Gunde Ninda Gudi Gantalu October 9th Episode: రోహిణి కుట్ర.. దినేష్ అరెస్ట్.. ప్రభావతి సంచలన నిర్ణయం..

Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ లో మీనా కనిపించకపోవడంతో కలకలం రేగిన ఇంట్లో వాతావరణం ఆమె తిరిగి రాగానే మారిపోయింది. తాను ఆర్డర్ కోసం బయటికి వెళ్లిందని చెప్పినా, ప్రభావతి "పని దొంగ" అంటూ అవమానించడంతో మీనా ఆగలేదు. తనకు వచ్చిన డబ్బులు చూపించి "నేను పని దొంగను కాదు " అంటూ గట్టి సమాధానం ఇచ్చింది. మీనాక్షి కూడా రంగంలోకి దిగి ప్రభావతి, మనోజ్‌లకు క్లాస్ తీసుకుంటూ "ఇంట్లో మనిషి కనిపించకపోతే బాధపడాలి, నిందలు వేయకూడదు" అని హెచ్చరించింది. తరువాత బాలు, మీనా మధ్య భావోద్వేగ సంభాషణ చోటుచేసుకుంది. "నన్ను ఇంత ప్రేమిస్తే అలా మాట్లాడావెందుకు?" అని మీనా అడగగా, బాలు "సరదాగా అన్నాను" అంటూ సారీ చెప్పాడు. అయితే పోలీస్ స్టేషన్‌లో మీ తమ్ముడు నా మీద కంప్లైంట్ ఇచ్చాడని చెప్పడంతో మీనా షాక్ అయ్యింది.

తరువాత రోజు తమ్ముడు శివను కలిసిన మీనా, "నా బావపై ఫిర్యాదు ఎందుకు చేశావు? ఎవరు నీ వెనుక ఉన్నారో నాకు తెలుసు" అంటూ గుణతో పాటు శివను నిలదీసింది. ఇక రోహిణి జీవితంలో కొత్త సమస్య మొదలైంది. మాజీ ప్రేమికుడు దినేష్ బ్లాక్‌మెయిల్ చేస్తూ, రెండు లక్షల రూపాయల ఫర్నిచర్ ఉచితంగా తీసుకెళ్లాడు. దీనిపై మనోజ్‌తో గొడవకు దారి తీసింది. చివరగా రోహిణి, స్నేహితురాలు విద్యాతో కలిసి దినేష్‌కు పాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. ఈ సంఘటనల మధ్య ప్రభావతి క్లాసికల్ డాన్స్ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఇక గురువారం (అక్టోబర్ 9 ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 528 October 9th 2025 here is full story

courtesy: Jiohotstar

వంటింట్లో తోడి కోడళ్లు శృతి , మీనా కబుర్లు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. "నువ్వు నిజంగా గ్రేట్ మీనా! ఇంత కోపం వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంటావు," అంటూ శృతి అప్రిషియేట్ చేస్తుంది. మీనా నవ్వుతూ, "అంటే నువ్వు కంట్రోల్ చేసుకోలేవా?" అని ప్రశ్నించగా శృతి జవాబిస్తుంది "నాకు నీలా ఓపిక లేదు. నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే, ముక్కు మీదే గుద్దుతా!" అంటుంది. మీనా నవ్వుతూ "మరి నేను ఏమైనా అంటే?" అని అడుగుతే, శృతి తన గోర్లు చూపిస్తూ "ఇవి చూసావా ఎలా ఉన్నాయో? రాకుతా!" అంటూ చిలిపిగా స్పందిస్తుంది. అత్తయ్య అంటే "మాటకు మాట, దెబ్బకు దెబ్బ! చెవుల నుంచి పొగలు రావాలి లేదా వాతలు పెట్టాలి" అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తుంది.

ఇవన్నీ దొంగ చాటున వింటూ ఉన్న ప్రభావతి. "నా మీద ఇంత కోపమా ఈ పిల్లకి?" అని మనసులో అనుకుంటుంది. "ఇవ్వాళే వీళ్ళ మధ్య బ్రేక్ వేయకపోతే మరింత దారుణం జరుగుతుంది" అని తలచి వంటింట్లోకి దూరిపోతుంది. ప్రభావతి వంటింట్లోకి రాగానే.. శృతి "అక్కా నాకు ఆఫీస్ టైం అయింది"అంటూ వెళ్లిపోతుంది. శృతి వెళ్ళిన వెంటనే ప్రభావతి మీనాపై మండిపడుతుంది. "నాపై లేనిపోని మాటలు మాట్లాడుతావా? పొగరా, ఇతరులను నా మీద రెచ్చగొడుతున్నావా?" అంటూ తిట్టిపోస్తుంది. మీనా మాత్రం కూల్‌గా "కడుపు మంటగా ఉన్నట్టుంది అత్తయ్య, మజ్జిగ తాగుతారా?" అని నవ్వుతూ అడుగుతుంది. ఏం మాట్లాడాలో తెలియక, ప్రభావతి "టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా" అంటూ వార్నింగ్ ఇస్తూ వెళ్ళిపోతుంది.

