Gunde Ninda Gudi Gantalu October 17th Episode: రోహిణి కుట్రను బయటపెట్టిన శ్రుతి.. మనోజ్ పై బాలు దాడి

Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్‌ మలేషియా మామ మాణిక్యం చుట్టూ తిరుగుతుంది. మీనా అనుమానంతో బాలు కూడా డౌట్‌లో పడతాడు. "మాణిక్యం రాజమండ్రిలోనే ఉన్నాడు" అని మీనా చెప్పడంతో బాలు కూడా రోహిణి మీద పాత అనుమానాలు గుర్తుచేసుకుంటాడు. దీనితో రోహిణి కొత్త ప్లాన్ వేస్తూ, "మలేషియా మామ-దుబాయ్ డ్రామా" మొదలుపెడుతుంది. తరువాత రోజు మాణిక్యం వీడియో కాల్‌లో కనిపిస్తూ, "కొనడం, కోయడం... స్మాల్ పీస్, బిగ్ పీస్" అని అనడంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే రోహిణి సర్దుబాటు చేస్తూ 'మామ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారు" అంటుంది. కానీ రవి మాత్రం వదలకుండా ప్రశ్నలు వేస్తాడు. "మీ మీద కేసు ఉందని అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారుగా, ఇప్పుడు ఎలా బయటికి వచ్చారు?" అని అడుగుతాడు. మాణిక్యం "ఇప్పుడు నేను దుబాయ్‌లోనే ఉన్నాను" అని చెబుతాడు. ఇంతలో బాలు వచ్చి "ఎక్కడ ఉన్నావ్ మేక మామ?"అని అడుగుతాడు. మాణిక్యం "నా బ్యాక్ గ్రౌండ్ కనిపించడం లేదా?" అంటాడు. దానికి బాలు "మీ ఫ్రంట్ గ్రౌండ్‌లో పొట్ట మాత్రమే కనిపిస్తోంది" అంటూ సరదాగా సమాధానం ఇస్తాడు. "లైవ్ లొకేషన్ పంపండి"అని బాలు అడగగానే, "ఇక్కడ సిగ్నల్ లేదు" అంటూ కాల్ కట్ చేస్తాడు మాణిక్యం.

అయితే, ఐదు లక్షలు పంపిస్తానని చెప్పడంతో ప్రభావతి ఆనందంతో గంతేస్తుంది. ఇక మీనా మాత్రం గందరగోళంలో పడుతుంది. నేను ఏమైనా పొరపాటు పడ్డానా అనుకుంటుంది. కానీ బాలు మాత్రం "అది ఫేక్ కాల్‌"అని చెబుతాడు. "రోహిణి ఏదో దాచిపెడుతోంది, త్వరలో ఆమె గుట్టు రట్టు చేస్తా" అని ఛాలెంజ్ విసురుతాడు. ఇదిలా ఉండగా రోహిణి, మనోజ్‌ను కన్ఫ్యూజ్ చేస్తూ తన ప్లాన్‌ సక్సెస్ అయిందని విద్యకు చెబుతుంది. మాణిక్యం మాత్రం "ఒక అబద్ధాన్ని దాచడానికి మరో అబద్ధం చెబితే ఎప్పటికైనా దొరికిపోతాం" అని హెచ్చరిస్తాడు. ఇంతలో రవి, శృతి సరదాగా రొమాంటిక్ మూమెంట్ క్రియేట్ చేస్తారు. వారిని చూసి బాలు, మీనా కూడా అదే రీతిగా తిరుగుతారు. హాల్‌లో అందరూ ప్రేమతో గడిపే సన్నివేశంలో ఆకస్మికంగా ప్రభావతి, సత్యం వస్తారు. "ఇది ఇల్లు అనుకున్నారా?" అంటూ మీనాపై ప్రభావతి మండిపడుతుంది. "మీ కంటికి నేనే కనిపిస్తున్నానా? మిగతా వాళ్లు కనిపించడం లేదా?" అంటూ ఘాటైన సమాధానం ఇస్తుంది. దీంతో ప్రభావతి ముఖం ఒక్కసారిగా మాడిపోతుంది. ఇక శుక్రవారం (అక్టోబర్ 17) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 534 October 17th 2025 here is full story

