Gunde Ninda Gudi Gantalu October 18th Episode:చిక్కుల్లో రోహిణి.. దినేష్ బ్లాక్ మెయిల్.. మీనా కిడ్నాప్..

Courtesy: jiohotstar
Gunde Ninda Gudi Gantalu: ప్రముఖ మా టీవీ సీరియల్ గుండె నిండా గుడిగంటలులో మరోసారి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ ప్రసారం అయింది. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో బెడ్‌రూమ్ విషయంలో మళ్లీ వివాదం చెలరేగింది. కొడుకులు తమ భార్యలను ఎత్తుకుని తిరిగే తీరుపై ప్రభావతి అసహనం వ్యక్తం చేస్తూ, "ఇలాంటివి ఉంటే బెడ్‌రూమ్‌లో పెట్టుకోండి" అని చెబుతంది. దీంతో శృతి వెటకారంగా "ఆ బెడ్‌రూమ్ అగ్గిపెట్టెలా ఉంది" అని అంటుంది. "మాకు రూమ్ కూడా లేదు కదా?" అని మీనా దిమ్మతిరిగి సమాధానం ఇవ్వడంతో ప్రభావతి మండిపడింది.

ఈ తగువులో రోహిణి అగ్గి వేసింది. "శృతి తన పుట్టింటికి వెళ్తానంది కదా" అని చెప్పడం వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. మీనా, ప్రభావతి మధ్య మాటల తూటాలు మారాయి. ఇక మనోజ్ తన అహంకారాన్ని చూపిస్తూ, "నేను బిజినెస్‌మాన్‌ని, మీలా డ్రైవర్ కాదు" అని అన్నదమ్ములను తక్కువ చేసి మాట్లాడాడు. దాంతో శృతి "నీ లాగా గుడి ముందు మా ఆయన అడుక్కోవడం లేదండి!" అని ఘాటుగా సమాధానం ఇచ్చింది.

ఇక సత్యం ఫ్యామిలీ మీటింగ్ పెట్టి, "ఇంటి ఖర్చులకు అందరూ సహకరించాలి" అని చెప్పడంతో కొత్త వివాదం మొదలైంది. మనోజ్ మొదట 2000 ఇస్తానని చెప్పగా, బాలు, ప్రభావతి విమర్శించడంతో 8000కి పెంచాడు. బాలు-రవి 10,000 చొప్పున ఇవ్వాలని చెప్పారు. మీనా "తాను కూరగాయల కోసం 2000 ఎక్స్ట్రా" అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. శృతి 10,000 ఇవ్వడం ప్రభావతిని సంతోషపరచగా, బాలు "అమ్మ డాన్స్ స్కూల్ పెడితేనూ, డబ్బులు ఇవ్వడం లేదే!" అని చురక వేసాడు. తర్వాత అన్నదమ్ములు దాబాపై మాట్లాడుకుంటూ, "ఈ డబ్బు నాన్న ఏం చేస్తున్నాడు?" అని మనోజ్ ప్రశ్నించగా, బాలు "మింగడమే వస్తుంది" అంటూ ఆగ్రహించాడు. మాటల యుద్ధం దాడులకు దారి తీసింది. రవి మధ్యలోకి వచ్చి "ఇకమీదట మీనా వదినపై మాట మాట్లాడితే వదలను" అంటూ హెచ్చరించాడు.

Gunde Ninda Gudi Gantalu serial Expected episode 535 October 18th 2025 here is full story

Courtesy: jiohotstar

ఇక కిచెన్‌లో మీనా, శృతి, రోహిణి మధ్య తగువులు చెలరేగాయి. శృతి "మేము కుటుంబం అనుకున్నాం, నువ్వు వచ్చావు" అని వెటకారంగా చెప్పడం, రోహిణి "మామయ్యకు 2000 ఎందుకన్నావ్?" అని అడుగుతుంది. దీంతో మీనా "గుడ్డు పెట్టే కోడి లేని నొప్పి, ఆమ్లెట్ తినేవాళ్లకు ఎందుకో?" అని కౌంటర్ ఇవ్వడం హైలైట్ అయ్యాయి. మరుసటి రోజు శృతి అమ్మ శోభ దీపావళి ఆహ్వానం ఇవ్వగా, బాలు "ఈసారి ఇంట్లోనే జరుపుకుందాం" అని చెప్పడంతో ప్రభావతి వెటకారం చేస్తుంది. అయితే మీనా దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తుంది - "మీ దయదక్షిణానే మేము బతుకుతున్నామా?" అని. ప్రభావతి ఒక్కసారిగా నిశ్శబ్దమై తలదించుకుంది.

