Gunde Ninda Gudi Gantalu October 3rd: బాలు మాటలతో మీనా గుండె పగిలింది.. సూసైడ్ లెటర్ తో ఇంట్లో టెన్షన్
courtesy: jiohotstar
Gunde Ninda Gudi Gantalu: ప్రభావతి రోహిణి ప్లాన్ బయటపెట్టగానే, బాలు ఆమెను నిలదీస్తాడు. అసలు విషయం ఏమిటంటే.. వారిని బయటికి పంపించాలని ప్రయత్నించినది ప్రభావతే అని రోహిణి చెబుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. సుగుణమ్మ కూడా మళ్లీ ఇంటికి రానని చెప్పేస్తుంది. ఈ సందర్భంలో చింటూ ఒక్కసారిగా రోహిణిని "అమ్మ" అని పిలవడం అందరినీ కంగారు పెట్టుతుంది. దానిని సర్దిచెప్పేందుకు సుగుణమ్మ కారణం చెబుతుంది కానీ రోహిణి లోపల ఆవేదనతో కన్నీరు పెట్టుకుంటుంది. తర్వాత మనోజ్, సుగుణమ్మ గురించి తప్పుగా మాట్లాడటంతో రోహిణి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మనుషులను చిన్నచూపు చూడకూడదని కౌంటర్ ఇస్తుంది. ఇదే సమయంలో చింటూ హాస్పిటల్‌లో కట్లు విప్పుకున్న తర్వాత మొదట రోహిణిని అమ్మ అని పిలుస్తాడు. రోహిణి కూడా ఎమోషనల్ అవుతూ అతన్ని హత్తుకుంటుంది.
తాను తన తల్లేనని చింటూ ప్రశ్నించగా, రోహిణి కన్నీళ్లు పెట్టుకుంటూ నిజం ఒప్పుకుంటుంది. వెంటనే మీనా, బాలు వచ్చేసరికి రోహిణి కంగారుపడి చింటూకి తనని అమ్మ అని బయట చెప్పొద్దని హితవు చెబుతుంది. బాలు, మీనా కాసేపు మాట్లాడుతుండగా, బాలు కూడా "నువ్వు వాడి నిజమైన అమ్మలాగే ఉన్నావు" అని చెబుతాడు. దాంతో రోహిణి కంగారు పడుతుంది. ఇక చింటూకి బర్త్‌డే నాడు వస్తానని హామీ ఇస్తూ రోహిణి వెళ్తుంది. మరోవైపు ఇంట్లో సత్యం సరదాగా తన పెళ్లి గురించి జోకులు వేస్తాడు. ఈ క్రమంలో బాలు చిన్ననాటి ఫ్రెండ్ రాజశేఖర్ వచ్చి తన అన్నయ్య పెళ్లి కార్డు ఇస్తాడు. పెళ్లిళ్లలో తమ్ముళ్లు జాగ్రత్తగా ఉండాలని బాలు సరదాగా అన్న మాటలు మీనా మనసును గాయపరుస్తాయి. ఇక అక్టోబర్ 3 వ తేదీ, 524వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

courtesy: jiohotstar
బాలు తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ, "అన్నయ్య పెళ్లి చేసుకుంటే తమ్ముళ్లు జాగ్రత్తగా ఉండాలి.. ఒకవేళ వాడు లేచిపోతే.. మనకే అంట కడతారు... జీవితాంతం కష్టపడాలి... ఇక బతుకు బస్టాండ్" అంటూ సరదాగా మాట్లాడుతాడు. కానీ ఈ జోక్ మీనా గుండెను గాయపరుస్తుంది. ఇప్పటివరకు బాలు తనపై ప్రేమ కురిపిస్తున్నాడని అనుకున్న మీనా ఒక్కసారిగా విరిగిపోతుంది. కోపంతో వంటరూం లోకి వెళ్లిపోతుంది. బాలు కూడా బయటికి వెళ్ళిపోతాడు. ఇదే అదునుగా భావించిన ప్రభావతి రెచ్చిపోతుంది. ఇప్పటివరకు.. ఇదే అదునుగా భావించిన ప్రభావతి రెచ్చిపోతుంది. " మీనా అనుకున్నట్లుగా బాలు ప్రేమతో పెళ్లి చేసుకోలేదు. నాన్న భయానికి బలవంతం కాపురం చేస్తున్నాడు. " అంటూ మీనాను కించపరుస్తుంది. బలవంతంగా మీనాను బాలుకి అంటగట్టారని కూడా చెబుతుంది. ఈ మాటలు మీనా మనసు మరింత గాయపరుస్తాయి.
