Gunde Ninda Gudi Gantalu October 28th Episode: బాలు మీనా కలల ఇల్లు, మనోజ్ బ్లాక్ డీల్, శృతి–రవి రొమాన్స్!
courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్ లో బాలు పుల్ గా తాగి రావడం గమనిస్తాడు. "సంస్కారానికి ఓ గీత ఉంటుంది" అని సత్యం చెప్పిన మాటలు బాలుని మనసులో మోగుతాయి. ప్రభావతి వ్యంగ్యంగా మాట్లాడడం వల్ల బాలు గట్టిగా రియాక్ట్ అవుతాడు. అదే సమయంలో మనోజ్, శృతి, రవి, రోహిణి హాల్లోకి రావడం వల్ల గొడవ మరింత పెరుగుతుంది. బాలు మీద ప్రభావతి, శృతి నోరు పారేయడంతో బాలు తీవ్రంగా స్పందిస్తూ "ఇది మీ ఇల్లు కాదు, మీ అత్తగారిల్లు" అని అంటాడు. దీంతో మీనా ముందుకొచ్చి తన భర్తకు సపోర్ట్‌గా నిలుస్తుంది. "మీ పెద్దబ్బాయిని ఎవరు ఏమైనా అంటే రోహిణి ఊరుకుంటుందా? మరి నా భర్తను అవమానిస్తుంటే నేను ఎందుకు ఊరుకోవాలి?" అని ధైర్యంగా ప్రశ్నించి అందరినీ షాక్‌కు గురి చేస్తుంది. ఆమె ఆత్మవిశ్వాసం బాలు మనసును కదిలిస్తుంది.
తర్వాత బాలు బాధతో "నాన్న నన్ను అందరి ముందు కొట్టాడు" అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. మీనా ప్రేమతో సాంత్వన ఇస్తూ.. "మీ నాన్న ప్రేమతోనే మందలించారు. కానీ తాగి రావడం తప్పు" అంటూ చక్కగా సర్దుతుంది. మీనా మాటలతో బాలు మారిపోతూ "ఇకపై తాగి రానని మాట ఇస్తా, నా నాన్న కోసం ఏదైనా చేస్తా" అని అంటాడు. మరుసటి ఉదయం బాలు మారిపోయిన వ్యక్తిగా కనిపిస్తాడు. భక్తితో పూజలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. "ఇకపై గొడవలు వద్దు, నా రూమ్ నేనే కట్టుకుంటా" అని ధైర్యంగా ప్రకటిస్తాడు. మనోజ్ వ్యంగ్యంగా మాట్లాడినా, మీనా వెంటనే స్పందిస్తూ "మేము ఎవరి దయపై జీవించం, మేము ఇద్దరం కష్టపడి రూమ్ కట్టుకుంటాం" అని శపథం చేస్తుంది. ఆమె మాటలు ఇంటి వాతావరణాన్ని సైలెంట్ చేస్తాయి. మీనా ధైర్యం, బాలు మారిన తీరు ఈ ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి. భార్య ప్రేమ, ప్రోత్సాహం ఒక మనిషిని ఎలా మార్చగలదో చూపించిన ఈ ఎపిసోడ్ ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఇక మంగళవారం(అక్టోబర్ 28 ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

courtesy: Jiohotstar
మంగళవారం ఎపిసోడ్ బాలు-మీనా మధ్య చర్చతో ప్రారంభమవుతుంది . బాలు తన ఆలోచనల్లో మునిగిపోయి మీనాతో చెబుతాడు, "నువ్వు ఇలా పదే పదే శపథాలు చేస్తూ వెళ్తే మనమే రిస్క్‌లో పడతాం మీనా. చివరికి ఇబ్బందులు మనకే వస్తాయి." అప్పుడు మీనా సీరియస్‌గా స్పందిస్తూ, "నీ నాన్నగారు ఈ వయసులో కూడా మన కోసం ఇబ్బంది పడాలా? ఆయన పింఛన్ డబ్బులు మొత్తం మనకిస్తే సరిపోతాయా? అందుకే నేనేం తప్పు చేయలేదు, మన గదిని మనమే కట్టుకుందాం. అందుకే అందరి ముందు అలా మాట్లాడును " అని స్పష్టత ఇస్తుంది. దాంతో బాలు చిరునవ్వు చిందిస్తూ, "నీ ప్లాన్ బాగానే ఉంది కానీ, దారే లేని చోట కారు నడపమన్నట్లు ఉంది" అని అంటాడు. దానికి వెంటనే మీనా ఉత్సాహంగా స్పందిస్తూ, "అయితే మనం ఇంకో కారు కొందాం బాలు. ఆ కారును రెంట్ కు ఇస్తే డబ్బులు సులభంగా వస్తాయి. ఆ డబ్బులతో చిట్టి వేయొచ్చు, చిట్టి పైసలతో మన ఇల్లు కట్టుకుందాం" అంటూ తన కలల ప్రణాళికను చెబుతుంది మీనా.
