Gunde Ninda Gudi Gantalu October 27th Episode: కొత్త అవతారమెత్తిన బాలు.. అత్తను సవాలు చేసిన మీనా

courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ లో శృతి తల్లి శోభ ఇచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కు చుట్టూ సీరియల్ మొత్తం తిరిగింది. శోభ అహంకారంతో ఇచ్చిన ఆ చెక్కు సత్యం ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది. "నాకు మీ సహాయం అవసరం లేదు, నా కష్టంతోనే ఇల్లు కట్టుకున్నాను" అంటూ సత్యం గట్టిగా చెబుతాడు. ఆ మాటలకు శోభ "మీరు రూమ్ కట్టలేరు" అంటూ హేళన చేయడంతో బాలు ఆగ్రహంతో "మా నాన్న కష్టాన్ని తక్కువ చేయొద్దు"అంటూ ఎదురుదాడి చేస్తాడు. ఈ వాదనలో రవి మధ్యలోకి వచ్చి బాలుతో వాగ్వాదం పెట్టుకుంటాడు. దీంతో బాలు ఆవేశంతో "ఇక మా ఇంట్లో నుంచి వెళ్లిపోండి" అంటూ ఘాటుగా స్పందిస్తాడు.

దీనిపై సత్యం కోపంతో బాలుపై చేయి వేస్తాడు. "ఆమె నీ అత్తగారు, ఇలాగే మాట్లాడతావా?" అని మందలిస్తాడు. ఈ సంఘటనతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. శోభ అవమానంతో వెళ్ళిపోతుంది. దీంతో ప్రభావతి కోపంతో బాలుపై మండిపడుతుంది. రోహిణి, రవి, శృతి అందరూ బాలుపై విరుచుకుపడతారు. తండ్రి కొట్టాడన్న బాధతో బాలు ఇంటి బయటకు వెళ్లి మందు తాగేస్తాడు. రాజేష్ అతన్ని ఓదారుస్తాడు. ఇదే సమయంలో మీనా ధాబా పైకెక్కి ఏడుస్తూ సత్యంతో మాట్లాడుతుంది. సత్యం తన తప్పు ఒప్పుకుంటూ "నాన్న కోపం కొడుకుపై కాదు, పరిస్థితులపై" అని చెబుతాడు. చివరగా బాలు ఇంటికి తిరిగి వచ్చి తూలిపడుతాడు. సత్యం పరుగెత్తి అతన్ని పట్టుకొని లేపి ప్రేమగా అడుగుతాడు "నామీద కోపమా?". బాలు "లేదు నాన్నా" అని చెబుతాడు. ఆ క్షణంలో తండ్రి-కొడుకు మధ్య అపార్థాలు కరిగిపోతాయి. ఇక సోమవారం (అక్టోబర్ 27 ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 540 October 27th 2025 here is full story
courtesy: Jiohotstar

బాలు బాధతో తాగి వచ్చిన విషయాన్ని సత్యం గమనిస్తాడు. "సంస్కారానికి ఓ గీత ఉంటుంది, ఇవతల ఉంటే మర్యాద.. అవతల ఉంటే రౌడీతనం" అని సత్యం బాలునికి చెబుతాడు. ఆడవారిని అవమానించడం క్షమించరాని నేరం అని సత్యం అంటాడు. దీంతో బాలు మనసులో గుబులు రేపుతాయి. ఆ సమయంలోనే ప్రభావతి హాల్లోకి వచ్చి, "సార్ గారు గుర్రం మీద ఎక్కి వచ్చినట్లు ఉన్నారు.. ఇన్నిరోజులు మానేశారని అనుకున్నా... పండుగ పూట ఇదేం పని?" అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఆమె మాటలకు బాలు గట్టిగా రియాక్ట్ అవుతాడు.

ఇంతలోనే మనోజ్, శృతి, రవి, రోహిణి కూడా హాల్లోకి వస్తారు. "ఏం జరుగుతుంది ఇక్కడా? నా నిద్ర డిస్టర్బ్ అవుతోంది" అని మనోజ్ పొగరుగా మాట్లాడుతాడు. దీంతో బాలు "ఎవరు ఎటో వెళ్తే నీకెందురా? నీకు ఒక రూమ్ ఉంది, తలుపు మూసుకొని పడుకో" అని వార్నింగ్ ఇస్తాడు. శృతి కూడా తాగి వచ్చి గొడవ చేస్తాడని నోరు పారేసుకుంటుంది. దీంతో బాలు కడుపుమండిపోతూ "ఇది మీ ఇల్లు కాదు మీ అత్తగారిల్లు.. మీరు ప్రతి విషయం మీ అమ్మగారికి చెప్పాలి ఎందుకు?" అని అడుగుతాడు.

