Gunde Ninda Gudi Gantalu September 18th: మనోజ్ కోసం రోహిణి త్యాగం.. బాలు ఇంటిని ముక్కలు చేసేలా శృతి తల్లి కుట్
Photo Courtesy: JioHotstar
Gunde Ninda Gudi Gantalu: ఫర్నిచర్ షాపులో పాత స్టాఫ్‌ని తీసేసి కొత్త స్టాఫ్‌ని పెట్టుకుంటాడు మనోజ్. మా అనుభవం మీకు ఎంతో ఉపయోగపడుతుంది.. మమ్మల్ని వదలుకుంటే మీరెంతో నష్టపోతారని ఉద్యోగులు చెప్పినా మనోజ్ పట్టించుకోడు. దాంతో మా ఉసురు మీకు తగులుతుందని పాత స్టాఫ్ శాపనార్ధాలు పెట్టి వెళ్లిపోతారు. అలిసిపోయి ఇంటికి వచ్చిన మనోజ్ - రోహిణిలకు ప్రభావతి దిష్టి తీస్తుంది. ఒక్కరోజుకే వీడి పని ఇలా అయిపోయిందని బాలు సెటైర్లు వేస్తాడు.
అలిసిపోయిన మనోజ్.. హాల్‌లోకి వెళ్లాలని ఎంత నిద్రలేపినా బెడ్‌రూంలోనే పడుకుంటాడు. బాలు వచ్చి తలుపులు బాదడంతో సత్యం వచ్చి ఏం జరిగిందని అడగ్గా.. వాడు రూమ్ ఖాళీ చేయడం లేదని చెబుతాడు. నువ్వు, మీనా మా గదిలో పడుకోండి.. నేను, మీ అమ్మ హాల్‌లో పడుకుంటామని సత్యం అంటాడు. మీరు ఈ వయసులో కష్టపడొద్దన్న బాలు.. మీనాని తీసుకుని మేడ మీద పడుకుంటాడు. మనోజ్ ఉదయాన్నే ఎంతకీ నిద్రలేవకపోవడంతో ప్రభావతి కొడుకుని నిద్రలేపుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక సెప్టెంబర్ 18వ తేదీ, 513వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
తల్లి ఒడిలో పడుకున్న మనోజ్‌ను చూసి నిద్రలేస్తావా? లేదా? అని రోహిణి మండిపడుతుంది. వాడే నిద్రలేస్తాడని ప్రభావతి వెనకేసుకుని వస్తుంది. ఇంతలో బాలు వచ్చి మనోజ్ గాడికి ఏమైంది? ఏం మింగాడని సెటైర్లు వేస్తాడు. అయితే ఈ షాపు కూడా గోవిందా? గోవిందా? అంటూ బాలు అంటాడు. అలిసిపోతే ఎక్కువసేపు పడుకుంటాడు కదా అని అంటుంది మనోజ్ భార్య. అయితే మీనా ఎంత అలిసిపోవాలి.. అందరికన్నా ముందు నిద్రలేచి, అందరికన్నా ఆఖరున నిద్రపోయే కష్టజీవి కూడా ఎప్పుడూ ఇలా అనలేదని అంటాడు బాలు. సూర్యుడు వచ్చాక కూడా నీకు నిద్రపడుతుందా అని బాలు అడగ్గా.. అంత మొద్దు నిద్రపోయేంత బద్ధకం నాకు లేదని చెబుతుంది మీనా. నేను లేటుగా లేస్తే అత్తయ్య నన్ను జోలపాట పాడి నిద్రలేపరు కదా అని అంటుంది.
