Gunde Ninda Gudi Gantalu October 21th Episode: లవర్ ట్రాప్‌లో రోహిణీ.. మీనా కిడ్నాప్.. ప్రమాదంలో బాలు
courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ లో దీపావళి పండుగ సమీపిస్తుండగా ప్రభావతి ఇంట్లో ఆనందం నెలకొన్న, ఆ ఆనందం వెనుక చిన్న మాటల గొడవలు పెద్ద సమస్యలుగా మారి కుటుంబంలో ఉద్రిక్తతలు కలిగిస్తాయి. ప్రభావతిపై మీనా చురకలు విసురుతూ ఉండగా, సత్యం "శభాష్"అని మెచ్చుకుంటాడు. అత్తయ్యకి ఇలా చురకలు అంటించకపోతే.. సమస్యలు వస్తాయని హెచ్చరిస్తాడు. ప్రతీ విషయంలో మీనాను టార్గెట్ చేస్తూ.. ప్రభావతి వ్యవహరించే తీరుతో మాటల యుద్ధం జరుగుతుంది. బాలు, ప్రభావతి, మీనా మధ్య ఉద్రిక్త వాదనలు కొనసాగుతాయి. తదుపరి పండుగను అందరితో సంతోషంగా జరుపుకోవాలని సత్యం సూచిస్తాడు. మీనా కూతురు మౌనికకు ఫోన్ చేస్తుంది, కానీ మౌనిక రాముకు ముంబై మీటింగ్ కారణంగా రావడం రద్దు అవుతుంది. ఈ సంఘటన ప్రభావతిని నిరాశకు దారితీస్తుంది.
తదుపరి రోజు సత్యం ఇంటికి బిల్డర్స్‌ను పిలిచి కొత్త రూమ్ కొలతలు వేస్తాడు. ఐదు లక్షల రూపాయల ఖర్చు తెలుసుకున్న ఇంటి సభ్యులు షాక్ అవుతారు. ప్రభావతి అప్పు తీసుకోవడం ఇష్టపడదు, బాలు రూమ్ అవసరం లేదని చెబుతాడు. బాలుని తక్కువగా చూసిన ప్రభావతికి మీనా సవాల్ చేస్తుంది. ముగ్గురు కోడళ్లకు సమానంగా చీరలు, బట్టలు ఇవ్వడం ద్వారా సత్యం తారతమ్యం లేకుండా నిర్ణయం తీసుకుంటాడు. ప్రభావతి, రోహిణి మాత్రం అసూయ పడుతారు. కానీ చివరికి అందరూ కొత్త బట్టలలో, ముగ్గులు వేసి, పటాసులు పేలుస్తూ దీపావళిని ఆనందంగా జరుపుకుంటారు. అయినప్పటికీ, ఆ సంతోషం వెనుక గత గొడవల వల్ల కొంత ఉద్రిక్తత ఇంకా మిగిలి ఉంటుంది. ఇక మంగళవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

ఇక సోమవారం ఎపిసోడ్ లో ప్రభావతి ఇంట్లో దీపావళి సంబరాలు ప్రారంభం అవుతాయి. ప్రభావతి పూజ చేస్తుండగా కొడుకులు, కోడళ్ళు వచ్చి పూజలో పాల్గొంటారు. అనంతరం వారంతా ప్రభావతి, సత్యం ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తరువాత కుటుంబ సభ్యులంతా పిండివంటలు, డెకరేషన్ వంటి పనులలో బిజీబిజీగా మారతారు. ఈ క్రమంలో మీనా పాయసం తీసుకొని వస్తోంది. ఆ పాయసం తిన్న సత్యం తన అమ్మను గుర్తు చేసుకుంటారు. బాలు కూడా అచ్చం షీలా డార్లింగ్ చేసిన విధంగా పాయసం చేసిందంటూ మీన ను పొగడ్తలతో ముంచెత్తుతాడు. అయితే ముందుగా పాయసం తినడానికి ఇష్టపడని మనోజ్ ఆ తర్వాత దొంగ చాటున మింగేస్తాడు. ఇందులోనే శృతి తన డబ్బింగ్ కంప్లీట్ చేసుకుని కిందికి వస్తుంది. గ్రాంథిక భాషలో మాట్లాడుతూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంది.
