Gunde Ninda Gudi Gantalu September 6th: సంజూ పొగరు.. పిజ్జాతో బుద్ధి చెప్పిన బాలు, బాత్‌రూమ్‌‌లోకి పరుగులు

కూతురు, అల్లుడు పుట్టింటికి రావడంతో ఎవరి బెడ్‌రూం ఇవ్వాలా? అని ప్రభావతి ఆలోచిస్తుంది. మనోజ్‌ను బెడ్ ఇవ్వమని అడగ్గా.. మనోజ్‌కి ఆ రూమ్‌లోనే నిద్రపడుతుందని రోహిణి కుదరదు అన్నట్లుగా ఆన్సర్ ఇస్తుంది. మేం పైన మేడ మీద పడుకుంటామని మీరు మా రూమ్ తీసుకోమ్మని శృతి చెప్పడంతో రోహిణి సరేనని అంటుంది. అయితే అప్పుడే ఇంట్లో ఎవరెవరు? ఎక్కడ పడుకుంటున్నారు? అన్నదానిపై సుశీల డార్లింగ్‌కు క్లారిటీ వస్తుంది. ఉన్న మూడు బెడ్ రూమ్‌లలో మీరు పడుకుని.. బాలుని, మీనాని హాల్‌లో పడేస్తారా? అని మండిపడుతుంది సుశీల.

భోజనాల దగ్గర సంజూ మరోసారి గొడవ పెట్టుకోవాలని చూస్తాడు. అందరూ తినే ప్లేట్‌లో నేను తినను అని చెప్పడంతో అల్లుడి కోసం వెండి పల్లెం తీసుకొచ్చి ఇస్తుంది ప్రభావతి. ఆ వెండి పాత్ర నాదని, నా కోసం మా సుశీల డార్లింగ్ చేయించిందని చెబుతాడు బాలు. ఆ మాటలతో సంజూ రగిలిపోతూ.. విస్తరాకులో భోజనం వడ్డించమంటాడు. మీరు హోటల్‌కు వెళితే వెండి పల్లెం తీసుకెళ్తారా అంటూ బాలు సెటైర్లు వేయడంతో సంజూ రగిలిపోతాడు. భోజనం చాలా చల్లగా ఉందని, ఫ్రిజ్‌లో నుంచి తీసుకొచ్చారా? అని నానామాటలు అంటాడు సంజూ. ఇప్పుడే ఇవన్నీ ఫ్రెష్‌గా వండామని ప్రభావతి చెబుతుంది.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 505 September 6th 2025 here is full story

భోజనాలు ముగిసిన తర్వాత సంజూని ముగ్గురు అన్నదమ్ములు పైకి తీసుకెళ్లి.. ఏ బెడ్ రూమ్‌లోకి అయినా వెళ్లొచ్చు కానీ ఆ బెడ్‌రూమ్‌లోకి మాత్రం వెళ్లొద్దు అంటూ నానా హంగామా చేస్తాడు బాలు. అయితే నేను అక్కడే పడుకుంటానని సంజూ చెప్పగా అది మనోజ్ రూమ్ కావడంతో అతను బాధపెడతాడు. కిందకి వెళ్లి బాలు చేసినదంతా చెబుతాడు మనోజ్. శృతి, రవిలు పైన పడుకుంటామని చెప్పడంతో రోహిణి- మనోజ్‌లు శృతి రూమ్ తీసుకుంటారు.

బాలు, మీనా, రవి, శృతి, సుశీల డార్లింగ్ మేడపైన కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మౌనిక వస్తుంది. మీ ఆయన మరి దుర్మార్గుడిలా ఉన్నాడని, ఎలా భరిస్తున్నావని అడుగుతుంది సుశీల. అతను ఎలాంటి వాడైనా సరే మీ బావ గారు కాబట్టి గౌరవించాలని బాలుకి, రవికి చెబుతుంది. సంజూతో ఎలాంటి ప్రాబ్లం లేదు కదా ఉంటే చెప్పు.. మీనా ఇటుక రాయి తీసుకొని వస్తుంది, నేను క్రికెట్ బ్యాట్ తీసుకుని వస్తానని సరదాగా అంటుంది శృతి. అందరూ సరదాగా ఉండగా.. మౌనిక మాత్రం డల్‌గా ఉండటాన్ని చూసిన బాలు, చెల్లెలు ఏదో కష్టంలో ఉందని అనుకుంటాడు.

