Gunde Ninda Gudi Gantalu October 7th Episode: మీనా మిస్సింగ్ మిస్టరీకి షాకింగ్ ట్విస్ట్.. పోలీస్ స్టేషన్ లో..
courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ లో మీనా కనిపించకపోవడంతో బాలు ఆందోళన చెందుతాడు. వెంటనే మీనా చెల్లెలికి ఫోన్ చేసి "మీ అక్కకి ఫోన్ ఇవ్వు" అని అడుగుతాడు. "అక్క ఎక్కడుందో నాకు తెలియదు" అని ఆమె సమాధానం ఇస్తుంది. దీంతో బాలు మరింత కంగారుపడతాడు. "మీనా ఎక్కడుంది? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా?" అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది బాలు మరదలు. ఈ మాటల్ని తల్లి పార్వతి విని ఆరా తీస్తుంది. అదే సమయంలో తమ్ముడు శివ కూడా విని "బాలు తాగి అక్కతో గొడవ పడి ఉంటాడు" అంటూ బాలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇదిలా ఉండగా రోహిణి వింత వంటలతో ఇంట్లో గందరగోళం నెలకొంటుంది. శృతి, రవి తినలేక ఇబ్బంది పడుతుంటే.. మనోజ్ మాత్రం భార్యని పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఈ పరిస్థితుల్లో సత్యం ఇంటికి చేరి "కోడలు కనిపించడంలేదు, కనీసం బాధ్యత కూడా లేదా?" అంటూ ప్రభావతిపై కోపం చూపుతాడు. కానీ ప్రభావతి మాత్రం "మీనా బాలు మీద కోపంతో ఇంటిని వదిలేసి వెళ్లిపోయింది" అంటూ వెటకారంగా చెబుతుంది. రవి తినకుండానే బయటకు వెళ్లి తన అన్నయ్య బాలు దగ్గరకు చేరి "వదిన కోసం వెతుకుదాం" అంటాడు. అయితే బాలు "రాజేష్ వస్తున్నాడు, వాడితో కలిసి వెతుకుతాను" అని కంగారుగా బయలుదేరుతాడు. రాజేష్‌తో కలిసి బాలు మీనా కోసం బంధువుల ఇళ్లు, పూలకొట్లు, పరిచయస్తుల వద్ద అన్నింటికీ వెళ్ళి ఆరా తీస్తాడు. కానీ ఎక్కడా మీనా గురించి సమాచారం దొరకదు. అలసిపోయిన బాలు దారిలో గుడి కనిపించగానే ఆగి "ఇకపై మీనాను పల్లెత్తి ఒక్క మాట కూడా అనను... మీనా అంటే నా ప్రాణం" అంటూ దేవుడి వద్ద మొక్కుకుంటాడు.
మరోవైపు ఇంట్లో ప్రభావతి నిర్లక్ష్యంగా ఫోన్‌లో చూస్తూ ఉండగా సత్యం కంగారు కంగారుగా తిరుగుతాడు. "కోడలు కనిపించడంలేదు, కనీసం ఫోన్ చేశావా?" అని ప్రశ్నిస్తాడు. ప్రభావతి "ఇకపై మీనా ఇంటికి రాదు" అంటూ నిర్లక్ష్యంగా బదులిస్తుంది. ఈ సమయంలో మీనాక్షి ఇంటికి చేరి "అసలేం జరిగిందో?" అని ప్రశ్నిస్తుంది. ప్రభావతి జరిగినదంతా చెబుతుంది. "వాడు ఏదో అన్నాడు, నువ్వు దానికి వత్తాసు పలికావా?" అంటూ మీనాక్షి గట్టిగా నిలదీస్తుంది. "ఒకవేళ మీనా గృహహింస చట్టం కింద కేసు పెట్టి ఉంటుందేమో... లేదా ఆత్మహత్య చేసుకుందేమో" అని భయపెడుతుంది. దీంతో ప్రభావతి మరింత కంగారు పడుతుంది. వెంటనే వాళ్ళిద్దరూ మీనా గదిని వెతకడం మొదలుపెడతారు. ఇదే