Gunde Ninda Gudi Gantalu September 29th: బయటపడ్డ రోహిణి బాగోతం.. ఇకనైనా చింటూకు తల్లి ప్రేమ దొరికేనా?

Photo Courtesy: JioHotstar

Gunde Ninda Gudi Gantalu: ప్రమాదంలో గాయపడిన చింటూని మీనా అక్కున చేర్చుకుని తన బెడ్‌రూంలో పడుకోపెడుతుంది. మరోవైపు రోహిణి తన గతం బయటపడుతుందేమోనని తీవ్ర టెన్షన్ పడుతుంది. నిద్రలోనే తన కొడుకు చింటూ తాను తల్లినని చెప్పుకుంటూ ఏడుస్తున్న కల పడుతుంది. దాంతో ఒక్కసారిగా లేచి కంగారు పడుతూ మీనా గదికి వెళ్తుంది. ఆ సమయంలో బాబు "అమ్మా... అమ్మా..." అంటూ ఏడవడం రోహిణిని మరింత కలవరపెడుతుంది. తన బిడ్డ దగ్గర ఉండలేకపోతున్నానని బాధపడుతుంది. మరుసటి రోజు వెంటనే తన ఫ్రెండ్ విద్యకు ఫోన్ చేసి పరిస్థితి చెబుతుంది. విద్య "ఇక వారిని ఇంట్లో ఉంచితే నీ రహస్యం బయటపడుతుంది" అని హెచ్చరిస్తూ ఒక ప్లాన్ వేస్తుంది.

ఆ ప్లాన్ ప్రకారం విద్య మీనాకు కాల్ చేసి పూల అల్లే పోటీలో సహాయం చేయమని అడుగుతుంది. మొదట నిరాకరించిన మీనా చివరికి ఒప్పుకుంటుంది. ఆమె వెళ్లబోతుండగా బాలు అనుమానం వ్యక్తం చేస్తాడు. "విద్యను నమ్మొద్దు" అని చెప్పినా, మాట ఇచ్చానని మీనా వెళ్ళిపోతుంది. రోహిణి తరువాత రవి, శృతిలను కూడా బయటకు పంపించేస్తుంది. ఇక తన ప్రధాన టార్గెట్ ప్రభావతి. చింటూ అమ్మమ్మ ఇక్కడే ఉంటారని అబద్ధం చెబుతూ ప్రభావతిని రెచ్చగొడుతుంది. "వారిని తానే పంపేస్తా" అన్న ప్రభావతికి రోహిణి అడ్డుపడి, "బాలు వాళ్లని తీసుకొచ్చాడు... నువ్వు పంపిస్తే గొడవ అవుతుంది" అని అడ్డుకుంటుంది. దాంతో ప్రభావతి తానే రోహిణి సహాయం కోరుతుంది. రోహిణి తన అత్తమామలను గుడికి పంపించి ప్లాన్ అమలు చేస్తుంది. ఇలా ఒక్కొక్కరిని ఇంట్లో నుంచి బయటకు పంపించే ప్రయత్నంలో రోహిణి తన మాస్టర్ ప్లాన్‌ను విజయవంతంగా మొదలుపెడుతుంది. ఇదే ఎపిసోడ్ హైలైట్. ఇక సెప్టెంబర్ 29వ తేదీ, 520వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 520 September 29th 2025 here is full story

