Gunde Ninda Gudi Gantalu September 23rd: ప్రభావతి దెబ్బకి రోహిణి పరుగులు.. మీనా కోసం గరిటె పట్టిన బాలు

Photo Courtesy: JioHotstar

రోహిణి పసుపు తాడుతో ఉండటం చూసి ప్రభావతి బాధపడుతుంది. నీకు ఎలాగైనా కొత్త పుస్తెలతాడు కొనిపెడతానని అంటుండగా శృతి వచ్చి.. మరి మీనా కూడా పసుపు తాడుతోనే ఉందని మండిపడుతుంది. మా అమ్మ డబ్బు కట్టమని మీ పీక మీద కత్తి పెట్టలేదు కదా.. అనవసరంగా మీనాను నానామాటలు అనొద్దని వార్నింగ్ ఇస్తుంది శృతి. బాలు డ్యూటీ నుంచి వచ్చేసరికి మీనా కుర్చీలో నిద్రపోతూ కనిపిస్తుంది. చేయి పట్టుకుని చూడగా ఆమెకు జ్వరం ఉంటుంది. నేను ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను, నువ్వెళ్లి మనోజ్ గదిలో పడుకోమని చెబుతాడు బాలు.

మీనా వద్దని చెప్పగా.. ఈ వారం మొత్తం ఆ గది మనదేనని అంటాడు బాలు. రోహిణి - మనోజ్‌లు వచ్చేసరికి వాళ్ల బెడ్‌రూమ్‌లో మీనా పడుకుని ఉండటంతో వారిద్దరూ ప్రభావతికి కంప్లయంట్ చేస్తారు. దాంతో ఊగిపోయిన అత్తగారు.. వెంటనే మీనాని బలవంతంగా నిద్రలేపి కిందకి ఈడ్చుకొచ్చేస్తుంది. అది చూసిన బాలు తల్లిపై మండిపడతాడు. వీరి గొడవ విన్న సత్యం వచ్చి ఏం జరిగిందని అడగ్గా.. బాలు జరిగినదంతా చెబుతాడు. దాంతో బాలు, మనోజ్‌లని తన గదిలో.. మీనా, ప్రభావతి, రోహిణిలు మరో గదిలో పడుకోమని పరిష్కారం చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక సెప్టెంబర్ 23వ తేదీ, 516వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 516 September 23rd 2025 here is full story

Photo Courtesy: JioHotstar

తండ్రి చెప్పడంతో సత్యం గదిలో బాలు, మనోజ్‌లు పడుకుంటారు. చాప మీద పడుకుంటున్నావా అని మనోజ్ అడగ్గా.. ఇది నాకు కాదు, నీకేనని అంటాడు బాలు. పార్క్‌లో పరుపులు ఉంటాయా? అక్కడ పడుకోలేదా? ని సెటైర్లు వేస్తాడు. చిన్నప్పుడు ఉరుములు, మెరుపులు వస్తే వీడు భయంతో పక్క తడిపేసేవాడు ఇంకా ఆ అలవాటు పోలేదా అని బాలు సెటైర్లు వేస్తాడు. నువ్వు కథలు బాగా చెప్పేవాడివని, ఓ కథ చెబుతావా అని అడుగుతాడు బాలు. నాకు ఏం రావు అని సత్యం చెప్పడంతో బాలు నేను చెబుతానని అంటాడు. మనోజ్ నిద్రపోకుండా తెల్లార్లు బాలు కథలు చెబుతూనే ఉంటాడు.

మీనా కింద పడుకుందని రోహిణి అడగ్గా.. దానికి ఇదేమైనా కొత్తా, పుట్టినప్పటి నుంచి కిందే కదా పడుకుందని అంటుంది ప్రభావతి. మీరు ఫ్రీగా పడుకుంటానంటే, నేను కూడా కిందే పడుకుంటానని చెబుతుంది రోహిణి. నీకేం కర్మ.. పూలు అమ్మకునేవాళ్లకి, మలేషియాలో పుట్టి పెరిగినవాళ్లకి తేడా ఉంటుందని మీనాని అవమానిస్తుంది ప్రభావతి. మీ మావయ్య చెప్పడంతో ఎక్కడ మీనా నా పక్కలో పడుకుంటుందోనని కంపరంగా ఉందని, దీనిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని రోహిణితో అంటుంది. ఆ మాటలతో మీనా బాధపడుతుంది.

