Gunde Ninda Gudi Gantalu October 13th Episode: ఊహించని విధంగా డ్యాన్స్ స్కూల్‌ ప్రారంభం.. కుప్పకూలిన ప్రభావతి.

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్‌లో ప్రభావతి భరతనాట్యం గురువుగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన డ్యాన్స్ స్కూల్ కోసం ఇల్లు అద్దెకు కావాలని మీనాక్షిని అడగగా, మొదట ఆమె నిరాకరించినా చివరికి ఒప్పుకుంటుంది. మరుసటి రోజు ప్రభావతి అందరినీ ఇంటికి పిలుస్తుంది. సత్యం "ఏమైంది ఇంత హడావుడిగా?" అని అడగగా, మీనా "అత్తయ్య కొత్త అవతారంలో కనిపించబోతున్నారు" అని చెప్పడంతో అందరూ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇంతలోనే గజ్జల శబ్దంతో భరతనాట్యం డ్రెస్‌లో ప్రభావతి మెరిసిపోతూ దిగుతుంది. "ఇది నా అసలు స్వరూపం, నాట్యం నా ప్రాణం!" అంటూ సీరియస్ డైలాగ్ విసురుతుంది.

ఆమె లుక్ చూసి అందరూ షాక్ అవుతారు. శృతి "మీరు శ్రీదేవిలా ఉన్నారు" అని పొగడ్తతలో ముంచెత్తుంది. తర్వాతి రోజు డ్యాన్స్ స్కూల్ ప్రారంభోత్సవంలో శృతి తల్లిని ఆహ్వానించలేక సత్యం అసహనం వ్యక్తం చేస్తాడు. అయినా శృతితో దీపం వెలిగింపజేసి రోహిణిని పిలుస్తుంది ప్రభావతి. ఆపై మీనా గురించి వ్యంగ్యంగా మాట్లాడడంతో బాలు కోపంతో "నా భార్యను అవమానించావు!" అంటూ మీనాను తీసుకుని వెళ్లిపోతాడు. సత్యం ఆపడానికి ప్రయత్నించినా, ప్రభావతి "అవసరం లేదు!" అంటూ మళ్లీ తన అహంకారాన్ని ప్రదర్శిస్తుంది. ఇక సోమవారం (అక్టోబర్ 13 ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 530 October 13th 2025
courtesy: Jiohotstar

ప్రభావతి క్లాసికల్ డాన్స్ స్కూల్ ప్రారంభోత్సవంలో మీనాకు ఘోర అవమానం జరుగుతుంది. తన అత్తయ్య కావాలని జ్యోతి వెలిగించకుండా అందులో నుండి వత్తి తీసేస్తుంది. మిగతా కోడలు జ్యోతి వెలిగించారు. కాబట్టి, తన భార్య రిబ్బన్ కట్ చేయాలంటూ బాలు వాదిస్తాడు. 'నాకు నచ్చని వారితో నేను స్కూల్ ఓపెన్ చేయించును'అంటూ ముఖంపైనే చెప్పేస్తుంది. దీంతో బాలు ఆగ్రహం ఊగిపోతాడు. 'అన్ని తీసి పడేస్తా'అంటూ బెదిరిస్తాడు. దీంతో సత్యం కలగచేసుకొని.. 'మన ఇంట్లో లక్ష్మి, పార్వతి, సరస్వతిలాగా ముగ్గురు కోడలు ఉన్నారు. వారందరూ ఒకేసారి కలిసి రిబ్బన్ కట్ చేస్తే సరిపోతుంది'అని సలహా ఇస్తాడు. దీంతో ప్రభావతి చేసేది ఏమీ లేక అయీష్టంగానే స్కూల్ ఓపెనింగ్ చేయిస్తుంది. ఆ తర్వాత సత్యం 'నేనెప్పుడూ నీ నాట్యం చూడలేదు.. ఒక్కసారి చేసి చూపించు'అని రిక్వెస్ట్ చేయగా.. ప్రభావతి తనలోని నాట్యమయూరి బయటకు తీస్తుంది. అదిరిపోయేలా క్లాసికల్ స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

స్కూల్ ఓపెనింగ్ అయిన తర్వాత అందరూ ఇంటికి చేరుకుంటారు. అందరూ కాఫీ కావాలని మీనాను కోరుతారు. మనోజ్ మాత్రం తనకు బ్లాక్ కాఫీ కావాలని ఆర్డర్ వేస్తాడు. 'మీనా పని మనిషి అనుకుంటున్నావా ఏంటి? అందరు తాగేది తాగు 'అని మనోజ్‌కు బాలు చివాట్లు పెడతాడు. ఆ తర్వాత అందరూ ప్రభావతి స్కూల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. 'అమ్మవతి డాన్స్ స్కూల్ పెట్టి పెద్ద సాహసమే చేసింది. వచ్చిన పిల్లలకు డాన్స్ మాత్రమే నేర్పిస్తే బాగుంటుంది. కానీ, ఆస్తి మీద ఆశ, డబ్బు మీద వ్యామోహం. మనుషులంటే వ్యసనం.. నేర్పించకపోతే స్కూల్ సక్సెస్ అవుతుంది' అంటూ సెటైర్ వేస్తాడు. 'బాలు సొంత తల్లిపై ఇలా క్రిటిసైజు చేయడం కరెక్టేనా?'అని శృతి ప్రశ్నిస్తుంది. 'ఇందులో తాను ఏమైనా తప్పుగా మాట్లాడానా?' అని ఎదురు ప్రశ్నిస్తాడు. దీంతో డబ్బుడమ్మా నోరు మూతపడుతుంది.