అందరూ తలా ఒక మాట అంటున్నారని.. నిద్రలేవమని రోహిణి, ప్రభావతిలు మనోజ్‌పై మండిపడతారు. ఇంతలో బాలు నీళ్లు తెచ్చి మనోజ్ ముఖాన కొట్టడంతో ఉలిక్కిపడి లేస్తాడు. వాడి షాపు వాడి ఇష్టమని ప్రభావతి చెప్పగా.. ఇది కూడా దివాళా తీస్తే మళ్లీ పార్కులోనే పడుకోవాలని అంటాడు బాలు. మా నాన్న లక్షల్ని మింగేశాడు, శాప్ రెంట్ తీరుస్తానని అన్నాడని చెబుతాడు. వాడు జీవితంలో పైకి రావాలంటే ఇలా వెనకేసుకుని రావొద్దని హెచ్చరిస్తాడు సత్యం. కిచెన్‌లోకి వచ్చిన ప్రభావతి.. వంట త్వరగా చేయమని కోప్పడుతుంది ప్రభావతి. మనోజ్‌కి షాప్‌కు తీసుకెళ్లడానికి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చేపల వేపుడు చేయ్.. అలాగే రోహిణికి వెజ్ బిర్యానీ చేయమని ఆర్డర్స్ వేస్తుంది.
మీరు చెప్పినవన్నీ ఇంట్లో అందరికీ చేయమంటే చేస్తాను కానీ, మీ పెద్ద కొడుక్కి ఒక్కడికే అంటే నేను చేయను అని తేల్చి చెబుతుంది మీనా. తనేమీ స్కూల్‌కి వెళ్లే పిల్లాడు కాదని, పెళ్లయ్యింది.. భార్య కూడా ఉందని తన క్యారేజ్ కోసం రోహిణిని చేసుకోమని చెప్పండి అని అంటుంది. నువ్వు ఏం మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్ధం అయ్యిందిలే అని సూటిపోటి మాటలు అంటుంది ప్రభావతి. నా మనసులో ఏం లేదని, మీరు తొంగిచూసినట్లు చెప్పొద్దని మండిపడుతుంది మీనా. రాత్రి మిమ్మల్ని లోపల పడకోనివ్వలేదని, నీ మొగుడు మనోజ్ మీద నీళ్లు కొట్టాడని.. దానికి మీరిద్దరూ కలిసి కక్ష సాధిస్తున్నారని మండిపడుతుంది.
మాకన్నీ తెలివి తేటలు లేవని.. మీ పెద్ద కొడుకు త్వరగా లేచి షాప్‌కి వెళ్లాలని ఆయన అలా చేశారని చెబుతుంది మీనా. క్యారేజ్ కోసం అయితే నేను చేయనని తేల్చిచెబుతుంది. రోజు రోజుకి లెక్కలేకుండా పోతున్నావని, ఒక్కరోజు కూడా బయట పడుకోలేవా? రూమ్‌లోనే పడుకోవాలా? అని ప్రభావతి నానామాటలు అనడంతో మీనా కోపం కట్టలు తెంచుకుంటుంది. మీ ఇంట్లో నీకు సెపరేట్ గది ఉందా? నిన్ను సుకుమారంగా పెంచిందా మీ అమ్మ? అని నిలదీస్తుంది ప్రభావతి. నోటికొచ్చినట్లు మాట్లాడొద్దని.. నేను మనోజ్ వాళ్లకి వంట చేయనని, మీరే చేసుకోండని వెళ్లిపోతుంది మీనా.
బాలు కారు క్లీన్ చేసుకుంటూ ఉండగా.. సోఫా డెలివరీ ఇవ్వడానికి కొంతమంది మనుషులు వస్తారు. మేం సోఫా బుక్ చేయలేదని, రాంగ్ అడ్రస్‌కి వచ్చి ఉంటుంది చూసుకోమ్మని చెబుతాడు బాలు. సత్యం గారింటికి సురేంద్ర గారు బుక్ చేశారని వాళ్లు చెప్పడంతో దానిని వెంటనే వెనక్కి తీసుకెళ్లమని చెబుతాడు బాలు. అలా కుదరదని, ఇది బుక్ చేసినవాళ్లకి ఫోన్ చేసి రిటర్న్ పంపిస్తున్నామని చెబితేనే తీసుకెళ్తామని అంటాడు డెలివరీ వ్యక్తి. దాంతో శృతి వాళ్ల అమ్మకి బాలు ఫోన్ చేసి మీరు బుక్ చేసిన సోఫాను తీసుకెళ్లమని చెబుతాడు. సోఫా ఎందుకు పంపారు? అని బాలు నిలదీయగా.. మీ ఇంట్లో సోఫా పాతది అయిపోయింది కదా? మీ అన్నయ్య షాపులోనే బుక్ చేశామని తీసుకోమ్మని చెబుతుంది శృతి తల్లి. మాకు పాత వస్తువులతో సర్దుకుపోవడం అలవాటేనని, మీ సోఫా మీరే తీసుకెళ్లమని చెబుతాడు బాలు.