సమయంలో శృతి, రోహిణి కూడా గదిలోకి వస్తారు. అందరూ ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని వెతుకుతుండగా... శృతికి ఒక లెటర్ కనిపిస్తుంది. "ఇదిగో లెటర్!" అని శృతి చెబుతుండగానే ప్రభావతి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆ ఉత్తరంలో ఏం రాసి ఉంది? నిజంగానే మీనా ఆత్మహత్య చేసుకుందా? లేక ఎక్కడికో వెళ్లిపోయిందా? అనేది మాత్రం వచ్చే ఎపిసోడ్‌లో తేలాలి. ఇక మంగళవారం ( అక్టోబర్ 7 ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

courtesy: Jiohotstar
మీనా రూమ్‌లో లెటర్ - ప్రభావతికి షాక్
మీనా కనిపించకపోవడంతో ఇల్లు మొత్తం ఆందోళనలో మునిగిపోయింది. ప్రభావతి, మీనాక్షి శ్రుతి, రోహిణిలు టెన్షన్‌లో మీనా గదిలో ఏమైనా క్లూ దొరుకుతున్న అని వెతుకుంటారు. ఇంతకీ శ్రుతికి ఓ లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ ను మీనాక్షి తీసుకోగానే.. "నా చావుకి ఎవరూ కారణం కాదు... ఒకరు తప్ప... ఆ ఒక్కరు మా అత్తగారు! అది ఒక బ్రహ్మరాక్షసి..."ఆమెను చంపేస్తే ఒక్కసారి చనిపోతుంది... కానీ నేను చనిపోతే పరువు పోతుంది... ఆమె జైలులో మగ్గిపోవాలి... ఉరి కంభం ఎక్కాలి..." అని మీనా చనిపోయే ముందు రాసిందేమో అని తలచి, జైలు సీన్‌లు, ఉరి కంభం ఊహల్లో మునిగిపోతుంది ప్రభావతి. కానీ, లెటర్ చూస్తే.. అది కేవలం ఒక "కూరగాయల లిస్ట్" అని తేలిపోవడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు.
బాలు ఎమోషనల్
మరోవైపు బాలు తన ఫ్రెండ్ రాజేష్‌తో కలిసి మీనాను వెతుకుతుంటాడు. ప్రతి వీధి, ప్రతి చోట మీనానుగురించి ఆరాతీస్తాడు. ఎక్కడా కనబడకపోవడంతో బాలు అలసిపోతాడు "ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇప్పటివరకు భయపడలేదు... కానీ ఈరోజు మొదటిసారి భయమంటూ ఏదో నా లోపల పుట్టుకువచ్చింది. మీనా కనిపించకపోవడం... ఆలోచించలేనంత బాధగా ఉంది..." అని చెప్పి కన్నీరు పెట్టుకుంటాడు. అప్పుడు రాజేష్ అతన్ని ఓదారుస్తూ, "మీనా ఎక్కడికి వెళ్లినా తిరిగి వస్తుంది. చిన్న చిన్న అపోహలకే పెద్ద గొడవలు అవుతున్నాయి. నువ్వు చేసిన తప్పులకూ ఆమె క్షమించింది. ఈరోజు కూడా తిరిగి వస్తుంది," అని ధైర్యం చెబుతాడు. బాలు కాస్త నిశ్శబ్దంగా అవుతాడు కానీ మనసులో కలవరం మాత్రం తగ్గదు.
శివకి గుణా సలహా - పోలీస్ స్టేషన్ లో మలుపు
ఇక మీనా తమ్ముడు శివ కూడా ఆందోళనలో ఉంటాడు. తన అక్క కనిపించడం లేదని గుణాకు చెబుతాడు. అప్పుడు గుణా వెంటనే "ఏం ఆలోచించకుండా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వు. నీ బావను నాలుగు ఉతికితే.. అసలు నిజం బయటపడుతుంది!" అని రెచ్చగొడతాడు.