అమ్మ పెట్టిన స్కూల్ కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకం తనకు ఉందని రవి అనగా.. నా కూడా అమ్మాయి బిజినెస్ లో సక్సెస్ అవుతుంది అని మనోజ్ అంటాడు. 'ఇది బిజినెస్ కాదురా.. ఓ కల.. కలను బిజినెస్ లాగా చూడకూడదు'అని సత్యం చివాట్లు పెడతాడు. 'ఈ డబ్బు బుర్రలకు ఏం అర్థమవుతుంది నాన్న.. ప్రతిదీ బిజినెస్ లాగా చూస్తారు'అంటూ బాలు.. మనోజ్ తలపై ముట్టికాయ వేస్తారు. ' అయినా మనోజ్ చెప్పిన దాంట్లో తప్పేముంది? ఏ కళాకారుడు అయినా డబ్బులు సంపాదిస్తున్నారు కదా'అని మనోజ్ కు రోహిణి సపోర్ట్ చేస్తుంది. 'కరెక్ట్.. కరెక్ట్.. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా'అని మనోజ్ సద్దిచెప్పుకుంటాడు.

'ఇక్కడ డాన్స్ స్కూల్ పెట్టడం తప్ప ఒప్ప కాదు.. తన వయసులో ఇలాంటి ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదు. వయసు మర్చిపోయి చిన్నపిల్లలాగా డాన్స్ చేస్తే ఆరోగ్యం ఏమవుతుందని ఆందోళన పడుతున్నాను'అని సత్యం అంటాడు. దీంతో వెంటనే మీనా రియాక్ట్ అవుతూ.. 'మామయ్య అనవసరంగా టెన్షన్ పడకండి. ఇంట్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. అత్తయ్య కూడా తనకు తెలిసిన విద్యతో డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తుంది.. చేయనివ్వండి మంచిదే కదా..'అంటుంది. 'అంటే అమ్మ ఆరోగ్యం ఏమైనా సరే.. పేరు సంపాదించాలి అంటావా'అని బాలు ప్రశ్నిస్తాడు.. 'అలా అని కాదు ఆమె ఆరోగ్యానికి ఏమైనా అయితే.. చూసుకోవడానికి మనం ఉన్నాం కదా' అని మీనా బదులిస్తుంది. నీలాగా మా అమ్మ కూడా ఆలోచిస్తే బాగుండు'అని బాలు ఫీల్ అవుతాడు. 'సక్సెస్ కావాలని మనం కోరుకుంటే కాదు.. అని ప్రభావతి మనసులో ఉండాలి. ప్రభావతి ఏం చేసినా సగం లోనే విడిచిపెడుతుంది. మరి ఇది ఎక్కడి వరకు వస్తుందో వేచి చూడాలి'అంటూ సత్యం కొండ బద్దలు కొడతాడు.

మరోవైపు ప్రభావతి తన స్కూల్లో వందలాది మంది పిల్లలు జాయిన్ అవుతారని, ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. కానీ, తీరా రియాల్టీ వచ్చేసరికి ఒక పిల్లవాడు కూడా డాన్స్ స్కూల్లో చేరరు. పైగా కరెంట్ బిల్లు వాడు వచ్చి.. ఇకపైనుండి మీరు కమర్షియల్ మీటర్ పెట్టించుకోవాలి. సాధారణంగా కరెంట్ బిల్లుకు మూడు రేట్లు ఎక్కువ బిల్లు వస్తుంది అని పిడుగు లాంటి వార్త చెప్పి వెళ్తాడు. దీంతో మీనాక్షి కంగారుపడుతుంది ఇప్పటికే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని బాధపడుతున్నాం.. ఇప్పుడు మూడు రేట్లు ఎక్కువ కరెంటు బిల్లు వస్తుందట అని దీనంగా ప్రభావతి వైపు చూస్తుంది. టెన్షన్ పడకు వదిన పిల్లలు ఎలాగైనా జాయిన్ అవుతారు.. నేను ఆ కరెంట్ బిల్లు కట్టుకుంటానులే అని ప్రభావతి అంటుంది.