మీ అమ్మాయికి మీరు చీరలు, బంగారం కొనివ్వండి.. అంతేకానీ ఇలా మా మీద జాలి చూపించొద్దని తేల్చిచెబుతాడు. బాలు దెబ్బకి డెలివరీ బాయ్స్ కూడా వెళ్లిపోతాడు. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసని భార్యతో సురేంద్ర అంటాడు. మరి ముందే చెప్పొచ్చు కదా అని భార్య అడగ్గా.. నువ్వు నీ కూతురి కోసం ప్రేమగా కొంటుంటే ఎలా వద్దని చెప్పనని అంటాడు సురేంద్ర. వాడు సోఫా వెనక్కి పంపి తప్పులో కాలు వేశాడని.. ఈ విషయం వాళ్లింట్లో తెలియదని, తెలుసుంటే శృతి దగ్గరి నుంచి మనకి ఫోన్ వచ్చేదని.. రాలేదంటే ఇది బాలు ఒక్కడే చేశాడని మండిపడతాడు సురేంద్ర. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనని, ప్రభావతితో మాట్లాడి ఆ ఇంట్లో సోఫా పెట్టించి నా ఈగో శాటిస్‌పై చేసుకుంటానని అంటుంది శృతి తల్లి. మన కూతురు, అల్లుడు మనింటికి ముఖ్యం రావాలని చెబుతాడు సురేంద్ర.
కస్టమర్లు బాగా ఉన్నప్పుడు మనోజ్ షాప్‌కి వెళ్లి సోఫా వెనక్కి ఇవ్వాలని.. షాపులో బోనీ అయిన మొదటి వస్తువే వెనక్కి రావడాన్ని సెంటిమెంట్‌గా ఫీలై మనోజ్ - రోహిణిలు ఇంట్లో గొడవ చేస్తారని చెబుతాడు సురేంద్ర. ఆ గొడవని అడ్డం పెట్టుకుని మన కూతురు, అల్లుడిని వెనక్కి తీసుకురావొచ్చని చెబుతాడు. బాలు కస్టమర్స్‌తో మాట్లాడుతుండగా రోహిణి వచ్చి షాపులో సేల్స్ బాగున్నాయని చెబుతుంది. ఇదంతా నీ వల్లే సాధ్యమైందని అంటాడు మనోజ్. శృతి వాళ్ల అమ్మకి థ్యాంక్స్ చెప్పాలని రోహిణి చెబుతుండగా.. ఆవిడ ఇచ్చిన డబ్బుని ఇప్పుడే డీలర్‌కి ఇచ్చానని చెబుతాడు మనోజ్. ఇంతలో శృతి వల్ల తల్లి రావడంతో మనోజ్ - రోహిణి సంతోషిస్తారు.
మీ దగ్గర కొన్న సోఫానే రిటర్న్ చేయడానికి వచ్చానని శృతి తల్లి చెప్పడంతో మనోజ్- రోహిణిలు షాక్ అవుతారు. నేను దానిని మీ ఇంటికి గిఫ్ట్‌గా పంపితే, బాలు దానిని వద్దని వెనక్కి పంపించాడని చెబుతుంది. మీరొద్దు, మీ గిఫ్ట్‌లు వద్దని నానామాటలు అన్నాడని.. మీ అత్తయ్య నన్ను చీఫ్ గెస్ట్‌గా పిలిచిందని, కాస్ట్ గురించి కూడా ఆలోచించకుండా సోఫా కొన్నానని చెబుతుంది శృతి తల్లి. కానీ మీ తమ్ముడికి నీ మీద ఏమాత్రం గౌరవం లేదని, సోఫా వల్ల మీ ఇంట్లో గొడవలు రావడం నాకు ఇష్టం లేదని, నా వల్ల మా అమ్మాయికి మీ ఇంట్లో ఏ సమస్య రాకూడదని చెబుతుంది. మీరు ఇచ్చిన డబ్బుని ఇప్పుడే మేం డీలర్‌కు ఇచ్చేశామని, మీకు డబ్బులు ఎలా ఇవ్వాలని అడుగుతాడు మనోజ్. ఇంతలో కస్టమర్లు ఆ మాటలు విని మెటీరియల్ తేడాగా ఉందా? రిటర్న్ ఎందుకు ఇస్తున్నారని అడుగుతాడు. నా వల్ల మీ వ్యాపారం పోయేలా ఉందని, డబ్బులు ఇప్పుడే ఇవ్వొద్దని.. ఆ సోఫా మీ షాపులోనే గిఫ్ట్‌గా ఉంచుకోండి అని చెబుతుంది శృతి తల్లి. ఇంతలో రోహిణి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి శృతి తల్లికి తిరిగి ఇస్తుంది.