'ఏంటి అలా మాట్లాడుతున్నావ్' అని మీనా అడగగా.. ఇప్పటివరకు తాను నరకాసుర వధ అనే స్పెషల్ ఎపిసోడ్ కు డబ్బింగ్ చెప్పానని, ప్రతి సీరియల్ లో మగవారు హీరోగా ఉంటే,, ఇందులో సత్యభామ హీరోయిన్ అంటూ చెబుతుంది. వెంటనే సత్యం కలగజేసుకొని.. 'అవును.. ఆడవారు మగవారు సమానమని చెప్పడానికే శ్రీకృష్ణుడు సత్యభామతో యుద్ధం చేపించాడు'అని చెప్పుకోవచ్చు. 'అంటే మీనా కూడా సత్యభామ లాంటిదే.. సత్యభామ బాణాలు వేస్తే.. మీనా ఇటుకలు వేస్తుంది' అంటూ బాలు సెటైల్ ఇస్తాడు. ఇందులోనే మీనాకు ఫోన్ రావడంతో బయటికి వెళుతుంది. విద్య ఫోన్ చేసి.. తన ఇంట్లో దీపావళి ఫెస్టివల్ జరుపుకుంటున్నామనీ, కచ్చితంగా పూలు తీసుకు రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో మీనా కాదనలేక పోతుంది. ఈ విషయాన్ని గమనించి బాలు కూడా వెళ్లు ఇంట్లో చూసుకుంటానని భరోసా ఇస్తాడు.
మరోవైపు రోహిణికి దినేష్ కాల్ చేస్తూ ఉంటాడు. కానీ, రోహిణి మాత్రం కట్ చేస్తూ ఉంటుంది. దినేష్ వేరే నెంబర్ నుండి ఫోన్ చేయగా అది కస్టమర్ నెంబర్ కావచ్చు అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. 'ఏంటి ఫోన్ కట్ చేస్తున్నావ్'అని ప్రశ్నించగా.. 'నీకు ఇదే పనా ఆడపిల్లలను హింసించి వేధిస్తున్నావ్.. ఇలా పైసలు వసూలు చేయడం కరెక్టేనా?' అని రోహిణి ప్రశ్నిస్తుంది. 'నువ్వు సుద్దపూసలాగా మాట్లాడుతున్నావ్.. నువ్వు చేసేవన్నీ కరెక్టేనా?'అని దినేష్ తిరిగి ప్రశ్నిస్తాడు. దీంతో రోహిణికి కోపం వస్తుంది. 'పోలీసులతో కొట్టించినా.. గుండాలతో కొట్టించినా.. నీకు ఇంకా బుద్ధి రాలేదా?' అంటూ మాట జారుతుంది. దీంతో దినేష్ అనుమానం క్లియర్ అవుతుంది. 'నన్నే కొట్టిస్తావా ? నీకు కచ్చితంగా పెనాల్టీ వేయాల్సిందే.. లక్ష రూపాయలు కావాలి'అని డిమాండ్ చేస్తాడు.
కానీ రోహిణి మాత్రం తన దగ్గర ఒక్క రూపాయి లేదని ఇప్పటికే అప్పుడు చేశానని వాపుతోంది. తనకు డబ్బులు ఇవ్వకపోతే 'ఇదే మీ అత్తగారింటికి లో జరుపుకునే చివరి దీపావళి. మీ ఇంటికి వచ్చి మీ సంసారాన్ని ముక్కలు ముక్కలు చేస్తా' అంటూ దినేష్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో రోహిణి ఎక్కడికైనా సంసారం ముక్కలవుతుందోనని బాధపడుతుంది భయపడుతుంది. దీంతో వెంటనే విద్యను కలవాలని భావిస్తుంది. ఈ క్రమంలో బయటికి రాగానే.. దినేష్ మనుషులు రోహిణి ఫాలో అవుతూ ఉంటారు.