ప్రభావతి ఎంత చూసినా.. ఒక్క పిల్లవాడు కూడా జాయిన్ కాదు.. తర్వాత ఇంటికి వచ్చి బాధపడుతుంది. 'స్కూల్ లో జాయిన్ అవుతారని నమ్మకం లేదు. ఆ ఇంటికి పాలవాడ నీళ్ల వాడు.. కరెంటు వాడు.. ఇలా ఎవరెవరు వస్తున్నారు. కానీ. డాన్స్ నేర్చుకోవడానికి ఎవరూ రావడం లేదు. నేను ఫెయిల్ అయ్యాను. చిన్నప్పటినుండి నేను ఏ పని సరిగా చేయలేదు. ఏ పనైనా మధ్యలోనే విడిచి పెట్టేదాన్ని.. ఇప్పుడు కూడా అలానే ఉంది పరిస్థితి'అంటూ ప్రభావతి బాధపడుతుంది. 'ఇప్పుడే స్టార్ట్ చేశావు కదా.. వస్తారులే బాధపడకు'అని సత్యం ధైర్యం చెబుతాడు. 'మీరు నా బాధ తీర్చలేరు సైలెంట్ గా వెళ్లి పడుకోపోండి'అంటుంది.

ఇంతలోనే మీనా వచ్చి..'మామయ్య తినడానికి రండి'అని మీనా పిలుస్తుంది.. 'సరే మరి మీ అత్తయ్య తిన్నదా ?లేదా? అడుగుతాడు'సత్యం. 'డాన్స్ స్కూల్లో ఎవరు జాయిన్ కాలేదని మధ్యాహ్నం నుండి కనీసం కాఫీ కూడా తాగలేదు. అత్తయ్య చాలా బాధపడుతున్నారు'అని మీనా అంటోంది. 'స్కూల్ ప్రారంభించే ముందు ఎవరైనా జాయిన్ అవుతారా? ఎంత మంది జాయిన్ అవుతారు? ఆ స్కూల్ ఎన్ని రోజులు నడపగలుగుతాం అనేది ముందుగా ఆలోచించాలి కదా.. అవన్నీ ఆలోచించకుండా ఇష్టమున్నట్లు త్వరగా పెడితే ఇలానే ఉంటుంది. ప్రతి పనికి కాస్త ప్లానింగ్ ఉండాలి'అని ప్రభావతికి క్లాస్ పీకుతాడు సత్యం. ఇందులోనే బాలు ఇంటికి చేరుకొని.. 'ప్రభావతి ఏంటి సైలెంట్ గా ఉంది'అంటాడు. 'డాన్స్ స్కూల్లో ఎవరికి జాయిన్ కాలేదు అని అత్తయ్య ఫీల్ అవుతున్నారు మీరు సైలెంట్ గా ఉండండి' అని మీనా అంటుంది.

'ఎవరో నెలకు 40 మంది పిల్లలు జాయిన్ అవుతారు... నెల తిరిగిలోపు రూ. 80,000 సంపాదించి చూపిస్తా'అని సవాల్ విసిరినట్లు ఉన్నారో అని బాలు అగ్గి రాజేస్తాడు. దీంతో ప్రభావతికి మండుతుంది 'నీకు, నీ పెళ్ళానికి స్కూల్లో చేరకపోతేనే సంతోషం కదా.. అంతా మీ వల్లే జరిగింది'అని ప్రభావతి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ బాలుపై రెచ్చిపోతుంది. వెంటనే సత్యం 'స్కూల్ పెట్టేముందు.. ఇక్కడ స్కూల్ నడుస్తుందో? లేదో ?అనే విషయం ముందుగా గమనించాలి. అవన్నీ తెలుసుకోకుండా స్కూల్ పెట్టి.. బాలు, మీనాను అంటే.. ఏం ప్రయోజనం? 'అని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

'అంతా నా తప్పే. ఈ ఊరి వారిని నమ్ముకుని ఇక్కడ స్కూల్ పెట్టడం నేను చేసిన పెద్ద తప్పు.. ఈ ఊర్లో ఎవరికి కళాపోషణ లేదని అర్థమవుతుంది. భరతనాట్యం నేర్చుకోవాలంటే రాసిపెట్టి ఉండాలి . ఈనాట్యం నేర్చుకుంటే వారిది జన్మ ధన్యం అవుతుంది. కానీ ఇక్కడ ప్రజలు తిందామా పడుకున్నామా.. తెల్లారిందా.. అన్నట్లే వ్యవహరిస్తున్నారు.'అంటూ ప్రభావతి తనను తాను తిట్టుకుంటుంది. 'కనీసం కాసింత తిని వెళ్ళండి అత్తయ్య అని మీనా అనగా.. 'నాకు తగిన బుద్ధి చెప్పావు కాదా.. నూనె పోసి వత్తి పెట్టి..'అత్త మీద కోపం దుత్త మీద తీసినట్లు ప్రభావతి వ్యవహరిస్తుంది. దీంతో మీనా తానేం తప్పు చేశానని ఫీల్ అవుతుంది ఇంతటితో నేటి సీరియల్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X