Gunde Ninda Gudi Gantalu October 8th Episode: గుణకు మీనా మాస్ వార్నింగ్ .. రోహిణికి మాజీ బాయ్‌ఫ్రెండ్ షాక్
courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్ లో మీనా కనిపించకపోవడంతో ఇల్లు మొత్తం ఆందోళనలో మునిగిపోతుంది. ప్రభావతి, మీనాక్షి, శ్రుతి, రోహిణి గదిని వెతికే సమయంలో శ్రుతికి ఒక లెటర్ దొరుకుతుంది. అందులో 'నా చావుకి కారణం నా అత్తగారు!'అంటూ మీనా రాసిందేమోనని భయపడుతుంది. ఉరి కంభం, జైలు ఊహల్లో ప్రభావతి కంగారుపడుతుంది. కానీ అది కేవలం కూరగాయల లిస్ట్ అని తేలిపోవడంతో అందరూ ఊపిరి పీలుస్తారు. ఇక బాలు తన ఫ్రెండ్ రాజేష్‌తో మీనాను వెతికినా, ఎక్కడా కనపడకపోవడంతో ఎమోషనల్ అవుతాడు. 'ఎంత పెద్ద సమస్య వచ్చినా భయపడలేదు... కానీ ఈరోజు భయమేస్తుంది'అంటూ కన్నీరు పెడతాడు. రాజేష్ ఓదారుస్తూ మీనా తిరిగి వస్తుందని ధైర్యం చెబుతాడు.
ఇక మీనా తమ్ముడు శివ గుణా సలహాతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి బాలు మీదే అనుమానం వ్యక్తం చేస్తాడు. కానీ, ఎస్ఐ 24 గంటలు గడవకపోవడంతో కేసు నమోదు చేయకుండా హెచ్చరిస్తాడు. పోలీస్ స్టేషన్ ముందు బాలు - శివ తగవుకు రాజేష్ అడ్డుపడతాడు. ఇంతలో ఇంట్లోకి మీనా రీ-ఎంట్రీ అవుతుంది. బాలు ఆమెను చూసి కన్నీళ్లతో హత్తుకుంటాడు. అందరూ ప్రశ్నలతో ముంచెత్తుతారు. చివరికి మీనా 'నేను బయటకు వెళ్ళే ముందు శృతికి చెప్పాను. కానీ ఆమె వేరేవారితో మాట్లాడుతుండగా తప్పుగా అర్థం చేసుకుంది'అని క్లారిటీ ఇస్తుంది. అన్ని అపోహలు కరిగిపోతాయి, కుటుంబం ప్రశాంతంగా మారుతుంది. బాలు తన ఆవేశానికి క్షమాపణ చెబుతాడు. ఇక బుధవారం (అక్టోబర్ 8 ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

courtesy: Jiohotstar
మీనా కనిపించకపోవడం వల్ల ఇంట్లో హడావుడిగా మారిన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తాను ఎక్కడికీ వెళ్లిపోలేదని, పూల ఆర్డర్ కోసం బయటికి వెళ్లిందని చెప్పినా ప్రభావతి మాత్రం "పని దొంగ" అంటూ అవమానపరుస్తుంది. ఈసారి మాత్రం మీనా కూడా ఆగలేదు. తనకు వచ్చిన డబ్బులు చూపిస్తూ "నేను పని దొంగను కాదు " అంటూ ప్రభావతి నోరు మూయించింది. అంతటితో ఆగకుండా మీనాక్షి కూడా రంగంలోకి దిగి, ప్రభావతి, మనోజ్‌లకు క్లాస్ తీసుకుంది. "ఇంట్లో మనిషి కనిపించకపోతే భయపడాలి, బాధపడాలి. ఏమైందో తెలుసుకోవాలి. కానీ లేనిపోని నిందలు వేయడం మాత్రం తగదు. మీ భార్య పని దొంగ కాదు!" అంటూ మీనాక్షి గట్టిగా చెప్పింది. ప్రభావతి తికమకపడి, "ఇంకా అయిపోయిందా నీ క్లాస్?" అంది. అప్పుడు మీనాక్షి నవ్వుతూ, "లేదు, రేపు మళ్లీ వస్తాను క్లాస్‌కి!" అంటూ వెళ్లిపోయింది.
ఇక ఇంట్లో అందరూ తమ గదుల వైపు వెళ్తుంటే.. మనోజ్, రోహిణి, ప్రభావతి ముగ్గురిని "ఒక్కసారి ఆగండి!" అని మీనా ఆదేశించాడు. వాళ్లు షాక్‌లో నిలబడ్డారు. అప్పుడు మీనా "ఉదయం మీరు ఏం మాట్లాడారో నాకు తెలుసు. మా ఆయన (బాలు) కి నా మీద ప్రేమ లేదని అన్నారా? ఆయన నన్ను కేవలం నాన్న భయంతో చూసుకుంటున్నాడా? నేను కనిపించకపోతే ఎంతగా బాధపడ్డారు తెలుసా? ఉదయం నుండి రాత్రి వరకు నన్ను వెతికారన్న విషయం మీకు అర్థమైందా ?" అని ప్రశ్నల వర్షం కురిపించింది. ముగ్గురికి ఏం మాట్లాడాలో అర్థం కాగా.. సైలెంట్‌గా వెళ్లిపోయారు.
