Gunde Ninda Gudi Gantalu September 16th: మనోజ్ షాప్ ఓపెన్ చేసిన ప్రభావతి.. మీనాకి ఘోర అవమానం

Photo Courtesy: JioHotstar

Gunde Ninda Gudi Gantalu: బాలు తలుపులు బాదటంతో రోహిణి - మనోజ్‌లు మండిపడతారు. నువ్వే నా కొడుకుని ఉసిగొలిపావా? అని మీనాని ప్రభావతి ప్రశ్నిస్తుంది. దీంతో శృతి, రవిలు ఏం జరిగిందో చెబుతారు. దాంతో చేసేది లేక రోహిణి - మనోజ్‌లు హాల్‌లోనే పడుకుంటారు. బాలుని పడుకోనివ్వకూడదని అనుకున్న మనోజ్ పదే పదే తలుపులు కొడుతూ అది మరిచిపోయా, ఇది మరిచిపోయానని విసిగించేశాడు. చివరిలో మీనా రావడంతో ఆమెను హత్తుకుని పడుకుంటాడు బాలు.

నిద్రపట్టక అటు ఇటు తిరిగిన మనోజ్.. ఉదయాన్ని తల్లి దగ్గరికి వెళ్లి నా రూమ్ నాకు కావాలని పట్టుబడుతుంది. దీంతో ప్రభావతి వారం రోజులు ఆగితే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అంటుంది. ఉదయాన్నే టిఫిన్ చేస్తుండగా డైనింగ్ టేబుల్ మీదే పడుకుంటాడు మనోజ్. షాప్ ఓపెనింగ్‌కి ఎవరిని పిలుస్తున్నావని శృతి ప్రశ్నించగా.. ఎవరో ఎందుకు అమ్మ చేతుల మీదుగానే షాప్ ఓపెనింగ్ చేయాలని అంటాడు బాలు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక సెప్టెంబర్ 16వ తేదీ, 511వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 511 September 16th 2025 here is full story

Photo Courtesy: JioHotstar

ఇంట్లో వాళ్లు చెప్పడంతో షాప్ ఓపెనింగ్ అత్తయ్యతోనే చేయిద్దామని రోహిణి చెప్పడంతో మనోజ్ సరేనంటాడు. ఇప్పుడు ప్రభావతి.. దీపావతిగా వెలిగిపోతోందని బాలు ఆటపట్టిస్తాడు. షాప్ ఓపెనింగ్ రోజున ఫ్యామిలీ అంతా ఎవరి కోసమో ఎదురుచూస్తుంటారు. ఇంతలో కామాక్షి వచ్చి నాకోసమే ఎదురుచూస్తున్నారా అని అడుగుతుంది. పార్లర్‌కి వెళ్లొచ్చేసరికి లేట్ అయ్యిందని, మేకప్‌మెన్‌ని ఇంటికే పిలిపించుకున్నానని చెబుతుంది. డెకరేషన్ అదిరిపోయిందని బాలు సెటైర్లు వేస్తాడు. ఓ అతిథి కోసం ఎదురుచూస్తున్నామని ప్రభావతి చెప్పడంతో అంత ప్రేత్యేకమైన గెస్ట్ ఎవరు అని అడుగుతుంది బాలు అత్త. ఇంతలో శృతి అమ్మగారు వస్తారు.

మీరొచ్చాకే రిబ్బన్ కట్ చేయాలని అందరినీ ఆపానని అంటుంది ప్రభావతి. ఆ వెంటనే ప్రభావతి రిబ్బన్ కట్ చేయించి షాప్ ఓపెన్ చేస్తుంది ప్రభావతి. అందరూ ఉన్నారు.. మరి మీ ఇంటి నుంచి ఎవరూ ఎందుకు రాలేదని మీనాని సత్యం అడుగుతాడు. ఎవ్వరూ పిలవలేదు, అందుకే నేను రమ్మని చెప్పలేదని అంటుంది మీనా. ఆ మాటలతో సత్యం బాధపడతాడు. మీ వాళ్లు పిలవకపోయినా వస్తారు కదా అని ప్రభావతి సూటిపోటి మాటలు అంటుంది. అంత సిగ్గుమాలిన వాళ్లు మా ఇంట్లో ఎవరు లేరని మీనా కౌంటర్ ఇస్తుంది. వాళ్లు వచ్చి మాత్రం ఏం కొంటారు? షాప్ చూసి కుళ్లు కుంటారని, అదే శృతి వాళ్ల అమ్మ అయితే వాళ్ల స్థాయి వస్తువు కొంటుందని.. అలాంటి వాళ్లు వస్తేనే స్థాయి పెరిగేది అని అంటుంది ప్రభావతి. అత్తగారి మాటలతో మీనా బాధపడుతూ వెళ్లిపోతుంది. ఏమైందని బాలు అడగ్గా.. ఏం లేదని చెబుతుంది.