ఇంతలో మీనాకు ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ అందుకున్న వెంటనే అర్జెంటుగా బయలుదేరడానికి రెడీ అవుతుంది. వెళ్లే ముందు అత్తమ్మ వద్దకు వెళ్లి "బయటకు వెళ్తున్నా అత్తయ్య" అని మరీ మరీ చెబుతుంది. అలాగే బాలు దగ్గరికి వెళ్లి "టిఫిన్ క్యారేజ్" ఇస్తూ, "నా గురించి అనవసరంగా ఆలోచించకండి. నేను అరుణక్కకు సహాయం చేయడానికి వెళ్తున్నా. వాళ్లు మనకు గతంలో సహాయం చేశారు కాబట్టి నేను ఇప్పుడు వెళ్తున్నా" అని చెబుతుంది. బాలు సైలెంట్‌గా వింటాడు. అతని ఫ్రెండ్ రాజేష్ కూడా భోజనం చేయమని చెప్పి వెళ్ళిపోతుంది మీనా.

ఇదిలా ఉండగా మరోవైపు రోహిణి- విద్య ఇద్దరూ గుణ దగ్గరికి వెళ్తారు."ఎందుకు వచ్చారు?" అని గుణ ప్రశ్నిస్తే, "మాకు సహాయం కావాలి" అంటారు."డబ్బులా?" అని అడగగానే రోహిణి "డబ్బులు కాదు, ఒక వ్యక్తిని బెదిరించాలి"అని అంటారు. "నేను ఫైనాన్స్ చేస్తా, సెటిల్మెంట్స్ కాదు"అని గుణ నిరాకరించగా, రోహిణి "మీ గతం మాకు తెలుసు గుణ. మీరు ఫైనాన్స్‌లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసు.. పోలీస్ స్టేషన్‌లో మీ ఫోటోలు ఉన్నాయి"అని తెలుసు అంటుంది. గుణ నవ్వుతూ "సరేలే బాగానే తెలుసుకున్నారుగా... ఏంటి ఆ పని?" అని అడుగుతాడు. వెంటనే రోహిణి "దినేష్" ఫోటో చూపిస్తూ 'వీడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. దయచేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి'అంటుంది. దీంతో "అవసరమైతే లేపిస్తా" అని గుణ చెబుతాడు. విద్య వెంటనే.. 'వద్దు గుణ.. కేవలం వార్నింగ్ ఇవ్వండి. లేకపోతే కాలో.. చేతో.. విరిచి చేయండి " అని చెబుతుంది.

"మీరు చెప్పాక నేను కాదంటానా?" అంటూ గుణ అంగీకరిస్తాడు. "ఎంత?" అని రోహిణి అడగగానే, "మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? మీరు నా ఫేవరెట్ కస్టమర్స్... ఇది సహాయం మాత్రమే" అని గుణ అంటారు. దీంతో రోహిణి ఆనందంతో నవ్వుతూ "థ్యాంక్సూ గుణ " అంటుంది.
గుణ తన మాట నిలబెట్టుకుంటాడు. దినేష్‌ని ఆఫీసుకు పిలిపించి "బ్లాక్ మెయిల్ చేస్తావా?" అంటూ నేరుగా కొడతాడు. దినేష్ "ఎందుకు కొడుతున్నారు? కారణం ఏమిటి?" అని వేడుకున్నా వినిపించుకోడు. దినేష్ ఎలాగో బయటికి పారిపోతాడు. అయినా గుణ వెంబడిస్తాడు.
ఈ చేజ్‌లో దినేష్ బైక్ మీద వెళ్తూ ఓ ముసలావిడను ఢీ కొడతాడు.

అటుగా వస్తున్న బాలు ఆ సీన్ గమనించి దినేష్‌ని అడ్డుకుంటాడు. "ఇలాంటి వాళ్లకి సెన్స్ ఉండదు" అంటూ మరో నాలుగు చెయ్యి దెబ్బలు కొట్టి పోలీసులకు అప్పజెప్పుతాడు. దినేష్ ను అరెస్ట్ చేసిన ఫోటోలు తీసి రోహిణికి పంపిస్తూ "ఇదిగో నీ బ్లాక్ మెయిలర్ నేను పోలీసులకు అప్పగించాను" అంటాడు. దీంతో రోహిణి తెగ సంతోషపడుతుంది. మనోజ్ ఆ విషయం గమనించి "ఏం జరుగుతుంది రోహిణి?" అని అడుగుతాడు. 'నాపై అనుమానమా?' అని రోహిణి ఎదురు ప్రశ్నిస్తుంది. మనోజ్ సైలెంట్‌ అవుతాడు.