శివ మొదట వెనుకాడతాడు కానీ గుణా మాటలకు ప్రభావితమై పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఇదే సమయంలో బాలు తండ్రి కూడా సత్యంకు ఫోన్ చేసి, "మీనా దొరికిందా? లేదంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు," అని చెబుతాడు. బాలు కూడా అదే దారిలో బయలుదేరుతాడు. పోలీస్ స్టేషన్ కి చేరుకున్న బాలు అక్కడ శివను చూసి షాక్ అవుతాడు. "ఇక్కడ వీడేం చేస్తున్నాడు?" అని ఆగ్రహంతో ప్రశ్నిస్తాడు. శివ అయితే ఒక్కసారిగా బాలు మీదే అనుమానాలు వేస్తూ, "మా అక్కను మా బావ ఏదో చేశాడు! అరెస్ట్ చేయండి!" అని పోలీసుల ముందే అరుస్తాడు.
ఎస్ఐ అయితే పరిస్థితి అర్థం చేసుకుని, "అనవసరంగా గొడవ వద్దు. 24 గంటలు గడిచాకే కేసు రిజిస్టర్ చేస్తా.. ఇంటికి వెళ్ళండి," అని హెచ్చరిస్తాడు. కానీ శివ మాత్రం బాలుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. నానా మాటలు అంటాడు. దీంతో బాలు పోలీస్ స్టేషన్ ముందటనే శివకాలర్ పట్టుకుంటాడు. రాజేష్ మధ్యలో వచ్చి, "ఇక్కడ గొడవ చేస్తే ఇరువురినీ అరెస్ట్ చేస్తారు. మీనా కోసం వెతికే అవకాశం పోతుంది," అని వారిని ఆపేస్తాడు.
మీనా రీ-ఎంట్రీ - అసలు నిజం బయటపడింది
ఇంటికి తిరిగి వచ్చిన బాలు టెన్షన్‌లో ఉండగానే సత్యం "మీనా వచ్చేసింది!" అని చెబుతాడు. వెంటనే బాలు.. మీనా దగ్గరికి ఆవేశంగా వెళ్లి, "ఎక్కడికి వెళ్లావు? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు?" అంటూ అడుగుతాడు. కానీ వెంటనే కన్నీరు పెట్టుకుంటూ ఆమెను హత్తుకుంటాడు. "నేను ఎంత భయపడ్డానో నీకు తెలుసా? ఒక్క క్షణం నేను బ్రతకలేనంత భయపడ్డాను..." అని ఎమోషనల్ అవుతాడు. అందరూ ఎక్కడికి వెళ్లావ్ అని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అసలు మీనాకు సమాధానం చెప్పి అవకాశం కూడా లేకుండా చేస్తారు. వారి సూటిపోటీ మాటలు భరించలేక మీనా గట్టిగా "ఒక్కసారి నన్ను మాట్లాడనివ్వండి!" అని అంటుంది. "నేను బయటకు వెళ్ళే ముందు శృతికి చెప్పి వెళ్లాను," అని చెబుతుంది. కానీ శృతి మాత్రం అయోమయంలో "నాకు తెలియదు" అని అంటుంది.
తర్వాత మీనా వివరంగా చెబుతుంది - "శృతి ఫోన్‌లో బ్లూటూత్‌తో మాట్లాడుతుండగా నేను మాట్లాడాను. ఆమె వేరేవారితో మాట్లాడుతుండగా నన్ను మాట్లాడినట్లు భావించింది. అక్కడే మిస్ కమ్యూనికేషన్ జరిగింది," అని క్లారిటీ ఇస్తుంది. ఇలా నిజం బయటపడగానే ప్రభావతి కుటుంబం మొత్తం నిశ్శబ్దంగా అయిపోతుంది. మీనా పై వేసిన అనుమానాలు అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. బాలు కూడా తాను చేసిన ఆవేశాన్ని గుర్తించి, మీనాకు క్షమాపణలు చెబుతాడు. ఇలా లెటర్ మిస్టరీ నుండి పోలీస్ టెన్షన్ వరకు సాగిన ఈ ఎపిసోడ్, చివరికి ప్రేమ, కుటుంబ బంధం, అపోహలు, అర్థం చేసుకోవడం వంటి భావోద్వేగాలతో నేటీ ఎపిసోడ్ ముగిసింది.


Click it and Unblock the Notifications