Photo Courtesy: JioHotstar

విద్యా ప్లాన్ ప్రకారం.. మీనా ఇంటికి వస్తుంది. ఇంటి వద్ద చాలా పని ఉంది. ఇంటికి ముఖ్యమైన వారు వచ్చారు. నీ రిక్వెస్ట్ కాదనలేక ఇంత దూరం వచ్చాను. పద త్వరగా.. అరగంటలో
పూలు ఎలా అల్లాలో నేర్పిస్తా అని మీనా చెబుతుంది. మీనా తొందరగా వెళ్తే రోహిణి పని అయిపోదు. ఎలాగైనా ఎక్కువసేపు ఇక్కడే ఉండేలా ప్రయత్నించాలని విద్యా భావిస్తుంది. అందుకు తగ్గట్టుగానే తనకు పూల గురించి, వాటిని ఎలా అల్లాలో తెలియనట్లు వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో మీనా ను పొగడ్తలతో ముంచెత్తుతుంది. ఇంట్లో అన్ని పనులు చేసిన మీ అత్త గయ్యారిలా వ్యవహరించడం బాధ కరెంటు సానుభూతిని వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తుంది. వెంటనే మీనా రియాక్ట్ అవుతాం. నువ్వు అలా మాట్లాడడం సరికాదు. మా అత్తయ్య ఉంది కాబట్టే మేమందరం కలిసి ఉన్నాం. ఆమె వల్లనే కుటుంబం నిలిచింది.మేమందరం ఒక కుటుంబం గా కలిసి ఉండడంలో సంతోషం. విడిపోయి బతకడంలో ఉండదు'అని చెబుతోంది.

దీంతో విద్య ఇంప్రెస్ అవుతుంది. 'అలాంటి అత్త గురించి కూడా ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావా.. నువ్వు ఏం చదువుకున్నావో తెలియదు. కానీ, మనుషుల్ని మాత్రం ఇంత బాగా చదువుకున్నావ్అని ఇప్పుడే తెలిసింది. అయినా బాలు మనోజ్ ను ఎందుకు తిడుతాడు అని విద్య ప్రశ్నించగా.. 'మనోజ్ ను తిట్టాడానికి మా ఆయన మనసులో ఏమీ లేదు. అలా తిడితే నైనా.. పౌరుష వచ్చి జీవితంలో స్థిరపడుతాడన్న ఆశ తప్ప ఇంకేమీ ఉండదు అని అసలు విషయాన్ని చెప్పుతుంది మీనా. ఇది కూడా ఇంట్రెస్టింగ్ కొత్త విషయమే అంటూ విద్య. 'ఎవరినైనా దూరం నుంచి చూస్తే అలాగే ఉంటుంది. దగ్గర్నుంచి చూస్తేనే గుణం తెలుస్తుంది'అని మీనా అంటుంది. అయినా అంతా నా గురించే అడుగుతున్నావ్. నీ గురించి చెప్పు.. మీదేవూరు? నువ్వు ఇక్కడే చదువుకున్నావ్? నీకు రోహిణీకి పరిచయం ఎలా అయింది? నువ్వు ఎప్పుడు మలేషియా వెళ్లలేదా? అంటూ ఇన్ డైరెక్ట్ గా రోహిణీ గురించి కూపిలాగే ప్రయత్నం చేస్తుంది మీనా. దీంతో విద్యకు అనుమానం వస్తోంది. రోహిణీ గురించి ఇన్ఫర్మేషన్ లాగుతుందా? లేకపోతే మామూలుగానే అడుగుతుందా? అనే సందేహం విద్యకు వస్తుంది.

ఎలాగైనా రోహిణి గురించి తెలుసుకోవాలని మీనా ఫిక్స్ అవుతూ.. 'మీరిద్దరూ కలిసి చాలా చోట్లకి వెళ్లారు కదా.. చిన్నప్పుడు ఫోటోలు తీసుకునే ఉంటారు కదా .. ఏమైనా ఫోటోలు ఉంటే చూపించూ.. ఈ మధ్య ఫోటోలను ఫోన్ లోనే పెట్టుకుంటారు కదా.. అలాంటివేమి లేవా? ఒకసారి చూపిస్తావా ? అని విద్యను అడుగుతుంది. దీంతో విద్య కంగరు పడుతుంది. ఎక్కడ తన కథ బయట పడుతుందోనని ఫోన్ వస్తుందని అక్కడి నుండి వెళ్లిపోతుంది. వెంటనే రోహిణీకి ఫోన్ చేసి వాళ్లను పంపించావా? లేదా అని అడుగుతుంది. ఇంట్లో బాలు ఉన్నాడని చెబుతుంది. వెంటనే విద్య తన ఫ్రెండ్ రమ్యకు ఫోన్ చేసి.. బాలు క్యాబ్ ను బుక్ చేయించి బయటకు వెళ్లిపోయేలా చేస్తోంది.

బాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోగానే రోహిణి రెచ్చిపోతుంది. తన తల్లిని ఇష్టవచ్చినట్లు తిడుతుంది. 'అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకు ఆటలుగా ఉందా? సంసారం గురించి నీకు బాధ లేదా? చింటూ గురించి తెలిస్తే నా జీవితం ఏం అవుతుందో ఒక్కసారైనా ఆలోచించావా? 'అని తన తల్లిని నిలదీస్తుంది రోహిణీ. 'నేను ఆటలాడుతున్నానా? ఎప్పుడో తెలియక ఒక పొరపాటు చేశాను. ఆ భగవంతుడే నీ జీవితాన్ని ఇలా చేశారు. ఇందులో నా తప్పేముంది' అని రోహిణి తల్లి బాధపడుతుంది. 'అయినా కన్న కొడుకును పరాయి వాడిలా చూస్తూ.. అత్తా అని పిలిపించుకుంటున్నావ్ అప్పుడే నువ్వు చనిపోయావు. నీ స్వార్థం కోసం నీ సుఖం కోసం నేను చచ్చిపోయిన పర్వాలేదు, కానీ నువ్వు కన్నందుకు వాడు ఎందుకు శిక్ష అనుభవించాలి? వాడేం పాపం చేశాడు నీ కడుపున పుట్టడమే నేరమా? వాన్ని తీసుకొస్తే ఇన్ని మాటలు అంటావా? అని రోహిణి తల్లి సీరియస్ అవుతుంది.

అయినా.. ఊరు నుండి వచ్చేటప్పుడు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? అని రోహిణి ప్రశ్నించగా, 'నీ గురించి తెలిసే ఫోన్ చేయలేదు. నా తిప్పలు ఎదో నేను పడదామని హాస్పిటల్ తీసుకువచ్చాను. ఆ సమయంలో బాలు మీనాలు అదే హాస్పిటల్ కి వచ్చి బలవంతం చేస్తే ఇక్కడికి వచ్చాను. కానీ మీ ఇంట్లో ఉండిపోవడానికి రాలేదు' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. 'నీ కన్నా కొడుకును నేను తల్లిలా పెంచుతున్నాను. నేను ఉన్నంత సేపు వాణ్ని చూసుకుంటా. కానీ ఒకవేళ వానికి ఏమన్నా అయితే.. నువ్వు చూసుకుంటావని నమ్మకం అయితే నాకు లేదు. ఏదైనా ఆనాథశ్రమంలో పడేసి చేతులు దులుపుకుంటా. నీ కాపురానికి ఇలాంటి ఇబ్బంది రాదని సంతోషంగా ఉంటావు'అని రోహిణి తల్లి సిరీయస్ అవుతుంది.

వెంటనే రోహిణి రియాక్ట్ అవుతుంది 'చింటూ నాకన్నా కొడుకు. వాడిని ఎలా విడిచిపెడతాను అనుకుంటున్నావ్ . ఏ తల్లికి తన కొడుకు భారం కాదు, కానీ, ఏం చేయను. నా ప్రస్తుతం నా పరిస్థితిలో నేను ఏం చేయలేను. జీవితం అంతా చీకటిగా ఉంది. ఎదో ఒక రోజు చింటూ విషయాన్ని మనోడికి చెప్తాను. నా పరిస్థితి మనోజ్ కచ్చితంగా అర్థం చేసుకుంటాడు. చింటూకు ఓ తండ్రిలా ఉంటాడు' అని రోహిణి ఎమోషనల్ అవుతుంది. అయితే ఈ విషయాన్ని చింటూ మెట్లపై ఉండి వింటూ ఉంటాడు. వెంటనే రోహిణి దగ్గరకు వచ్చి 'నువ్వే కదా మా అమ్మవి. నువ్వు మా అమ్మ వే కదా.. నేను వద్దా నీకు.. ఎందుకు నాతో లేవమ్మా.. ఎందుకమ్మా.. నేనేం తప్పు చేశాను. అమ్మ ఎందుకు చెప్పు'అని చింటూ అడగడంతో కన్న కొడుకును గుండెలకు హత్తుకుంటుంది రోహిణీ.. ఇంతటితో సిరీయల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X