బాలు నవ్వుతూ, "ప్లాన్ బాగానే ఉంది కానీ కారు కొనేందుకు డబ్బులు కావాలి కదా" అని అంటాడు. వెంటనే మీనా తడబడకుండా సమాధానం ఇస్తుంది, "నా దగ్గర బంగారం ఉంది కదా, దాన్ని అమ్మేసి కారు కొందాం." ఆ మాట విని బాలు ఆశ్చర్యపడి, "అది మా అమ్మకి ఇచ్చావు కదా. తిరిగి ఎలా తీసుకుంటావు? పైగా 'అవసరం లేదు' అని శపథం కూడా చేశావు కదా!" అని గుర్తు చేస్తాడు. దానికి మీనా ధైర్యంగా స్పందిస్తూ, "మన అవసరానికి కాదు కదా బాలు, ఇల్లు కట్టుకోవడానికి కదా! అమ్మని అడిగితే తప్పేం ఉంటుంది?" అంటుంది. కానీ బాలు మాత్రం "ఒకసారి 'అవసరం లేదు' అన్న తర్వాత తిరిగి తీసుకోవడం సరికాదు మీనా. వేరే మార్గం చూద్దాం" అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు.
మరోవైపు రోహిణి, మనోజ్ తమ ఫర్నిచర్ షాప్‌లో బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రోహిణి కొంచెం ఆవేదనతో, "ఇవాళ కస్టమర్స్ ఎవరూ లేరు మనోజ్!" అని అంటుంది. దానికి మనోజ్ "వీక్ డేస్ కదా, అప్పుడప్పుడు ఇలా డల్‌గా ఉంటుంది బిజినెస్. వారం చివర్లో కస్టమర్స్ వస్తారు" అని చెబుతాడు. ఇంతలో రోహిణి చెబుతుంది, "నాకు ఓ రిసార్టు నుంచి ఇన్విటేషన్ వచ్చింది, ఒకరోజు బయటికి వెళ్లి రిలాక్స్ అవుద్దాం. మనకూ ఛేంజ్ అవుతుంది." కానీ మనోజ్ నిరాకరిస్తూ, "నేను బిజినెస్‌మాన్‌ని రోహిణి. షాప్ వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు. కస్టమర్ల నమ్మకం తగ్గుతుంది" అని అంటాడు. రోహిణి మాత్రం "కస్టమర్స్‌ను ఎంప్లాయీస్ చూసుకుంటారు, మనం ఒక్కరోజు బయటికి వెళ్తే ఆకాశం కూలిపోదు. ఇంట్లో గొడవలు, టెన్షన్లు కాస్త సరదా కావాలి" అని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది.
