Gunde Ninda Gudi Gantalu September 20th: మనోజ్ గదిలో మీనా, ఈడ్చిపడేసిన ప్రభావతి.. బాలు ఉగ్ర స్వరూపం

బాలు సోఫా రిటర్న్ చేయడంపై ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఇకపై నాకు చెప్పకుండా నీ బోడి పెత్తనం చేస్తే ఊరుకోనని బాలుకి వార్నింగ్ ఇస్తాడు మనోజ్. అన్నయ్య మాటలతో రగిలిపోయిన బాలు.. మనోజ్ కాలర్ పట్టుకుంటాడు. ఇప్పుడే రౌడీ అని చెప్పాను.. అందుకే రౌడీయిజం చేస్తున్నావా అని రవి అంటాడు. దాంతో ఏంట్రా నైటీలు వేసుకునేవాడా నువ్వు కూడా వీళ్లతో కలిసిపోయి నన్ను అంటావా? అంటూ రవి కాలర్ పట్టుకుంటాడు బాలు. ముగ్గురు అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు దూసుకెళ్తుంటారు. వారిని విడదీయడానికి మీనా, రోహిణి, శృతి, ప్రభావతిలు కష్టపడతారు.

తాను బతికుండగానే తన కళ్లెదుటే కొడుకులు, కోడళ్లు కొట్టుకుంటూ ఉండటంతో సత్యం కుమిలిపోతారు. నేను బతికున్నాను అని అనుకున్నారా? లేదా? అంటూ కొడుకులపై కోప్పడతాడు. శృతి అమ్మగారు పెద్ద మనసుతో నా ఫర్నిచర్ షాప్ ఓపెనింగ్‌కి వచ్చి.. లక్షన్నర పెట్టి సోఫా కొన్నారని చెబుతాడు మనోజ్. బాలుగాడు ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా సొంత నిర్ణయం తీసుకుని సోఫాను వెనక్కి పంపించేశాడని దీని వల్ల ఆమె చాలా బాధపడ్డారని అంటాడు మనోజ్. వెంటనే సోఫాను ఆమె రిటర్న్ చేయడానికి వచ్చారని చెబుతాడు మనోజ్.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 515 September 20th 2025 here is full story

సోఫాను వెనక్కి ఇచ్చేయడంతో మేం ఆవిడ కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది.. సరిగ్గా అదే సమయానికి ఆ డబ్బును నేను డీలర్‌కు కట్టేశానని చెబుతాడు మనోజ్. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో శృతి అమ్మగారికి డబ్బులు ఇవ్వడానికి రోహిణి పుస్తెలతాడు తాకట్టు పెట్టిందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. రోహిణి తన మెడలో ఉన్న పసుపు తాడు చూపించడంతో.. ఇంటి పెద్ద కోడలు ఇలా పసుపు తాడుతో కనిపిస్తే మన కుటుంబానికి ఎంత అప్రతిష్ట అని ప్రభావతి బాధపడుతుంది.

మరి నా భార్య కూడా ఇన్ని రోజులు పసుపు తాడు కట్టుకునే ఉందని, మరి నీకు అప్పుడు ఎలాంటి బాధ లేదా? అని బాలు మండిపడతాడు. నీ పెళ్లానికి ఒళ్లంతా పొగరుపట్టి పుస్తెలతాడు నా ముఖాన విసిరికొట్టిందని, ఈ ఇంట్లో మీ ఇద్దరూ ఎవరినీ లెక్కచేయడం లేదని మండిపడుతుంది ప్రభావతి. బాలుగాడి వల్ల ఈ ఇంటి పరువు పోతుందని, ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుందని చెబుతుంది. నేను, నా భర్త ఈ ఇంట్లో ఉండటం బాలుకి ఇష్టం లేదని.. షాప్ పెట్టుకుని సెటిల్ అవుదామని అనుకుంటే అడ్డుపడుతున్నాడని, మనోజ్ ఎదగడం నచ్చకే అసూయతో ఇదంతా చేస్తున్నారని అంటుంది రోహిణి.

నాకు అలాంటి బుద్ధులు లేవని, అయినా తక్కువ రేటుకి మీకు షాప్ వచ్చేలా మాట్లాడిందని నేనే అని బాలు చెబుతాడు. అయినా శృతి వాళ్ల అమ్మగారు సోఫా రిటర్న్ ఇవ్వగానే వెంటనే డబ్బులు ఇవ్వకుండా రెండ్రోజులు ఆగిన తర్వాత ఇవ్వొచ్చు కదా అని అంటాడు బాలు. అయినా నేను మా అమ్మని సోఫా కొనమని చెప్పలేదని, ఆవిడ పంపిస్తే మీకొచ్చిన నష్టం ఏంటని నిలదీస్తుంది శృతి. గతంలో మా పెళ్లి రోజున సోఫా కొనిస్తానని మీ అమ్మగారు అంటే.. నేను, నాన్న వద్దని చెప్పడంతో ఆవిడ ఇలా చేసిందని అంటాడు బాలు. అసలు అన్నింటికంటే ముందే సోఫా పంపిస్తున్న విషయం మావయ్య గారికి చెప్పుంటే ఇంత గొడవ అయ్యుండేది కాదని అంటుంది మీనా.

