Gunde Ninda Gudi Gantalu September 17th: మనోజ్‌కి స్టాఫ్ శాపనార్ధాలు.. బాలు- మీనాలని మేడపైకి గెంటేసిన ప్రభావతి
Photo Courtesy: JioHotstar
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ ఫర్నిచర్ షాప్ ఓపెనింగ్‌కి శృతి తల్లి వచ్చే వరకు వెయిట్ చేసి తర్వాత రిబ్బన్ కట్ చేస్తుంది ప్రభావతి. అన్నింటిలోకి కాస్ట్‌లీ సోఫా కావాలని శృతి తల్లి అడగ్గా.. మనోజ్, రోహిణిలు లక్షన్నర విలువ చేసే సోఫాను చూపిస్తారు. ఆ వెంటనే శృతి తల్లి డబ్బు కట్టలు ఇవ్వడంతో ప్రభావతి మురిసిపోతుంది. ఇంట్లోకి మిక్సర్ కొనాలని మీనా చూస్తుండగా.. ప్రభావతి వచ్చి అవమానిస్తుంది. షాప్ ఓనర్ వచ్చి మనోజ్‌కు డాక్యుమెంట్స్ ఇస్తాడు. ఇంత తక్కువ రేట్‌కి షాప్ అమ్మడానికి కారణం నీ తమ్ముడు బాలు అని చెప్పి వెళ్లిపోతాడు.
మీనా కుటుంబాన్ని షాప్ ఓపెనింగ్‌కి పిలవకపోవడంపై ప్రభావతిపై మండిపడతాడు సత్యం. నాకు డబ్బున్న వాళ్లంటేనే ఇష్టమని తేల్చిచెబుతుంది ప్రభావతి. పాత స్టాఫ్‌ని పిలిపించిన మనోజ్.. వాళ్లందరినీ ఉద్యోగాల్లో నుంచి తీసేస్తాడు. మీరంతా ముసలివాళ్లు అయిపోయారని, నాకు యంగ్ బ్లడ్ కావాలని అంటాడు. ఆ మాటలతో రోహిణి షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక సెప్టెంబర్ 17వ తేదీ, 512వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఫర్నిచర్ షాపులో పాత స్టాఫ్‌ను తీసేసి కుర్రాళ్లని ఉద్యోగంలో పెట్టుకుంటాడు మనోజ్. మీరైనా సార్‌కి చెప్పండి మేడం అని స్టాప్ చెప్పడంతో.. ఒక నెల తర్వాత తీసేయొచ్చు కదా మనోజ్ అని అంటుంది రోహిణి. అప్పుడైనా తీసేస్తారు కదా మేడం, మూడు కుటుంబాలను హఠాత్తుగా రోడ్డు మీద నిలబెట్టారని ఆ పాపం ఊరికే పోదని అంటారు స్టాఫ్. మాకు వయసు పెరిగింది, ముసలి వాళ్లం అయ్యామనే కాదు, అనుభవం కూడా పెరిగిందని అర్ధమని చెబుతారు. తలకాయ ఉన్నవాడు బిజినెస్‌లో అనుభవం ఉన్నవారిని కాపాడుకుంటాడని, ఏమాత్రం అనుభవం లేని ఈ పిల్ల బచ్చాలు మీకేం ఉపయోగపడతారు? అని ప్రశ్నిస్తారు స్టాఫ్. వీడికి ఇదొక్కటే షాపు, మనం పనిచేయాలంటే ఎన్నో షాపులు ఉన్నాయని చెప్పడంతో మనోజ్ మండిపడతాడు. వాడు వేగంగా ఎదగాలని చూస్తున్నాడని, ఆ వేగమే వాడిని రోడ్డు మీద నిలబెడుతుందని.. ఆ ఊసురు తగలకుండా పోదని శాపనార్ధాలు పెడతారు స్టాఫ్.
షాపులో బాగా అలిసిపోయి ఇంటికి వెళ్తారు రోహిణి, మనోజ్. ఇంతలో ప్రభావతి వాళ్లిద్దరిని గుమ్మం దగ్గరే ఆపుతుంది. నీ బిడ్డ కుర్చీలు, బెంచ్‌లు మోసి మోసి అలిసిపోయాడని సెటైర్లు వేస్తాడు బాలు. వాడు మొదటిసారి షాప్‌కు వెళ్లాడని బోల్డెంత దిష్టి తగిలి ఉంటుందని దిష్టి తీస్తుంది ప్రభావతి. ఏం సాధించాడని దిష్టి తీస్తున్నారని శృతి సెటైర్లు వేస్తుంది. ఎన్ని లక్షలు మింగేశావు రా అని బాలు సెటైర్లు వేయడంతో అప్పుడే ఎగతాళి చేయొద్దని అంటుంది రోహిణి. మొదటిసారి నీ బిడ్డ పనిచేయడం మొదలు పెట్టాడని, మొదటి రోజే మూలుగుతున్నాడని ఫైర్ అవుతాడు బాలు. మా నాన్నకి ఇవ్వాల్సిన 40 లక్షల రూపాయలు ఇచ్చే వరకైనా షాప్‌కి వెళ్లాలని అంటాడు. దిష్టి తీసిన తర్వాత ఎర్రనీళ్లు బయట పడేయమని ప్రభావతి అనగా.. రాదని అంటాడు బాలు. వాడికి తీసిన దిష్టి వైరస్‌లా నా భార్యకు తగులుతుందని మండిపడతాడు.