తర్వాత బాలు మీనా దగ్గరకి వచ్చి "టిఫిన్ చేసావా?" అని అడిగితే, మీనా కోపంతో వెళ్లిపోతుంది. "ఇకపై నేను ఏమీ చేయను" అని ప్రభావతితో ఘాటుగా చెబుతుంది. ఇంతలో మనోజ్ వచ్చి టిఫిన్ అడిగితే, "నీ పెళ్ళాన్ని చెయ్యమని అడుగు లేదా గుడి ముందు అడుక్కో" అంటూ మండిపడుతుంది. ప్రభావతి అడిగిన "ఇడ్లీ పిండి లేదా?"కి కూడా "ముగ్గు పిండి ఉంది, దిబ్బ రొట్ట వేసుకొని తినండి" అని చెబుతుంది. చివరగా "మీనా ఎప్పుడో చచ్చిపోయింది... నేను దెయ్యం... గుడ్ నైట్" అంటూ కిచెన్ నుంచి రూమ్‌లోకి వెళ్లిపోతుంది.
బాలు మరోసారి మీనాను సాంత్వన పరచడానికి వస్తాడు. "అసలు ఏమైంది? ఎందుకు కోపంగా ఉన్నావు?" అని అడుగుతాడు. "నీ అన్నయ్య పారిపోయితే నన్ను అంట కట్టారు కదా... నా మీద ప్రేమే లేదు కదా..." అని మీనా ప్రశ్నిస్తుంది. "నేను సరదాగా అన్నాను" అని బాలు చెబుతాడు. దానికి "మనసులో లేనిదే మాట బయటకు రాదు" అని మీనా ఘాటుగా సమాధానం ఇస్తుంది. బాలు కూడా "నేను నిన్ను ప్రేమించనివాడినైతే ఎందుకు ఎన్నిసార్లు 'నువ్వు లేనిదే నేను లేను' అన్నాను? అవి కూడా సరదాగానే అన్నానా?" అని కోపంగా సమాధానం ఇస్తాడు. ఈ సమయంలో బాలుకి ఫోన్ రావడంతో బయటకి వెళ్ళిపోతాడు.
ఇంతలోనే బాలుకి ఫోన్ రావడంతో బయటికి వెళ్ళిపోతాడు. ఆ మాటలతో మీనా ఇంకా బాధపడుతుంది. ఈ క్రమంలోనే పార్వతి మీనాకు ఫోన్ చేస్తుంది. తన తల్లితో కూడా మీనా కోపంగాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. సరేలే తర్వాత ఫోన్ చేస్తా అంటూ కట్ చేస్తుంది. ఇలా మాట్లాడడం పార్వతి కూడా కొత్తగా అనిపిస్తుంది. మరోవైపు బాలు కోపంగా తన ఫ్రెండ్ రాజేష్‌కి చెబుతాడు. "నేను సరదాగా అన్న మాటను మీనా సీరియస్‌గా తీసుకుంది" అని. దానికి రాజేష్ "భార్య తుప్పు పట్టిన కత్తి లాంటిది... వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తప్పు చేసినా మనమే సారీ చెప్పాలి. ఇంట్లో కంచెం మంచం ఉండాలంటే సారీ చెప్పు" అని సలహా ఇస్తాడు. బాలు అంగీకరిస్తాడు.