ఇక "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ తర్వాతి ఎపిసోడ్‌లో ఓ సస్పెన్స్‌ మలుపు చోటుచేసుకోబోతుంది. ప్రభావతి ఇంట్లో దీపావళి సంబరాలు ప్రారంభమవుతాయి. అన్నదమ్ములు, తోడికోడళ్ళు కలిసి ఇంటిని పూలతో, రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. ఆనందం నిండిన వాతావరణంలో అందరూ కలిసి లక్ష్మీదేవి పూజ చేస్తారు. అయితే ఈ సంతోష సమయంలో కూడా అత్త ప్రభావతి తన దుస్స్వభావాన్ని ఆపుకోలేకపోతుంది. మీనా పూజలో ఏదైనా తప్పు జరిగిందని చూపిస్తూ మళ్లీ ఆమెను అవమానపరుస్తుంది. కానీ ఈసారి మీనా ఆ మాటలను పట్టించుకోకుండా ప్రశాంతంగా అక్కడి నుండి వెళ్లిపోతుంది.

ఇంతలో రోహిణికి అనుకోని ఫోన్‌ కాల్‌ వస్తుంది. ఫోన్‌ ఎత్తి చూసేసరికి అది ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ దినేష్‌ది. రోహిణి ఒక్కసారిగా షాక్‌ అవుతుంది. "నన్ను గుండాలతో కొట్టించినా నీకు ఇంకా బుద్ధి రాలేదా?" అని రోహిణి అనగానే.. 'అంటే.. పోలీసులకు పట్టించింది నువ్వేనా? 'అంటూ దినేష్ ఆగ్రహంతో అరుస్తాడు. "నీ జీవితాన్ని రోడ్డుకి ఈడ్చుతా" అంటూ భయపెడతాడు. భయంతో వణికిపోయిన రోహిణి ఏం చేయాలో అర్థం కాక "దయచేసి, ఏమి కావాలో చెప్పు" అని బతిమిలాడుతుంది. దినేష్ "నాకు వెంటనే లక్ష రూపాయలు ఇవ్వాలి. లేదంటే నీ సీక్రెట్స్ మొత్తం బయటపెడతా" అని స్పష్టంగా చెబుతాడు.

రోహిణి భయంతో తన స్నేహితురాలు విద్య దగ్గరకి పరుగెత్తి వెళ్తుంది. జరిగిన విషయాలన్నీ చెబుతుంది. "దినేష్ ఇప్పుడు ఏమైనా చేస్తాడు. నేను అతనికి డబ్బు ఇవ్వకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. విద్య కూడా ఆ విషయం విని షాక్ అవుతుంది. "ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు రోహిణి" అంటూ తల పట్టుకుంటుంది.

ఇదిలా ఉండగా, దినేష్ తన మనుషులను రోహిణిని ఫాలో చేయమని ఆదేశిస్తాడు. "ఆమె రెడ్ కలర్ శారీ కట్టుకుని ఉంటుంది" అని చెబుతాడు. అయితే అదే సమయానికి మీనా కూడా అదే అపార్ట్‌మెంట్‌లోకి పూలు ఇవ్వడానికి వస్తుంది. యాదృచ్ఛికంగా ఆమె కూడా రెడ్ శారీ కట్టుకుంది. దాంతో గుండాలు మీనానే రోహిణిగా పొరబడతారు. బాలు ఫోన్‌లో మీనాతో మాట్లాడుతుండగా, ఒక్కసారిగా లైన్ కట్ అవుతుంది. కొద్ది సేపటికి ఆమె కనబడకపోవడంతో బాలు తీవ్ర ఆందోళనలో పడతాడు.

ఇక తర్వాత ఏమవుతుంది? బాలు మీనాను ఎలా రక్షిస్తాడు? దినేష్ రోహిణిపై తన ప్లాన్‌ను కొనసాగిస్తాడా? రోహిణి రహస్యం బహిర్గతం అవుతుందా? అనే ప్రశ్నలతో సీరియల్‌ కథ ఉత్కంఠభరిత మలుపు తీయబోతోంది. దీపావళి ఆనందం మధ్య ప్రారంభమైన ఈ భయానక సంఘటన ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెప్పొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X