Gunde Ninda Gudi Gantalu October 14th Episode:పోటీపోటీగా అత్తకోడళ్ల డ్యాన్స్.. ప్రాణంపైకి తెచ్చుకున్న ప్రభావతి

courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్‌లో మీనాను ఘోర అవమానం జరుగుతుంది. ప్రభావతి క్లాసికల్ డాన్స్ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతుందని అందరూ భావించారు. కానీ అత్తయ్య కావాలని మీనాకు జ్యోతి వెలిగించే అవకాశం ఇవ్వకుండా వత్తి తీసేయడం అందరినీ షాక్‌కు గురిచేసింది. తన భార్య రిబ్బన్ కట్ చేయాలంటూ బాలు వాదించగా, "నాకు నచ్చని వాళ్లతో నేను స్కూల్ ఓపెన్ చేయించను" అంటూ ప్రభావతి ఓపెన్ గా చెప్పేస్తోంది. దీంతో సత్యం కలుగ చేసుకుని ముగ్గురు కోడళ్లు కలిసి రిబ్బన్ కట్ చేయాలనే సలహా ఇస్తారు. ప్రభావతికి ఆ విషయం నచ్చకున్న అంగీకరిస్తుంది. తర్వాత సత్యం కోరగా ప్రభావతి నాట్యం చేసి అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది.

ఇంటికి చేరిన తర్వాత కాఫీ విషయంలో బాలు-మనోజ్ వాదన తలెత్తింది. ప్రభావతి స్కూల్ గురించి చర్చ మొదలై, బాలు ఆమెను విమర్శించడంతో ఇంటి వాతావరణం మరోసారి ఉద్రిక్తకరంగా మారుతోంది. రోహిణి, మనోజ్‌లు ఆర్థిక కోణం నుండి మాట్లాడగా, మీనా మాత్రం ప్రభావతి ప్రయత్నాన్ని సమర్థించింది. ఇదిలా ఉంటే.. ఎన్నో ఆశలతో ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ప్రారంభించినా ఒక్క విద్యార్థి కూడా జాయిన్ కాలేదు. కరెంట్ బిల్లు పెరిగే షాక్, ఖర్చుల భారం వల్ల ప్రభావతి తీవ్ర నిరాశలో పడింది. "నేను ఏ పని సరిగ్గా చేయలేను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సత్యం ధైర్యం చెప్పినా ఆమె మాట వినలేదు. మీనా భోజనానికి పిలవగానే, ప్రభావతి కోపంతో ఆమెపై విరుచుకుపడింది. "ఈ ఊర్లో కళల విలువే లేదు" అంటూ తన కల నెరవేరకపోవడంపై బాధపడుతుంది. చివరగా అన్నింటికి కారణం మీనా, బాలు అని అసహనం వ్యక్తం చేస్తోంది. నేటీ ( మంగళవారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ లూక్కేయండి.

Gunde Ninda Gudi Gantalu serial episode 531 October 14th 2025
courtesy: Jio hotstar

భారతనాట్యం గురువుగా పేరు తెచ్చుకోవాలని, అందరి కంటే తానే ఎక్కువ సంపాదించాలనే ఆశతో ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ప్రారంభిస్తుంది. అయితే.. తన స్కూల్‌లో ఏవరూ కూడా జాయిన్ కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంది. తన కష్టం అవుతుందనే ఆలోచన ఆమెను క్రమంగా అసహనానికి గురిచేస్తోంది. ఆగ్రహంతో కట్టలు తెంచుకున్న ప్రభావతి, ఇంట్లో వాళ్లనే కాదు ఊరి వారినీ కూడా తిట్టిపోస్తుంది. ఇలా వెళ్తూ వెళ్తూ మీనాను కూడా అవమానపరుస్తుంది. దాంతో మీనా మౌనంగా నిలబడిపోతుంది. ఈ విషయాన్ని గమనించిన సత్యం ఆమెకు మద్దతుగా నిలుస్తాడు. "ఏం పట్టించుకుంటావమ్మా! ఏదో ఆవేశంలో అన్నది" అంటూ మీనాను ఓదారుస్తాడు. అయితే మరోవైపు బాలు మాత్రం తల్లి ప్రవర్తన చూసి చింతలో మునిగిపోతాడు.

