Gunde Ninda Gudi Gantalu September 19th: శత్రువుల్లా కొట్టుకున్న అన్నదమ్ములు.. బాలుని తప్పుపట్టిన సత్యం

Photo Courtesy: JioHotstar

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ నిద్రలేవకపోవడంతో ప్రభావతి, రోహిణిలు బుజ్జగిస్తూ ఉంటారు. ఇంతలో బాలు వచ్చి ముఖాన నీళ్లు కొట్టడంతో మనోజ్ ఉలిక్కిపడి లేస్తాడు. నువ్వు ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే ఫర్నిచర్ షాప్ కూడా మిగలదని బాలు అంటాడు. తన కారు క్లీన్ చేసుకుంటూ ఉండగా ఇంటి ముందు సోఫా చేయడానికి కొందరు మనుషులు వస్తారు. మీ ఇంటికి సురేంద్ర గారు పంపించారు అని వారు చెప్పడంతో వెంటనే శృతి తల్లికి బాలు ఫోన్ చేసి మీరు పంపించిన సోఫాను మీరే తీసుకెళ్లండని చెబుతాడు. బాలు చేసిన పనిని అడ్డం పెట్టుకుని శృతిని, రవిని ఇంటికి తెచ్చుకోవడానికి సురేంద్ర దంపతులు ప్లాన్ చేస్తారు.

షాప్ మొత్తం కస్టమర్లతో కళకళలాడుతుండగా శృతి తల్లి వచ్చి సోఫాను రిటర్న్ చేస్తున్నట్లు చెప్పడంతో మనోజ్, రోహిణిలు షాక్ అవుతారు. మీ కోసం నేను సోఫాను పంపితే బాలు తిరిగి పంపించేశాడని మండిపడుతుంది శృతి తల్లి. డబ్బుల సంగతి తర్వాత చూసుకుందాం.. నా గిఫ్ట్‌గా మీరే ఉంచుకోండని ఆమె వెళ్లబోతుండగా ఐదు నిమిషాల్లో వచ్చేస్తానని రోహిణి బయటికి వెళ్లి డబ్బుతో వచ్చి శృతి తల్లికి ఇచ్చేస్తుంది. ఇంత డబ్బు ఎక్కడిదని మనోజ్ అడగ్గా.. పసుపు తాడు చూపిస్తుంది రోహిణి. షాపులో తనకు జరిగిన అవమానం గురించి మనోజ్ ఇంట్లో పెద్ద గొడవ చేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక సెప్టెంబర్ 19వ తేదీ, 514వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 514 September 19th 2025 here is full story

Photo Courtesy: JioHotstar

తన ముందే కొడుకులు, కోడళ్లు గొడవ పడుతుండటంతో ప్రభావతి మండిపడుతుంది. ఇదంతా చూస్తూంటే బాలు, మీనాలు అసూయతో కావాలని చేసినట్లుగా ఉందని అంటుంది. లక్షన్నర సోఫా సెట్ మనం కొనలేమా? అని బాలు అనగా.. మీ ఆవిడ పూలు అమ్మి సోఫా సెట్ కొనిపెడుతుందని ప్రభావతి సెటైర్లు వేస్తుంది. పూలు అమ్మే కారు కొనిపెట్టిందని ఆ విషయం మరిచిపోయావా? అని ప్రశ్నిస్తాడు బాలు. అన్నింటికీ సమాధానం చెబుతావ్, అందరినీ హడలగొడతావ్ ఏంటీ అన్నయ్య ఇది అని రవి కూడా మండిపడతాడు. రౌడీ కదా అలాగే చేస్తాడని మనోజ్ కోప్పడతాడు. ఇంకోసారి నీ బోడి పెత్తనం చేశావో ఏం చేస్తానో నాకే తెలియదని మనోజ్ వార్నింగ్ ఇవ్వడంతో .. బాలు కోపంతో కాలర్ పట్టుకుంటాడు. రవి కూడా నోరు జారడంతో తమ్ముడి కాలర్ కూడా పట్టుకుంటాడు బాలు.

