Gunde Ninda Gudi Gantalu October 4th Episode: మీనాను ప్రభావతి వెళ్లగొట్టిందా? సూసైడ్ లెటర్‌తో సంచలనం!

Courtesy: jiohotstar

Gunde Ninda Gudi Gantalu: ప్రముఖ మా టీవీ సీరియల్ గుండె నిండా గుడిగంటలులో మరోసారి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ ప్రసారం అయింది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో బాలు సరదాగా చేసిన వ్యాఖ్యలు మీనా మనసును తీవ్రంగా గాయపరిచాయి. బాలు తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ "అన్నయ్య పెళ్లి చేసుకుంటే తమ్ముళ్లు జాగ్రత్తగా ఉండాలి.. వాడు లేచిపోతే మనకే అంట కడతారు... ఇక బతుకు బస్టాండ్" అంటూ బాలు చెప్పిన జోక్ మీనా గుండెలో కత్తిలా గుచ్చుకుంది. బాలు తనపై నిజమైన ప్రేమ కురిపిస్తున్నాడని నమ్మిన మీనా ఒక్కసారిగా బాలుపై మనసు విరిగిపోతుంది. వెంటనే కోపంతో వంటగదిలోకి వెళ్లిపోతుంది.

ఈ పరిస్థితిని అదునుగా భావించిన ప్రభావతి, "మీనా అనుకున్నట్టుగా బాలు ప్రేమతో పెళ్లి చేసుకోలేదు. నాన్న భయానికి బలవంతం కాపురం చేస్తున్నాడు. బలవంతంగా మీనాను బాలుకి అంటగట్టారు" అంటూ మీనాను కించపరుస్తుంది. ప్రభావతి మాటలతో మీనా మరింత బాధలో కూరుకుపోతుంది. ఈ క్రమంలో బాలు వచ్చి "టిఫిన్ చేసావా?" అని అడగగా మీనా కోపంతో వెళ్లిపోతుంది. "ఇకపై నేను ఏమీ చేయను" అంటూ ఘాటుగా చెబుతుంది. మనోజ్ టిఫిన్ అడిగితే కూడా, "నీ పెళ్లాన్ని అడుగు" అంటూ మండిపడుతుంది. ప్రభావతి "ఇడ్లీ పిండి లేదా?" అని అడిగితే, "ముగ్గు పిండి ఉంది, దిబ్బ రొట్ట వేసుకొని తినండి" అని కౌంటర్ ఇస్తుంది. చివరగా "మీనా ఎప్పుడో చచ్చిపోయింది... నేను దెయ్యం" అంటూ గదిలోకి వెళ్లిపోతుంది.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 525 November 6 th 2025 here is full story

courtesy: jiohotstar

తర్వాత బాలు మీనాను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. " నా మీద ప్రేమే లేదు కదా, మనసులో లేనిదే మాట బయటకు రాదు" అని ఘాటుగా సమాధానం ఇస్తుంది మీనా. బాలు కూడా "నువ్వు లేనిదే నేను లేను అన్నానంటే అవి కూడా సరదాగా అన్నానా?" అని కోపంగా చెబుతాడు. ఈ సమయంలో ఫోన్ రావడంతో బాలు బయటికి వెళ్తాడు. మీనా ఇంకా బాధలో మునిగిపోతుంది.

ఇదే సమయంలో ఇంట్లో వంటపై తగువులు మొదలవుతాయి. సత్యం రాగానే.. ప్రభావతి మీనాను పని దొంగ అని తిడుతుంది. ఉదయాన్ని బయటకు వెళ్లిందనీ, ఇక ఇంటికి చేరుకోలేదని చెబుతుంది. దీంతో బాలు టెన్షన్ పడుతాడు. వెంటనే మీనాకు ఫోన్ చేస్తాడు. కానీ, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుండటంతో బాలు మరింత టెన్షన్ పడతాడు.

మరోవైపు కాఫీ తీసుకొచ్చి సత్యానికి ఇస్తున్న ప్రభావతికి "నాక్కూడా ఇవ్వొచ్చుగా" అని బాలు అనగానే, 'పోయి నీ పెళ్లాన్ని అడుగు'అని ప్రభావతి చెప్పడం సీన్‌లో హైలైట్ అయింది. ఈ క్రమంలో "ఇంకా వదిన రాలేదా?" అని రవి అడగగా, ప్రభావతి "ఇంకా వంటమనిషి రాలేదు" అంటూ కౌంటర్ ఇచ్చింది. "నా పెళ్లాన్ని వంద అనుకుంటాను.. మీరెందుకు అంటారని" బాలు నిలదీయడంతో ఇంట్లో టెన్షన్ పెరుగుతుంది. మీనా ఇంట్లో లేకపోవడంపై శ్రుతి ప్రశ్నించగా, అందరూ నోటికొచ్చినట్టు మాట్లాడటం బాలును మరింత కోపానికి గురిచేసింది.

