Gunde Ninda Gudi Gantalu September 10th: బాలుకి డ్రైవర్ ఉద్యోగం.. దెబ్బకు దెబ్బ తీసిన సంజూ

Photo Courtesy: JioHotstar

Gunde Ninda Gudi Gantalu: పెళ్లి రోజు కావడంతో బాలు, మీనాలు పార్వతమ్మ ఇంటికి వస్తారు. అందరూ మీరు పెట్టిన షర్ట్ బాగుందని, ఎక్కడ కొన్నారని బాలు అడగ్గా.. నేను కొనలేదని శివ తీసుకొచ్చాడని అంటుంది. ఆ మాటలతో బాలు రగిలిపోతాడు. మీరు కష్టపడి సంపాదిస్తారు కాబట్టి తీసుకుంటా.. వీడు మందిని ఇబ్బంది పెట్టిన డబ్బుతో కొన్నాడని మండిపడతాడు. నేనంటే ఇష్టం లేనప్పుడు నేను తీసుకొచ్చిన షర్ట్ ఎందుకని శివ ప్రశ్నిస్తాడు. దాంతో బాలు షర్ట్ విప్పేసి శివ ముఖంపై కొట్టి కోపంగా ఇంటికి వెళ్లిపోతాడు.

షర్ట్‌తో వెళ్లి షర్ట్ లేకుండా వచ్చిన కొడుకుని చూసిన సత్యం, ప్రభావతిలు షాక్ అవుతారు. అక్కడ ఏం జరిగిందో చెప్పమని బాలు, మీనాలను నిలదీస్తారు. మీనా ఏదేదో కారణాలు చెప్పడంతో ఎలాగైనా నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీనా దగ్గరికి రోహిణిని పంపుతుంది ప్రభావతి. ఇది మా పర్సనల్ అని మా జోలికి రావొద్దని రోహిణికి మీనా వార్నింగ్ ఇస్తుంది. సుశీల, మీనాలు బుజ్జగించడంతో బాలు షర్ట్ వేసుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 10వ తేదీ, 507వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 507 September 10th 2025 here is full story

Photo Courtesy: JioHotstar

ప్రభావతి టార్చర్ గురించి రోహిణి, శృతిలు సెటైర్లు వేస్తారు. మీనా మనలాగా చదువుకోలేదు కాబట్టి.. పాతకాలం అమ్మాయిలా అన్ని భరించిందని రోహిణి చెప్పింది. చదువుకు కాపురానికి సంబంధం లేదని, ఎంత చదువుకున్నా కాపురం నిలబడాలంటే సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలని అంటుంది సుశీల డార్లింగ్. మీ అందరి కడుపులో నా మీద ఇంత ఉందా? అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. నువ్వు మీనాని ఎలా చూస్తావో ప్రపంచం మొత్తానికి తెలుసని సత్యం సెటైర్లు వేస్తాడు. ఇప్పుడు ఆ హీరో హీరోయిన్ల కోసం మనమంతా నిలబడి ఎదురుచూడాలా? అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. నిజంగానే బాలు ఒక హీరో, మీనా ఒక హీరోయిన్ అంటాడు సత్యం.

కేక్ తీసుకొచ్చారా? లేదా? అని రవిని మనోజ్ అడుగుతాడు. ఎంత ఆర్ధర్ ఇచ్చారు? ఒక పావుకిలోనా? అరకిలోనా? అని సెటైర్లు వేస్తాడు సంజూ. వచ్చాక మీరే చూడండి.. మా ఇంట్లో ఎన్ని గొడవలు ఉన్నా అవసరం వచ్చినప్పుడు ఒకటిగానే ఉంటామని, ఆ ప్రేమను ఎప్పుడు కిలోల లెక్కన తూకం వేసుకోలేమని రవి పంచ్ విసురుతాడు. ఇంతలో శృతి తల్లి వచ్చి.. మౌనిక కాపురం ఎలా సాగుతుందోనని అడుగుతుంది. మా శృతిలాగా నువ్వు గడుసు దానివి కాదని, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. దీంతో మండిపడిన సంజూ.. వచ్చిన వాళ్లని వచ్చినపని చూసుకుని వెళ్లమని అంటాడు.

