Gunde Ninda Gudi Gantalu September 27th: రోహిణి అసలు ప్లాన్ ఇదేనా.. విద్యను టార్గెట్ చేసిన మీనా..
గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో రోహిణి తన గతం బయటపడుతుందేమోనన్న భయంతో తీవ్రంగా టెన్షన్ పడుతుంది. ప్రమాదంలో గాయపడిన చింటూని మీనా అక్కున చేర్చుకోవడంతో రోహిణి గందరగోళానికి గురవుతుంది. నిద్రలోనే తన కొడుకు నిజం బయటపెడతాడేమోనని కలలు కంటుంది. ఒక్కసారిగా లేచిన ఆమె, చింటూ ఏడుస్తున్న దృశ్యం చూసి మరింత కలత చెందుతుంది. తన కొడుకు వద్దకు వెళ్లలేకపోవడం ఆమెను లోలోపల బాధపడుతుంది. తన కొడుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను దగ్గరుండి చూసుకోలేకపోతున్నాననీ బాధపడుతుంది. కనీసం మీనా లెక్క కూడా తన కొడుకును చూసుకోలేకపోతున్ననీ, ప్రమాదంలో దగ్గరకు చేరదీయలేకపోతున్నారని ఎమోషనల్ అవుతుంది రోహిణీ.
మరుసటి రోజు రోహిణి తన స్నేహితురాలు విద్యకు ఫోన్ చేసి అసలు కథ చెబుతుంది. విద్య చెప్పినట్టుగా రోహిణి ఒక మాస్టర్ ప్లాన్‌ను అమలు చేయాలని నిర్ణయిస్తుంది. విద్య మీనాను తప్పుదారి పట్టించి సహాయం కోసం పిలుస్తుంది. పువ్వులు అల్లే కాంపిటీషన్ ఉందని అబద్ధం చెప్పి మీనాను తనవైపు లాగుతుంది. మీనా వెళ్ళిపోవడాన్ని బాలు గమనించి అనుమానం వ్యక్తం చేస్తాడు. రోహిణి స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు. అయినా మీనా విద్య మాట విని బయలుదేరుతుంది. రవి, శృతి కూడా ఆఫీస్ కు వెళ్లిపోతారు. ఇక మెయిన్ టార్గెట్ తన అత్తమ్మ ప్రభావతి. ఆమెను బయటికి ఎలా పంపించాలని తెగ ఆలోచిస్తుంది. చింటూ వాళ్ళ అమ్మమ్మ ఇంకో వారం పదిరోజులు ఇంట్లో ఉండాలని ఫ్లాన్ చేస్తున్నారంటూ కట్టు కథ అల్లుతుంది. దీంతో ఆగ్రహించిన ప్రభావతి వారిని వెళ్లగొట్టాలనుకుంటుంది. కానీ రోహిణి ఆపి, బాలు వారిని తీసుకువచ్చాడు కాబట్టి మనం పంపిస్తే గొడవ అవుతుందని చెబుతుంది.

దీంతో ఏం చేయాలో అర్థం కాక ప్రభావతి తన కోడలు సహాయం కోరుతుంది. ఎలాగైనా వారిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టమని చెబుతుంది ప్రభావతి. దీంతో రెచ్చిపోయిన రోహిణి తాను దగ్గరుండి వారిని ఇంట్లో నుండి బయటకు పంపిస్తానని, ముందు తన అత్తమ్మ, మామయ్య ను కూడా ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని సూచిస్తుంది. ఇక రోహిణి చెప్పినట్లు ప్రభావతి వింటుంది. కోడలు ప్లాన్ ప్రకారం.. అత్త ప్రభావతి తన భర్త సత్యంను గుడికి తీసుకవెళ్ళమని రిక్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకని సత్యం ప్రశ్నించగా.. వెంటనే రోహిణి కలగజేసుకొని, మనోజ్ షాప్ పెడితే గుడికి వస్తానని అత్తమ్మ మొక్కుకుందని బదులిస్తుంది. 'అయినా బాలు అడుగుతే వస్తారు కానీ, నేను అడుగుతే రారా' అని ప్రభావతి నిలదీస్తుంది. సరేలే అంటూ సత్యంగుడికి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. తన ప్లాన్ వర్క్ అవుట్ అయిందని భావించే లోపే బాలు హాల్లోకి వస్తాడు. బాలు కనిపించగానే సత్యం 'ఏరా నువ్వు కూడా గుడికి వస్తావా?' అని అడుగుతాడు. తనకు ట్రిపుందని బయటికి వెళ్తున్నాను అని బాలు బదులుస్తాడు.
