్టింటికి తీసుకుని సత్యం చెబుతాడు. దాంతో భార్యాభర్తలిద్దరూ పార్వతమ్మ ఇంటికి వస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 9వ తేదీ, 506వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

మా శివని అపార్ధం చేసుకోవద్దని, వాడికి ఆ వీడియోకి సంబంధం లేదని చెబుతుంది పార్వతమ్మ. నాకు తెలుసు.. అయినా ఇప్పుడు వాటిని గుర్తుచేసుకోవడం ఎందుకు అని అడుగుతాడు బాలు. నువ్వు, అల్లుడుగారు మీ నాన్న గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెబుతుంది బాలు. మీ షర్ట్ చాలా బాగుందని మీనా చెల్లెలు బాలుని మెచ్చుకుంటుంది. ఈ షర్ట్ అందరికీ చాలా నచ్చిందని, ఏ షాప్‌లో కొన్నారని బాలు అడుగుతాడు. నాకు తెలియదని శివ తీసుకొచ్చాడని చెబుతుంది పార్వతమ్మ. ఆ మాటలు విన్న బాలు రగిలిపోతాడు.
వాడు కొన్న షర్టా ఇది అని అరుస్తుండగా శివ వస్తాడు. ఈ షర్ట్ మీ అమ్మగారు కొన్నారని చెప్పావ్ అని మీనాని నిలదీస్తాడు. మీనాకు కూడా తెలియదని, నేను మీ ముందే ఇచ్చానని చెబుతుంది పార్వతమ్మ. ఎవరు కొంటే ఏంటీ? మా పుట్టింటి వాళ్లు కొన్నట్లని అంటుంది మీనా. మీ అమ్మ కొన్నారంటే ఒక్కొక్క పువ్వు అల్లుతూ కష్టపడి సంపాదించి ఉంటారని సంతోషంగా వేసుకున్నానని అంటాడు బాలు. నేను కూడా కష్టపడే షర్ట్ కొన్నానని శివ చెబుతాడు. నూటికి 6 రూపాయలకు వడ్డీ తీసుకునే ఆ గుణ దగ్గర పనిచేస్తూ జనాన్ని ఇబ్బంది పెడతున్నావని మండిపడతాడు బాలు. అలాంటి డబ్బుతో కొన్న ఈ షర్ట్ వేసుకుంటే నా ఒంటి మీద తేళ్లు, జెర్రులు పాకుతున్నట్లుగా ఉంటుందని అంటాడు బాలు.
ఇంతలో శివని బయటికి వెళ్లమని మీనా అడగ్గా.. నేనేందుకు వెళ్లాలి? ఇది నా ఇల్లు అని శివ పంతం పడతాడు. పార్వతమ్మ కూడా కొడుకు మీద రంకెలు వేస్తుంది. గొడవ అవుతుందని భయపడుతున్నారా? నా చేయి విరిచేసినా కూడా అక్క ముఖం చూసి షర్ట్ కొనిపెట్టానని ఆ విశ్వాసం కూడా ఈ మనిషికి లేదని శివ చెప్పడంతో బాలు రగిలిపోతాడు. నేనేమీ ఆర్డనరీ షర్ట్ కొనలేదు.. బ్రాండెడ్ షర్టే కొన్నానని అంటాడు శివ. దాంతో తమ్ముడిని కొట్టబోతుంది మీనా. నువ్వు నాకు ఖరీదైన షర్ట్‌లు కొనేంత మొనగాడివి అయ్యావా? నువ్వు లక్ష పెట్టి కొన్నా.. అది ఎలాంటి షర్టో తెలిస్తే చచ్చినా వేసుకునే వాడిని కాదని అంటాడు బాలు.
నేను కొన్నానని తెలిసినా ఆ షర్ట్ ఎందుకు వేసుకున్నావ్? నీ ఒంటి మీద ఎందుకుందని శివ నిలదీయగా.. బాలు వెంటనే షర్ట్ విప్పేసి శివ ముఖాన కొట్టేసి ఇంటికి బయల్దేరతాడు. ఇదంతా చూసినా ఇరుగు పొరుగు వారు.. బాలు చొక్కా లేకుండా వెళ్తున్నాడని అడుగుతారు. ఇద్దరూ సంతోషంగా ఉన్నారని అటుగా వెళ్లామో లేదో అప్పుడే గొడవ అయ్యిందా అని నానామాటలు అంటారు. ఉన్నంతలో అన్ని మర్యాదలు చేస్తావ్ కదా? అయినా అంత కోపం పనికి రాదని అంటారు. వస్తున్నావా? లేదా? అని మీనాని కారులో ఎక్కించుకుని వెళ్లిపోతాడు.