అయితే, మనోజ్ మాత్రం గట్టిగా, "మన బిజినెస్ లో ఎవరినీ నమ్మలేం" అని చెబుతాడు. రోహిణి కాస్త సెంటిమెంట్‌లోకి వెళ్లి "భార్య మాటకు విలువ లేదా? భార్య కోరినా, బిజినెస్ అని వేలాడుతావా?" అంటూ అతని మనసు మార్చడానికి ప్రయత్నిస్తుంది. చివరికి మనోజ్ , "సరే, నీ కోసం రిసార్ట్ వస్తా" అని ఒప్పుకుంటాడు. అయితే అదే సమయంలో ఒక ఫోన్ కాల్ వస్తుంది. పెద్ద ఆర్డర్ గురించి ఒక కస్టమర్ చెబుతాడు "మాకు పది రూముల ఫర్నిచర్ కావాలి, వెంటనే డెలివరీ కావాలి, కాష్‌లో ఇస్తాం." అంటాడు. దీంతో మనోజ్ కళ్లు మెరుస్తాయి. "ఇది మన లైఫ్ ఛేంజింగ్ డీల్ రోహిణి!" అని ఉత్సాహంగా అంటాడు. రోహిణి నిరాశగా, "ఇంత పెద్ద ఆఫర్ వస్తే నేను రాలేదా అనిపిస్తుంది" అంటుంది. మనోజ్ మాత్రం, "బిజినెస్ వదులుకోలేను, ఇది మన భవిష్యత్తు" అని చెబుతాడు. రోహిణి నిరాశతో వెళ్ళిపోతుంది.
మరోవైపు.. బాలు ఇంటికి చేరుకుంటాడు. కానీ లోపలికి రాకుండా మీనాకు ఫోన్ చేస్తాడు. "బయటికి రా మీనా, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది!" అని చెబుతాడు. మీనా, "అత్తయ్య చూస్తే తిడుతుంది బాలు, పని మధ్యలో బయటికి రావడం కుదరదు" అని అంటుంది. కానీ బాలు సస్పెన్స్ "ఒక్కసారి రా, ఈ సర్ప్రైజ్ నీకు చాలా నచ్చుతుంది" అని అంటాడు. మీనా వెళ్ళడానికి సిద్ధమవుతుంటే ప్రభావతి అడ్డుకుంటుంది. "ఎక్కడికి వెళ్తున్నావ్?" అని ప్రశ్నిస్తుంది. మీనా "నా మొగుడు పిలిచాడు అత్తయ్య" అని చెబుతుంది. "వాడు రాడా, నువ్వు ఎందుకు వెళ్తున్నావ్?" అంటూ ప్రభావతి తిరిగి ప్రశ్నిస్తుంది. మీనా కోపంతో, "ఏమండీ!" అని గట్టిగా అంటుంది. ఇదంతా సత్యం గమనించి, "అధికారాన్ని నిలబెట్టుకుంటే గౌరవం వస్తుంది, కానీ దాన్ని అనవసరంగా వాడితే అవమానం " అని ప్రభావతిని హెచ్చరిస్తాడు.
ఇక మీనా బయటికి వెళ్ళగానే బాలు ఆనందంగా చెబుతాడు, "ఈరోజు నుండి మన కలల ఇల్లు ప్రారంభం!". మీనా ఉత్సాహంగా అడుగుతుంది "ఏంటి ఆ సర్ప్రైజ్?" బాలు కారు డిక్కీ ఓపెన్ చేస్తాడు. అందులో ఇటుకలు చూపిస్తాడు. మీనా ఆశ్చర్యపడి, "ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి ఇటుకలు సరిపోతాయా?" అని అడుగుతుంది. బాలు నవ్వుతూ, "నా కస్టమర్ ఇటుకల వ్యాపారి. ప్రతిసారి డ్రాప్ చేసినప్పుడు ఇలా ఇటుకలు ఇస్తానన్నాడు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఇటుక సేకరించుకుందాం, అలా మన ఇల్లు నిర్మించుకుందాం!" అని చెబుతాడు. మీనా సరదాగా, "నా దగ్గర సిమెంట్ వ్యాపారి కస్టమర్ ఉన్నాడు, నేను సిమెంట్ తెస్తా!" అని అంటుంది. ఇద్దరూ నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చేస్తారు.