షాప్ ఓపెన్ అయ్యాక మనోజ్ వెళ్లి ఓనర్ సీట్లో కూర్చొంటాడు. కొడుకుని చూసుకుని ప్రభావతి మురిసిపోతుంది. ఎప్పటికైనా వాడికి ఇలాంటి యోగం రాసుందని చెప్పానని అంటుంది. జైళ్లో ఉన్న రోహిణి వాళ్ల నాన్న డబ్బులు ఇవ్వబట్టి ఈ షాప్ పెట్టారని, లేదంటే ఏ గుడి ముందో అంటూ కామాక్షి సెటైర్లు వేస్తుంది. నువ్వు నేను నోటికి తాళం వేసుకోవాలని, ఇప్పుడు ప్రభావతి.. ఈ ఫర్నిచర్ షాప్‌కి ఓనర్.. వాళ్ల లెవలే వేరు అంటాడు బాలు. ఇంతలో మనోజ్‌ని పిలిచి ఇకనైనా పార్క్‌ల్లో పడుకోకుండా, వచ్చిన లక్షలు మింగకుండా, బుద్దిగా సంపాదించుకుని, నా దగ్గర నాలుగు చిట్టీలు వేసుకుని షాప్‌ని డెవలప్‌ చేసుకోమ్మని అంటుంది కామాక్షి.

ఇంతలో షాప్ ఓనర్ వచ్చి ఓనర్‌‌షిప్ మార్చిన పత్రాలు తీసుకొచ్చి మనోజ్‌కు ఇస్తుండగా.. వాటిని మా అత్తయ్య గారి చేతులు మీదుగానే తీసుకుంటామని రోహిణి చెబుతుంది. దీంతో ప్రభావతి సంతోషించి.. ఆ పత్రాలను మనోజ్ చేతుల్లో పెడుతుంది. ఆ పత్రాలు జాగ్రత్తగా దాచుకోవాలని చెబుతుంది కామాక్షి. ఈ షాప్ ఇంత తక్కువ రేట్‌‌కి ఇచ్చానంటే అందుకు కారణం నీ తమ్ముడు బాలు అని చెబుతాడు ఓనర్. డబ్బులిచ్చింది మా మనోజే కదా అని ప్రభావతి చెబుతుంది. మనోజ్ వాళ్ల నాన్నగారు మలేషియాలో జైళ్లో అనబోతుండగా ప్రభావతి అడ్డుకుంటుంది. ఇంతలో సీనియర్ స్టాఫ్ కొంతమందిని పిలిచి వాళ్లని జాగ్రత్తగా చూసుకోమని ఓనర్ చెప్పగా.. ఆలోచిస్తానంటూ మనోజ్ ఆన్సర్ ఇస్తాడు. ఇన్నాళ్లు బాగా చూసుకున్నానని, వదిలి వెళ్లాలంటే పుట్టినింటిని వదిలి వెళ్లినట్లుగా ఉందని ఓనర్ బాధపడతాడు.