అయినా ఎప్పుడులేంది ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్తున్నారని ఎదురు ప్రశ్నిస్తాడు. వెంటనే సత్యం రియాక్ట్ అవుతూ.. మనోజ్ గురించి మీ అమ్మ మొక్కుకుంది అని సెటైరికల్ గా బదిలిస్తాడు. షాప్ పెట్టినందుకు కాదు.. డైలీ కరెక్ట్ సమయానికి షాప్ ఓపెన్ చెయ్యాలని మొక్కమని ఉచిత సలహా ఇస్తాడు బాలు. దీంతో ప్రభావతి చిరాకు పడుతుంది. 'నీ పని నువ్వు చూసుకో'అంటూ వాళ్లపై కోప్పడుతుంది. పక్కనే ఉన్న రోహిణి చూసిన బాలు.. పార్లరమ్మ మీరు షాప్ కు ఎందుకు వెళ్లలేదని బాలు అడుగుతాడు. ఏదో దొంగతరుడు సమాధానం ఇస్తుంది రోహిణి. పార్లరమ్మ వ్యవహారం చూస్తే బాలుకి ఏదో తేడా కొడుతుంది. సర్లేనని అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాలు. మరోవైపు తన అత్తమామలు కూడా గుడికి వెళ్లిపోవడంతో లైన్ క్లియర్ అవుతుంది.
ఇక రోహిణీ తన పథకం ప్రకారం. రోహిణి తన కొడుకు దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా మాట్లాడుతుంది. తాను తన తల్లినే అని చెప్పాలని ఉన్న ప్రస్తుత పరిస్థితులలో అది సరికాదని రోహిణి భయపడుతుంది. ఆ తరువాత తన తల్లితో మాట్లాడుతూ అసలు ఇంటికి ఎందుకు వచ్చారని, బాలు పిలిస్తే వచ్చేయడమేనా? అని అవమానిస్తుంది. తన కొడుకును అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో నుండి బయటికి పంపించడం కరెక్ట్ కాదని తెలిసినా.. తన గతం ఎక్కడ బయటపడుతుందోనని రోహిణి వారిని ఇంట్లో నుండి వెళ్లిపొమ్మని చెబుతోంది. బిడ్డ మాటకు అడ్డు చెప్పలేని తల్లి.. వెళ్లిపోవడానికి సిద్ధమవుతోంది.
మరోవైపు.. మీనా రోహిణి ఫ్రెండ్ విద్యకు సహాయం చేయడానికి వెళుతుంది. ఈ క్రమంలో రోహిణి గురించి అడుగుతూ విద్యపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మెల్లగా రోహిణి ప్లస్ బ్యాక్ తెలుసుకోవాలని మీనా ప్రయత్నిస్తుంటుంది. కానీ విద్య తెలివిగా సమాధానాలు చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ, విద్య వ్యవహార శైలి చూస్తే మీనాకు ఏదో తేడా కొడుతుంది. అయితే, రోహిణి తన ప్లాన్ ప్రకారం తన తల్లి కొడుకులను ఇంట్లో నుండి బయటికి గెంటేస్తుందా? లేదా తన కొడుకుతో ఆప్యాయంగా మాట్లాడాలని ఇంట్లో వారందరినీ బయటకు పంపించిందా? రోహిణి అసలు ప్లాన్ ఏంటి? తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి ఉండాల్సిందే. మొత్తానికి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ట్విస్టులతో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.


Click it and Unblock the Notifications