ఇంతలో సత్యం వచ్చి ఏం జరుగుతుందని అడగ్గా.. దున్నపోతుని అమ్మ కడుగుతోందని అంటాడు బాలు. మనోజ్ లోపలికి వచ్చి రవిని మంచినీళ్లు తెమ్మంటాడు, శృతిని ఫ్యాన్ వేయమని అనడంతో అంతా షాక్ అవుతారు. పక్కనే నీ భార్య ఉంది కదా? తనని అడగకుండా మాకు చెబుతావా అని బాలు మండిపడతాడు. ఒక్కరోజు పనిచేయగానే అందరూ నీకు అసిస్టెంట్స్‌లా కనిపిస్తున్నారా? అని ఫైర్ అవుతతాడు బాలు. ఒక్కరోజుకే బాలు ఇలా అయిపోయాడు, రోజూ అందరి మీదా అరిచే మా అమ్మ ఏమైపోవాలి? రోజూ డబ్బులిచ్చే నువ్వేం అయిపోవాలని అడుగుతాడు బాలు. ఒక్కరోజు కూడా కాకుండానే వీడు మూటలు మోసేవాడిలా అలిసిపోయాడని అంటాడు సత్యం.
ఆ కష్టం మీకు తెలియదని, బస్సులో ఎవరికి సీటు ఉన్నా లేకపోయినా మీకు తప్పకుండా సీటు ఉంటుందని.. కాబట్టి మీకు లాగా ఒకే చోట కూర్చొనే అవకాశం మీకు ఎక్కడ కలుగుతుందని ప్రశ్నిస్తుంది ప్రభావతి. దేవుడు తనని మనిషిలా పుట్టించి కోడి మెదడు పెట్టి పంపించాడని సెటైర్లు వేస్తాడు సత్యం. ఏసీ రూమ్‌లో కూర్చొని నలుగురితో మాట్లాడినందుకే వీలు ఇలా అయిపోయాడని, అన్ని సంవత్సరాలు మా నాన్న రాత్రి పగలు లీవ్ పెట్టకుండా డ్యూటీ చేశాడని చెబుతాడు బాలు. ఏ పనైనా మనకి గౌరవాన్ని ఇస్తుందని, మనకి తిండి పెడుతుందని, మనల్ని నమ్ముకుని వచ్చిన భార్యని పోషించడానికి ఆధారమైందని ఇష్టంగా పనిచేస్తే అలసట అనేది తెలియదని చెబుతాడు సత్యం. నేను నైట్ డ్యూటీలు చేసి నిద్రలేక తెల్లవారుజామున ఇంటికొస్తే మీ అమ్మ పక్కనే మీ నలుగురు ప్రశాంతంగా పడుకుని కనిపించేవారు. నాన్న ఉన్నాడనే ధైర్యంతో మీరంతా ప్రశాంతంగా కనిపించేవారు. నేను ఏం చేసినా వీళ్ల కోసమేనని మళ్లీ సెకండ్ షిఫ్ట్‌కి వెళ్లిపోయేవాడినని చెబుతాడు సత్యం.
అలిసిపోయి వచ్చిన భర్త భుజాలను నొక్కి భార్యకు మాత్రమే ఆ కష్టం విలువ తెలుస్తుందని అంటుంది మీనా. కానీ మా అమ్మ లాంటి వాళ్లకి ఈ జన్మకి అది తెలియదని సెటైర్లు వేస్తాడు బాలు. అన్నేళ్లు కష్టపడిన మా నాన్న.. చివరిలో సుఖపడకుండా 40 లక్షలు ఎత్తుకుపోయిన వాడికి దిష్టి తీశావని మండిపడతాడు బాలు. కానీ మా నాన్నని తక్కువ చేసి, వాడిని ఎక్కువ చేసి మాట్లాడొద్దని అంటుండగా బాలుని మీనా పక్కకి తీసుకెళ్లిపోతుంది. మా మీద పడి ఏడుస్తున్నారని మనోజ్‌ని రోహిణి తీసుకెళ్తుంది. అలిసిపోయి బెడ్‌పై పడుకున్న మనోజ్‌ని రోహిణి బలవంతంగా నిద్ర లేపుతుంది. బాలు వచ్చి మళ్లీ గొడవ చేస్తాడని చెప్పినా వినిపించుకోడు.