మీ బిడ్డల దగ్గరికి వెళ్లడం కోసమే కదా అమ్మేశారు.. ఆ సంతోషం ముందు ఈ బాధ చిన్నదేనని చెబుతాడు సత్యం. మా మనోజ్, పార్లరమ్మ బాగా చదువుకున్నారని.. ఇద్దరూ కలిసి మీ షాప్‌ని రెట్టింపు చేస్తారని బాలు చెబుతాడు. కన్నబిడ్డను అప్పగించినట్లు, అప్పగించి వెళ్తున్నాడని కామాక్షి అంటుంది. కన్నబిడ్డను కర్కశుడి చేతిలో పెట్టి వెళ్లిపోతున్నాడని అంటాడు బాలు. ఇంతలో రోహిణి ఫ్రెండ్ వచ్చి.. మొత్తానికి తిమ్మిని బొమ్మిని చేసి మనోజ్‌తో షాప్ పెట్టించావని మెచ్చుకుంటుంది. మీ మామగారు ఇచ్చిన డబ్బును మీ నాన్నగారు ఇచ్చారని చెప్పి.. ఏ కొడుక్కి వాటా లేకుండా చేసి మనోజ్‌తో షాప్ పెట్టించావు అని చెబుతుంది. ఆ మాటలతో షాకైన రోహిణి.. సైలెంట్‌గా ఉండమని వార్నింగ్ ఇస్తుంది.

షాపులో మీక్సి చూసిన మీనా ముచ్చటపడుతుంది. మా నానమ్మ ఊళ్లో రుబ్బు రోలు వాడుతుందని, అందుకే ఇంకా గట్టిగా ఉందని అంటాడు బాలు. మీక్సిలు తయారు చేసినవాడు బాగా డబ్బులు సంపాదిస్తుంటే మనం మాత్రం బాగా బద్ధకం సంపాదించుకుంటున్నామని సెటైర్లు వేస్తాడు. వీటి వల్లే మా లాంటి వాళ్లకి పూలు అమ్ముకోవడానికి టైం దొరికిందని చెబుతుంది మీనా. ఒకప్పటిలా అందరూ నడక ఆరోగ్యకరమని అనుకుంటే మీ ట్యాక్సీలు వచ్చేవా? మీకు ఈ పని దొరికేదా? అని మీనా కౌంటర్ వేస్తుంది. ఫర్నిచర్ షాప్‌నైనా నిలబెట్టుకో, రోహిణిని టెన్షన్ పెట్టొద్దని మనోజ్‌తో ఆమె ఫ్రెండ్ చెబుతుంది.

ఆ తర్వాత శృతి తల్లికి షాప్ అంతా తిప్పి చూపిస్తాడు మనోజ్. అన్నింటిలోకి కాస్ట్ లీ సోఫా చూపించమని అంటుంది శృతి తల్లి. ఆ వెంటనే లక్షన్నర పెట్టి సోఫాను కొనేస్తుంది. ఇంతలో మీనా మీక్సి తీసుకుని వస్తుండగా.. ఏం కొన్నావని అడుగుతుంది మీనా. ఇది 5 వేలు కూడా ఉండదని, శృతి వాళ్ల అమ్మగారు చూడు ఎంత ఖరీదైనది కొనిందా అని మీనాను అవమానిస్తుంది ప్రభావతి. శృతి వాళ్ల అమ్మ బాగా రిచ్, బాలు అమ్మ బాగా పూర్ కదా అని సెటైర్లు వేస్తుంది కామాక్షి. ఇంట్లో ఒక మిక్సి ఉంది కదా అని ప్రభావతి అడగ్గా.. అది నువ్వు కాపురానికి వచ్చినప్పుడు కొనిందని అంటాడు బాలు.

ఫస్ట్ బోనీ శృతివాళ్ల అమ్మగారే చేయాలని, పూలు అమ్ముకునే దాని చేతిలో ఏముంటుందని ప్రభావతి అనడంతో మీనా బాధపడుతుంది. నీ పెద్ద కోడలు పార్లర్ పెట్టింది, అదేమైనా నిలబడిందా అని బాలు నిలదీస్తాడు. నా పెద్ద కోడలు అదృష్టవంతురాలు కాబట్టి.. పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి షాప్ పెట్టించిందని, నీ పెళ్లానికి లేదు కాబట్టి పూల కొట్టు పోయిందని నానామాటలు అంటుంది ప్రభావతి. ఇంతలో శృతిని ఏం కొన్నావని అడుగుతుంది మీనా.. హెయిర్ డ్రెయర్ కొన్నానని, నేను మా అమ్మ అంత రిచ్ కాదు కదా అని చెబుతుంది శృతి. అందరూ వాళ్లకి కావాల్సింది కొంటుంటే నువ్వు ఇంటికి కావాల్సింది కొన్నావని అడుగుతాడు సత్యం.