Courtesy: Jiohotstar

'గుండె నిండా గుడిగంటలు'సీరియల్‌లో ఈ వారం ఎపిసోడ్లు మరింత ఉత్కంఠభరితంగా సాగాయి. ప్రభావతి ఇంట్లో ప్రశాంత వాతావరణం మరోసారి గాలికి ఎగిరిపోయినట్టైంది. ప్రభావతి ఇంట్లో మరోసారి బెడ్‌రూమ్‌ విషయంలో గొడవ జరుగుతుంది. కొడుకులు తమ పెళ్లాలను ఎత్తుకుని తిరగడం చూసి ప్రభావతి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. "ఇలాంటివి ఉంటే బెడ్‌రూమ్‌లో పెట్టుకోండి," అంటూ శ్రుతికి సూచిస్తుంది. కానీ శృతి తన తీరే వేరు "ఆ బెడ్‌రూమ్ అగ్గిపెట్టె లాంటిది," అంటూ వెటకారంగా సమాధానమిస్తుంది. ఇదే సమయంలో మీనా కూడా ఆగదు "మీకైనా రూమ్ ఉంది, మాకు ఆ రూమ్ కూడా లేదు కదా?" అంటుంది. దీంతో ప్రభావతి ఒక్కసారిగా మండిపడి, "మళ్లీ రూమ్ గొడవ మొదలుపెట్టారా?" అంటూ మీనా, శ్రుతిపై విరుచుకుపడుతుంది.

ఇదంతా చూస్తున్న రోహిణి చిట్టి మంటకు అగ్గి వేస్తుంది "ఈ వారం రవి-శృతి వంతుగా కదా... అవసరమైతే తన పుట్టింటికి వెళ్తానని శృతి చెప్పింది కదా," అంటుంది. మీనా వెంటనే "అది మాట వరస కదా, నిజంగానే వెళ్ళిపోవాలా?" అంటుంది. ఈ మాటలతో ప్రభావతి మరింత రగిలిపోతుంది. "నువ్వు శృతిని నిజంగానే ఇంటి నుండి పంపించాలని అనుకుంటున్నావా?" అంటూ మీనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. "అలా అనుకుంటే హాల్లో ఎందుకు పడుకుంటాను?" అంటూ మీనా తిరిగి సమాధానం ఇస్తుంది. ఈ సమయంలో మనోజ్ తన రూమ్ఇవ్వాల్సి వస్తుందోనని, "నేను బిజినెస్ మాన్‌ని. మీలా కార్ స్టీరింగ్ తిప్పే వారిని కాదు, దోశను అటు ఇటు వేసే వాడిని కాదు!" అంటూ అన్నదమ్ములను తక్కువ చేసి మాట్లాడతాడు.

దీంతో శృతి ఇక ఆగలేకపోతుంది"నీలా గుడి ముందు మా ఆయన అడుక్కోవడం లేదండి!" అంటూ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇస్తుంది. గొడవ పెరుగుతుండటంతో సత్యం సీరియస్‌గా ఫ్యామిలీ మీటింగ్ పెడతాడు. "ఇక అందరూ సంపాదిస్తున్నారు, ఇంటి ఖర్చుల కోసం ఎవరు ఎంత ఇస్తారు చెప్పండి," అని ప్రశ్నిస్తాడు. ముందుగా మనోజ్‌ను అడుగుతాడు. మనోజ్ "2000 ఇస్తాను" అంటాడు. బాలు వెంటనే "పెద్ద బిజినెస్ మాన్ అంటున్నావ్.. 2000లేనా.. గుడి ముందు అడుక్కునే వాడా!" అంటూ సూటిగా తిట్టేస్తాడు. ప్రభావతికీ కోపం వస్తుంది. "నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావు కదా, 2000 ఏంటి?" అని మనోజ్ ను అంటుంది. దాంతో మనోజ్ బలవంతంగా "మూడు వేలు ఇస్తాను" అంటాడు. కానీ, రోహిణి 8000 ఇస్తానని చెప్పడంతో .. మేము 8000 అంటాడు మనోజ్..