నేను షర్ట్ కొనిస్తే ఆయన వేసుకుంటాడని చెప్పావ్ కదా? చూశావా ఎంత పొగరుగా విప్పేసి వెళ్లిపోయాడో అని పార్వతమ్మని శివ నిలదీస్తాడు. నా కూతురు ఎంతో సంతోషంగా వచ్చింది? కానీ నువ్వు దానిని క్షణాల్లో ఆవిరి చేశావని శివని నిలదీస్తుంది పార్వతమ్మ. వాడు తెలియక వాగితే ఇలాగే వచ్చేస్తారా? అని బాలుని మీనా నిలదీస్తుంది. మన పెళ్లి రోజని మా అమ్మ భోజనానికి ఏర్పాట్లు చేసిందని పాపం ఆవిడ బాధపడిందని అంటుంది మీనా. అసలు వాడు షర్ట్ కొన్నాడన్న సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతాడు బాలు. ఆ షర్ట్ శివ కొన్న విషయం నాకు తెలియదని, లేదంటే వద్దు అనే దానిని అని చెబుతుంది మీనా. షర్ట్ లేకుండా వచ్చేస్తే ఇంట్లో వాళ్లు ఏం జరిగిందని అడుగుతారు? అత్తయ్య ఎంత గొడవ చేస్తారో ఏంటో అని మీనా భయపడుతుంది.
ఈ రోజు వరకు నేను ఏం కొన్నా.. నేను కష్టపడి సంపాదించిన దబ్బుతోనే కొన్నానని, కానీ మందిని ఏడిపించి, పీడించిన డబ్బుతో కొనలేదని చెబుతాడు బాలు. ఈ బాలు ఎప్పటికీ బాలులాగే ఉంటాడని చెబుతాడు. బాలుకి ప్రసాదం తీసుకొచ్చి ఇస్తుంది ప్రభావతి. తల్లి డల్‌గా ఉండటంతో ఏం జరిగిందని మనోజ్ అడగ్గా.. మీనా లేకపోవడంతో అన్ని పనులు నాతో చేయిస్తున్నారని చెబుతుంది ప్రభావతి. ఇంతలో షర్ట్ లేకుండా బాలు ఇంటికి రావడంతో ఏం జరిగిందని ఇంట్లో వాళ్లంతా అడుగుతారు. ఎవరైనా అత్తగారింటికి వెళితే బట్టలు పెట్టి పంపిస్తారని, మీ అత్తగారు ఉన్న షర్ట్ ఊడపీకి పంపించారని సంజూ సెటైర్లు వేస్తాడు.
ఇద్దరూ పొంతన లేని సమాధానం చెప్పడంతో ప్రభావతికి డౌట్ వస్తుంది. నిజం తెలుసుకునే దాకా వదిలిపెట్టనని అనుకుని రోహిణి ద్వారా రాబట్టాలని అనుకుంటుంది. బాలు చాలా కోపంగా ఉన్నాడని, అసలు ఏమైనా జరిగిందా? అని రోహిణి అడుగుతుంది. అయినా అది మా ఇంటి విషయమని మీనా కోపంగా వెళ్లిపోతుంది. జరిగిందంతా తలచుకుని మీనా బాధపడుతుంది. ఇంతలో సుశీలమ్మ వచ్చి ఏం జరిగిందని నిలదీస్తుంది. బావ బామ్మర్దుల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. ఎదురుపడితే శత్రువుల్లా బిహేవ్ చేస్తున్నారని, ఆ షర్ట్ శివ కొన్నాడని ఆయనకి తెలియగానే విప్పేసి వచ్చేశారని నిజం చెబుతుంది మీనా. తిరిగి బావబామ్మర్దలు కలిసిపోతారని సుశీలమ్మ చెబుతుంది.
నాకు అంతా తెలుసని, కోపం తగ్గించుకోమని చెబుతుంది సుశీల. మీనాకు నువ్వంటే ప్రాణమని.. ఆ అమ్మాయిని బాగా చూసుకోమని అంటుంది సుశీల. మీ మనవడికి ఎంత చెప్పినా వినిపించుకోడని.. మా పెళ్లే గొడవతో మొదలైందని, అది అలాగే కొనసాగుతోందని బాధపడుతుంది మీనా. చివరికి షర్ట్ వేసుకుంటాడు బాలు. ప్రభావతి టార్చర్ గురించి రోహిణి, శృతిలు అందరికీ చెబుతారు. మీనా మా లాగా చదువుకోలేదు కాబట్టి అన్నీ భరించిందని మెచ్చుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