ఇక ఇంట్లో మరో సీన్ - ప్రభావతి, మీనాక్షి మాట్లాడుకుంటున్నారు. 'నాకు గౌరవం రోజు రోజుకి తగ్గిపోతోంది. మీనా వల్ల'అంటూ ప్రభావతి వాపోతుంది. 'ప్రతి ఒక్కడు మీనా గురించే మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అదే మాట అంటున్నావ్!' అని మీనాక్షిని మందలిస్తుంది.
చేతిలో ఉన్న కాపీని తీసుకుని 'ఇక మీ ఇంటికి వెళ్లు.. నీతో పని ముగిసింది'అంటూ కోప్పడుతుంది ప్రభావతి. ఇంతలో మీనా- రోహిణి ఇంటికి వస్తారు. ప్రభావతి వెంటనే మీనాపై మాటల దాడి చేస్తుంది. "ఇలాంటి అమ్మలక్కలకు తాను ఖాళీగా ఉన్నానని చెబుతున్నావా? నీ కస్టమర్స్ వచ్చి నా నెంబర్ అడుగుతున్నారు. నన్ను నీ పని మనిషిలా చూస్తున్నావా?"అని అరిచేస్తుంది.

మీనా కూల్‌గా "మీ దగ్గర నెంబర్ లేదు కదా? 10 అంకెలు చెప్తే చాలు"అంటుంది. దీంతో ప్రభావతి "నా దగ్గర కోటీశ్వరుల నెంబర్లు మాత్రమే ఉంటాయి. నీలాంటి పేదింటి దాని నెంబర్ నాకు అవసరం లేదు!" అంటూ అవమానంగా మాట్లాడుతుంది. పక్కనే ఉన్న మీనాక్షి తట్టుకోలేక "అవునవును ప్రభావతి దగ్గర కోటీశ్వరుల నెంబర్లు ఉంటాయి .. దోమ మందు కొట్టేవాళ్లు, రోడ్లు ఊడ్చేవాళ్లు!" అంటూ సెటైర్ వేస్తుంది.
దీంతో ప్రభావతికి మరింత కోపం వస్తుంది. 'ముందుగా ఆ పూల వ్యాపారం మానెయ్యి'అంటూ మీనాకు వార్నింగ్ ఇస్తుంది. మీనా ప్రశాంతంగా 'ఆ విషయం మీరు కాదు, మా ఆయన చెప్తే చేస్తా'అని కూల్‌గా సమాధానమిస్తుంది.

ఏం చేయాలో తెలియక ప్రభావతి 'ఇక నేను కూడా ఏదో చేస్తా. పార్లర్‌కి వెళ్లి అక్కడ చూసుకుంటా'అని చెబుతుంది. దీంతో రోహిణి షాక్ అవుతుంది. 'ఇది ఎక్కడి దాకా వస్తుందో?'అని ఆలోచిస్తూ 'అత్తయ్య, మీకెందుకు శ్రమ? దర్జాగా ఇంట్లోనే ఉండండి'అని అంటుంది. ' అక్కడికి వద్దు అంటే.. ఫర్నిచర్ షాప్‌లో కూర్చుంటా'అని ప్రభావతి చెప్పగానే మీనాక్షి 'అవునవును, గల్లా పెట్టె ముందు కూర్చోండి!'అంటూ వ్యంగ్యంగా అంటుంది. అవమానం తట్టుకోలేక ప్రభావతి 'నాకు వేరే పని ఉంది. నేనే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. నేను భరతనాట్యం కళాకారిణి - డాన్స్ స్కూల్ పెడతా!'అని గర్వంగా ప్రకటిస్తుంది.

దీంతో అందరూ షాక్ అవుతారు. "డాన్స్ స్కూల్ అంటే?" అని మీనా, రోహిణి ఒకరినొకరు చూస్తారు. ప్రభావతి ప్లేస్ గురించి ఆలోచిస్తూ.. మీనాక్షి ఇల్లు సరిపోతుందని అంటుంది. ముందు మీనాక్షి ఒప్పుకోదు. కానీ, రోహిణి, మీనా లు రిక్వెస్ట్ చేయడంతో అంగీకరిస్తుంది. ఇలా ప్రభావతి తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెడుతుంది. భరతనాట్యం స్కూల్‌తో కొత్త దారిలోకి అడుగేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X