అయినా నేనేం తప్పు చేయలేదని బాలు చెప్పగా.. చేసిందంతా నువ్వేనని, నువ్వు తప్పు చేశావని కొడుకుకి గడ్డి పెడతాడు సత్యం. ఉమ్మడి కుటుంబంలో నీ ఒక్కడి నిర్ణయాలు ఉండకూడదని క్లాస్ పీకుతాడు. జరిగిన గొడవని తలచుకుంటూ శృతి బాధపడుతుంది. ఇంతలో రవి వచ్చి మీ అమ్మగారు సోఫాను పంపిస్తున్న విషయం నాన్నకో, అమ్మకో చెప్పి ఉంటే బాగుండేదని చెబుతాడు రవి. మరి కింద ఆ విషయాన్ని ఎందుకు మాట్లాడలేదని శృతి అడగ్గా.. అక్కడ భార్యగా నీ గౌరవం కాపాడాల్సిన బాధ్యత నాదేనని అంటాడు రవి. భర్త మాటలతో శృతి మురిసిపోతుంది. నీ మీద నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగిందని చెబుతుంది.

జరిగిన గొడవని చాలా సిల్లీగా తీసుకున్న బాలు.. కిచెన్‌లో క్యారెట్‌లు తింటూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఇంతలో మీనా వచ్చి శృతి వాళ్ల అమ్మ గారు ఇదంతా కావాలనే చేసిందని నాకు తెలుసని బాంబు పేలుస్తుంది. రవిని, శృతిని ఎలాగైనా మన కుటుంబం నుంచి వేరు చేసి వాళ్లింటికి తీసుకెళ్లాలని మంటపంలో గొడవ చేశారని గుర్తుచేస్తుంది. అప్పుడు వాళ్ల ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో ఈసారి ఇలా చేశారని చెబుతుంది మీనా. రోహిణి కూడా తెలివిగా పుస్తెలతాడు తాకట్టు పెట్టి తన మీద సానుభూతి వచ్చేలా, అందరూ నీ మీద కోపం తెచ్చుకునేలా చేసిందని అంటుంది.

సోఫా గురించి ముందే మావయ్య గారికి చెప్పుంటే ఆయనే వెనక్కి పంపించేవారని.. మీరేమో తొందరపడి ఇదంతా చేశారని భర్తకు చీవాట్లు పెడుతుంది మీనా. మీ కోపమే మీకు శత్రువు అవుతుంది.. మనం ఎప్పుడు దొరుకుతామా అని ఇంట్లో చాలామంది ఎదురుచూస్తున్నారని జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది మీనా. జరిగిన గొడవతో ప్రభావతి రగిలిపోతుంది.. ఆ బాలు, మీనాలు ఈ ఇంట్లో ఉండొద్దని సత్యంతో చెబుతుంది. మనోజ్‌ని కన్నట్లే బాలుని కూడా నవమాసాలు మోసి కన్నావని, వాడు ఎందుకొద్దు అని ప్రశ్నిస్తాడు సత్యం.

మనమే ఎలాగోలా డబ్బులు సర్దుబాటు చేసి రోహిణికి పుస్తెలతాడు కొనిపెట్టాలని సత్యానికి చెబుతుంది ప్రభావతి. అది భర్తగా మనోజ్ బాధ్యత అని వాడు చూసుకుంటాడని అంటాడు సత్యం. బాలు కష్టపడి సంపాదించి మీనాకి తాళి కొన్నిచ్చాడని, మనోజ్ కూడా అలాగే చేస్తాడని అంటాడు సత్యం. పార్లర్‌కి వెళ్తున్న రోహిణిని పసుపు తాడులో చూసి ప్రభావతి ఆవేదన వ్యక్తం చేస్తుంది. నాకు రావాల్సిన డబ్బులు ఉన్నాయని .. ఏదో ఒకటి చేసి తాళి బొట్టు విడిపిస్తానని రోహిణికి చెబుతుంది. ఆ బాలుగాడి వల్ల నీ తాళి తాకట్టు పెట్టాల్సి వచ్చిందని, ఆ మీనా పూలు అమ్మి సంపాదించిన డబ్బుని పుట్టింటికి చేరవేస్తోందని అంటుంది ప్రభావతి. ఈ మాటలు విన్న శృతి.. మీనాను ఎందుకు తిడుతున్నారని నిలదీస్తుంది.

తర్వాతి ఎపిసోడ్‌లో బాలు డ్యూటీ నుంచి తిరిగొచ్చిన తర్వాత మీనా చాలా నీరసంగా కనిపిస్తుంది. ఏం జరిగిందని అడగ్గా.. కొంచెం హెల్త్ బాలేదని చెప్పడంతో నేను వెళ్లి టాబ్లెట్స్ తీసుకొస్తాను, నువ్వెళ్లి మనోజ్ రూమ్‌లో పడుకోమని చెబుతాడు బాలు. అప్పుడే ఫర్నిచర్ షాప్ నుంచి అలిసిపోయి వచ్చిన మనోజ్, రోహిణిలు తమ గదిలో మీనా పడుకుని ఉండటం చూసి రగిలిపోతారు. వెంటనే ప్రభావతి దగ్గరికి వెళ్లి విషయం చెప్పడంతో ఆమె భద్రకాళిలా ఊగిపోతూ.. మీనాని నిద్రలేపుతుంది. నీకు సెపరేట్ రూమ్‌ కావాలా? ముందే దూరిపోదామని అనుకున్నావా? అంటూ మండిపడుతుంది. అక్కడితో ఆగకుండా మీనాని బలవంతంగా కిందకి ఈడ్చేస్తుంది. అప్పుడే బయటి నుంచి వచ్చిన బాలు ఇదంతా చూసి రగిలిపోతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X