Gunde Ninda Gudi Gantalu September 13th: మీనాతో బాలు రొమాన్స్.. పూలగంప కౌగిట్లో ముళ్లకంప
బాలు, మీనాలు గదిలో కాకుండా మేడపై పడుకోవడంతో దానికి ఓ పరిష్కారం ఆలోచించాలని సత్యం, సుశీల ప్లాన్ చేస్తారు. పైన ఓ గది కట్టించాలని ఇందుకు ఎంత కావాలని అడుగుతుంది సుశీల. తల్లికి ఇబ్బంది కలగకూడదని భావించిన సత్యం ఎంతైనా నేను భరిస్తానని చెబుతాడు. నువ్వు ఈ వయసులోనూ పొలం పనులు చేస్తూ రూపాయి రూపాయి కూడబెడుతున్నావని, నా కోసం మొత్తం ఇచ్చేస్తే ఎలా అని సత్యం తన తల్లితో చెప్పుకుని బాధపడతాడు. నేను ఎంత సంపాదించినా? ఎంత కూడబెట్టినా నా కొడుకు, నా మనవళ్లు, నా మనవరాళ్ల కోసమేనని చెబుతుంది సుశీల డార్లింగ్.
నువ్వేం ఆలోచించిద్దని, ఎంత కావాలో తీసుకుని ముందు మేడపై బెడ్‌రూమ్ కట్టించి.. బాలు, మీనాల సమస్యను పరిష్కరించాలని చెబుతుంది సుశీల. తల్లి మాటలతో సరేనన్న సత్యం.. రేపు పిల్లలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెబుతాడు. బాలు, మీనాలు ఎప్పటిలాగే చాప, దిండు తీసుకుని మేడపైన పడుకోవడానికి వెళ్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక సెప్టెంబర్ 13వ తేదీ, 510వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

పెళ్లి రోజు కార్యక్రమాలు ముగియడంతో ఆనందంగా ఉన్న శృతి దగ్గరికి మీనా వచ్చి నీ కోసం ఓ గిఫ్ట్ తీసుకొచ్చానని చెబుతుంది. అదేంటీ అని అడగ్గా.. ఓ పెద్ద కవర్ ఇస్తుంది. ఇదేంటీ అని మీనా అడగ్గా.. క్యాంపింగ్ టెంట్ అని చెబుతుంది. ఇది నాకెందుకు అని మీనా ప్రశ్నిస్తుంది. నువ్వు, బాలు మేడపై పడుకుంటున్నారు కదా అందుకే తెచ్చానని చెబుతుంది శృతి. ఇప్పుడు వర్షం పడేలా లేదు కదా వద్దులే అని చెబుతుంది. ఇది వర్షం వచ్చినప్పుడు వేసుకోవడానికే కాదు.. మేం ఊరేళ్లినప్పుడు నువ్వు, బాలు గొడుగు ఎందుకు వేసున్నారు అని శృతి ప్రశ్నించడంతో మీనా సిగ్గుపడుతూ తీసుకుంటుంది. బాలుతో గడిపిన రోజులు గుర్తొచ్చి వెంటనే శృతి ఇచ్చిన టెంట్ తీసుకుని వెళ్లిపోతుంది.
అందరూ పడుకున్నాక బాలు, మీనాలు శృతి ఇచ్చిన టెంట్ వేసుకుని పడుకుని రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా అందాన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు బాలు. పెళ్లాం పిట్ట, మొగుడు పిట్ట ఊసులాడుకుంటుండగా ఉందని బాలు అనగా.. పాలు తీసుకురాలేదా అని ప్రశ్నిస్తాడు. కనీసం తినడానికి కూడా ఏం లేవా అని అడుగుతాడు. బాగా ఆకలి వేస్తుందా అని మీనా ప్రశ్నించగా.. తినడానికి కాదు తినిపించుకోవడానికి అని అంటాడు బాలు. ఏం లేవని మీనా చెప్పగా.. అది పళ్లు ఉన్నాయని, అది నీకు తినిపిస్తున్నట్లు ఊహించుకుందామని అంటాడు బాలు.