ఈ విషయం ఇక్కడ ఎవ్వరికీ అర్ధం కాదని బాలు సెటైర్లు వేస్తాడు. శృతి తల్లిని బోనీ చేయమని ప్రభావతి అడుగుతుంది. మీనా కొన్నదానికి బిల్లు నేను కడతానని సత్యం చెప్పగా.. నేనే ఇస్తానని బాలు చెబుతాడు. ఏది ఉచితంగా తీసుకునే అలవాటు నాకు లేదు, మా ఆయనకి లేదని చెబుతుంది మీనా. సోఫా కొన్నందుకు మనోజ్ బిల్లు రాసివ్వగా.. శృతి తల్లి లక్షన్నర డబ్బు ఇవ్వడంతో అది చూసి ప్రభావతి కళ్లు వెలిగిపోతాయి. ప్రభావతిని పక్కకి తీసుకెళ్లి.. నువ్వు నేల మీద నిలబడటం లేదని, ఇంకొకరి మేడ మీదకి ఎక్కి గొడవలకు పోతున్నట్లుగా ఉందని చీవాట్లు పెడతాడు సత్యం. అందరి ముందు ఇంటి కోడల్ని తక్కువ చేయడం ఎప్పుడు మానుకుంటావని మండిపడతాడు.

మీనా తల్లి కూడా వియ్యపురాలేనని, అదే గౌరవం ఆమెకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తాడు సత్యం. ఇవాళ ఆవిడని ఎందుకు పిలవలేదు? డబ్బుంటేనే గౌరవం, మర్యాద ఇస్తావా? అని ఫైర్ అవుతాడు. డబ్బున్నవాళ్లు బోనీ చేస్తే మనోజ్ జీవితం బాగుంటుందనే ఇలా చేశానని అంటుంది ప్రభావతి. మనోజ్‌ని కన్నట్లే.. బాలుని కన్నావ్, కానీ బాలు గురించి నువ్వు ఏనాడు ఆలోచించలేదని మండిపడతాడు సత్యం. అయినప్పటికీ బాలు, మీనాలు మనిద్దరి గురించే ఆలోచిస్తారు.. నువ్వు కన్న ఆ మనోజ్ గాడు మాత్రం నీ చేయి మంచిదని నీతో బోనీ ఎందుకు చేయించలేదని ప్రశ్నిస్తాడు సత్యం. నీ మలేషియా కోడలు నీ బంగారు చేత్తో ఏదైనా కొనమని అడగలేదే అంటాడు. మీనా కాబట్టి అన్ని మౌనంగా భరిస్తోందని, అది వదిలేస్తే నీకు గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వొదని హెచ్చరిస్తాడు.

షాప్ ఓపెన్ చేసిన తర్వాత డబ్బులు లెక్క పెడుతున్న మనోజ్‌ని చూసి మురిసిపోతుంది రోహిణి. ఇదంతా నీ వల్లేనని, ఆ డబ్బంతా మీ నాన్న పంపించాడని చెప్పడం వల్ల ఈ షాప్‌కు ఓనర్‌ని అయ్యానని అంటాడు మనోజ్. నన్ను చూసి నవ్వుకున్నవాళ్లు ఏడ్చేలా చేస్తానని చెబుతాడు. ఇంతలో పాత ఓనర్ దగ్గర పనిచేసిన స్టాఫ్‌ని పిలిపించి బయటికి వెళ్లిపోమ్మని చెబుతాడు మనోజ్. ఆ మాటలతో రోహిణి, స్టాఫ్ షాక్ అవుతారు. మీ పాత ఓనర్ ముసలాయన అందుకే మిమ్మల్ని ఇంకా కంటిన్యూ చేశాడని, మీరు గట్టిగా ఒక టేబుల్ జరపలేకపోతున్నారని అందుకే మీ అందరినీ తీసేస్తున్నానని చెబుతాడు మనోజ్. ఆ మాటలతో రోహిణి షాక్ అవుతుంది. మేమంతా పనిచేయనిదే ఇంతకాలం ఈ షాపు ఇంత బాగా నడిచిందా? మా రక్తాన్ని చెమటగా చేసి పనిచేశామని అంటారు స్టాఫ్. నాకు కావాల్సింది యంగ్ బ్లడ్ అని అంటాడు మనోజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X