Gunde Ninda Gudi Gantalu October 29th Episode:మీనా పాదపూజ చేసిన బాలు.. బ్లాక్ మనీతో రిస్క్ లో పడ్డ మనోజ్..
Courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు మంగళవారం ఎపిసోడ్ లో బాలు, మీనా మధ్య చర్చతో ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. బాలు ఆందోళనగా "నువ్వు పదే పదే శపథాలు చేస్తే ఇబ్బంది మనకే వస్తుంది" అంటాడు. దానికి మీనా ధైర్యంగా 'నీ నాన్న పింఛన్ మీద జీవించడం కరెక్ట్ కాదు. మన గదిని మనమే నిర్మించుకోవాలి'అంటుంది. బంగారం అమ్మి కారు కొని రెంటుకు ఇవ్వాలన్న మీనా ప్లాన్‌కి బాలు "మాట బాగుంది కానీ మార్గం సరిగా లేదు" అని చెబుతాడు. మరోవైపు రోహిణి, మనోజ్ ఫర్నిచర్ షాప్‌లో బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు. రోహిణి రిలాక్స్ అవుద్దాం అంటుంటే మనోజ్ 'బిజినెస్ మన బాధ్యత'అంటాడు. కానీ అదే సమయంలో పెద్ద కస్టమర్ నుండి భారీ ఆర్డర్ రావడంతో అతని దృష్టి పూర్తిగా డబ్బు వైపు మళ్లుతుంది. 'ఇది మన లైఫ్ ఛేంజింగ్ డీల్'అని ఆనందపడుతాడు.
మరోవైపు బాలు మీనాకు సర్ప్రైజ్ ఇస్తాడు. కారు డిక్కీలో ఇటుకలు చూపిస్తూ "మన ఇల్లు ఇక్కడినుంచే మొదలు" అంటాడు. మీనా నవ్వుతూ "నేను సిమెంట్ తెస్తా!" అని స్పందిస్తుంది. కానీ ఇంట్లోకి వచ్చిన వెంటనే ప్రభావతి వ్యంగ్యంగా మాట్లాడుతుంది. దానికి మీనా చురకతో "మీ దీవెనలతో షష్టిపూర్తికి ఇల్లు కట్టేస్తాం" అని చెబుతుంది. ఆ తరువాత బాలు, మీనాలు ఇళ్లు కట్టినట్టు ఊహాల్లో తేలిపోతారు. మరుసటి రోజు మనోజ్ తన బిజినెస్ ఓ రెంజ్ లోకి వెళ్లిపోయిందని ఊహాల్లో తేలిపోతాడు. కానీ, బ్లాక్ మనీతో డీల్‌కి ఒప్పుకొని రిస్క్ తీసుకుంటాడు. మరోవైపు శృతి ఇంటికి వచ్చి రవిని కాళ్లు పట్టమని అడగడం, రవి ప్రేమగా ఒప్పుకుంటుంది. ఈ రొమాంటిక్ సీన్ చూసి ప్రభావతి కోపంతో మండిపడుతుంది. తన కొడుకును పనిమనిషిలా చేసిందని శృతిపై ఆగ్రహంతో కేకలు వేస్తుంది. ఇక బుధవారం (అక్టోబర్ 29) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

ప్రభావతి ఇంట్లో మరోసారి గందరగోళం మొదలైంది. రవి-శృతి అన్యోన్యంగా ఉండటం ప్రభావతికి నచ్చదు. "మగాడిచేత కాళ్లు పట్టించుకోవడం ఏంట్రా ఇది?" అంటూ మండిపడుతూ గదిలోకి దూసుకెళ్లింది. ఆ మాటలు విన్న రవి నిశ్శబ్దంగా ఉంటాడు. "ఏంటి అత్తయ్య ఇలా ఆవేశంగా?" అని అడిగిన శృతికి ప్రభావతి సమాధానం ఇచ్చింది "నా సంగతి తర్వాత, ముందు చెప్పు.. మొగాడిని కాళ్లు పట్టమని అడిగావా?" అంటుంది. శృతి నవ్వుతూ "స్టూడియోలో రోజు మొత్తం నిల్చున్నా.. కాళ్లు నొప్పిగా ఉన్నాయి.. అందుకే రవి కాస్తా మసాజ్ చేశాడు" అని చెప్పింది. వెంటనే ప్రభావతి ఆగ్రహంతో "అయినా భర్తతో ఇలాంటివి చేయించుకుంటావా?" అని ఘాటుగా అడిగింది. కానీ శృతి మాత్రం వెనకడుగు వేయలేదు"ఏ మాటకు ఆ మాటే అత్తయ్య.. రవి చాలా బాగా మసాజ్ చేశాడు.. పైగా నెయిల్ పాలిష్ కూడా బాగానే పెడతాడు" అంటుంది.
దాంతో ప్రభావతి మరింత మండిపడి "ఇవి చేయించుకోవడం సిగ్గు కాదా?"అని రవిని ప్రశ్నిస్తుంది. "అత్తయ్య, మీరు ఎప్పుడూ అంకుల్‌తో ఇలాంటివి చేయించుకోలేదా? అందులో తప్పేంటి?" అంటూ శృతి కౌంటర్ ఇచ్చింది. ప్రభావతి రవి వైపు తిరిగి "నువ్వైనా చెప్పాలి కదా," అని మందలించగా, రవి మృదువుగా, "రోజంతా కష్టపడి వచ్చింది, పాపం," అని అన్నాడు.
"పాపం అంటావా? నీకే పాపం దక్కుతుంది!" అని ప్రభావతి కేక వేసింది. అప్పుడు శృతి మధ్యలోకి వచ్చి "అత్తయ్య, ఇప్పుడు కాలం మారిపోయింది. గౌరవం అనేది భయంతో కాదు, ప్రేమతో ఉండాలి," అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. "మీరు చెబుతున్న గౌరవం ప్రిన్సిపల్‌కి చూపేది, భర్తకి కాదు!" అని చెప్పిన మాటకు ప్రభావతి షాక్ అయింది. చివరగా శృతి నెయిల్ పాలిష్ బాటిల్ ఇచ్చి, "ఇదిగో అత్తయ్య, అంకుల్‌తో పెట్టించుకోండి.. అప్పుడు మీకే అర్థమవుతుంది," అంటూ స్మైల్ ఇచ్చింది శ్రుతి.
ఈ సీన్ మొత్తం బాలు గమనించాడు. "ఎందుకింత నెగిటివ్‌గా ఆలోచిస్తున్నారు అమ్మ?" అని అడిగాడు. ప్రభావతి మాత్రం మండి, "మగాడి చేత కాళ్లు పట్టించుకుంటే మనం బతకడం ఎందుకు?" అంది. "అమ్మా, భార్యాభర్తల మధ్య ప్రేమ కనిపించగానే నీకు ఎందుకింత అసూయ?" అని బాలు సూటిగా అడిగాడు.
తరువాత రవి బయటకు వచ్చాడు. "ఏమైంది అన్నయ్య? అమ్మ కోపంగా ఉంది కదా?"అని అడిగాడు. బాలు నవ్వుతూ "మీ అన్యోన్యత చూసి కడుపు నిండిపోయిందట!" అన్నాడు. రవి నవ్వుతూ, "అదేం లేదు అన్నయ్య, నేను శృతికి నెయిల్ పాలిష్ పెడుతుంటే అమ్మ చూసి ఆగ్రహించింది" అని నిజం చెప్పాడు. బాలు సరదాగా "ఈ రోజులలో ఇవన్నీ కామన్‌మ్మా, అమ్మను పట్టించుకోకు," అని చెబుతాడు. మరోసారి మీ .జోలికి రాకుండా చూసుకుంటా అని రవి చేతిలో నెయిల్ పాలిష్ తీసుకుని హాల్ లోకి దూసుకెళ్తాడు బాలు.
మరోవైపు ఆగ్రహంతో ప్రభావతి సత్యం దగ్గరకు వెళ్లి "ఇంట్లో కోడళ్ళు రాక్షసులయ్యారు!" అంటూ గోల చేసింది. "అనవసరంగా మీనాను ఎందుకు తిడుతున్నావు?" అని సత్యం అడగగా.. "మీనా కాదు, రవికోడలు శృతి!" అంటూ అరుస్తుంది. సత్యం ఆశ్చర్యపడి, "నీకు నచ్చిన కోడలుపై నువ్వు కోపం తెచ్చుకున్నావా?" అని అడిగాడు. " శ్రుతి .. రవితో నానా చాకిరీ చేయిస్తోంది, గౌరవం లేనట్టుంది" అని ప్రభావతి చెప్పగా, సత్యం చమత్కారంగా, "నువ్వేనా భర్తను గౌరవించేది? నువ్వు మాట్లాడతావా?" అని కౌంటర్ ఇచ్చాడు. ప్రభావతి కోపంగా అసలు విషయం వివరించింది "రవి శృతి కాళ్లకు నెయిల్ పాలిష్ పెడుతున్నాడు." సత్యం నవ్వుతూ, "అది వాళ్ల ప్రేమ, నువ్వు కూడా అలాంటి అనుబంధం ఆస్వాదించు" అని సమాధానం ఇచ్చాడు. కానీ ప్రభావతి మాత్రం, "ఇప్పుడు వాళ్లను ఆపకపోతే, దారుణంగా మారిపోతారు," అంటూ బాధపడింది.
