Gunde Ninda Gudi Gantalu November 4th Episode: బామ్మ బర్త్‌డే కోసం బాలు ప్లాన్.. ప్రభావతి నకిలీ నగల నాటకం..

Courtesy: Jio hotstar

Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడిగంటలు సోమవారం ఎపిసోడ్‌లో ఉదయం కిచెన్‌లో మీనా చేపల కూర వండుతుంటే ఆ వాసనతో బాలు ఆగలేక కిచెన్‌లోకి దూసుకెళ్తాడు. కుటుంబం అంతా తినటానికి సిద్దమవుతారు. కానీ, ప్రభావతి మాత్రం పెద్ద కొడుకు మనోజ్ కోసం వేచి ఉంటుంది. కొద్దిసేపటికే మనోజ్ కంగారుగా ఇంటికొస్తాడు. అతను నగలు తాకట్టు పెట్టిన విషయాన్ని దాచిపెట్టి "అన్నీ సేఫ్‌గానే ఉన్నాయి అమ్మా" అని అబద్ధం చెబుతాడు. వీరిద్దరి రహస్య సంభాషణను మీనా గమనిస్తుంది. ఇదే సమయంలో బాలు కోపంతో "లక్షలు మింగేశావా?" అంటూ అరిచి ఇంట్లో గందరగోళం సృష్టిస్తాడు. సత్యం, మీనా, రవి ప్రశ్నించడంతో ప్రభావతి పరిస్థితిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో రోహిణి సంతోషంగా "మనోజ్ బిజినెస్‌లో లక్ష లాభం తెచ్చాడు!" అంటూ డబ్బులు చూపిస్తుంది. బాలు, మీనా ఇద్దరూ వ్యంగ్యంగా స్పందిస్తారు. సత్యం కూడా అనుమానంతో "ఇతనికి సంపాదించడం కొత్త అనుభవం కదా" అని చెబుతాడు. ప్రభావతి సైలెంట్‌గా ఉండిపోతుంది.

రోహిణి మాత్రం అహంకారంగా "ఇది ప్రారంభం మాత్రమే" అంటుంది. చివరగా రోహిణి 50,000 రూపాయలు తీసి "ఇది మీకోసం అత్తయ్య" అంటూ ప్రభావతి చేతిలో పెడుతుంది. ప్రభావతి అవమానంతో ఏం చెప్పలేక మౌనంగా ఉంటుంది. కానీ ప్రభావతి బయటకు తీసుకెళ్లి మనోజ్‌కి "ఇది నీ డబ్బు కాదు, మీనా నగలు అమ్మి వచ్చిన డబ్బు" అంటూ హెచ్చరిస్తుంది. మనోజ్ తలదించుకుంటాడు. తరువాత రోజు ఉదయం కాఫీ విషయంలో ప్రభావతి-బాలు మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ సమయంలో సత్యం తల్లి సుశీలమ్మ ఫోన్ చేసి "నా 75వ పుట్టినరోజు మీ అందరితో జరుపుకోవాలి" అని చెబుతుంది. మీనా సంతోషంగా "మీరు ఇక్కడికే రండి, వేడుకలు ఇక్కడే జరుపుదాం" అంటుంది. కానీ ప్రభావతి మాత్రం మనసులో భయపడుతుంది. "అత్తయ్య ఇక్కడికి వస్తే నా రహస్యాలు బయటపడతాయేమో!" అని ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక మంగళవారం(నవంబర్ 4వ) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 546 November 4th 2025 here is full story
Courtesy: Jiohotstar