ఇక మరోవైపు సత్యం పెళ్లి నుంచి ఇంటికి వస్తాడు. "మీనా నీళ్లు తీసుకురా" అని పిలుస్తాడు. కానీ మీనా లేదు. వంట చేయలేదు అని ప్రభావతి కేకలు వేస్తుంది. బాలు సరదాగా మాట్లాడిన మాటలు మీనా సీరియస్ గా తీసుకుందని ఆ మాటలకి వంట చేయకుండా ఇంట్లో ఉండి వెళ్ళిపోయింది, పని దొంగ అంటూ మీ నాన్నకు తిడుతుంది ప్రభావతి. ఇందులోనే బాలు ఇంటికి చేరుకుంటాడు. మీనా లేదా అని ప్రశ్నిస్తాడు. మీనా లేదు... ఇంత రాత్రి అయినా బలాదూర్ గా తిరుగుతోంది అని ప్రభావతి అరుస్తుంది. బాలు "నా భార్యని ఇలా తిట్టవద్దు, ఇంట్లో మీరు కూడా నానా మాటలు అన్నారు కాబట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది " అని ఘాటుగా చెబుతాడు.
మీనా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుండటంతో బాలు టెన్షన్ పడతాడు. కానీ ఇంట్లో మాత్రం వంట గురించి తగువులు జరుగుతాయి. రోహిణి వంట చేయమని ప్రభావతి బలవంతం చేస్తుంది. ఇదంతా జరుగుతుండగా బాలు తన మరదలు ఫోన్ చేసి "మీనా అక్కడికి వచ్చిందా?" అని అడుగుతాడు. "లేదు... ఫోన్ స్విచ్ ఆఫ్" అని సమాధానం వస్తుంది. బాలు మరింత టెన్షన్‌లో బయటకి వెళ్లి మీనాను వెతకడానికి బయలుదేరతాడు.
ఈ విషయం ముందే తెలిస్తే తాము ఆర్డర్ పెట్టుకునే వాళ్ళం కదా.. తాను చాలా అలసిపోయాను అంటూ మనోజ్ ఓవర్ గా మాట్లాడుతాడు. దీంతో రవి రియాక్ట్.. మేము కూడా పనిచేస్తున్నాం అనవసరంగా బిల్డప్ ఇవ్వకు అని వార్నింగ్ ఇస్తారు. మీరు కూడా ఆపండి ఫస్ట్.. మీనాకు ఫోన్ చేసి ఎక్కడ ఉందో తెలుసుకోమని అంటుంది శృతి. ఇది ఇలా ఉండగానే .. మీనా లేకపోతే ఏంటి మనకు వంట చేయడం రాదా అంటూ రోహిణి వంట చేయమని బలవంత పెడుతుంది ప్రభావతి. మీనా కనిపించకపోవడంతో బాలు మరింత టెన్షన్ పడతారు.
ఈ క్రమంలో తన మరదలు ఫోన్ చేసి మీ నా అక్కడికి వచ్చిందా అని ప్రశ్నిస్తాడు. అక్కయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఇక్కడికి రాలేదని బదిలీస్తోంది. దీంతో మరింత టెన్షన్ పడతాడు బాలు. బయటికి వెళ్లి మీనా కోసం వెతికి ప్రయత్నం చేస్తాడు. ఇక ప్రభావతి ఇంట్లో కూడా టెన్షన్ మొదలవుతుంది.. ఏదైనా ఆధారం దొరుకుతుంది కావచ్చని మీనా గదిలో వెతుకుతుండగా సూసైడ్ లెటర్ కనిపిస్తుంది. ఇంతటితో ఈ సీరియల్ ముగుస్తుంది. ఇంతకీ మీనా ఎటు వెళ్లిపోయినట్టు. సూసైడ్ లెటర్ ఎందుకు రాసినట్లు.. నిజంగానే మీరా సూసైడ్ చేసుకుంటున్న అనే విషయాలు తెలుసుకోవాలంటే మరో ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే.


Click it and Unblock the Notifications