మీ అందరినీ మిస్ అవుతున్నానని గుర్తొచ్చి బాధగా ఉందని కవర్ చేస్తుంది మౌనిక. నేను మా ఇంటికి వెళ్లినప్పుడు అమ్మ, చెల్లి, తమ్ముడితో ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉంటానని అంటుంది మీనా. వాళ్లని వదిలిపెట్టి తిరిగి ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు కూడా అంతే బాధగా ఉంటుందని చెబుతుంది. ఒకవేళ మీ ఆయన నిన్ను ఏమైనా అంటే చెప్పు బాలు జాకీ తెస్తాడు, రవి గరిటె తెస్తాడు, నేను మైక్ తీసుకొస్తానని, మీనా ఇటుకరాయి తీసుకొస్తాడని శృతి అంటుండగా ఆ మాటలు సంజూ వింటాడు. మరేం పర్లేదు.. మీ ఆయనకి నేను గతంలో కొట్టిన దెబ్బలు గుర్తుండే ఉంటాయని, జన్మలో నీ జోలికి రాడని అంటాడు బాలు.

సంజూ వచ్చి గట్టిగా కేకలు వేసి మౌనికను తీసుకుని కిందకి వెళ్లిపోతాడు. నా పేరు మధ్యలో ఎందుకొచ్చింది? శృతి, మీ అన్న కలిసి నా మీద జోకులు వేస్తుంటే విరగబడి నవ్వుతున్నావని ఫైర్ అవుతాడు సంజూ. నీ నవ్వంతా ఇంటికి వెళ్లాక ఏడుపులుగా మారుస్తానని వార్నింగ్ ఇస్తాడు. బలవంతంగా డోర్ వేసుకుని వెళ్లిపోవడంతో తలుపు మధ్యలో మౌనిక వేళ్లు పడి నలిగిపోతాయి. అది చూసిన బాలు వచ్చి వాడిని చంపేస్తానని పూనకం వచ్చినట్లుగా ఊగిపోతాడు. ఏ గొడవ జరగకూడదనే ఉద్దేశంతో బాలుని మీనా శాంతిపజేస్తుంది.

పెళ్లి రోజు కావడంతో ఉదయాన్నే సుశీల ఆశీర్వాదం తీసుకుంటారు బాలు - మీనా. ప్రభావతి సరిగా ఆశీర్వదించకపోవడంతో మీనాను దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోమని చెబుతుంది సుశీల. దీంతో ప్రభావతి అలాగే చేస్తుంది. మీనానే ఈ ఇంటికి పెద్ద కోడలని చెప్పిన సుశీల.. నా చేతిలో ముందుగా ఎవరైతే మునిమనవడిని పెడతారో వారికి నా ఆస్తి రాసిస్తానని కండీషన్ పెడుతుంది. ఆ మాటలతో ప్రభావతి మనసు శాంతిస్తుంది.

అందరూ ఉదయాన్నే టిఫిన్ చేసేందుకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటారు. ఏం టిఫిన్ చేశావని మీనాని రవి అడగ్గా.. పూరి, కుర్మా అని చెబుతుంది మీనా. నేను ఆయిల్ ఫుడ్ తిననని సంజూ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆ వెంటనే పిజ్జా ఆర్డర్ చేయించుకుంటాడు సంజూ. డెలివరి బాయ్ ఇంటికి రాగానే, నేను వెళ్లి తీసుకొస్తానని బాలు బయటికి వెళ్తాడు. ఆ వెంటనే మిరియాలు, కారంపొడిని పిజ్జా మొత్తం చల్లేస్తాడు బాలు. దానిని తీసుకొచ్చి సంజూకి ఇస్తాడు. పిజ్జాని చూసిన మనోజ్‌కి నోరూరుతుంది. దాంతో కావాలా? అని అడిగిన సంజూ.. మనోజ్‌కి కూడా పెడతాడు.

దానిని కొరికి చూడగా బాగా కారంగా ఉండటంతో మనోజ్‌ కళ్ల నుంచి నీరు వస్తుంది. తినకపోతే పరువు పోతుందని గ్రహించిన సంజూ.. బలవంతంగా తింటాడు. దాంతో ఏం జరిగిందో అర్ధం కాక శృతి, రవిలు అయోమయంగా చూస్తుంటారు. అది మన పనేనని బాలు .. వాళ్లిద్దరికి కన్ను కొడతాడు. దాంతో రవి, శృతిలు నవ్వుకుంటారు. కారం దెబ్బకి మనోజ్ పరుగులు తీస్తాడు. పిజ్జాని మధ్యలో వదిలేయకూడదని తినాలని సంజూతో బలవంతంగా తినిపిస్తాడు బాలు. దాంతో బాత్‌రూమ్‌లోకి పరుగులు తీసిన సంజూ మంచినీళ్లు తాగేస్తూ, ఏడుస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X