బాలు, మీనాల పెళ్లి రోజు కావడంతో మీనాకి బంగారు గాజులు బహుమతిగా తీసుకొస్తుంది శృతి తల్లి. దాంతో ప్రభావతి షాకై కళ్లు అప్పగించి చూస్తుండి పోతుంది. మీనా కోసం చాలా మంచి గిఫ్ట్ తెచ్చావని తల్లిని మెచ్చుకుంటుంది శృతి. ఇదంతా చూసిన మనోజ్.. మన వెడ్డింగ్ యానివర్సిరిని త్వరగా చేసుకోవాలని రోహిణితో అంటాడు. శృతి తల్లి ఇచ్చిన గాజుల్ని తీసుకున్న మీనా.. గాజులు చాలా బాగున్నాయని చెబుతుంది. ఫ్రీగా వస్తే ఏదైనా బాగుంటుందని సెటైర్లు వేస్తుంది ప్రభావతి. నాకు బంగారం అంటే ఎంత ఇష్టమనే విషయం నా మెడలో ఉన్న పసుపు తాడే చెబుతుందని, ఈ గాజులు నాకన్నా శృతికే బాగుంటాయని ఆమెకు వేసేస్తుంది మీనా.

శృతి చేతికి ఎందుకు వేశావని ఆమె తల్లి మీనాని అడుగుతుంది. నా భార్యకి బంగారం అంటే మోజు లేదని అర్ధమని బాలు మెచ్చుకుంటాడు. నాకు నీ మీద ఇంకా గౌరవం పెరిగిందని రవి మెచ్చుకుంటాడు. అందరి ముందు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు బాలు - మీనా. అలాగే అందరికీ తినిపిస్తారు . పెళ్లిరోజు సందర్భంగా మీనా - బాలులు కలిసున్న ఫోటోను గిఫ్ట్‌గా ఇస్తాడు రవి. అది అందరికి నచ్చుతుంది. ఇంతలో నేను కూడా నీ కోసం గిఫ్ట్ తెచ్చానని సంజూ అంటాడు. చెక్ తీసుకొచ్చాడేమోనని మనోజ్ టెన్షన్ పడుతుండగా.. బాలు కవర్ విప్పి చూస్తాడు. వాడికి ఇంగ్లీష్ రాదని మనోజ్ చదువుతాడు.

బావగారు బాలుగాడికి పర్సనల్ డ్రైవర్‌గా జాబ్ ఇచ్చాడని మనోజ్ చదివి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నెలకి 50 వేల జీతమని చెబుతాడు. ఆ మాటలు విన్న ప్రభావతి షాక్ అవుతుంది. ఎంతైనా గొప్పవాళ్ల కానుకలు గొప్పగానే ఉంటాయని అంటుంది. అల్లుడుగారేమో బంగారం లాంటి ఉద్యోగం ఇచ్చారు, వదినగారు బంగారు గాజులు తెచ్చారని మురిసిపోతుంది. ఎన్నాళ్లని క్యాబ్ నడుపుతావ్, నాకు విశ్వాసంగా వుండే ఓ నౌకరు కావాలని అదే నువ్వయితే డ్రైవింగ్ బాగా చేస్తావు, పైగా నమ్మకంగా పనిచేస్తావని అంటాడు సంజూ. నమ్మకంగా పనిచేయడానికి జీతం ఎక్కువ ఇవ్వాల్సిన పనిలేదని, కానీ నేను ఎవ్వరి దగ్గర పనిచేయనని తేల్చిచెబుతాడు బాలు.

ఆ మాటలు విన్న ప్రభావతి.. నీకెమైనా పిచ్చి పట్టిందా? నెలకు 50 వేలు జీతం.. నువ్వు ఎంత కష్టపడి కారు నడిపినా అంత రాదు కదా అని అంటుంది. నెలంతా కష్టపడి కారు నడిపినా, నా కారు నేను నడిపానన్న తృప్తి ఉంటుందని చెబుతాడు బాలు. నేను కారు ఎక్కితే డోర్ తెరిచి పట్టుకోవడానికి నామోషిగా ఉంటుందా అని అడుగుతాడు సంజూ. ఇంటి ఆడపడుచు భర్త ముందు ఎంత కోటీశ్వరుడైనా తల వంచాల్సిందేనని, నా పని నేను చేయడానికి నామోషి అని ఎందుకు అనుకుంటానని అంటాడు బాలు. దొంగదారిలో సంపాదించేవారు, అధికారం ఉందని విర్రవీగేవారు నామోషిగా ఫీల్ అవ్వాలని చెబుతాడు.