ఇది చిలక , గోరింకల శోభనం కాదని.. కొద్దిరోజుల్లో మరో శోభనం వస్తుందన్న మాట అని అంటాడు బాలు. మన పెళ్లయిన దగ్గరి నుంచి ఎన్నో నైట్స్ వచ్చాయి, పోయాయని బాధపడుతుంది మీనా. ఆ రోజు మా అమ్మ విజిల్ ఊదడం వల్ల చాలా నైట్స్ వేస్ట్ అయ్యాయని చెబుతాడు బాలు. మనం ఊరికి వెళ్లి గొడుగు వేసుకున్నాం గుర్తుందా అని మీనా చిలిపిగా ప్రశ్నిస్తుంది. ఎందుకు గుర్తులేదు.. ఆ రాత్రి మనకు మొదటి రాత్రిలా అనిపించిందని సిగ్గుపడతాడు బాలు.
ఉదయాన్నే సత్యం, సుశీల, ప్రభావతిలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రోహిణి - మనోజ్, బాలు- మీనా, శృతి - రవిలు రెడీ అయి కిందకి వస్తారు. మీరందరూ ఎక్కడికో వెళ్తున్నట్లుగా ఉన్నారని అడుగుతాడు. మనోజ్- రోహిణి ఫర్నిచర్ షాపుకు వెళ్తున్నామని.. బాలు ట్యాక్సీ నడుపుకోవడానికి, మీనా పూలు అమ్ముకోవడానికి, శృతి- రవిలు స్టూడియోకు వెళ్తున్నామని చెబుతారు. మీ అందరితో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెబుతాడు సత్యం. నా ఆరోగ్యం బాలేకపోవడంతో బాలు, మీనాలు తమ గది నాకు ఇచ్చి వారిద్దరూ మేడపైన పడుకుంటున్నారని ఇది నేను చూడలేకపోతున్నాని అంటాడు. నేను ఏం చేయాలో మా అమ్మ నాకు చెప్పిందని చెబుతాడు.
మేడపైన మరో గది కట్టించాలని అనుకుంటున్నానని తన నిర్ణయం చెప్పగానే దానికి నేను వాటాలు ఇవ్వాలా? అని మనోజ్ కంగారుపడతాడు. మీ అందరికి కొంచెం తేడాతోనే పెళ్లిళ్లు అయ్యాయని.. భార్యాభర్తలు అన్నాక ఏకాంతం కావాలని చెబుతుంది సుశీల డార్లింగ్. ఇప్పుడు మా గది బాలుకు ఇవ్వమంటారా ఏంటీ? అని ప్రభావతి కూడా షాక్ అవుతుంది. నువ్వు ఎక్కువ మాట్లాడితే నాతో పాటు ఊరికి తీసుకెళ్లి పిడకలు కొట్టిస్తానని వార్నింగ్ ఇస్తుంది సుశీల డార్లింగ్.
ఇంటి కోసం ఎవరూ వాటాలు వేసుకోవద్దని, నా పెన్షన్ డబ్బులతోనే కట్టిస్తానని సత్యం చెప్పడంతో బాలు బాధపడతాడు. డబ్బులన్నీ గది కట్టించడానికి ఇచ్చేసి మీరు ఇబ్బంది పడతారని ప్రభావతి కూడా అనడంతో బాలు తల్లిని మెచ్చుకుంటాడు. ఈ వయసులో మీరు కష్టపడొద్దని మేం అడ్జెస్ట్ అవుతామని చెబుతాడు. నీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేనని అంటాడు సత్యం. ఎంత కష్టమైనా సరే పైన గదిని కట్టిస్తానని చెబుతాడు సత్యం. మీకు అంత కష్టం వద్దని మా నాన్నకి చెబితే ఆయనే కట్టిస్తాడని అంటుంది శృతి. నీకు, రవికి వేరే ఎక్కడైనా ఆయన ఇల్లు కట్టిస్తే నాకు అభ్యంతరం లేదని, కానీ ఈ ఇంట్లో చిన్న ఇటుక కొనాలన్నా అది నా డబ్బుతోనే జరగాలని తేల్చేస్తాడు సత్యం.