"మా అమ్మ చాలా బాధపడుతుంది"అని చెప్పగానే, మీనా "పూలు అమ్మకపోతే నేను కూడా చాలా ఫీల్ అవుతాను" అంటుంది. దాంతో బాలు నవ్వుతూ, "అవును నాకు కూడా ట్రిప్ రద్దయితే తినాలనిపించదు" అని జోక్ చేస్తాడు. కానీ "మా అమ్మ ఒక్కరోజులోనే ఆకాశానికి నిచ్చెన వేస్తోంది. చెట్టు పండ్లు ఇవ్వాలంటే ముందు మొక్క నాటి, నీళ్లు పోసి, కాలం తీసుకోవాలి కదా" అంటూ తన మనసులోని మాట బయటపెడతాడు. దీనికి మీనా స్పందిస్తూ, "మామయ్య ఎంతో చెప్పినా అత్తయ్య వినలేదు. ఇప్పుడు మనం ఏం చేయగలం?" అని అడుగుతుంది. వెంటనే బాలు "నా దగ్గర ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. రేపు అమలు చేద్దాం" అని చెబుతాడు.

మరుసటి రోజు ప్రభావతి తన డాన్స్ స్కూల్‌లో ఒంటరిగా కూర్చుంటుంది. చుట్టూ దోమలు, ఈగలు గుట్టలు కడుతుంటే ఆమె వాటిని తోలుకుంటూ చిరాకు పడుతుంది. ఈ సమయంలో మీనాక్షి వచ్చి, "ఏంటి వదిన, ఈగలు తోలుతున్నావా?" అని అడగగా, ప్రభావతి "బర్రెలు ఎద్దులు తోలుదామని అనుకున్న కానీ అవి లేవు కదా" అంటూ చమత్కారం చేస్తుంది. మీనాక్షి పరిస్థితిని గమనించి, "నువ్వేం టెన్షన్ పడకు వదిన. చీటీ పాట పాడేవాళ్లందరికీ చెప్పాను. వాళ్లు 20 మంది ఉంటారు. ముగ్గురు చొప్పున చేర్చినా 60 మంది వస్తారు" అని గాల్లో లెక్కలు వేస్తుంది. ప్రభావతి నవ్వుతూ "నీ లెక్కలు బాగానే ఉన్నాయి కానీ అది వర్కౌట్ కావాలి కదా!" అని అనుమానం వ్యక్తం చేస్తుంది.

బాలు-మీనా ఎంట్రీ
ఇంతలోనే బాలు, మీనా ఇద్దరూ పండ్లు, పూలతో స్కూల్‌కి వస్తారు. వారిని చూసిన మీనాక్షి ఆశ్చర్యపడి, "ఏంట్రా ఇలా వచ్చారు? ఈ పండ్లు బట్టలు ఎందుకు?"అని అడుగుతుంది. దానికి బాలు, "మేము డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాం" అని బదులిస్తాడు. ఇది విన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. "వాళ్లు నన్ను అవమానించడానికి వచ్చారు" అని అనుకుంటుంది. వెంటనే బాలు, "లేదు గురువుగారు, మేము నిజంగా నేర్చుకోవడానికి వచ్చాము" అంటాడు. కానీ ప్రభావతి నమ్మక, "ఇది కారు తోలడం, పూలమాలలు కట్టడం కాదు. ఇది భరతనాట్యం!" అంటూ క్లాస్ మొదలుపెట్టే ముందు ఓ రేంజ్‌లో స్పీచ్ ఇస్తుంది.

ఇక బాలు నవ్వుతూ, "గురువుగారు, నాటకాలు కాదు.. నాట్యాలు నేర్చుకోవడానికే వచ్చాం!" అని సటైర్ వేస్తాడు. తీరా వారు ఫీజు తీసుకుని వచ్చారనగానే ప్రభావతి కాస్తా చల్లబడుతుంది. మీనాక్షి కూడా, "ఇంత ఆరాటంగా ఫీజు తీసుకుని వచ్చారు, నటరాజ స్వామి చూస్తున్నాడు, ఒప్పుకోకపోతే ఆగ్రహిస్తాడు"అంటూ ప్రభావతిని ఒప్పిస్తుంది. దాంతో ప్రభావతి చివరకు అంగీకరిస్తుంది.

అత్త - కోడలు పోటీగా నాట్యం
నటరాజ స్వామికి ప్రార్థనతో క్లాస్ ప్రారంభమవుతుంది. బాలు మొదట చేసిన స్టెప్పులు చూసి ప్రభావతి నవ్వేస్తుంది. "నీకు తర్వాత నేర్పుతా" అంటూ పక్కకు తోసేస్తుంది. ఇక మీనా ముందుకు రామంటుంది ప్రభావతి, "ఇది సరిగ్గా చూడాలి" అంటుంది. ఇద్దరూ పోటాపోటీగా డాన్స్ మొదలుపెడతారు. ప్రభావతి తన వయసును మరిచి నాట్యమయూరిలా స్టెప్పులు వేస్తూ.. పూర్తిగా మునిగిపోతుంది. బాలు చప్పట్లు కొడుతూ, "మా అమ్మలో అసలైన కళామాత" అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తాడు. కానీ అంతలోనే ఒక అపశృతి జరుగుతుంది. ప్రభావతి ఒక్కసారిగా "అయ్యో నా మెడ!" అంటూ గింజుకుంటుంది.

ప్రభావతి ఏం జరిగిందో బాలు అర్థం చేసుకోడు. "మా అమ్మ నాట్యంలో అంతర్లీనమైంది"అంటాడు. కానీ వెంటనే పరిస్థితి సీరియస్‌గా మారుతుంది. మీనాక్షి, "ఇలా మెడ పట్టేసినప్పుడు నూనెతో మర్దన చేస్తే తగ్గుతుంది. అలాంటి వ్యక్తి నాకు తెలుసు" అంటూ చెబుతుంది. దాంతో బాలు, మీనా ఇద్దరూ ప్రభావతిని ఇంటికి తీసుకువెళ్తారు. ఇంట్లోకి రాగానే సత్యం కంగారుపడతాడు. "ఏమైందీ?" అని అడగగా బాలు నవ్వుతూ, "ప్రభావతి శిలావతిగా మారింది" అంటాడు. మీనా వెంటనే "డాన్స్ చేస్తూ ఉండగా మెడ పట్టేసింది" అని అసలు విషయాన్ని చెబుతుంది.

ఇంతలో రవి శ్రుతి దిగివస్తారు. అత్తయ్య తనకు హాయ్ చెబుతున్నట్టు ఉందని శ్రుతి భావించి, ప్రభావతికి హైపై ఇస్తుంది. దీంతో ప్రభావతి గిరగిరా తిరిగి కిందపడిపోతుంది. అందరూ షాక్ అవుతారు. "ఏంటి మమ్మీ సెంటర్‌లో శిలా విగ్రహంలా నిలబడిపోయింది?" అని రవి ప్రశ్నించగా.. మీనా మళ్లీ వివరిస్తూ, "డాన్స్ చేస్తూ ఉండగా మెడ పట్టేసింది" అంటుంది. దీంతో శృతి నోరుకరుచుకుంటుంది. అంత బాధపడుతున్న ప్రభావతి సైలెంట్ గా ఉండగా.. తన గురించి అందరికీ చెప్పినందుకు మీనాపై మండిపడుతుంది. "నా ఫోటో తీసి వాల్ పోస్టర్‌లా వేయి" అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. "ఇంత జరిగి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ వయసులో ఇలాంటి ప్రయోగాల అవసరమా?" అని సత్యం గట్టిగా మందలిస్తాడు.

ఇంతలో మీనాక్షి తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యురాలిని తీసుకువస్తుంది. ఆమె కొన్ని నూనెలతో మర్దన చేసి, "ఇంకో రెండు సార్లు చేస్తే సెట్ అవుతుంది" అని చెబుతుంది. కానీ మధ్యలో ప్రభావతి తల తూర్పునుంచి పడమరగా తిరిగిపోతుంది. అందరూ హడలిపోతారు. ఈ గందరగోళం మధ్య బాలు తల్లి బాధ చూసి మనస్తాపానికి గురవుతాడు. "నీ వల్లే మా అమ్మ ఇలా అయిపోయింది!" అంటూ మీనాపై ఆవేశంగా మాట్లాడుతాడు. ఆ మాట విన్న మీనా బాధపడుతుంది. ఇలా మరోసారి ప్రభావతి కుటుంబంలో ఉద్రిక్తత నెలకొంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X