ఎపిసోడ్ ప్రారంభంలో బాలు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. "శీలా డార్లింగ్ ఈ సంవత్సరానికి 75 ఏళ్లు అవుతుంది... ఈ కాలంలో ఇంత వయసు దాటడం అంటే మామూలు విషయం కాదు!" అని తనలోతననే అనుకుంటాడు. "ఈ సారి ఆమె బర్త్‌డేను గుర్తుండిపోయేలా జరుపుతా!" అని నిర్ణయించుకుంటాడు.ఇంతలో మీనా వచ్చి "ఏంటి బాలు గారూ, ఒంటరిగా ఏమో పెద్ద ప్లాన్ ఆలోచిస్తున్నట్టున్నారు?" అని నవ్వుతూ అడుగుతుంది. బాలు చిరునవ్వు చిందిస్తూ "శీలా డార్లింగ్ గురించే ఆలోచిస్తున్నా. ఈ సారి బర్త్‌డే స్పెషల్‌గా జరుపాలి అనుకుంటున్నా." మీనాకు ఆ ఆలోచన నచ్చుతుంది. "మరి బహుమతిగా ఏం ఇవ్వాలనుకుంటున్నారు?" అని అడుగుతుంది. బాలు "ఏదైనా విలువైనది ఇవ్వాలి, మనసు పెట్టి గుర్తుండే గిఫ్ట్ కావాలి." అని అంటాడు. మీనా ఒక క్షణం ఆలోచించి "మనకు మొదట్లో బంగారం ఇచ్చారు కదా, మనం కూడా బంగారం వస్తువే గిఫ్ట్‌గా ఇస్తే బాగుంటుంది." అంటుంది. దీంతో బాలు ఉత్సాహంగా "అవును, గోల్డ్ చైన్ ఇస్తే సూపర్ గిఫ్ట్ అవుతుంది!" అంటారు.

మీనా"కానీ డబ్బులు ఉన్నాయా?" అడుగుతుంది. బాలు "ప్రస్తుతం లేవు కానీ, అప్పు చేసిన సరే తెచ్చేస్తా!" అని ధైర్యంగా చెబుతాడు. మీనా అతని నిబద్ధతను చూసి సంతోషపడుతుంది.తర్వాత సీన్‌లో బాలు తన స్నేహితులు, కస్టమర్ల దగ్గర డబ్బుల కోసం తిరుగుతాడు. ప్రతీ చోట "ఇప్పుడే ఇవ్వలేం", "వచ్చే నెల చూసుకుందాం" అని నిరాశ కలిగించే సమాధానాలు వస్తాయి. తన కాళ్లతో కష్టపడి తిరిగినా చేతిలో ఏమీ పడదు. బాలు ఇంటికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. మీనా గమనించి"ఏమైంది? పని అయిందా?" అని అడుగుతుంది.బాలు నిరుత్సాహంగా "అదేమీ కాదు మీనా... ఈ రోజు బాగోలేదు. ఒకడు అయితే అప్పు ఇవ్వడానికి ముందు కారు తాకట్టు పెట్టమన్నాడు."

మీనా ఒక్కసారిగా మండిపడుతుంది "ఏమిట్రా అది? మన కారు తాకట్టు పెడతామా? అలా అయితే ఆ కారు తోనే వాడిని గుద్దేస్తే సరిపోతుంది!" అంటుంది. బాలు నవ్వి "నీ కోపం కాస్త తగ్గించు, ఇప్పుడు ఏం చేద్దాం?" అంటాడు. మీనా "మీ అమ్మగారి దగ్గర నా బంగారు నగలు ఉన్నాయ్ కదా. వాటిని తీసుకెళ్లి తాకట్టు పెడదాం. ఆ డబ్బులతో బామ్మకు గోల్డ్ చైన్ కొనుక్కుందాం." అంటుంది. దీంతో
బాలు కొంచెం ససేమిరా అన్నట్లుగా "నీ ప్లాన్ బాగానే ఉంది కానీ మా అమ్మ ఇస్తుందా?" అంటాడు. మీనా "అయ్యో! నేను వేసుకోవడానికి అడుగట్లేదు. నీ బామ్మ కోసం అడుగుతున్నా. అంత పెద్ద సెంటిమెంట్ కోసం ఇస్తారు." అంటుంది. బాలు "అదే కష్టం, మా అమ్మ ఒక్క రూపాయి కూడా ఇచ్చే రకం కాదు." మీనా తెలివిగా "అమ్మకు కాదు, మామయ్య (సత్యం) గారికి అడిగితే అవును అంటారు. ఆయన చెప్పగానే చేతిలో పెట్టేస్తారు." అంటుంది.