ఇక రాత్రి బెడ్‌రూమ్‌లో బాలు, మీనాలు మాట్లాడుకుంటారు.. "నా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు అలా మాట్లాడావెందుకు?" అని మీనా ప్రశ్నించగా, బాలు "సరదాగా అన్నాను. నువ్వు ఇంత సీరియస్‌గా తీసుకుంటావనుకోలేదు" అని సారీ చెప్పాడు. మీనా చిరునవ్వు చిందిస్తూ "బాలుని గీచి. నొప్పిగా ఉండా ? 'అని తనదైన స్టైల్‌లో జవాబు ఇచ్చింది మీనా. తర్వాత బాలు పోలీస్ స్టేషన్‌లో జరిగిన విషయాన్ని చెబుతాడు. "నిన్ను వెతికే క్రమంలో పోలీస్ స్టేషన్‌కి వెళ్లాను. కానీ అక్కడ నీ తమ్ముడు నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. 'మా అక్క ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి మా బావా కారణం'అని అన్నాడు" అని చెప్పాడు. ఇది విన్న మీనా ఆగ్రహంతో ఊగిపోతుంది. "ఒకసారి ఫోన్ ఇవ్వు, ఇప్పుడే మాట్లాడుతాను వాడితో!" అంటుంది. కానీ బాలు శాంతింపజేస్తూ, "ఇప్పుడు కాదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడుదాం. నేను నీ ఇంట్లో కూడా ఇది చెప్పలేదు, నువ్వు కూడా ఇప్పుడే చెప్పకు" అని చెప్పి ఆపేస్తాడు.
మీనా - తమ్ముడు షాక్ ఫేస్ టూ ఫేస్
మరుసటి రోజు ఉదయం, మీనా తన తమ్ముడు శివను కలవడానికి వెళ్తుంది. అక్కడ గుణ కూడా ఉంటాడు. ఈ ఇద్దరినీ ఒకేసారి చూసిన మీనా ఆగ్రహంతో ఉడికిపోతుంది. "నువ్వు బావ పై కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు? ఎవరు నీ వెనుక ఉన్నారో నాకు తెలుసు!" అని గట్టిగా నిలదీస్తుంది. గుణ వైపు తిరిగి "ఇలాంటి ప్లాన్‌లు మానుకోండి. గతంలో నీలా ఎవరో బాలుని జైల్లో పెట్టాలని భావించాడు. వాడి పరిస్థితి ఇప్పుడు ఏంటో ఒకసారి వెళ్ళి చూడు!" అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. మీనా వెళ్లిపోయాక శివకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది. "నేను ఎందుకు ఇలా చేశాను? నా అక్కను, బావను అనవసరంగా ఇబ్బంది పెట్టేశాను" అని బాధపడుతాడు. కానీ గుణ మాత్రం " మీ అక్క పై ప్రేమతో కాదా నువ్వు చేసేది. " అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు.
రోహిణి - దినేష్ ఎపిసోడ్
ఇక రోహిణి జీవితంలో కొత్త సమస్య. ఆమె షాప్‌కి ఆమె మాజీ ప్రియుడు దినేష్ వస్తాడు. "నాకు డబ్బు కావాలి, లేదంటే నీ ఫర్నిచర్ షాప్ కావాలి!" అంటూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడతాడు. రోహిణి ఎంత చెప్పినా వినడు. కొత్తగా విల్లా కడుతున్నానని చెప్పి, "అందులో ఫర్నిచర్ మొత్తం ఉచితంగా ఇవ్వాలి!" అని వార్నింగ్ ఇస్తాడు. రోహిణి మళ్ళీ భయంతో రెండు లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ సీన్ చూసిన మనోజ్‌కి అనుమానం వస్తుంది. "అంత పెద్ద ఆర్డర్ ఒక్కసారిగా ఎలా వచ్చింది?" అని అడుగుతాడు. రోహిణి మాటలు తడబడుతుంటే, మనోజ్ ఇంకా కోపంగా "క్యాష్ ఇచ్చారా, కార్డు ఇచ్చారా?" అని అడుగుతాడు. రోహిణి నిజం చెప్పలేక "వాళ్లు ప్రత్యేక ఆఫర్ కస్టమర్లు.. వారికి ఈఎంఐ లో ఇచ్చాఅని" అని అబద్ధం చెబుతుంది. దీంతో వారికి గొడవకు జరుగుతుంది. ఇక విసుగెత్తిన రోహిణి తన స్నేహితురాలు విద్యాకు ఫోన్ చేసి, దినేష్ బ్లాక్‌మెయిల్ విషయాన్ని చెబుతుంది. ఇద్దరూ కలిసి దినేష్‌కు గట్టి వార్నింగ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. "ఇలానే వదిలేస్తే రేపు మరొకరిని ఇబ్బంది పెడతాడు. ఈసారి పాఠం నేర్పాలి!" అని విద్యా ధైర్యం చెప్పుతుంది.
ప్రభావతి కొత్త ఆలోచన - డాన్స్ స్కూల్ స్టార్ట్!
ఇవన్నీ జరుగుతున్న సమయంలో ప్రభావతి మాత్రం కొత్త నిర్ణయం తీసుకుంటుంది. "ఇక నేను కూడా ఏమన్నా చేయాలి" అనే ఆలోచనతో క్లాసికల్ డాన్స్ స్కూల్ పెట్టాలని ఫిక్స్ అవుతుంది. "నా చిన్నప్పటి డాన్స్ ప్యాషన్‌ని ఇప్పుడు రియలైజ్ చేసుకుంటా. పేరు 'నాట్యభారతి'గా పెడతా!" అంటూ ఉత్సాహంగా ప్రకటిస్తుంది. ఇంట్లో ఉన్నవారందరూ షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications










