Gunde Ninda Gudi Gantalu October 30th Episode: కాళ్ల బేరానికి వచ్చిన మనోజ్.. మీనా నగలను దొంగిలించిన ప్రభావతి..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు బుధవారం ఎపిసోడ్ లో ఆసక్తికర మలుపులు తిరుగుతాయి.శృతి-రవి మధ్య అన్యోన్యతను చూసి ప్రభావతి మండిపడుతుంది. "మగాడిచేత కాళ్లు పట్టించుకోవడం ఏంటి?" అంటూ కోపంతో గదిలోకి వెళ్లిపోతుంది. కానీ శృతి మాత్రం సరదాగా స్పందిస్తూ "రవి బాగా కాళ్లు పడుతున్నాడు,నెయిల్ పాలిష్ కూడా బాగానే పెడుతున్నాడు" అని చెబుతుంది. దీంతో ప్రభావతి మరింత రెచ్చిపోతుంది. కానీ, శృతి "భర్త అంటే గౌరవం కాకుండా ప్రేమ ఉండాలి, భయం కాదు" అంటుంది. ఆ మాటలతో ప్రభావతి సైలెంట్‌గా వెళ్లిపోతుంది.బాలు ఈ సన్నివేశాన్ని గమనించి ప్రభావతిని సెటైర్లు వేస్తాడు "నీకు భార్యాభర్తలు సుఖంగా ఉంటే నచ్చదా?" అని. రవి కూడా విషయాన్ని క్లారిటీగా చెబుతాడు. " శృతి కాళ్లకు నెయిల్ పాలిష్ పెడుతున్నానని కోపగించింది" అని. అప్పుడు బాలు "ఆమెకు భయపడొద్దు, నేను చూపిస్తా" అంటూ నెయిల్ పాలిష్ తీసుకొని మీనా దగ్గరికి వెళ్తాడు.

అక్కడ మీనాకు కాళ్లకు పాలిష్ పెడుతూ ప్రేమగా కవితలు చెబుతాడు. మీనాకు సిగ్గు,ప్రభావతికి కడుపుమంట ఇరువైపులా కామెడీ సీన్ పండుతుంది. బాలు "భార్యను ప్రేమించే భర్తకు ఇలాంటి మాటలు సహజమే" అంటూ తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఇక మరోవైపు, మనోజ్ బిజినెస్‌లో భారీ డీల్ చేశానంటూ ఉత్సాహంగా రోహిణితో మాట్లాడతాడు. కానీ అతనికి ఊహించని షాక్ ఎదురవుతుంది. ఫేక్ సీఐడీ ఆఫీసర్లు వచ్చి నకిలీ నోట్లతో మోసం చేస్తారు. పోలీస్ స్టేషన్లో మనోజ్‌ను ఎస్ఐ గట్టిగా హెచ్చరిస్తాడు "బిల్లు లేకుండా డీల్ చేయడం పెద్ద తప్పు" అని.మనోజ్ పశ్చాత్తాపంతో తల వంచుతాడు. మరోవైపు మీనా-బాలు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి పొదుపు మొదలుపెడతారు. బాలు రూ.3000, మీనా రూ.1000 జమ చేస్తూ "రోజూ ఇలానే పొదుపు చేస్తే 6 నెలల్లో మన సొంత ఇల్లు కల నిజమవుతుంది" అని భావిస్తారు. ఇక గురువారం (అక్టోబర్ 30) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 543 October 30th 2025

Courtesy: Jiohotstar

నేటీ ఎపిసోడ్ లో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని బాలు-మీనా దంపతులు రూపాయి రూపాయి పొదుపు చేస్తున్నారు. ఇందుకోసం వారిద్దరూ రాత్రింబవళ్ళూ కష్టపడి పనిచేస్తుంటారు. బాలు ఉదయం లేచిన క్షణం నుంచీ రాత్రి వరకు కష్టపడి పని చేస్తూ ఉంటాడు. ఈ శ్రమ వల్ల అతనికి కాళ్ల నొప్పి వస్తుంది. "నాకు కాళ్లు నొప్పిగా ఉన్నాయి, మీనా" అని చెబుతాడు బాలు. అప్పుడు ప్రేమతో మీనా, "ఒక రోజైనా రెస్ట్ తీసుకోండి కదా..." అని అంటుంది. కానీ బాలు మాత్రం, "పని ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మన ఇల్లు ఎలా కడతాం?" అని సమాధానం ఇస్తాడు. ఇది విన్న మీనా చిరునవ్వుతో "సరే ఆగండి" అని వేడి నీళ్ళు తీసుకువచ్చి బాలు కాళ్లకు కాపడం పెడుతుంది. ఇలా తన భర్తకు పాద పూజ చేసినట్లే సేవ చేస్తుంది.

ఇదంతా ప్రభావతి గమనిస్తుంది. "చూడు, ఇదే మొగాడి లక్షణం.. తన భార్యతో సేవలు చేయించుకుంటున్నాడు. కానీ నా రవి మాత్రం పెళ్లానికి బానిసైపోయాడు" అని బాధపడుతుంది. వెంటనే రవిని తీసుకువచ్చి చూపించాలని నిర్ణయిస్తుంది. "రా రవి, చూడు నీ అన్నయ్య ఎలా ఉందో! ఇది మొగాడి లక్షణం!" అని రవిని బాలు రూమ్ దగ్గరికి తీసుకువస్తుంది. కానీ అక్కడ సీన్ పూర్తిగా తారుమారవుతుంది. బాలు మీనా కాళ్లకు కాదు, మీనా చేతులకు కాపడం పెడుతుంటాడు. ఇది చూసి ప్రభావతి అవాక్కవుతుంది. "అయో, నువ్వు కూడా పెళ్లానికి బానిసైపోయావా!" అని ఎగతాళి చేస్తుంది. రవి మాత్రం శాంతంగా, "అమ్మ, ఇది బానిసత్వం కాదు. భార్యభర్తల మధ్య పరస్పర సహాయం మాత్రమే. మొగుడుపెళ్లాలు అన్న తర్వాత ఇలాంటివి సహజం" అని చెబుతాడు.

ఇంతలో సత్యం బాలు రూమ్‌లోకి వస్తాడు.మీనా బాలు కాళ్లకు కాపడం పెట్టుకుంటూ కనిపిస్తాడు. "ఏమైందిరా?" అని అడుగుతాడు సత్యం. "కాళ్లు నొప్పిగా ఉన్నాయి నాన్నా..." అని చెబుతాడు బాలు. "వారంలో ఒకసారైనా విశ్రాంతి తీసుకో, లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది" అని ప్రేమగా సలహా ఇస్తాడు సత్యం. ఈ సమయంలో సత్యం చేతిలో కవర్ గమనిస్తాడు బాలు. "ఏంటీ నాన్నా ఇది?" అని అడుగుతాడు. "నీ అమ్మకి ఒక గిఫ్ట్ తెచ్చాను" అని చిరునవ్వుతో చెబుతాడు సత్యం. బాలు, మీనా ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తారు.

ఆ తరువాత సత్యం ప్రభావతికి కవర్ ఇస్తాడు."ఏంటీ ఇది?" అని ప్రశ్నించే ప్రభావతికి, "నీ అన్ని సమస్యలకు పరిష్కారం ఇందులోనే ఉంది. ఓపెన్ చేసి చూడు" అంటాడు. కవర్ తెరిచే ప్రభావతి అందులో మూడు కోతి బొమ్మలు ఉంటాయి. "ఇది గిఫ్టా?" అని వ్యంగ్యంగా అడుగుతుంది. సత్యం నవ్వుతూ, "చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు ఈ మూడు కోతులు చెప్పే నీతి ఇది. అనవసరంగా ఇతరుల జీవితాలను గమనించకు. దొంగచాటుగా వినకు. ఈర్షపడకు. అలా చేస్తే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది" అని చెబుతాడు. "వీటికి పూజ చెయ్యాలా?" అని ప్రభావతి అడగగా.. "నీకు ఓపిక ఉంటే చెయ్యి, నేను అడ్డుకుంటానా?" అని సత్యం నవ్వేస్తాడు.

ఇదిలా ఉంటే.. ఇంతలో మనోజ్ తన తల్లి రూమ్ లోకి పిలుస్తాడు. ప్రభావతి గదిలోకి రాగానే.. రోదిస్తూ ప్రభావతి కాళ్లపై పడిపోతాడు. "కాపాడు అమ్మా!" అని చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు. "ఏమైంది మనోజ్?" అని కంగారుగా అడుగుతుంది ప్రభావతి. "నేను మోసపోయాను అమ్మా. వ్యాపారంలో బ్లాక్ మనీ స్కాంలో ఇరుక్కున్నాను. నాలుగు లక్షలు మోసపోయాను" అని చెబుతాడు. ఇది విని ప్రభావతి షాక్ అవుతుంది. "మళ్లీ లక్షల రూపాయలు పోగొట్టావా? చదువుకున్నావు కదా, నీ తెలివి ఎక్కడ?" అని మండిపడుతుంది. " మాట్లాడితే.. బిజినెస్‌మాన్ అంటావ్ కదా? ఇదేనా నీ వ్యాపారం?" అని దుమ్మెత్తిపోస్తుంది. "నీకంటే మీనా చాలా బెటర్! ఆమె రూపాయి రూపాయి పొదుపు చేస్తుంది, నువ్వు మాత్రం లక్షల రూపాయలు పోగొడుతున్నావ్!" అని అవమానిస్తుంది.

మనోజ్ ఏడుస్తూ, "రోహిణికి ఈ విషయం తెలిస్తే నన్ను వదిలి వెళ్తుంది అమ్మా... ఏదైనా చేసి డబ్బులు అరేంజ్ చేయి" అని వేడుకుంటాడు.
ప్రభావతి, "నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కావాలంటే గుడి ముందు అడుక్కో!" అని తిడుతుంది. "నీలాంటి మొగుడ్ని భార్య కూడా ఇష్టపడదు" అని కోపంతో అంటుంది. దీంతో మనోజ్, "ఇంటిపత్రాలు ఇవ్వు అమ్మా. వాటిని తాకట్టుపెట్టి డబ్బులు తెస్తా" అని చెబుతాడు.
"చివరిసారి నీ వల్లనే నేను అందరి ముందు అవమానానికి గురయ్యాను. మరోసారి ఇంటి పత్రాల పేరు ఎత్తకు " అని ప్రభావతి హెచ్చరిస్తుంది.

మనోజ్ మళ్లీ మళ్లీ వేడుకుంటూ, "అయితే నగలు ఇవ్వు అమ్మా. మీ నగలు తాకట్టుపెట్టి డబ్బులు తెస్తా. నెల రోజుల్లో తిరిగి ఇస్తా" అని చెబుతాడు. ప్రభావతి మనసు కరిగిపోతుంది. "నా దగ్గర నా నగలు లేవు. మీనా నగలు మాత్రమే ఉన్నాయి. అవి తీసుకున్నట్లు తెలిస్తే బాలు మీనా కల్లోలం సృష్టిస్తారు" అని చెబుతుంది. మనోజ్, "ఎవరికి తెలియకుండా తిరిగి తెస్తా అమ్మా" అని మాట ఇస్తాడు. అలా ప్రభావతి తన కోడలి నగలను దొంగిలించాలనే ఆలోచనలో పడుతుంది. "నా కొడుకువల్లనే నేను దొంగగా మారాలి అనుకుంటున్నా" అని బాధపడుతుంది.

ఆ తర్వాత ప్రభావతి గదిలోకి వెళ్ళి మీనా నగలను వెతుకుతుంది. బీరువాలో దాచిన నగల సంచి దొరకగానే, ఎవరికీ తెలియకుండా కవర్‌లో వేసుకుంటుంది. "ఈ మనోజ్ వల్ల నా జీవితం ఇంతకీ ఇబ్బందుల్లో పడుతూనే ఉంది" అని మనసులో బాధపడుతుంది. ఇంతలోనే సత్యం గదిలోకి ప్రవేశిస్తాడు! ప్రభావతి ఒక్కసారిగా కంగారుపడుతుంది. కానీ సత్యం అసలు విషయాన్ని గమనించడు. "బీరువా డోర్ మూయకుండా ఎందుకు వెళ్తావు?" అని మందలిస్తాడు. దీంతో ప్రభావతి ఊపిరి పీల్చుకుంటుంది."బ్లౌజ్ కుట్టించుకోవడానికి క్లాత్ తీసుకున్నా" అని అబద్ధం చెబుతుంది. "మనోజ్‌కి కుట్టించమని ఇవ్వడానికి వెళ్తున్నా" అని కవరింగ్ చేస్తుంది. సత్యం నవ్వుతూ.. "మనోజ్ గొప్ప బిజినెస్‌మాన్ నీ పనీ చేస్తున్నాడా?" అని ఆశ్చర్యపోతాడు. ప్రభావతి గదిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది.

ఇలా "గుండె నిండా గుడిగంటలు" ఎపిసోడ్ చివరికి బాలు-మీనా కలల ఇల్లు కోసం కష్టపడుతుండగా, మరోవైపు ప్రభావతి తన కుమారుడి తప్పిదం వల్ల కోడలి నగలను దొంగిలించాల్సిన స్థితికి చేరుతుంది. సత్యం ఆమెపై అనుమానం పెట్టకపోవడం తాత్కాలికంగా ఆమెకు ఉపశమనం కలిగించినా, ఈ దొంగతనం ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X