ప్రభావతి హాల్లోకి రాగానే బాలు మీనాను పిలుస్తాడు. దీంతో మీనా పరుగెత్తుకుంటూ వస్తుంది. వెంటనే బాలు చమత్కారం చేస్తూ.. "నీ కాళ్లు తెల్లగా ఉన్నాయి, పాలు తేనెతో కడుగుతావా?" అని అడిగాడు. మీనా నవ్వుతూ, "నీళ్లతోనే కడుగుతాను," అని మృదువుగా బదులిచ్చింది. ఇది చూసి ప్రభావతి మండిపడి, "ఇంత మృదువుగా ఉంటే నీ పెళ్లాం కాళ్లు నెత్తిపై పెట్టుకుని ఊరేగు!"అంటుంది. దీంతో బాలు వెంటనే, "అమ్మవారి అనుమతి వస్తే ఖచ్చితంగా ఊరేగుతా!" అంటూ సరదాగా బదులిచ్చాడు. అంతటితో ఆగకుండా బాలు మీనాపై కవితలు చెబుతూ ఆమెను నవ్విస్తాడు. ప్రభావతి సైలెంట్‌గా లేచి వెళ్ళిపోయింది.
ఇదిలా ఉండగా.. తన ఆఫీస్‌లో కుర్చీలో కూర్చొని మనోజ్ రోహిణికి కాల్ చేస్తూ, "రోహిణి! ఈరోజు నా లైఫ్‌లోనే పెద్ద డీల్ క్లోజ్ అయ్యింది! ఇక మన లైఫ్ సెట్.
త్వరలోనే ఇండియాలోనే రిక్వెస్ట్ బిజినెస్‌మాన్ అవుతానమ్మా," అంటూ తెగ ఎగిరిపడతాడు. రోహిణి నవ్వుతూ, "వావ్ మనోజ్! నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సక్సెస్ కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు," అని చెబుతుంది. తప్పకుండా సెలబ్రేట్ చేద్దాం అని మనోజ్ చెబుతూ, "త్వరలో గోవా టూర్, లేకపోతే ఫారిన్ ట్రిప్ వెళ్దాం," అని రోహిణిని అడుగుతాడు. అయితే రోహిణి శాంతంగా, "ఇప్పుడేం అవసరం లేదు మనోజ్. టైం వచ్చినప్పుడు వెళ్దాం," అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది
ఇంతలోనే బయట నుండి ఇద్దరు వ్యక్తులు ఆఫీసర్స్ డ్రెస్‌లో లోపలికి వస్తారు. "ఇక్కడ ఓనర్ ఎవరు?" అని కాస్త కఠినంగా అడుగుతారు. మనోజ్ కుర్చీపై నుంచి లేచి, గర్వంగా, "నేనే ఓనర్ మనోజ్!" అని అంటాడు. "మాకు కొంత సమాచారం వచ్చింది. ఇక్కడ ఎవరైనా పెద్ద మొత్తంలో ఫర్నిచర్ కొనుగోలు చేశారా?" అని వారు ప్రశ్నిస్తారు. దానికే మనోజ్ తన సిగ్నేచర్ స్టైల్లో, "ఫర్నిచర్ షాప్‌లో ఫర్నిచర్ కాక ఇంకేమైనా అమ్ముతామా? రోజూ పెద్ద పెద్ద బిజినెస్ లావాదేవీలు జరుగుతాయి," అని బిల్డప్ ఇస్తాడు. వారు మళ్లీ అడుగుతారు "అయితే ఆ కస్టమర్లు బిల్ ఎలా పేమెంట్ చేశారు?" మనోజ్ కూల్‌గా, "క్యాష్ ఇచ్చారు. పెద్ద డీల్ కాబట్టి బిల్ ఇవ్వలేదు," అని సమాధానం ఇస్తాడు.