బాలు, రవి ఇద్దరూ 10,000 చొప్పున ఇస్తామని మాట ఇస్తారు. మీనా "కూరగాయల కోసం 2000 ఎక్స్ట్రా ఇస్తాను మామయ్య," అంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దాంతో బాలు "అమ్మ డాన్స్ స్కూల్ పెట్టింది, నెలకు లక్ష సంపాదిస్తుంది, కనీసం 10,000 ఇవ్వాలి!" అంటాడు.
ప్రభావతి మాత్రం చేతులెత్తేస్తుంది. "నేను ఈగలతో, దోమలతో పోరాడుతున్నాను, నాకు వంతు లేదు!" అని. ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ అయిన శృతి "నేను నెలకు 5000 ఇస్తాను," అని చెబుతుంది. తర్వాత శృతి కూడా "10,000 ఇస్తాను" అంటూ తల్లి, మామయ్యను సంతోషపరుస్తుంది.
ప్రభావతి మురిసిపోతుంది. సత్యం మాత్రం కఠినంగా చెబుతాడు"ప్రతి నెల ఐదో తారీకు లోపు డబ్బులు ఇవ్వాలి!". అయితే ప్రభావతి "డబ్బులు నాకు ఇవ్వాలి," అంటుంది. దీంతో వెంటనే బాలు "అన్ని మింగేయడానికి కదా?" అంటూ సెటైర్ వేస్తాడు.

ఇక రాత్రి అన్నదమ్ములు దాబాపై కూర్చుని మాట్లాడుకుంటారు. మనోజ్ తన లెక్కలు చెప్పేస్తాడు "నేను 5000, రోహిణి 8000... మొత్తం 13000. ఏడాదికి లక్షన్నర అవుతుంది. ఈ డబ్బు నాన్న ఏం చేస్తున్నాడు?" అంటాడు. దీంతో బాలు కోపంతో "వాడికి మింగడమే తప్ప ఇవ్వడం తెలియదు!" అంటాడు. ఈ సయమంలో మనోజ్ "వాళ్లు ఈ డబ్బు తీసుకొని ఇంట్లోనుండి వెళ్లిపోతారేమో!" అంటు సందేహం వ్యక్తం చేస్తారు. అప్పుడే బాలు గట్టిగా చెబుతాడు "నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వాళ్లను వెళ్లనివ్వను. మనందరం కలిసి ఉండాలి!".అని అంటారు. దీంతో మనోజ్ మళ్లీ అహంకారంగా "నేను మీ లాగా డ్రైవర్ ను కాదు. నేను బిజినెస్ మాన్‌ని. త్వరలో ఫారెన్ బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తాను!" అంటాడు. దీంతో రవి కూడా కోపం వస్తుంది. "ఏ పని చిన్నది కాదు. శ్రమకు గౌరవం ఇవ్వడం నేర్చుకో!" అన్నకు క్లాస్ పీకుతాడు.

మనోజ్ మరింత ఎగిరిపోతాడు. "నేను చదువుకున్నవాడిని, నా మామయ్య నాకు లక్షలు ఇచ్చాడు. నీ అత్తగారు నీకు పూల గంపలు ఇచ్చారా?" అని బాలుని రెచ్చగొడుతాడు. దీంతో బాలు కోపం కట్టలు దాటుతుంది "నువ్వు కష్టపడి సంపాదించావా?" అంటూ మనోజ్‌పై దాడి చేస్తాడు.
రవి ఆపడానికి ప్రయత్నిస్తాడు కానీ గొడవ పెద్దదవుతుంది. రవి కూడా హెచ్చరిస్తాడు "ఇకమీదట మీనా వదిన గురించి మాట మాట్లాడితే నేనే కొడతాను!" అని వార్నింగ్ ఇస్తాడు.