ఈ గొడవతో సత్యం కోప్పడతాడు. ఇక్కడ నేను లేను అనుకున్నారా? జరిగిన దానిని ఎవరైనా మార్చగలరా? అని సత్యం ప్రశ్నిస్తాడు. అందుకనీ వీడేం చేసినా వదిలేయాలా? సోఫా తిరిగి ఇచ్చేయడంతో లక్షన్నర రూపాయల్ని శృతి అమ్మగారికి రిటర్న్ చేయాల్సి వచ్చిందని చెబుతాడు మనోజ్. ఆవిడ ఇచ్చిన డబ్బుని అప్పుడే డీలర్‌కి ఇచ్చేశానని.. దాంతో రోహిణి తన పుస్తెల తాడు తాకట్టుపెట్టి కట్టిందని మనోజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అంటే పసుపు తాడు కట్టుకున్నావా అని ప్రభావతి అడగ్గా.. రోహిణి చూపిస్తుంది. మన వస్తువు మనకి ఇచ్చినప్పుడు, ఆవిడ డబ్బు, ఆవిడకి ఇవ్వాలి కదా అని చెబుతుంది రోహిణి. పరువు కాపాడుకోవడానికి పుస్తెల తాడు తాకట్టు పెట్టాల్సి వచ్చిందని అంటుంది.

నా ఇంటి కోడలు పుస్తెల తాడు కట్టుకోవాల్సిన కర్మ పట్టించాడని బాలుపై కోప్పడుతుంది ప్రభావతి. నా భార్య కూడా ఈ ఇంటి కోడలే, నా భార్య కూడా పసుపు తాడు కట్టుకోవాల్సిన కర్మ పట్టించింది కూడా నువ్వేనని చెబుతాడు బాలు. దానికి పొగరుపట్టి పుస్తెలతాడు నా ముఖాన విసిరికొట్టిందని, ఈ ఇంట్లో మీ ఇద్దరూ ఎవరినీ లెక్కచేయడం లేదని మండిపడుతుంది. వీడి వల్ల ఈ ఇంటి పరువు పోతుందని, ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుందని చెబుతుంది ప్రభావతి. నేను, నా భర్త ఈ ఇంట్లో ఉండటం బాలుకి ఇష్టం లేదని.. షాప్ పెట్టుకుని స్థిరపడతాం అనుకుంటే అడ్డుపడుతున్నాడని, మనోజ్ ఎదగడం నచ్చకే ఇదంతా చేస్తున్నారని అంటుంది రోహిణి.

వాడు ఎదగాలనే ఉద్దేశంతోనే నేను ఆ షాప్ ఓనర్‌తో మాట్లాడి తక్కువ రేట్‌కి షాప్ ఇప్పించానని గుర్తుచేస్తాడు బాలు. ఆవిడ సోఫా రిటర్న్ చేయగానే నువ్వు ఆత్మగౌరవానికి అమ్మమ్మలా ఫీలై పుస్తెల తాడు తాకట్టు పెట్టాలా? రెండ్రోజుల్లో డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పొచ్చు కదా అని అంటాడు బాలు. మా అమ్మని సోఫా కొనమని నేనేం చెప్పలేదని, మా ఇంటికి పంపిస్తుందని కూడా నాకు తెలియదు.. నా కోసం పంపిస్తే బాలుకి ఏమైందని నిలదీస్తుంది శృతి. ముందే ఈ విషయం మావయ్య గారికి చెప్పుంటే ఇంత గొడవ అయ్యుండేది కాదని అంటుంది మీనా.

అంత ఖరీదైన సోఫాను మీ అమ్మని కొనిపెట్టమని, కనీసం కుర్చీ కూడా కొనలేరని మీనాని అవమానిస్తుంది ప్రభావతి. అన్నయ్య చేసిన తప్పుకి వదిన పుట్టింటి వాళ్లను అంటావా? అని మండిపడతాడు రవి. అసలు నేనేం తప్పు చేయలేదని బాలు గొడవపడతుండగా.. సత్యం కోప్పడతాడు. అసలు చేసిందే నువ్వు అని తండ్రి అనడంతో బాలు షాక్ అవుతాడు. ఉమ్మడి కుటుంబంలో నువ్వు ఒక్కడివే నిర్ణయం తీసుకోవడం తప్పు, నీ వల్ల ఇంటి కోడలు పుస్తెలతాడు మెడలోంచి తీయాల్సి వచ్చిందని అంటాడు సత్యం. ఇప్పటి నుంచైనా సొంత నిర్ణయాలు తీసుకోవడం మానేయండి అని వార్నింగ్ ఇస్తాడు.