దాంతో సుశీల డార్లింగ్ ఈ సమస్యకు పరిష్కారం చెబుతుంది. ఉన్న గదిని రోటేషన్ పద్దతిలో ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు వాడుకోవాలని చెబుతుంది. ఒక్కో వారం ఒక్కో జంట గదిని వాడుకోవాలని అంటుంది. ఆ నిర్ణయం అందరికీ నచ్చడంతో సరేనని అంటారు. మనోజ్- రోహిణిలు తమ ఫర్నిచర్ షాపుని ఫ్రెండ్స్‌కి చూపిస్తారు. ఇంతలో ఓనర్ వచ్చి త్వరలోనే షాపుని మీ పేరు మీదకి మార్చేస్తానని, కష్టపడి బిజినెస్ చేసి పేరు నిలబెట్టాలని అంటాడు. పెద్ద ఫంక్షన్‌లో ఓపెనింగ్ కార్యక్రమం చేస్తే జనాల్లోకి బాగా వెళ్తుందని ఆయన కొన్ని సలహాలు ఇస్తాడు. షాపుకి మా అత్తగారి పేరు మీదుగా ప్రభావతి ఫర్నిచర్స్ అని పెడుతున్నట్లు మనోజ్, రోహిణిలు చెప్పడంతో వారి ఫ్రెండ్స్ వద్దంటారు.
తాను ఊరెళ్లిపోతున్నానని బాలుని జాగ్రత్తగా చూసుకోమని మీనాకి చెబుతుంది సుశీల. మీ ఫోకస్ పిల్లల్ని కనడంపైనే ఉండాలని వార్నింగ్ ఇస్తుంది. రోటేషన్ పద్దతి ప్రకారం హాల్‌లో పడుకోవాల్సి ఉండటంతో మనోజ్‌ని రోహిణి పిలుస్తుంది. అతను ఎంతకు రాకపోవడంతో బాలు వెళ్లి తలుపులు బాదుతూ గొడవ చేస్తాడు. దాంతో రోహిణి, మనోజ్‌లు బాలు తీరుపై అత్తమామలకు ఫిర్యాదు చేస్తారు. మేం ఇంట్లో ఉండాలా? వద్దా? మేం కిందకి రాకపోతే తలుపులు బద్ధలు కొడుతున్నాడని రోహిణి మండిపడుతుంది.
మనం ముందుగా అనుకున్నట్లు ఒక వారం మీరు హాల్‌లో పడుకోవాల్సిందేనని, బాలు - మీనాలకు మీ గదిని ఇవ్వాల్సిందేనని సత్యం తేల్చి చెబుతాడు. బాలు గొడవ, సత్యం తీర్పుతో మనోజ్ - రోహిణిలు అయిష్టంగానే హాల్‌లో పడుకోవడానికి ఒప్పుకుంటారు. దీంతో బాలు, మీనాలు మనోజ్ గదిలో పడుకోవడానికి వెళ్తారు. పక్కనే మంచం ఉన్నప్పటికీ మీనా చాప వేయడంతో బాలు ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతాడు. ఆ మంచం మనది కాదని, మనకి కేవలం గది మాత్రమే ఇచ్చారని మీనా చెబుతుంది.
అయితే మీరు మంచంపై పడుకోండి, నేను చాప మీద పడుకుంటానని మీనా చెప్పడంతో బాలు కోప్పడతాడు. నేను ఆశపడేది నా మీనా పక్కన పడుకోవాలని చెప్పి తను కూడా చాప మీదే పడుకుంటాడు. నీ తల నా గుండెల మీద పెట్టుకుని పడుకోమని చెబుతాడు బాలు. మీ గుండెల మీద నా తల పెడితే మీకు బరువుగా అనిపించదా? అని మీనా అడగ్గా.. ప్రేమకి బరువు తెలియదని అంటాడు బాలు. అయితే ఫ్రీజ్‌లో ఉన్న పూలన్నీ తెచ్చి మీకు చుట్టనా అని మీనా సెటైర్లు వేస్తుంది. అవసరం లేదు.. ముద్దబంతి పువ్వులా నువ్వు ఉన్నావ్.. నిన్ను చుట్టుకుని పడుకుంటానని అంటాడు బాలు.


Click it and Unblock the Notifications










