Gunde Ninda Gudi Gantalu August 16th: బాలుపై కొత్త కుట్ర.. మీనాకు దూరం చేసిన ప్లాన్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఆగస్టు 15వ తేదీ 489వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణికి కొత్త సమస్య వస్తుంది. తన మాజీ ప్రియుడు దినేష్ డబ్బులు ఇవ్వమని రోహిణిని ఇబ్బందికి గురి చేస్తాడు. డబ్బులు ఇవ్వకపోతే మాత్రం మీ అత్తగారింట్లో నీ గుట్టు రట్టు చేస్తానని హెచ్చరిస్తాడు. దాంతో రోహిణి షాక్ అవుతుంది. ఇప్పటికే నీకు చాలా డబ్బులు ఇచ్చానని చెబుతుంది. ఇకపై నీకు డబ్బులు ఇవ్వడం నాతో అవ్వదని అంటుంది. కానీ దినేష్ మాత్రం రోహిణి ఒక్కరోజు సమయం ఇచ్చి డబ్బులు అరెంజ్ కాకపోతే అప్పుడు నీ సంగతి చెబుతానని అంటాడు. దాంతో రోహిణి భయపడి పోతుంది. ఇక ఇంటికి వెళ్లి ఎలాగైనా డబ్బులు అరెంజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. అప్పటికే మనోజ్ ఇంట్లో ఖాళీగానే ఉంటాడు.
ఇక తన అకౌంట్ లో ఉన్న డబ్బులతో ఏం బిజినెస్ చేద్దామా? అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏదో వ్యాపారంలో డబ్బులు పెట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో రోహిణి వచ్చి తెలియని వ్యాపారంలో డబ్బులు పెట్టి పోగొట్టే ప్రయత్నం చేయకని చెబుతుంది. నాకు తెలియకుండా ఏ ఒక్కరికి డబ్బులు ఇవ్వకని హెచ్చరిస్తుంది. ఇక మనోజ్ కూడా సరేనని ప్రామీస్ చేస్తాడు. కానీ రోహిణి మనోజ్ దగ్గర 1 లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంటుంది. ఇక మనోజ్ ఎందుకు? అని అడిగితే నాకు ఖర్చులు ఉన్నాయని చెబుతుంది. దాంతో మనోజ్ ఇస్తాడు. మరోవైపు మీనా తన తమ్ముడు శివ స్నేహితుడు గుణను అవమానిస్తుంది. దాంతో మీనా, బాలు మధ్య చిచ్చు పెట్టాలని చూస్తాడు. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 16వ తేదీ 490 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

మీనా చేసిన పని వల్ల బాలు చిక్కుల్లో చిక్కుకుంటాడు. మీనా తన తల్లి, చెల్లిని కలిసేందుకు వాళ్ల ఇంటికి వెళ్తుంది. ఇదే సమయంలో శివ తన స్నేహితుడు, ఫైనాన్షియర్ గుణతో కలిసి ఇంటికి వస్తాడు. గుణతో తన తమ్ముడు శివను చూసిన మీనా రగిలిపోతుంది. వెంటనే అసలు నువ్వు ఎందుకు గుణతో తిరుగుతున్నావని శివను మందలిస్తుంది. తన నా స్నేహితుడని శివ బదులిస్తాడు. ఇలాంటి తాగుబోతు నీకు స్నేహితుడు ఏంటని మీనా శివను తిడుతుంది. అసలు నువ్వు గుణతో ఎందుకు తిరుగుతున్నావు? అయినా నువ్వు మా తమ్ముడిని ఎందుకు తీసుకెళ్తున్నావు నీ వెంట అని మీనా గుణను ప్రశ్నిస్తుంది. మేం ఇద్దరు మంచి స్నేహితులమని గుణ చెబుతాడు. అయినా మేం తాగుబోతులం కాదని, నీ భర్త బాలునే తాగుబోతు అని గుణ అంటాడు. దాంతో మీనాకు ఇంకా కోపం వస్తుంది. నా భర్త బాలును మరోసారి మధ్యలోకి లాగితే అస్సలు ఊరుకోనని అంటుంది. ఇక వెంటనే గుణ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సమయం దొరికినప్పుడు బాలును, మీనాను అస్సలు కలిసి ఉండనివ్వనని అనుకుంటాడు.