"ఆ క్యాష్ ఒకసారి చూపించగలరా?" అని వారు అంటారు. "మీకెందుకు చూపించాలి? నా బిజినెస్ నా ఇష్టం!"అని మనోజ్ తిప్పికొడతాడు. వెంటనే వారు జేబులోంచి ఐడీ కార్డులు తీసి, "మేము సీఐడి ఆఫీసర్లు. ఇక్కడ ఫేక్ కరెన్సీ ట్రాన్స్‌ఫర్ జరిగినట్టు సమాచారం వచ్చింది," అని హెచ్చరిస్తారు. అది విన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అయి చెమటలు కారుస్తాడు. "సరే సర్, చూడండి," అంటూ కవర్లలో ఉన్న నోట్లను తీసి వారి ముందు పెడతాడు. వారు కెమికల్ పౌడర్ చల్లి, "ఇది అసలు కరెన్సీ కాదు, ఫేక్ నోట్స్!" అని ప్రకటిస్తారు. "సర్! ఇది ఎలా సాధ్యం? వాళ్లు మంచి కస్టమర్ల్లా వచ్చారు. నేను డీల్ సైన్ చేశాను," అంటూ వణుకుతున్న స్వరంతో చెబుతాడు. సరే గానీ, "వారి వివరాలు ఉన్నాయా? బిల్ ఇచ్చారా?" అడుగుతారు. మనోజ్ తలదించుకుని, "లేదు సర్... పెద్ద మొత్తంలో డీల్ కాబట్టి బిల్ ఇవ్వలేదు. మొత్తం క్యాష్‌లో తీసుకున్నాను," అంటాడు.
"బిల్లు లేకుండా డబ్బు తీసుకోవడం అంటే ప్రభుత్వానికి టాక్స్ ఎగ్గొట్టడమే. నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావ్!" అంటూ వారు గట్టిగా ప్రశ్నిస్తారు. మనోజ్ వణుకుతూ, "అది కాదు సర్... డీల్ పెద్దది కాబట్టి నమ్మకం మీద చేశాను. దయచేసి మన్నించండి," అంటాడు. వెంటనే వారు, "ఇది మా డిపార్ట్‌మెంట్ సీజ్ చేసిన మనీ. మేము దీన్ని స్టేషన్కి తీసుకెళ్తాం. మీ ఫర్నిచర్ వస్తువులు అక్కడి నుంచి తీసుకెళ్లండి," అని చెప్పి బయలుదేరుతారు. మనోజ్ మాత్రం కంగారుగా తల పట్టుకుంటాడు. తరువాత మనోజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి, ఎస్ఐ ముందు వంగి "సర్, నాకు ఫర్నిచర్ వస్తువులు కావాలి, నేను బాధితుణ్ణి," అని అంటాడు. ఎస్ఐ కొంచెం చిరాకుగా, "ఇది ఫర్నిచర్ షాపా లేక పోలీస్ స్టేషనా?" అని అరిస్తాడు.
"సర్, నా షాప్‌లో కొంతమంది వచ్చి డీల్ చేశారు. ఫేక్ ఐడీలు చూపించారు, డబ్బు తీసుకెళ్లారు," అని మనోజ్ ఒక్కసారిగా చెప్పేస్తాడు. ఎస్ఐ క్షణం ఆలోచించి, "నీ దగ్గర ఫర్నిచర్ తీసుకున్న వాళ్లు కూడా కేటుగాళ్లే, డబ్బు తీసుకెళ్లిన వాళ్లు కూడా వాళ్లే!" అని చెప్పి, "ఫేక్ ఐడీలు చూపించగానే నమ్మేస్తావా?" అని అడుగుతాడు.
"నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది ఎంత చదివావో! డిగ్రీలతో కాదు, కామన్ సెన్స్‌తో బిజినెస్ చేయాలి!" అంటూ పంచ్ వేసాడు. "బిల్ లేకుండా డీల్ చేసినందుకు నీపై కేసు వేయాలి " అని హెచ్చరించాడు. "సర్, ఇది నా మొదటి తప్పు. ఇకముందు బిల్లుతో, జీఎస్టీతోనే డీల్ చేస్తా. దయచేసి మన్నించండి," అని వేడుకున్నాడు. దీంతో ఎస్ఐ "సరే.. ఆ దొంగలు దొరికినప్పుడు ఫర్నిచర్ ఇస్తామన్నాడు. ఇంట్లోకి తిరిగి వెళ్లే ముందు మనోజ్ టెన్షన్‌తో, "బాలుకి ఈ విషయం తెలిస్తే నన్ను ఉండనివ్వడు," అంటూ తల పట్టుకున్నాడు.
ఇక చివరగా, బాలు-మీనా తమ భవిష్యత్తు కలలు కంటున్నారు. బాలు మొదటి రోజు ₹3000 జమ చేస్తాడు. మీనా కూడా ₹1000 జమ చేస్తుంది. "రోజూ ఇలా కొంతకొంతగా పొదుపు చేస్తే, ఆరు నెలల్లో మన సొంత ఇల్లు కల నెరవేరుతుంది," అంటూ బాలు ఆశగా చెబుతాడు. మీనా చిరునవ్వు చిందిస్తూ, "ఇల్లు కాదు మన ప్రేమకు చిరస్థాయిగా ఉండే గూటి అవుతుంది," అని అంటుంది.


Click it and Unblock the Notifications