రోహిణి ఒక్కతే కిందకి రావడంతో వాడెక్కడ అని బాలు అడుగుతాడు. మనోజ్‌ని తీసుకుని వస్తానని వెళ్లిన రోహిణి ఎంతకీ కిందకు రాకపోవడంతో బాలు పైకి వెళ్లి తలుపులు బాదుతాడు. రూమ్ పోతే పోయింది, వాళ్లని ఇబ్బంది పెట్టొద్దని మీనా బతిమలాడుతున్నా బాలు వినిపించుకోడు. బాలు గొడవతో బయటికొచ్చిన రోహిణి.. మనోజ్ అలిసిపోయి పడుకున్నాడని రావడం లేదని చెబుతుంది. వాడిని ఎలా లేపాలో నాకు బాగా తెలుసని బాలు లోపలికి వెళ్తుండగా సత్యం వచ్చి ఏమైందని అడుగుతాడు. మీరు చెప్పినట్లుగా మనోజ్ నడుచుకోవడం లేదని తండ్రికి చెబుతాడు బాలు. మనోజ్ అలిసిపోయి నీరసంగా పడుకున్నాడని అంటుంది ప్రభావతి. వంతు ప్రకారం బాలు- మీనాలకు గది ఇవ్వాల్సిందేనని అంటాడు సత్యం.
రోహిణి, బాలు కావాలనే చేస్తున్నారని.. వాడిని నువ్వు లేపుతావా? నన్నే బయట పడేయమంటావా? అని రోహిణికి వార్నింగ్ ఇస్తాడు బాలు. వాడు అలా రౌడీలా బిహేవ్ చేస్తుంటే చోద్యం చూస్తున్నావా? నీకు రూమ్ కావాలా? అని ప్రభావతి అడగటంతో మీనా రగిలిపోతుంది. మనోజ్ అలిసిపోయుంటాడని మీ ఇద్దరికి నా గది ఇస్తామని బాలుకి సత్యం చెబుతాడు. దాంతో సత్యంను ఆపి బాలు - మీనాలు మేడపైన పడుకుంటామని వెళ్తారు. రోహిణి - మనోజ్‌లు కావాలనే ఇదంతా చేశారని నిన్ను కింద పడుకోబెట్టాల్సి వచ్చిందని బాధపడతాడు బాలు. మన దగ్గర డబ్బు లేదనే కదా మనల్ని తక్కువగా చూస్తున్నారని అంటాడు. మనకి చేతనైన పని మనం చేస్తున్నాం.. వాళ్లకి చేతనైన పని వాళ్లు చేస్తున్నారని చెబుతుంది మీనా.
వాళ్లు పెద్ద షాప్ పెట్టుకున్నారని పైనా ఆకాశంలో నడుస్తున్నారని, మా నాన్న కోసం అవమానాల్ని భరిస్తున్నానని అంటాడు బాలు. ఉన్నదాంట్లోనే తృప్తిపడేవాడే ప్రశాంతంగా నిద్రపోతాడని చెబుతుంది. ఉదయాన్నే సత్యానికి కాఫీ ఇవ్వడానికి వచ్చిన మీనాని మనోజ్‌కి కూడా ఇవ్వమని అంటుంది ప్రభావతి. నేను ఇవ్వనని మీనా ముఖం మీదే చెబుతుంది. అత్తమామలు కాబట్టి మీకు, భర్త కాబట్టి మా ఆయనకి ఇస్తానని, శృతి - రవి చిన్నవాళ్లు కాబట్టి వాళ్లకి కూడా ఇస్తానని అంటుంది. మీ పెద్ద కొడుక్కి పెళ్లి కాలేదా? పెళ్లాం లేదా? ఇక నుంచి తననే వచ్చి తీసుకెళ్లమని చెబుతుంది ప్రభావతి. ఇన్ని రోజుల్లో మీనా ఇప్పుడే కరెక్ట్‌గా మాట్లాడిందని మెచ్చుకుంటాడు సత్యం.
ఇంతలో రోహిణి రావడంతో మనోజ్ నిద్రలేచాడా? అని అడుగుతాడు సత్యం. ఉదయం నుంచి ఎంత లేపినా లేవడం లేదని రోహిణి చెబుతుంది. ఆ మాటలతో మీనా నవ్వడంతో రోహిణి మండిపడుతుంది. ఇంతలో శృతి, రవిలు రెడీ అయి వచ్చి మనోజ్ ఇంకా లేవలేదా అని అడుగుతారు. మనోజ్‌ని ప్రేమగా నిద్రలేపుతున్న ప్రభావతిని చూసి సత్యం మండిపడతాడు. మీరిద్దరూ ఇంతకాలం ఇలా వెనకేసుకుని రావడం వల్లే ఇలా తయారయ్యాడని ఫైర్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










