Gunde Ninda Gudi Gantalu October 24th Episode: శోభ అహంకారం.. సత్యం ఆత్మాభిమానం..బాలుపై చేయి చేసుకున్న తండ్రి..

Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు గురువారం ఎపిసోడ్‌లో రోహిణి భయంతో వణుకుతుంది. తన రహస్యం ఎక్కడ బయటపడిందేమోనని ఆందోళన చెందుతుంది. ప్రభావతి, మనోజ్ వరుస ఫోన్లు చేయడంతో ఆమె మనసు గజిబిజిగా మారుతుంది. విద్య ధైర్యం చెబుతూ "నిజం దాచడం కంటే ఎదుర్కోవడం మంచిది" అని సలహా ఇస్తుంది. ఇదే సమయంలో ప్రభావతి ఇంట్లో దీపావళి పూజ ఏర్పాట్లు జోరుగా జరుగుతుంటాయి. కానీ మీనా కనిపించకపోవడంతో ప్రభావతి చిరాకు చెందుతుంది. "బాలు, మీనా ఎక్కడ? పని తప్పించుకోవడానికి వెళ్లిందేమో" అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతుంది. కొద్దిసేపటికి బాలు, మీనా ఇంటికి వస్తారు. ప్రభావతి రోహిణి ఫోన్‌ ఎత్తకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తుంది. సత్యం "రోహిణి పెద్దింటి కోడలు కాబట్టి ఆగుతున్నావా?" అని అడగడంతో బాలు గట్టిగా "అన్ని కోడళ్లు సమానమే" అని చెబుతాడు.

అంతలోనే రోహిణి టెన్షన్‌తో ఇంటికి చేరుతుంది. ప్రభావతి పరోక్షంగా ఆమెపై విమర్శలు చేస్తాడు. దాంతో మనోజ్, బాలు ఇద్దరూ కౌంటర్లు ఇస్తారు. చివరకు సత్యం "పండగ పూట గొడవ వద్దు" అని సీన్‌ కూల్‌ చేస్తాడు. తరువాత రోహిణి భయం ఇంకా తగ్గదు. బాలు, మీనా రూమ్‌లో మాట్లాడుతుండగా ఆమె దొంగగా వింటుంది. "అసలు విషయం చెప్పేస్తాను" అన్న బాలు మాట విని ఆమె గుండె ఆగిపోతుంది. కానీ మీనా అసలు విషయం చెప్పడంతో రోహిణి ప్రాణం తిరిగి వస్తుంది. పూజ సమయంలో ప్రభావతి మీనాను దూరం పెట్టి రోహిణితోనే దీపం వెలిగించమని చూస్తుంది. "కావాలనే మీనాను పూజలోంచి తొలగిస్తున్నావా?" అని బాలు నిలదీస్తాడు. చివరికి అందరూ కలిసి పూజ చేస్తారు. సత్యం మాత్రం తన కూతురు మౌనికను గుర్తుచేసుకుని బాధపడుతుంటాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 539 October 24th 2025

ఇంతలో కొత్త ట్విస్ట్‌గా శృతి తల్లి శోభ ఎంట్రీ ఇస్తుంది. "నా కూతుర్ని పిలవలేదు, అందుకే నేనే వచ్చాను" అంటూ ఇంట్లోకి అడుగుపెడుతుంది. "ఇంత ఇరుకైన ఇంటిలో ఎలా ఉంటున్నారు? బెడ్‌రూమ్ గొడవల వార్తలు విన్నా..." అంటూ వెటకారం చేస్తుంది. తర్వాత తన పొగరుతో "మా భర్త లోన్ ఇచ్చారు కనుకనే ఈ ఇల్లు ఉంది" అని అవమానిస్తుంది. "పై అంతస్తు కట్టాలనుకుంటున్నారని విన్నా, నా వంతుగా ఐదు లక్షలు ఇస్తున్నాను" అంటూ చెక్కు ఇస్తుంది. ప్రభావతి తీసుకోవాలని చూస్తుంది. కానీ, బాలు "తీసుకోండి అమ్మ, శృతి వాళ్ల అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉంటారు." అంటూ వెటకారం చేస్తాడు. ఆ తర్వాత అసలు నిజం చెబుతూ "మీ భర్త లోన్ ఇవ్వలేదు, నేను వేరే బ్యాంకులో తెచ్చుకున్నాను" అని షాకింగ్‌ రివీల్‌ చేస్తాడు. దీంతో శోభ ముఖం చిన్నబోతుంది, ఇక శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