ఆ వెంటనే మీనా లేచి పాడు దోమలు, చెవిలో జోరీగలాగా ఒకటే తిరుగుతోందని అంటుంది. ఆ శబ్ధం వింటే ఎలా నిద్రపడుతుందని ప్రభావతికి చురకలు వేస్తుంది. అత్తగారి గురక దెబ్బకి రోహిణికి నిద్రపట్టదు. నిద్రమత్తులో మాటిమాటికి రోహిణిని తంతుంది ప్రభావతి. దీంతో చేసేదేం లేక రోహిణి చాప, దిండు తీసుకుని హాల్లోకి వస్తుంది. అప్పటికే మనోజ్ సోఫాలో నిద్రపోతూ కనిపిస్తాడు. ఆ వెంటనే మనోజ్‌ని నిద్రలేపడంతో అతను ఉలిక్కిపడతాడు. నువ్వెంటీ కిందకి వచ్చావని మనోజ్ అడగ్గా.. అత్తయ్య గురక రాగం తీస్తున్నారని అంటుంది రోహిణి. మా అమ్మకి గురక వీక్‌నెస్ ఉందని చెబుతాడు మనోజ్. అవును.. రాత్రుళ్లు గురక వీక్‌నెస్, పగలు డబ్బు వీక్‌నెస్ అని మనసులో అనుకుంటుంది రోహిణి.

నువ్వేంటీ ఇక్కడ పడుకున్నావని రోహిణి అడగ్గా.. నీకు గురక మ్యూజిక్ ప్రాబ్లమ్ అయితే, నాకు బుర్ర తినే ప్రాబ్లమ్ అని చెబుతాడు మనోజ్. ఆ బాలుగాడు బ్రేక్‌ల్లేని కారులా నాన్‌స్టాప్‌గా నా బుర్ర తింటున్నాడని అంటాడు మనోజ్. ఎవడు దొరికితే వాడి బుర్ర తినేస్తాడని చెబుతాడు. అయితే ఎక్కడ మొదలుపెట్టామో అక్కడికే వచ్చి పడ్డామని రోహిణి బాధపడుతుంది. ఈ వారం మొత్తం హాల్‌లోనే పడుకోవాలని బాధపడతాడు మనోజ్. నేల మీద పడుకుంటే నీకు నిద్రపట్టదు కదా? అని రోహిణి అడగ్గా.. వేరే ఆప్షన్ లేదని చెబుతాడు మనోజ్.

ఉదయాన్నే ప్రభావతి అటు ఇటూ తిరుగుతూ కాఫీ కోసం ఎదురుచూస్తుంది. నువ్వు కావాలనే పొద్దెక్కే వరకు పొడుకున్నావని మీనాపై మండిపడుతుంది. నేను ఏ రోజైనా పొద్దెక్కే వరకు పడుకున్నానా? ఇవాళ పడుకున్నానంటే దాని అర్ధం నాకు ఒంట్లో బాలేదని అని చెబుతుంది మీనా. రాత్రి మీ ఇద్దరికీ రూమ్ ఇవ్వలేదని కక్షగట్టి ఇంతసేపు పడుకున్నావని మండిపడుతుంది ప్రభావతి. ఒక్కరోజు రూమ్ లేకపోతే ఉండలేవా? అని ప్రభావతి అడగ్గా.. అదే మాట నేను మిమ్మల్ని అడిగితే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నిస్తుంది మీనా. కావాలని రూమ్ ఇవ్వకుండా మా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతుంది.

అందరూ పనులకు వెళ్లాలి? ఇంకా వంట చేయలేదు? టిఫిన్ చేయలేదని నిలదీస్తుంది ప్రభావతి. ఒక్కపూట వాళ్లని చేయమని చెప్పొచ్చు కదా అని మీనా అడుగుతుంది. వాళ్లు, నువ్వు ఒక్కటేనా? అని అడుగుతుంది ప్రభావతి. ముగ్గురు కొడుకుల్ని, ముగ్గురు కోడళ్లని వేరు చేసి మాట్లాడేది మీరని అంటుంది మీనా. ఇంతలో సత్యం వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఆరోగ్యం బాగుంటే అన్ని పనులు మీనాని చేసేదని కోడల్ని సత్యం వెనకేసుకుని వస్తాడు. ఇంతలో మనోజ్ వచ్చి బాగా ఆకలి వేస్తోందేని, ఏం టిఫిన్ చేశారని అడుగుతాడు.