సొంత చెల్లెలి ఇంట్లో డ్రైవర్‌గా చేయడానికి ఫీల్ అవుతున్నావా? అని అడుగుతాడు సంజూ. నా చెల్లెలికి నేను ఎప్పటికీ డ్రైవర్‌గానే ఉంటానని అంటాడు బాలు. కానీ నీకు కావాల్సింది డ్రైవర్ కాదు.. నేను నీ దగ్గర నౌకరుగా ఉండటమని చెబుతాడు. విశ్వాసమే కావాలనుకుంటే కుక్కని పెంచుకోండని తేల్చేస్తాడు బాలు. మా అన్నయ్య ఎప్పుడు ఒకరి దగ్గర పనిచేయలేదని వదిలేయమని మౌనిక బతిమలాడుతుంది. వాడి కాళ్ల మీద వాడు నిలబడి ఏదో సంపాదించుకుంటున్నాడని ఈ విషయం ఇంతటితో వదిలేయమని అడుగుతాడు సత్యం. నా మనవడిది వాడి తాత పోలిక అని, ఒకరి దయా దాక్షిణ్యాల మీద బతకడం వాడికి ఇష్టం ఉండదని చెబుతుంది సుశీల డార్లింగ్.

చాలాసేపు నిలబడి ఉన్నావని, వెళ్లి కూర్చోమని సంజూతో చెబుతుంది ప్రభావతి. ఆ వెంటనే సంజూ కూర్చొన్న కుర్చీ విరిగిపోయి కిందపడతాడు. మీ ఇంట్లో ఇంత పాతకాలం నాటి సోఫాలు ఉన్నాయని నాకెందుకు చెప్పలేదని మౌనికను అడుగుతాడు సంజూ. మీరు మా చెల్లెల్ని పుట్టింటికి పంపిస్తే దానికి తెలుస్తుందని అంటాడు బాలు. ఇంత పాతకాలం నాటి సోఫాలు ఇంట్లో ఉంచుకుంటారా అని శృతి తల్లి ప్రశ్నిస్తుంది. మీరు ఎలాగూ కొనలేరు కాబట్టి నేనొక మంచి సోఫా కొని పంపిస్తానని అంటుంది. అలాంటి కానుకలు వద్దని సత్యం చెబుతాడు. సారె కింద పంపిస్తానని చెబుతుంది శృతి తల్లి. మీరు ఆ ముక్క ముందే అని ఉంటే చాలా బాగుండేదని, కానీ మీరు కొనలేరనే మాట అనడం మాకు నచ్చలేదని అంటాడు బాలు.

బంగారం అంటే నా భార్యకు, 50 వేల జీతం అంటే నాకు, ఫ్రీగా వస్తువులు ఇస్తామంటే మా నాన్నకి ఎప్పటికీ ఇష్టం ఉండదని అంటాడు బాలు. ఆ మాటలతో శృతి తల్లి వెళ్లిపోతుంది. బాలు, మీనాల గురించి ఒక్కొక్కరు చెప్పాలని అడుగుతుంది శృతి. నా వల్లే వీడికి పెళ్లి అయ్యిందని, లేదంటే వాడికి పిల్లని ఎవరిస్తారని అంటాడు మనోజ్. పెళ్లయినప్పటి నుంచి మీనా, బాలులు గొడవ పడుతూనే ఉన్నారని నెక్ట్స్ పెళ్లి రోజుకైనా వారి జీవితం సెట్ అవ్వాలని కోరుకుంటున్నానని చెబుతుంది రోహిణి.

వదిన వచ్చాక బాలు అన్నయ్య పూర్తిగా మారిపోయాడని మెచ్చుకుంటాడు రవి. రవి, నేను కలిసుండటానికి మీనా, బాలులే కారణమని ప్రశంసిస్తుంది శృతి. పెళ్లి బలవంతంగా చేసుకున్నా కాపురం నిలబెట్టుకున్నాడంటే మీనా వల్లేనని సత్యం చెబుతాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉండటానికి ఏ డిగ్రీలు అవసరం లేదని, ఒకరి మీద ఒకరికి నమ్మకం ప్రేమ ఉంటే చాలని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X