ఇంట్లోకి వచ్చిన వెంటనే ప్రభావతి షాక్ అవుతుంది. "ఏంటి ఇటుకలు పట్టుకుని వచ్చారు?" అని ఆరా తీస్తుంది. బాలు నవ్వుతూ, "ఈరోజే మన ఇల్లు ప్రారంభం!" అని చెబుతాడు. ప్రభావతి వ్యంగ్యంగా, "ఇలా ఒక్కొక్క ఇటుక తెస్తే షష్టిపూర్తి అయ్యేలోగా ఇల్లు పూర్తవుతుంది" అని అంటుంది. దానికి మీనా సెటైర్ వేస్తూ, "ధన్యవాదాలు అత్తయ్య! షష్టిపూర్తి వరకు కలిసే ఉండమని దీవించినందుకు" అని చెబుతుంది. బాలు నవ్వుతూ, "చూసావా నా భార్యను? తిట్లలో కూడా ఆశీర్వాదాలు వెతుక్కుంటుంది. అదీ నా భార్య గొప్పతనం!" అని అంటాడు. ఇలా బాలు, మీనా తమ కలలపై మాట్లాడుకుంటూ ఇటుకలతో ఇల్లు ఊహల్లో నిర్మించుకుంటారు.
మరుసటి రోజు మనోజ్ షాప్‌లో సీన్ మారుతుంది. మనోజ్ దేవుని ముందు పూజ చేసి, "నా బిజినెస్ ఇంకా ఎదగాలి దేవుడా. ఇలాంటి పెద్ద డీల్స్ ఇంకా రావాలి" అని ప్రార్థిస్తాడు. ఇంతలో ఆ కస్టమర్లు వస్తారు. వారు చెబుతారు, "మాకు 10 రూముల ఫర్నిచర్ కావాలి, కానీ బిల్లు వద్దు, డబ్బులు కాష్‌లో ఇస్తాం." మనోజ్ అయోమయంలో పడతాడు. "ఇంత పెద్ద మొత్తం బిల్లు లేకుండా ఎలా చూపించాలి?" అని ఆలోచిస్తాడు. కస్టమర్ చెబుతాడు, "ఇది బ్లాక్ మనీ బిజినెస్. మీరు ఇవ్వకపోతే వేరే షాప్‌కి వెళ్తాం." మనోజ్ ఆలోచనలో పడి, "రిస్క్ అయినా గాని బిజినెస్ తప్పక దక్కించుకోవాలి" అని ఒప్పుకుంటాడు. వారు 5 లక్షలు కాష్‌లో ఇస్తారు. మనోజ్ వాటిని చూసి మురిసిపోతాడు. "ఇలాంటి డీల్స్ వారానికి ఒకటి వస్తే నేను దేశంలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అవుతా!" అని కలల్లో తేలిపోతాడు.
ఇక చివరి సీన్‌లో శృతి రవి ఇంట్లోకి వస్తుంది. షూటింగ్ ముగిసిన తర్వాత అలసిపోయి చెబుతుంది, "కాళ్లు నొప్పిగా ఉన్నాయి రవి... కాస్త పట్టు" అని శ్రుతి కోరుతుంది. దీంతో రవి తన పెళ్లాం కాళ్లు పట్టుతాడు. శృతి నవ్వుతూ, "నా కాళ్లకు నేల్ పాలిష్ కూడా వేస్తావా?" అని అడుగుతుంది. రవి నవ్వుతూ, "పెళ్లాం కోరిక కదా, కాదనలేను!" అని అంటాడు. ఇలా రొమాంటిక్ సన్నివేశం జరుగుతుంటే ప్రభావతి ఆ సీన్ గమనిస్తుంది. కోపంతో గదిలోకి దూసుకెళ్లి అరుస్తుంది, "ఏంటి ఇది శృతి? " అని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