రూమ్ కోసం గొడవ జరగడం వల్ల మేం ఇద్దరం సరిగా తినలేదని చెబుతుంది రోహిణి. మనోజ్, నేను హాల్‌లోనే పడుకున్నామని రోహిణి చెప్పడంతో ప్రభావతి బాధపడుతుంది. ఇంతలో గరిటె పట్టుకుని వస్తాడు. నువ్వు ఏం చేస్తున్నావని సత్యం అడగ్గా.. మీనాకి జ్వరం కదా? అందుకే జావ కాస్తున్నానని చెబుతాడు బాలు. పుట్టింటికి వెళ్లమంటే సంతోషంగా వెళ్లిపోతుంది.. ఇంట్లో వంట చేయమంటే మాత్రం చేయదని మీనాని తిడుతుంది ప్రభావతి. ఇంతలో శృతి, రవిలు వచ్చి ఏమైందని అడుగుతారు. తినడానికి ఏం లేదని రోహిణి చెప్పడంతో ఎందుకని శృతి అడుగుతుంది. మీనాకి ఒంట్లో బాలేదని బాలు చెప్పగా.. ఎందుకు నిల్చొని ఉన్నావ్? వెళ్లి రెస్ట్ తీసుకోమని చెబుతుంది శృతి.

చిన్నవాళ్లు అయినా మీనాను ఎలా అర్ధం చేసుకున్నారు? నువ్వెలా మాట్లాడుతున్నావని ప్రభావతిపై మండిపడతాడు సత్యం. ఈ ఇంట్లో వంట మీనా మాత్రమే చేయాలనే రూల్ లేదని, ఈ ఇంట్లో ఇంకో ఇద్దరు కోడళ్లు ఉన్నారని అంటాడు. నాకు వండటం రాదని, అందుకే కదా చెఫ్‌ని పెళ్లి చేసుకున్నానని చెబుతుంది శృతి. మీనాను ఇబ్బంది పెట్టకుండా నేను, రవి రెస్టారెంట్‌లో తినేస్తామని చెబుతుంది. శృతికి వంట రాకపోతే నీకొచ్చు కదమ్మా అని రోహిణిని అడుగుతాడు సత్యం.. వచ్చు కానీ మీనా లాగా ఇంట్లో వంట చేసుకుంటూ కూర్చుంటే నా క్లయింట్స్ మారిపోతారని, అందరూ వీఐపీలే వాళ్ల టైంని బట్టి నేను వెళ్లాలని చెబుతుంది రోహిణి. నేను, మనోజ్ కూడా బయటే తింటామని అంటుంది.

నలుగురు ఆకలితో వెళ్లిపోయారు? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందని మీనాపై మండిపడుతుంది ప్రభావతి. ఎవరికి వారు బయట తింటామని వెళ్లిపోయారని, ఇకపై మీనా నాకు, నాన్నకు మాత్రమే వంట చేస్తుందని బాలు తేల్చేస్తాడు. మరి నేనేం తినాలని ప్రభావతి అడగ్గా.. ఇప్పుడు కూడా నీ గురించి ఆలోచిస్తున్నావ్ కానీ, నా గురించి ఆలోచించావా అని సత్యం కోప్పడతాడు. బాలు వచ్చి తల్లిదండ్రులిద్దరికీ జావ ఇస్తాడు. మీనాకు హెల్త్ బాగోకపోవడంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు బాలు.

మూడు రోజులు నువ్వు రెస్ట్ తీసుకోకుండా ఇంట్లో పనులన్నీ చేస్తే నేను ఊరుకోనని మీనాకి వార్నింగ్ ఇస్తాడు బాలు. నీకు ఒంట్లో బాలేదని నేను కూడా ట్రిప్‌కి వెళ్లడం లేదని చెబుతాడు బాలు. వాళ్లిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చింటూకి యాక్సిడెంట్ అయి అతని అమ్మమ్మ ఆసుపత్రికి తీసుకొస్తుంది. అది చూసిన బాలు, మీనాలు ఆమెను ఓదారుస్తారు. చిన్న సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పడంతో చింటూ అమ్మమ్మ బాధపడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి ఆపరేషన్ అయ్యే వరకు మేం మీతోనే ఉంటామని బాలు, మీనాలు చెప్పడంతో చింటూ అమ్మమ్మ భయపడుతుంది. ఈ విషయాన్ని రోహిణికి ఎలా చెప్పాలా? అని ఆమె ఆలోచిస్తుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X