ఇదిలా ఉంటే శృతి వాళ్ళ అమ్మ శోభ ఫోన్ చేసి 'పండుగకు ఇంటికి రారా?' అని ప్రశ్నిస్తుంది. తాను ఇక్కడనే అందరితో కలిసి దీపావళి పండగ జరుపుకోవాలని భావిస్తున్నారని శృతి చెపుతుంది. 'అంటే పండుగకు రారా.. అప్పుడే మేమేం బోర్ వచ్చామా? 'అని శోభ ఏదో మాట్లాడుతుంది. 'ఇప్పుడిప్పుడే అన్ని గొడవలు క్లియర్ ప్రశాంతంగా ఉంటున్నాం.. పండుగ వైబ్ లోకి వచ్చాం.'. అంటుంది శృతి. గొడవ ఏంటి అని ప్రశ్నించగా.. 'బాలు మీనాలకు రూమ్ కట్టించాలని, ఎందుకు ఐదు లక్షలు ఖర్చు అవుతుంది. అందరం డబ్బులు వేసి రూమ్ కట్టాలని ఫిక్స్ అయ్యాం' అంటూ అసలు విషయాన్ని చెప్తుంది. దీంతో శోభ మరోసారి బాధ దీంట్లో గొడవ పెట్టడానికి కారణం దొరికిందని సంతోషపడుతుంది.
మరోవైపు రోహిణి సహాయం కోసం విద్యా ఇంటికి చేరుకోగా.. దినేష్ మనుషులు ఆమెను ఫాలో అవుతారు. ఇంతలోనే మీనా కూడా పువ్వులు పట్టుకుని విద్య ఇంటికి వెళుతుంది. రోహిణి కూడా అక్కడే ఉండడంతో మీనా షాక్ అవుతుంది. 'నువ్వేంటి ఎక్కడున్నావ్ఝ' అని ప్రశ్నించగా .. 'నేనే డెకరేషన్ చేయడానికి రమ్మన్నాను అంటూ కవరింగ్ చేసేంది విద్య. సరే అని మీనా పూలు ఇచ్చి వెళ్తుంది. ఇంతలోనే బాలు ఫోన్ చేసి త్వరగా రమ్మని చెబుతాడు. 'ఇప్పుడే పూలు ఇచ్చి.. వస్తున్న దారిలో ఉన్న అని బదిలిస్తుంది మీనా.. అయితే రోహిణి, మీనా ఇద్దరు రెడ్ కలర్ సారీ కట్టుకోవడంతో రౌడీలు కన్ఫ్యూజ్ అవుతారు. దీంతో రోహిణికి బదులు మీనా ను కిడ్నాప్ చేస్తారు.
సడన్ గా మీనా అరవడంతో.. బాలు కంగారు పడతాడు. మీనా ఏదో ప్రమాదంలో పడిందని అర్థం చేసుకొని వెంటనే విద్య ఇంటికి చేరుకుంటాడు. అక్కడ పరిస్థితిని గమనిస్తాడు. మొదట విద్య ఇంట్లోకి వెళ్లి అడగగా.. మీనా అప్పుడే వెళ్లిందని చెప్పడంతో బాలు కంగారు పడతాడు. మీనాకు ఫోన్ చేసి చూడగా.. ఫోన్ రోడ్డుపై మోగుతుంది. దీంతో బాలు అనుమానం మరింత పెరుగుతుంది. ఇక అప్ కమింగ్ ఎపిసోడ్లో బాలు మీనాను కాపాడే ప్రయత్నం చేయడం. వారి చేతుల్లో బాలు దెబ్బలు తినడం. దీంతో మీనా సత్యభామ పోరాటం చేయడం, ఆ విషయాన్ని రోహిణి చూసి భయపడడం చూడవచ్చు.


Click it and Unblock the Notifications