ప్రభావతి వెంటనే "నీ పెళ్లాం మాత్రం అన్ని చెప్పదా? మీ అత్తతో డైలీ సీరియల్‌లా మాట్లాడుతుంది కదా?" అంటూ వ్యంగ్యంగా అంటుంది. అప్పుడు బాలు " అవునా.. అయినా ఏ రోజు అయినా మా అత్తగారు వచ్చి నాన్నను అవమానించిందా?" అని ప్రశ్నిస్తాడు. ప్రభావతి మాత్రం "శృతి వాళ్ళ అమ్మ పెద్ద మనసు చేసుకొని డబ్బు ఇవ్వడానికి వచ్చింది. నువ్వే గొడవ చేసి అవమానించావు" అని బాలు మీద నింద వేస్తుంది.

ఈ మాటలు విన్న మీనా కోపంతో రగిలిపోతుంది. "ఆమె పెద్ద మనసు చేసుకొని డబ్బు తీసుకవచ్చారా? లేక అవమానించడానికి వచ్చారా? ఎవరో దానం చేస్తే తేలికగా తీసుకోవాలా?" అని ఘాటుగా అడుగుతుంది. ప్రభావతి చేతు ఎత్తడానికి ప్రయత్నించగానే, మీనా ధైర్యంగా అడ్డుకుంటూ "మీరు మాట్లాడకండి. మామయ్యను అవమానించే వారిని మీరు సమర్థిస్తున్నారా?" అని నిలదీస్తుంది. "మీ పెద్దబ్బాయిని ఎవరు ఏమైనా అంటే రోహిణి ఊరుకుంటుందా? మీ చిన్నబ్బాయిని ఎవరు ఏమైనా అంటే శృతి ఊరుకుంటుందా? మరి నా భర్తను అవమానిస్తుంటే నేను ఎందుకు ఊరుకోవాలి?" అని గట్టిగా ప్రశ్నిస్తుంది.

మీనా ధైర్యం చూసి అందరూ షాక్ అవుతారు. ఆమె మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసం బాలు మనసును కదిలిస్తుంది. తర్వాత ఆమె రవినీ ఉద్దేశించి "నీ అత్తయ్య గారు అంతలా అవమానిస్తే నువ్వు ఎందుకు ఊరుకున్నావు?" అని ప్రశ్నిస్తుంది. "మా ఆయన గౌరవం కాపాడాడు, ఆయన ఆత్మాభిమానాన్ని నిలబెట్టాడు" అంటూ మీనా క్లాస్ ఇస్తుంది. తర్వాత బాలుని పైకి తీసుకెళ్తుంది. సత్యం మాత్రం ప్రభావతిని "నోరు మూసుకో" అంటూ హెచ్చరిస్తాడు.

పైకి వెళ్లాక బాలు బాధతో "నాన్న నన్ను అందరి ముందు కొట్టాడు" అని బాధపడతాడు. మీనా ఓదార్తూ "మీ నాన్నకు నిన్ను మందలించే హక్కు ఉంది. ఆయన ప్రేమతోనే చేశారు. కానీ మీరు తాగి రావడం తప్పు" అని చెబుతుంది. ఆమె మాటలు బాలుని మనసును తాకుతాయి. "ఇకపై తాగి రానని మాట ఇస్తా. నా నాన్న సంతోషం కోసం ఏదైనా చేస్తా. అవసరమైతే నేనే ఇల్లు కట్టిస్తా" అంటూ మీనా ఒడిలో బాలు తలపెడతాడు.