జరిగిన గొడవని తలచుకుంటూ శృతి బాధపడుతుంది. అలాంటి మూర్ఖుడికి నీలాంటి మంచోడు తమ్ముడిగా పుట్టడంతో చాలా ఫీల్ అవుతున్నానని రవితో అంటుంది. తప్పంతా అన్నయ్యదేనని చెప్పడంతో శృతి షాక్ అవుతుంది. నాకు రైట్ అనిపిస్తే రైట్ అంటాను, రాంగ్ అనిపిస్తే రాంగ్ అంటానని చెబుతాడు. మీ అమ్మవాళ్లు సోఫా పంపిస్తున్న విషయం మనతో చెప్పుంటే బాగుండేదని రవి అంటాడు. నువ్వు కూతురివి కాబట్టి నీకు ఏం ఇచ్చినా పర్లేదని, కానీ ఖచ్చితంగా నాన్నకి కానీ అమ్మకైనా తెలియాలని చెబుతాడు రవి. నీ మీద రెస్పెక్ట్ బాగా పెరిగిపోయిందని రవిని మెచ్చుకుంటుంది శృతి. న్యాయం ఎటు ఉంటే అటే ఉంటావని, బాలు అన్నయ్య మీ నాన్నని కొట్టిన విషయం తెలిసినా నిజం తెలుసుకుని మా ఇంటికి వచ్చేశావని చెబుతాడు రవి.

బాలు కిచెన్‌లో క్యారెట్ తింటుండగా.. మీనా వచ్చి శృతి వాళ్ల అమ్మ కావాలనే ఇదంతా చేసిందని నాకు తెలుసని అంటుంది. రవిని, శృతిని వాళ్లింటికి తీసుకెళ్లాలని మంటపంలో గొడవ చేశారని.. అప్పుడు వాళ్ల ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో ఈసారి ఇలా చేశారని చెబుతుంది మీనా. రోహిణి కూడా తెలివిగా పుస్తెలతాడు తాకట్టు పెట్టి తన మీద జాలి, నీ మీద కోపం తెప్పించిందని అంటుంది బాలు. సోఫా గురించి ముందే మావయ్య గారికి చెప్పుంటే ఆయనే వెనక్కి పంపించేవారని చెబుతుంది మీనా. మీ కోపమే మీకు శత్రువు అవుతుంది.. మనం ఎప్పుడు దొరుకుతామా అని ఇంట్లో వాళ్లు ఎదురుచూస్తున్నారని జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది మీనా.

బాలు, మీనాలు ఈ ఇంట్లో ఉండొద్దని సత్యంతో గొడవ పడుతుంది ప్రభావతి. మనమే డబ్బులు సర్దుబాటు చేసి రోహిణికి పుస్తెలతాడు కొనిపెట్టాలని చెబుతుంది. అది మనోజ్ బాధ్యత అని వాడు చూసుకుంటాడని అంటాడు సత్యం. బాలు కష్టపడి సంపాదించి భార్యకి తాళి కొన్నిచ్చాడని, మనోజ్ కూడా అలాగే చేస్తాడని చెబుతాడు సత్యం. పార్లర్‌కి వెళ్తున్న రోహిణిని ప్రభావతి ఆపి బాధపడుతుంది. ఏదో ఒకటి చేసి డబ్బులు సర్దుతానని తాళి బొట్టు విడిపించమని రోహిణికి చెబుతుంది. ఆ బాలు వల్ల నీ బంగారం తాకట్టు పెట్టాల్సి వచ్చిందని, ఆ మీనా పూలు అమ్మి సంపాదించిన డబ్బుని పుట్టింటికి పంపిస్తోందని అంటుంది ప్రభావతి. ఈ మాటలు విన్న శృతి మండిపడుతుంది. రోహిణి కోసం మీనాను తిట్టొద్దు, మా అమ్మ డబ్బులు రిటర్న్ చేయమని ఫోర్స్ చేసిందా అని నిలదీస్తుంది శృతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X