courtesy: Jiohotstar

నేటీ ఎపిసోడ్ శృతి తల్లి శోభ ఇచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కు చుట్టూ తిరుగుతుంది. శోభ తనకు డబ్బు ఉందనే అహంకారంలో ఇచ్చిన ఆ చెక్కు, సత్యం ఆత్మాభిమానానికి తాకింది. "నాకు మీ సహాయం అవసరం లేదు. నేను ఆర్టీసీ లోన్ తీసుకోలేదు. మీ ఆయన లోన్ ఇప్పించలేదు. మీ భర్త నాకు సర్వీస్ సర్టిఫికెట్ కోసం రెండు నెలలు నా చుట్టూ తిరిగించాడు. చివరికి నేను పై ఆఫీసర్‌కి ఫోన్ చేయకపోతే సర్టిఫికెట్‌ కూడా ఇవ్వలేదు" అంటూ సత్యం ఆగ్రహంతో అసలు విషయాన్ని బహిర్గతం చేస్తాడు. తన కష్టంతో ఇల్లు కట్టుకున్నానని, ఇంకా రూమ్ కూడా తానే కట్టుకుంటానని సత్యం స్పష్టం చేస్తాడు. "నాకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు ఉన్నారు. మేమంతా కలిసిన కట్టుకుంటాం, ఎవరి దయ దక్షిణ్యాలు మాకు అవసరం లేదు" అని గర్వంగా చెబుతాడు.

సత్యం మాటలకు శోభ సైలెంట్‌గా ఉండదు. "ఆరుగురు కలిసిన రూమ్ కట్టలేరు, మేమే ఇవ్వాలనుకుంటున్నాం" అంటూ పొగరుగా మాట్లాడుతుంది. దాంతో బాలు రియాక్ట్ అవుతూ, "మీ ఉదార బుద్ధికి జోహార్లు! మాటిమాటికి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. మీరు మా నాన్నను అవమానించడానికి ఆ చెక్కు తెచ్చారనే మాకు తెలుసు!" అని చెబుతాడు. శృతి వెంటనే "అలా కాదు బాలు, అమ్మ మంచి మనసుతో ఇస్తోంది" అని చెబుతుంది. కానీ బాలు "చందా తీసుకోమంటావా? అదే డబ్బుతో మీకే బంగ్లా కట్టించి ఇవ్వమను. కానీ చెక్కు ఇచ్చి మమ్మల్ని తక్కువగా చూడడం నచ్చదు" అని స్ట్రాంగ్‌గా చెబుతాడు.

రవి ఈ వ్యవహారంలో మధ్యలోకి వచ్చి, "నాన్న మాట్లాడుతుంటే నువ్వెందుకు?" అని బాలును ప్రశ్నిస్తాడు. దీంతో బాలు మరింత కోపంతో, "లేచి వెళ్ళిపోయినోడా.. మీరు మాటలతో మమ్మల్ని తక్కువ చేయాలనుకుంటున్నారు. సిగ్గు ఉందా? తంతే ఎగిరిపడుతావ్ అని వార్నింగ్ ఇస్తాడు బాలు. శృతి "ఇప్పుడు పండగ పూట ఈ గొడవ ఎందుకు?" అని పరిస్తితిని సర్దుమనిగేనా చేయాలని ప్రయత్నిస్తుంది కానీ పరిస్థితి ఆగదు. శోభ మరోసారి సత్యంను తక్కువ చేసి మాట్లాడుతూ "మీ మామయ్య లోన్ లేకుండా ఇల్లు కట్టలేదు. ఇంకో 10 ఏళ్లయినా మీరు రూమ్ కట్టలేరు!" అంటూ హేళన చేస్తుంది.

ఈ మాటలకు బాలు ఆగ్రహంతో శోభ వైపు దూసుకెళ్తాడు. "లంచాలు తీసుకొని మీ ఆయన కోటీశ్వరుడు అయ్యాడు. మా నాన్న కష్టపడి ఈ ఇల్లు కట్టాడు. మీకు మాకు పోలికేంటి?" అని గట్టిగా అంటాడు. శోభ "నన్ను కొడతావా?" అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో బాలు "ఆడదానివి కాబట్టి ఊరుకున్నా, లేకపోతే ఇంకోలా ఉండేది. మా ఇంట్లో నుంచి వెళ్లిపోండి.. లేదా నేను మెడలు పట్టి గెంటేస్తా " అని వార్నింగ్ ఇస్తాడు.

ఇంతలో సత్యం ఆగిపోమని, బాలు పైకి చేయి వేస్తాడు. "ఆమె మీ తమ్ముని అత్తగారు. ఆమెతో ఇలా మాట్లాడాలా?" అంటూ మందలిస్తాడు. దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. బాలు కన్నీళ్లతో సైలెంట్ అవుతాడు. తర్వాత సత్యం శోభ(శృతి తల్లి) వైపు తిరిగి, "మీ పెద్దమనసుకు నమస్కారం. కానీ మేము అడుక్కునే స్థితిలో లేం. మీ దగ్గర లక్షలు ఉంటే మీ కుతూరుకు పెట్టుకోండి. మా రవికి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు" అని చెబుతాడు. "దయచేసి ఇక వెళ్లిపోండి" అంటూ దండం పెడుతాడు. శోభ అవమానంతో, "నన్ను గంటేస్తారా? బాలు లాంటి వాడిని సరిగా పెంచలేదు!" అంటూ వెళ్ళిపోతుంది.