బాలు కారణంగా మీ ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతుందని జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్లిపోతుంది. ఆవిడ డబ్బులు వద్దు అన్నారు కదా? ఎందుకు ఇచ్చావని అడుగుతాడు మనోజ్. వద్దు అన్నా మనం తిరిగి ఇచ్చేయాలని చెబుతుంది రోహిణి. మీ తమ్ముడి వల్ల మనం అమ్మిన మొదటి వస్తువే వెనక్కి వచ్చిందని, మీనా కొనాలని అనుకున్న మిక్సర్‌ని వద్దు అన్నందుకే అదంతా మనసులో పెట్టుకుని బాలు ఇదంతా చేశాడని అంటుంది రోహిణి. నీకు ఇంత డబ్బు ఎలా అడ్జెస్ట్ అయ్యిందని మనోజ్ అడగ్గా.. మెడలో పసుపు తాడు చూపిస్తుంది రోహిణి. తాళిబొట్టు తాకట్టు పెట్టానని భార్య చెప్పడంతో మనోజ్ బాధపడతాడు.
సోఫా వెనక్కి ఇచ్చేసిన వ్యవహారంపై ఇంట్లో పంచాయతీ పెడతాడు మనోజ్. అసలు నా బిజినెస్‌లో వేలు పెట్టడానికి నువ్వు ఎవరు అంటూ బాలుపై మండిపడతాడు. అసలు సోఫాను ఆవిడ మనింటికి ఎందుకు పంపించింది? అని బాలు నిలదీస్తాడు. మా అమ్మ నా కోసం పంపించింది? అది తప్పా? అని శృతి అడుగుతుంది. నీ కోసం ఏమైనా పంపించుకోవచ్చని, మనింటికి పంపించడం కరెక్ట్ కాదని అంటాడు బాలు. నీ వల్ల నేను షాప్‌లో చాలా అవమానాలు పడ్డానని మనోజ్ రగిలిపోతాడు. బోనీ చేసిన వస్తువు వెనక్కి వచ్చిందంటే మాకు ఎంత బాధ వేస్తుందో తెలుసా అని రోహిణి అంటుంది. నా మీద ప్రేమగా మా అమ్మ ఏం పంపించినా? తప్పుగా ఎందుకు ఆలోచిస్తున్నావని శృతి నిలదీస్తుంది.
మా పెళ్లి రోజునాడే సోఫా కొనిస్తానని అంటే నేను, నాన్న వద్దని చెప్పామని, అయినా కొని పంపించిందంటే దాని అర్ధం ఏంటని నిలదీస్తాడు బాలు. మనింట్లోకి ఏదైనా వస్తువు కావాలంటే ఇంకొకరు ధర్మం చేస్తే కానీ కొనలేమా? అని అడుగుతాడు బాలు. నువ్వే వాడిని రెచ్చగొట్టావా? అని ప్రభావతి మీనాపై మండిపడటంతో.. ఆ సోఫా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే లేనని చెబుతుంది మీనా. నీతో బోనీ చేయించలేదనే ఇలా చేశారని రోహిణి చెప్పడంతో.. నా చేయి మంచిది కాదని ఆపారు, ఆవిడ చేయి మంచిదైతే మళ్లీ ఇలా ఎందుకు రిటర్న్ వస్తుందని మీనా అంటుంది. ఆ మాటలతో శృతి బాధపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