తరువాత సీన్‌లో బాలు తన తండ్రి సత్యంను హాల్‌లోకి పిలుస్తాడు. బాలు మొదట అసలు విషయం చెప్పకుండా వేరే విషయం మాట్లాడుతాడు. "ఎండాకాలం ఈ సారి బాగా ఉంది కదా నాన్నా... వానాకాలం ఎప్పుడు వస్తుందో!" అంటూ వేరే విషయాలు మాట్లాడుతాడు. సత్యం నవ్వుతూ "ఇవి కాదు బాలు, అసలు విషయం ఏంటో చెప్పు!" అంటాడు. దీంతో మీనా "బాలు ఒక విషయం చెప్పాలట మీరు వినండి" అని అంటుంది. సత్యం "ఏమిట్రా బాలు?" అని అడుగుతాడు. బాలు మొహమాటంగా - "అమ్మ దగ్గర మీనా నగలు ఉన్నాయి కదా... అవి కావాలి నాన్నా." అంటాడు. దీంతో సత్యం ఆశ్చర్యంగా "అమ్మ దగ్గరున్న నగలను ఎందుకు అడుగుతున్నావు? ఏదైనా సమస్యా?" అని అడుగుతాడు. బాలు నిజాయితీగా "నాన్నా, బామ్మ పుట్టినరోజు వస్తుంది కదా. ఆమె కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నా. అందుకే మీనా నగలను తాకట్టు పెట్టి గోల్డ్ చైన్ కొనాలని ప్లాన్ చేశా." అంటాడు. సత్యం ఆ మాట విని కళ్లలో నీరు తెచ్చుకుంటాడు. "బాలు, బామ్మ కోసం నీ ప్రేమ చూసి గర్వంగా ఉంది. నగల గురించి ఆలోచించకు, నేనే అడిగి తెచ్చిస్తా." అని మాటిస్తాడు.

ఈ మొత్తం సంభాషణను పక్కగదిలో మనోజ్ వింటాడు.అతని ముఖం ఒక్కసారిగా తెల్లబడుతుంది. "అరె! బాలు ఈ ప్లాన్ అంతా నా గుట్టు బయట పెట్టడానికే చేస్తున్నాడా?" అని భయంతో చెమటలు కారుస్తాడు.ఆందోళనతో ఆలోచిస్తూ, తన చేతిలో ఫోన్‌ను గట్టిగా పట్టుకుంటాడు. "ఇక నాకు కష్టాలు మొదలయ్యాయి" అని అనుకుంటాడు.

మరోవైపు.. తరువాత ప్రభావతి నేరుగా మీనాక్షి దగ్గరికి వెళ్తుంది. తన ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. "మనోజ్ వ్యాపారంలో నష్టపోయాడు. అందుకే మీనా నగలు ఇచ్చాను" అని నిజం చెబుతుంది. మీనాక్షి ఆశ్చర్యంతో "అయితే మీనా అడిగితే ఏం చెబుతావు?" అని ప్రశ్నిస్తుంది. ప్రభావతి ధైర్యంగా "ఆమె ఎప్పటికీ అడగదు. బాలు కూడా ప్రస్తావించడు. మనోజ్ ఆరు నెలల్లో డబ్బులు తిరిగి ఇస్తాడు. అప్పటికి నగలు తీసుకువచ్చేస్తాం." అంటుంది. ఇంతలోనే మనోజ్ వచ్చి "అమ్మా! పెద్ద కష్టం వచ్చింది. బాలు, మీనా బంగారు నగలు అడుగుతున్నారు!" అని చెబుతాడు. దీంతో ప్రభావతి షాక్ అవుతుంది. "ఎందుకు అడుగుతున్నారు తెలుసుకున్నావా?" అని అడుగుతుంది.మనోజ్ - "తెలియదు కానీ నాన్నను అడుతున్నారు." అంటాడు. దీంతో ప్రభావతి గుండె బరువెక్కుతుంది. "ఏమైనా చేసి ఆ నగలు వెంటనే తీసుకురా!" అని ఆదేశిస్తుంది.అప్పుడు మనోజ్ నిస్సహాయంగా చెబుతాడు "అమ్మా, ఆ నగలు తాకట్టు పెట్టలేదు... అమ్మేశా!"