"ఒక్కపూట నా పెళ్లాం లేకపోతే ఇంతమంది విలవిల్లాడుతున్నారు.ఇప్పటికైనా నా మీనా విలువ తెలిసిందా?" అని బాలు ఘాటుగా చెప్పాడు. "మీనా ఇంట్లో లేకపోతే ఏమీ జరగదంటున్నాడు బాలు... నువ్వెళ్ళి వంట చెయ్" అని రోహిణికి ప్రభావతి ఆర్డర్ వేస్తుంది. ఇంతలో బాలు మీనా పుట్టింటికి కాల్ చేస్తాడు. సుమతితో మాట్లాడుతూ.. అక్కకు ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. ' అక్కడ అక్క ఉంటే.. నేను ఎలా ఫోన్ ఇస్తాను అంటుంది సుమతి. "మీనా అక్కడికి వచ్చిందా?" అని బాలుఅడుగగా.. "అక్క ఇక్కడకు రాలేదు బావా" అని సుమతి బదులిస్తుంది. దీంతో బాలు షాక్ అయ్యాడు. ఏం చేయాలో అర్థం కాక.. తన తల్లి ప్రభావతిపై అరుస్తాడు.

అప్ కమ్మింగ్ ఎపిసోడ్ లో.. మీనా పుట్టింట్లో కూడా ఆందోళన చెందుతారు. మీనా అక్క గురించి బావా ఫోన్ చేశాడని తన తల్లికి చెబుతుంది. దీంతో మీనా తల్లి పార్వతి కూడా ఆందోళన చెందుతుంది. ఉదయం తాను ఫోన్ చేసినప్పుడు అదోలా మాట్లాడిందనీ, మీనాకు ఏమైందని బాధపడుతుంది. ఈ విషయం మీనా తమ్ముడికి తెలుస్తోంది. దీంతో బాలుపై మరింత కోప్పాడుతాడు.

ఇలా మీనా పుట్టింట్లో కూడా తీవ్ర ఆందోళన నెలకొంటుంది. "బావా ఫోన్ చేశాడు, అక్క కనిపించడం లేదన్నాడు" అని మీనా సోదరి తన తల్లికి చెబుతుంది. దీంతో మీనా తల్లి పార్వతి కూడా టెన్షన్‌కి లోనవుతుంది. "ఉదయం తాను ఫోన్ చేసినప్పుడు అదోలా మాట్లాడింది, మీనాకు ఏం జరిగిందో" అని ఆందోళన చెందుతుంది. ఈ విషయం మీనా తమ్ముడికి తెలిసి, అతను బాలుపై మరింత కోప్పడతాడు.

మరోవైపు, బాలు తన స్నేహితుడు రాజేష్‌తో కలిసి రోడ్లపై తిరుగుతూ మీనాను వెతకడం ప్రారంభిస్తాడు. దారిలో కనిపించిన గుడి వెళ్లి మొక్కతాడు. "మీనా లేకుంటే వంటే ఉండదని" ఇంట్లో వ్యాఖ్యలు రావడంతో, ప్రభావతి "రోహిణి నువ్వు వండి అది తప్పని నిరూపించు" అని చెప్పడంతో రోహిణి వంటగదికి వెళ్లిపోతుంది.

ఇదే సమయంలో ప్రభావతి, కామాక్షి, శ్రుతి కలిసి మీనా గదిలో వెతుకుతుంటారు. అక్కడ శ్రుతికి ఒక లెటర్ దొరుకుతుంది. కామాక్షి ఆ లెటర్ చదివితే "నా చావుకు కారణం ఒకే ఒక్కరు - మా అత్తగారు" అని మీనా రాసిన సూసైడ్ లెటర్ బయటపడుతుంది. ఈ సంచలన సీన్‌తో నేటి ఎపిసోడ్ ముగిసింది. ప్రస్తుతం ప్రేక్షకులలో ఒక్క ప్రశ్న మాత్రమే మారుమ్రోగుతోంది - నిజంగానే మీనా సూసైడ్ చేసుకుందా? లేక ఇది మరో మలుపు కోసం వేసిన నాటకమా? ఈ సస్పెన్స్‌ను తీర్చే సమాధానం రాబోయే ఎపిసోడ్‌లో దొరకనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X