Gunde Ninda Gudi Gantalu October 25th Episode: బాలు కొత్త అవతారం.. అత్త,తోడి కోడళ్లతో మీనా శపథం..
Courtesy: jiohotstar
Gunde Ninda Gudi Gantalu:గుండె నిండా గుడిగంటలు శుక్రవారం ఎపిసోడ్ లో కుటుంబ గౌరవం, ఆత్మాభిమానం, ప్రేమల మధ్య తారతమ్యాలు మరోసారి చెలరేగాయి. పండగ పూట ఇంట్లో సంతోషం నెలకొనాలని అనుకున్న ప్రభావతి కుటుంబంలో, ఒక్క చెక్కు కారణంగా పెద్ద కలహం మొదలైంది. శృతి తల్లి శోభ, "ఇంటి నిర్మాణానికి ఉపయోగించుకోండి" అంటూ ఐదు లక్షల చెక్కు ఇవ్వగా, సత్యం దాన్ని అవమానంగా తీసుకున్నాడు. తన కష్టపడి సంపాదించే జీవితం మీద ఎవరి దయ అవసరం లేదని గట్టిగా చెప్పి, శోభపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాంతో శోభ కూడా పొగరుగా మాట్లాడడంతో బాలు ఆమెపై విరుచుకుపడ్డాడు. రవి తన సోదరుడి ప్రవర్తనపై ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో సత్యం, బాలు హద్దు దాటుతున్నాడని భావించి, అతనిపై చేయి వేయడం ఇంటి వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ ఘటనతో బాలు మనసు విరిగిపోయి మద్యం తాగి బాధలో మునిగిపోయాడు.
ఇక సత్యం తన మనసులోని ఆవేదనను మీనాతో పంచుకుంటూ, " తన కొడుకు తప్పు చేయకూడదనే భయంతోనే మందలించాను" అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. మీనా అతనికి ధైర్యం చెప్పి, "అతడు కూడా బాధతోనే అలా ప్రవర్తించాడు" అంటూ సర్దిచెప్పింది. మరోవైపు బాలు బాధతో తాగి రాజేష్ వద్ద తన వేదనను బయటపెడతాడు. " మా నాన్న నన్ను అందరి ముందు కొట్టాడు. శోభ డబ్బు ఇచ్చి అవమానించింది" అంటూ కన్నీళ్లు కారుస్తాడు. రాజేష్ అతనిని ఓదారుస్తూ, "నీ నాన్న కోపం నీ మీద కాదు, పరిస్థితుల మీద" అని చెబుతాడు. ఈ మాటలు బాలు హృదయాన్ని తాకి తండ్రిని క్షమాపణ కోరాలని నిర్ణయించుకుంటాడు. బాలు తప్పతాగి ఇంటికి చేరుకుంటాడు. బాలు తూలి పడిపోతే సత్యం పరుగెత్తి తన కొడుకును కౌగిలించుకొని, "నా కోపం నీ మీద కాదు, నా బాధ మీద" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇద్దరూ మౌనంగా ఒకరినొకరు చూస్తూ ఆత్మీయతతో కరిగిపోయారు.

Courtesy: jiohotstar
'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ రాబోయే ఎపిసోడ్ భావోద్వేగాలతో సాగనుంది. కథ బాలు తాగిన మత్తులో ఇంటికి చేరుకుంటాడు. ఈ క్రమంలో మీనా అతని కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటుంది. "అన్నం పెడతాను రండి" అంటూ ప్రేమతో పలుకుతుంది. కానీ బాలు తూలి నేలపై పడిపోతాడు. ఆ సమయానికి సత్యం వచ్చి తన కొడుకును పట్టుకుంటాడు. కానీ బాలు మాత్రం తండ్రి వైపు చూడకుండా మౌనంగా ఉంటాడు.
ఆ దృశ్యం సత్యం మనసును పగలగొడుతుంది. తండ్రి ప్రేమ, బాధ, ఆవేదన అన్నీ ఒకేసారి ముఖంలో వ్యక్తమవుతాయి. "ఏమైనా తిన్నావా రా? నామీద కోపమా? అందుకే తాగి వచ్చావా?" అని సత్యం ప్రశ్నిస్తాడు. అప్పుడు బాలు 'అదేం లేదు నాన్న' అని సమాధానమిచ్చినా, లోపల పశ్చాత్తాపంతో ఉంటాడు. సత్యం మరింత మృదువుగా "నువ్వు ఎక్కడ తప్పు చేస్తావో అన్న భయంతోనే కొట్టాను. నీపై ప్రేమతో అలా చేశాను" అని చెప్పడంతో బాలు కదిలిపోతాడు. తండ్రి మాటల్లోని హృదయాన్ని తాకే నిజాయితీ అతనిలో మార్పును తెస్తుంది.
ఇంతలో ప్రభావతి అక్కడికి వస్తుంది. ఆమె తిడుతూ "పండుగ పూట ఇంట్లో ప్రశాంతం లేకుండా చేస్తున్నావ్ కదా?" అని బాలు మీద కోపం చూపిస్తుంది. "శ్రుతి వాళ్ల అమ్మ 5 లక్షలు ఇస్తే ఎందుకు తీసుకోలేదని గొడవ చేస్తావ్?" అని మండిపడుతుంది. ఈ వ్యాఖ్యలు మీనాను కుదిపేస్తాయి. మీనా కోపంతో "డబ్బు తీసుకోకపోవడం తప్పేనా? ఎందుకు ఇస్తున్నారో తెలుసుకోవాలి కదా!" అని ఎదురు తిరుగుతుంది. "ఇది డబ్బు విషయం కాదు, మామయ్య ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం!" అంటూ మీనా గట్టిగా చెబుతుంది. ఆమె మాటల్లో భర్తపట్ల గౌరవం, కుటుంబ పరువుపట్ల గౌరవం స్పష్టంగా వ్యక్తమవుతాయి.
తర్వాతి రోజు ఉదయం బాలు ఆశ్చర్యకరంగా మారిపోతాడు. తెల్లవారగానే లేచి స్నానం చేసి పూజ చేయడం అందరినీ షాక్‌కి గురి చేస్తుంది. తండ్రి చెప్పిన మాటలు అతనిలో మార్పు వస్తుంది. "ఈ ఇంట్లో ఇక గొడవలు వద్దు. మాకు చేతనైనప్పుడు రూమ్ మేమే కట్టించుకుంటాం" అని బాలు చెబుతాడు. అతని మాటల్లో ఆత్మాభిమానం, బాధ్యత స్పష్టంగా కనిపిస్తాయి.
కానీ అదే సమయంలో మనోజ్, రోహిణి వ్యంగ్యంగా "ఇలాగే నీ భార్య కూడా నువ్వు తెచ్చిన తర్వాతే నగలు వేసుకుంటానని చెప్పింది. ఇప్పటి వరకూ అది జరగలేదు. ఇప్పుడు రూమ్ అంటావా?" అని ఎగతాళి చేస్తారు. అది విని మీనా తట్టుకోలేక "ఇప్పటికైనా ఆ రూమ్ కట్టిస్తాను. ఇది నా శపథం!" అని గట్టిగా చెబుతుంది. ఆ సమయంలో మీనా గొంతులో స్వాభిమానం, ఆత్మవిశ్వాసం, భర్తపై ప్రేమ అన్నీ కలిసిపోతాయి. ఈ ఎపిసోడ్ గది వివాదం నుంచి కుటుంబ గౌరవం, ఆత్మాభిమానం, దాంపత్య బంధాల విలువను తెలియజేసే మలుపుగా మారుతుంది.


Click it and Unblock the Notifications