ప్రభావతి షాక్ అయ్యి మనోజ్‌ను గట్టిగా తిట్టేస్తుంది."నన్ను అడగకుండా అమ్మేశావా? నీకు బుద్ధి లేదా?" అని. మనోజ్ "అమ్మా, తాకట్టు పెడితే 2 లక్షలు మాత్రమే వస్తాయన్నాడు, అమ్మితే 4 లక్షలు ఇస్తానన్నాడు ఆ సీట్. అందుకే అమ్మేశా." అంటాడు. ప్రభావతి కోపంతో తట్టుకోలేక మనోజ్ ని కొడుతుంది. "ఏం చేసినా, వెంటనే ఆ నగలు తీసుకురా!" అని ఆదేశిస్తుంది. వెంటేనే మనోజ్ జ్యూవెలర్‌కి కాల్ చేస్తాడు. "సార్, నేను ఇచ్చిన నగలు తిరిగి కావాలి" అని అడుగుతాడు. "వాటిని ఇప్పటికే కరిగించేశాం సార్." అని బదులిస్తాడు. మనోజ్ తల పట్టుకుని కూర్చుంటాడు. "ఇప్పుడు ఏం చెప్తా ఇంట్లో?" అని కంగారు పడతాడు.మనోజ్ ఇంటికి తిరిగి వచ్చి విషయం చెబుతాడు.

ప్రభావతి కంగారుగా "ఇప్పుడు ఏం చేయాలి? బాలు అడిగితే ఏం చెబుతాం?" అని ఆందోళన వ్యక్తం చేస్తుంది. మీనాక్షి దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతుంది. "ఏదైనా మార్గం చెప్పు!" అని. ప్రభావతి "నేను ఆ నగలను ఎప్పుడూ చూడలేదు, కానీ గోల్డ్ షాప్ ఫోటో ఉంటే కొత్తగా కవరింగ్ నగలు చేయించొచ్చు." అప్పుడు మనోజ్ "అమ్మా, నేను అమ్మేసేముందు ఫోటో తీసుకున్నాను. నా ఫోన్‌లో ఉంది!" చెబుతాడు. దీంతోప్రభావతి ఊపిరి పీలు స్తుంది. "ఇదే మార్గం! వెంటనే ఆ ఫోటోతో నకిలీ నగలు తయారు చేయించు!" అని చెబుతుంది. మనోజ్ ఆ ఫోటోతో జ్యూవెలర్ దగ్గరికి వెళ్ళి కవరింగ్ నగలు చేయమని ఆర్డర్ ఇస్తాడు. మీనాక్షి ఆ సీన్ అంతా నిశ్శబ్దంగా గమనిస్తుంది. తన మనసులో "ఇలా నకిలీ నాటకాలు చేస్తూ ఎన్ని రోజులు దాచగలరు? ఒకరోజు వీరందరూ రోడ్డు మీద పడతారు!" అని అనుకుంటుంది.

ఇక మరోవైపు కుటుంబ సభ్యులంతా భోజనానికి కూర్చుంటారు. భోజనం మధ్యలో బాలు ప్లేట్‌లో వెంట్రుక పడుతుంది. ఆ వెంటనే బాలు "భోజనంలో వెంట్రుక రావడం మంచిది కాదు. ఇది ఇంట్లో ఏదో కష్టం రాబోతోందని సూచన." అంటాడు. అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటారు. ఇంతలోనే మనోజ్, ప్రభావతి నకిలీ నగలతో ఇంటికి వస్తారు. బాలు వారిని గమనించి వ్యంగ్యంగా "ఇదిగో చూడు మీనా, చేడు కీడు ఇద్దరూ కలిసి వచ్చారు!" అని సెటైర్ వేస్తాడు. మీనా నవ్వుతుంది కానీ మీనాక్షి మాత్రం లోలోపల ఆందోళనతో కూర్చుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X