ఇది విన్న ప్రభావతి రగిలిపోతుంది. "ఇంటికి వచ్చిన వారిని కూడా అవమానిస్తున్నావా?" అని బాలుపై మండిపడుతుంది. రోహిణి, "రవి, శృతి లను ఇంటి నుండి పంపించాలనుకుంటున్నావా?" అని ప్రశ్నిస్తుంది. మనోజ్ కూడా రహస్యంగా ఆ రూమ్‌ని తానే తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని అంటాడు. శృతి కూడా బాలును తిట్టుతుంది "ఇంట్లో భార్యకు గౌరవం ఇవ్వని వాడు బయట ఎవరికీ మర్యాద ఇస్తాడు?" అని అంటుంది. రవి కూడా బాలుపై విరుచుకుపడుతూ, "నువ్వు ఎందుకు మాట్లాడవు?" అని అంటాడు. సత్యం అన్నీ విని, "చాలు!" అని గట్టిగా అరుస్తాడు.

"నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాటలు విన్నాను. నేనే కష్టపడి ఇల్లు కట్టించా. కానీ మీ అమ్మ ఇప్పటికీ ఈ ఇల్లు తనదే అంటుంది. పెళ్లాం పుట్టింటి నుండి తీసుకువచ్చిన ఆస్తి పాపం అనిపిస్తోంది" అని ఆవేదనతో చెబుతాడు. తన కష్టాన్ని తక్కువ చేసినందుకు బాధపడుతూ, "కాలం ఎలా చెబితే అలా జరుగుతుంది" అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతాడు.

రవి, శృతి తమ రూమ్‌లో మాట్లాడుకుంటారు. శృతి "బాలు మా అమ్మను ఘోరంగా అవమానించాడు" అని బాధపడుతుంది. రవి మాత్రం "నీ అమ్మ కావాలనే మమ్మల్ని అవమానించాలనుకుంది. మన పరిస్థితి తెలిసి డబ్బు ఇచ్చి తక్కువ చేయాలనుకుంది" అని చెబుతాడు. ఆ మాటలతో శృతి కాస్త తడబడుతుంది. "అయినా బాలు మాట్లాడిన తీరు సరిగా లేదు" అని అంటుంది. రవి "ఇకపై కుటుంబ విషయాలు బయట చెప్పేముందు నాతో ఒకసారి మాట్లాడి నిర్ణయించు" అని సూచిస్తాడు.

మరోవైపు బాలు తండ్రి తనపై చేయి వేసాడని బాధతో మందు తాగేస్తాడు. తన స్నేహితుడు రాజేష్ దగ్గర కూర్చుని బాధ పంచుకుంటాడు. "శృతి వాళ్ల మమ్మీ డబ్బు ఇచ్చి పొగరు చూపించింది. నా నాన్న నన్ను కొట్టాడు" అని బాధపడతాడు. రాజేష్ అతనిని ఓదారుస్తూ, "నీ నాన్న నిన్ను కోపంతో కొట్టలేదు. నువ్వు హద్దు దాటుతావో అని ఆపాడు. ఆయనకు నువ్వంటే ప్రేమ ఉంది" అని చెప్పి సమాధానపరుస్తాడు.
దాంతో బాలు కాస్త చల్లబడతాడు. ఇంటికి బయలుదేరుతాడు.

మరోవైపు మీనా ధాబా పైకెక్కి ఏడుస్తూ ఉంటుంది. "నా భర్తను ఎవరూ అర్థం చేసుకోవడంలేదు. అంతా అతనినే తప్పుపడుతున్నారు" అని బాధపడుతుంది.
సత్యం అక్కడికి వచ్చి, "మీ నాన్న మీద కోపమా?" అని అడుగుతాడు. మీనా, "మీరు ఆయన తండ్రి. కొడుకును మందలించడం ప్రతి తండ్రి హక్కు. కానీ అందరి ముందు కొడితే భార్యకి కూడా బాధే కదా" అని తాత్వికంగా చెబుతుంది. సత్యం "నిజం. నా చేతకానితనం వల్ల కొట్టాల్సి వచ్చింది. కానీ నా హద్దు దాటిపోతాడేమోనని భయపడ్డాను" అని మనసు విప్పి చెబుతాడు.

ఇంతలో బాలు ఇంటికి వస్తాడు. మీనా "ఏమైనా తిన్నావా?" అని అడుగుతుంది. తన సైలెన్స్ మధ్య బాలు తూలిపడి కిందపడబోతాడు. వెంటనే సత్యం పరుగెత్తి తన కొడుకును పట్టుకొని లేపుతాడు. "ఏం రా? తిన్నావా? నామీద కోపమా?" అని మృదువుగా అడుగుతాడు. బాలు "అదేం లేదు నాన్నా" అని చిన్నగా చెబుతాడు. సత్యం "నీకు తప్పు చేస్తావేమోనని భయపడ్డాను. అందుకే మందలించాను. నా కోపం నీ మీద కాదు, పరిస్థితుల మీద" అని తండ్రి ప్రేమతో చెబుతాడు. అలా తండ్రి - కొడుకు మధ్య ఉన్న అపార్థాలు కరిగిపోతాయి. కానీ ఇంట్లో ఏర్పడిన విభేదాల వలయం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X