మరోవైపు బాలుకు ఒక హస్త జ్యోతిష్యకుడు కనిపించి పలు సూచనలు చేస్తాడు. ఇవ్వాళ నీకు బాగా లేదని చెబుతాడు. ఈ ఒక్కరోజు నువ్వు మౌనంగా ఉండమని అంటాడు. లేదంటే గొడవ మొత్తం నీవైపే తిరుగుతుందని హెచ్చరిస్తాడు. నీ నోటి దురుసు వల్ల పెద్ద గొడవ జరగబోతుందని, మౌనంగా ఇంట్లో ఉండమని చెబుతాడు. కానీ బాలు అస్సలు పట్టించుకోడు. ఇలాంటివన్నీ నేను అస్సలు పట్టించుకోనని అంటాడు. ఇక బాలు స్నేహితులు కూడా ఈరోజంతా ఇంట్లోనే ఉండమని సలహానిస్తారు. కానీ బాలు వినడు. అస్సలు ఇంటికి వెళ్తేనే పెద్ద గొడవ జరుగుతుందని అంటాడు. ఇంట్లోనే 70 శాతం గొడవలు జరుగుతున్నాయని అంటాడు. అదే సమయంలో బాలుకు ఒక పొలిటిషన్ ఫోన్ చేసి వెంటనే రమ్మని చెబుతాడు. ఇక తన స్నేహితుడు ఒకరికి కారు కావాలని చెబితే నిన్ను పిలిచానని బాలుతో చెబుతాడు. ఇక మార్నింగ్ అంతా పనులు చూసుకున్న తర్వాత రాత్రికి వాళ్లతో కలిసి మందు సిట్టింగ్ కు వెళ్తాడు. బాలు ఎంత రానని చెప్పినా కూడా వాళ్లే బలవంతంగా బాలును తీసుకొని వెళ్తారు.
ఇక వెళ్లి ఒక బారులో కూర్చొంటారు. అదే బారులో శివ స్నేహితుడు గుణ కూడా తన అనుచరులతో కలిసి అదే బారులో తాగుతూ ఉంటాడు. ఇక బాలును చూసి ఎలాగైనా ఇరికించాలని చూస్తాడు. మరోవైపు ఆ పొలిటిషన్స్ బాలును మందు తాగమని ఆఫర్ చేస్తారు. కానీ తను తాగనని చెబుతాడు. దాంతో సాఫ్ట్ డ్రింక్ తాగుతానని చెబుతాడు. ఇక చికెన్ తింటూ ఉంటాడు. ఇక బాలును వాళ్లు మందు తాగకపోయినా మందు కలపమని అంటారు. దాంతో బాలు సరేనని మందు గ్లాస్ ల్లో పోస్తాడు. దాంతో గుణ వీడియోలు తీస్తాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ అయ్యేలా చేస్తాడు. బాలు తాగుబోతు అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇక ఆ వీడియో కాస్తా మీనా వరకు చేరుతుంది. మీనా ఆ వీడియో చూడగానే షాక్ అవుతుంది. కానీ బాలు అస్సలు తాగడమని మీనా అంటుంది. ఆయన అలా తాగే వ్యక్తి కాదని బలంగా నమ్ముతుంది. వాస్తవానికి బాలు కూడా అస్సలు మందు తాగడు.
కానీ మీనాకు తన తమ్ముడు శివ స్వయంగా బావ బాలు మందు తాగిన వీడియోను చూపిస్తూ అబద్ధాలు చెబుతాడు. బావ తాగాడు అక్క అని చెబుతుంది. ఇక మీనా తప్పనిసరి పరిస్థితుల్లో నమ్మాల్సి వస్తుంది. మరోవైపు బాలు వీడియో సోషల్ మీడియాలో అందరూ చూస్తారు. ఇక తన క్యాబ్ లో ఎక్కిన కస్టమర్లు కూడా చూసి బాలును వెంటనే కారు ఆపమని అందులోంచి దిగిపోతాడు. అయితే తన వీడియోను ఎవరో కావాలని సీక్రెట్ గా తీసి వైరల్ చేశారని, అసలు అలాంటి అవసరం ఎవరికి ఉందని బాలు అనుమానిస్తాడు. ఎలాగైనా వారిని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలోనే మీనా బాలుపై విరుచుకుపడుతుంది. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