మరుసటి రోజు ఉదయం మరో బాలు దర్శనమిస్తాడు. భక్తితో పూజలు చేస్తున్న బాలు చూసి అందరూ షాక్ అవుతారు. సత్యం కూడా "నేనేమైనా కలగంటున్నానా?" అని ఆశ్చర్యపోతాడు. ప్రభావతి వ్యంగ్యంగా "ఇంట్లో చెప్పకుండా పూజలు చేస్తావా? హార్ట్ పేషెంట్స్ ఉన్నారు" అంటుంది. దానికి బాలు "మీకు నాన్నగారికే హార్ట్ ఉందని గుర్తొచ్చిందా?" అని సెటైర్ వేస్తాడు.

సత్యం "ఏమైంది రా ఇది?" అని అడగగా, బాలు ప్రశాంతంగా "ఇకపై గొడవలు వద్దు. రూమ్ వద్దు. కావాలనుకున్నప్పుడు నేనే కట్టుకుంటా" అంటాడు. మనోజ్ వెంటనే "వీడు తన భార్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోవాలని ప్లాన్ చేస్తున్నాడు" అంటాడు. బాలు వెంటనే "మూసుకోరా? ఎగిరితే బుచ్చలో పడతావ్" అంటూ వార్నింగ్ ఇస్తాడు.

మనోజ్‌ను తిట్టుతూ "ఇన్ని తప్పులు చేసిన నువ్వే ఇక్కడ ఉన్నావు, నేను ఎక్కడికీ వెళ్లను" అని గట్టిగా అంటాడు. సత్యం "అయినా రూమ్ లేకపోతే ఎలా?" అని అడగగా, "రూమ్ పేరుతో జరిగే రచ్చ నాకు అవసరం లేదు. నా రూమ్ నేనే కట్టుకుంటా" అని ధైర్యంగా చెబుతాడు. ప్రభావతి "బాలు గాడి కన్ను నా ఇంటి పత్రాల మీద పడలేదు దేవుడా" అంటూ ఊపిరి పీలుస్తుంది.

కానీ మనోజ్, రోహిణి వెటకారం చేస్తూ "నీ భార్య శపధం చేసింది కదా? ఇప్పుడు నువ్వే రూమ్ కట్టేస్తావా?" అంటారు. దాంతో మీనా కోపంగా "బాలు ఎందుకు రూమ్ కట్టలేడు? బంగారం ఎందుకు కొనలేడు?" అని ప్రశ్నిస్తుంది. మనోజ్ "ఇంటింటికి వెళ్లి పువ్వులు అమ్ముకోవాలి కదా" అని వ్యంగ్యంగా అంటాడు. దీంతో మీనా " నువ్వు పెట్టిన షాప్ కు డబ్బులు ఎలా వచ్చాయి. పార్క్ లో పల్లీలు అమ్ముకొని సంపాదించావా? లేదా గుడి ముందు అడుక్కుంటే వచ్చాయా? రోహిణి వాళ్ళ అమ్మగారు ఇస్తేనే కదా మీరు షాప్ పెట్టారు లేకపోతే.. నీ పరిస్థితి ఏంటో తెలియదా అని ఒరేంజ్ లో అరుసుకుంటుంది.

మీనా ఈ సందర్భంలో మరోసారి తన ఆత్మగౌరవాన్ని చూపిస్తుంది. "మేము ఎవరి ముందు చేతులు చాపం, ఎవరి దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. మేము ఇద్దరం కష్టపడి రూమ్ కట్టుకుంటాం" అంటూ గట్టిగా శపథం చేస్తుంది. ఆమె మాటలు వింటూ ఇంటిల్లిపాది షాక్ అవుతారు. ఆ తర్వాత బాలు మీనా దగ్గరకు వచ్చి "నువ్వు ఇల్లు కట్టుకుంటానని అంటావ్, కానీ ఎలా?" అని భయపడతాడు.

మీనా ధైర్యంగా "మీరు ఒక్కరే మౌనిక పెళ్లి చేసారు, కారు కొనిచ్చారు, బంగారం గొలుసు కొనిచ్చారు. అవన్నీ చేసినప్పుడు ఇల్లు ఎందుకు కట్టలేరు?" అని ప్రోత్సహిస్తుంది. మీనా మాటలు బాలు మనసులో కొత్త నమ్మకం నింపుతాయి. "అసాధ్యం అనేది మనసులోనే ఉంటుంది" అని ఆమె చెప్పిన మాటలతో బాలు కొత్త ఆలోచనలో పడతాడు. తన భార్య మీనా ధైర్యం, మాటలు, ప్రేమ చూసి బాలు మారిపోతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X