మరోవైపు కిచెన్‌లో మీనా, శృతి మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి కూడా అక్కడికి వస్తుంది. "ఏం మాట్లాడుకుంటున్నారు?" అని అడుగుతుంది. "మేమంతా ఒకే కుటుంబం అని అనుకున్నాం, అంతలో నువ్వు వచ్చావు " అని శృతి సెటైర్ వేస్తుంది. దాంతో రోహిణి మండిపడుతుంది. "అంటే నేను కుటుంబం కాదా?" శృతి స్మైల్ చేస్తూ "ఆ సమాధానం నీకే తెలుసు!" అంటుంది. తర్వాత రోహిణి పూల వ్యాపారంపై వెటకారం చేస్తుంది. "లక్షల లాభాలు వస్తున్నాయా?" అని అడుగుతుంది. దీంతో మీనా కూడా వెనుకాడదు "లాభం వస్తే ఏమవుతుంది?" అంటుంది. రోహిణి "మామయ్యకు 2000 ఎందుకన్నావ్?" అని గుచ్చుతుంది. శృతి వెంటనే కౌంటర్ ఇస్తుంది "అలాగైతే నువ్వు అత్తయ్యకు 5000 పాకెట్ మనీ, మలేషియా చీర గిఫ్ట్ ఇచ్చావ్. అది కూడా మెప్పు పొందడానికా?"అని అడుగుతుంది. దీంతో రోహిణి తడబడిపోతుంది. "మేము సంపాదించే వాళ్ళం కాబట్టి ఇస్తున్నాం!" అంటుంది. దీంతో మీనా సైలెంట్‌గా "గుడ్డు పెట్టే కోడి లేని నొప్పి, ఆమ్లెట్ తినేవాళ్లకు ఎందుకో?" అంటూ దిమ్మతిరిగే డైలాగ్ ఇస్తుంది. రోహిణి ముఖం వాడిపోతుంది, ఆగ్రహంతో కిచెన్‌ విడిచి వెళ్తుంది.

తర్వాత బాలు కిచెన్‌లోకి వచ్చి "నాకు స్ట్రాంగ్ టీ ఇవ్వు" అంటాడు. మీనా ముఖం మాడిపోవడం గమనించి "ఏమైంది?" అని అడుగుతాడు.
మీనా "రోహిణి వచ్చి డబ్బుల మీద తక్కువ చేసి మాట్లాడింది" అంటుంది. బాలు "మనోజ్ కూడా అలాగే మాట్లాడాడు, అందుకే రెండు నాలుగు కొట్టేశా!" అని చెబుతాడు. ఇద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధం, ఆత్మీయత మరింత బలపడుతుంది. మరుసటి రోజు శృతి అమ్మ శోభ ఫోన్ చేస్తుంది "దీపావళికి నిన్ను అల్లుడితో ఇంటికి రమ్మా!" అని ప్రేమగా చెబుతుంది. శృతి "తప్పకుండా వస్తాం" అంటుంది కానీ బాలు "ఈసారి అందరం ఇక్కడే జరుపుకుందాం!" అని అంటాడు. దీంతో ప్రభావతి వెటకారంగా "అత్తగారింట్లో పండుగ జరుపుకోలేరు కాబట్టి ఇక్కడే కదా!" అని అంటుంది. మీనా మాత్రం ఒక్కసారిగా కౌంటర్ ఇస్తుంది. "మేము పుట్టినప్పటి నుండి మీ దయదక్షిణాన బతుకుతున్నాం కదా! మీరు పూల కొట్టు పెట్టిస్తేనే మేము బతుకుతున్నాం!" దీంతో ప్రభావతి నిశ్శబ్దమై, మాట రాకుండా తలదించుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X