Gunde Ninda Gudi Gantalu Weekly: మనోజ్ రోహిణిలను వరించిన అదృష్టం.. ఆందోళనలో బాలు మీనా
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
ఆగస్టు 11వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మనోజ్ కు అదృష్టం కలిసి వచ్చింది. తను తన మాజీ లవర్ కల్పనా గురించి వెతుకుతూ ఉంటే తానే ఎదురై వస్తుంది. రోహిణి పార్లర్ కు రావడంతో వెంటనే గుర్తుపట్టి మనోజ్ కు ఫోన్ చేసి చెబుతుంది రోహిణి. ఆ తర్వాత పోలీసులను పిలిచి అప్పగిస్తారు. కానీ పోలీసులకు మనోజ్ పైనే తిరిగి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తుంది కల్పనా. కానీ పోలీసులు నమ్మరు. మనోజ్ చూసిన బ్యాంక్ స్టేట్ మెంట్ ఆధారాలను పరిశీలించి కల్పనా 40 లక్షలు ముంచేసిందని తేల్చేస్తారు. ఇక వెంటనే మనోజ్ కు డబ్బులు తిరిగి ఇవ్వాలని పోలీసులు ఆదేశిస్తారు. ఇవ్వకపోతే పలు పలు సెక్షన్ల కింద కేసు పెట్టి ఇండియా నుంచి వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తారు. మరోవైపు అదే పోలీస్ స్టేషన్ కు మీనా, బాలు కూడా వస్తారు. మీనా స్కూటీ విడిపించేందుకు ప్రయత్నం చేస్తారు.

ఆగస్టు 12వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మొత్తానికి మనోజ్ మాజీ లవర్ కల్పనా డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకుంటుంది. అన్ని దారులు మూసుకుపోవడంతో తిరిగి ఇస్తానని చెబుతుంది. ఇక పోలీసులు ఇప్పుడే ట్రాన్స్ ఫర్ కొట్టమని అంటారు. రోహిణి 40 లక్షలు కాదు, మా డబ్బులతో వ్యాపారం చేసి సంపాదించావు కాబట్టి 45 లక్షలు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఇక కల్పనా ఆ డబ్బులు మొత్తం చెల్లిస్తుంది. దీంతో మనోజ్ రోహిణి ఫుల్ ఖుషి అవుతారు. పోయిన డబ్బులు వచ్చినందుకు సంతోషిస్తారు. ఇక వెంటనే వెళ్లి ఇంట్లో వాళ్లకు చెబుదామని మనోజ్ అంటాడు. కానీ ఇప్పుడే వద్దని రోహిణి చెబుతుంది. చెబితే డబ్బులు మొత్తం లాగేసుకుంటారని, అప్పుడు మనం వ్యాపారం చేయడానికి ఉండదని అంటుంది. మా నాన్న ఈ డబ్బులు ఇచ్చాని ఇంట్లో చెబుతానని అంటుంది. ఇక అలాగే చెబుతుంది. దీంతో బాలు, శృతి, రవి, సత్యం అంతా ఆశ్చర్యపోతారు. ప్రభావతి మాత్రం 25 లక్షలు వచ్చాయని రోహిణి చెప్పడంతో ఆనందంలో మునిగి తేలుతుంది. మరోవైపు బాలు, మీనాలకు స్కూటీ రావడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోతారు.
ఆగస్టు 13వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
రోహిణికి సడెన్ గా 25 లక్షలు రావడంతో బాలు సందేహిస్తాడు. దీంతో రోహిణిపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. జైలులో ఉన్న మీ నాన్న ఇప్పుడు నీకు డబ్బులు పంపించడం ఏంటీ? అసలు ఎలా పంపాడు అని ప్రశ్నిస్తాడు. నువ్వు మనోజ్ కు ప్రతిసారి 40 లక్షలు మింగావని హేళన చేస్తున్నావని నేనే ఒకసారి మా నాన్నను అడిగాను. ఆయన జైలుకు వెళ్లడానికి ముందే తీసి పక్కన పెట్టారు. ఇక ఇప్పుడు మా మావయ్య నాకు అందించారు. మరో 15 లక్షలు కూడా అకౌంట్ లోకి వస్తాయని చెబుతుంది. సరిగ్గా 40 లక్షలు అవుతున్నాయి కదా, కొంపదీసి మీకు మనోజ్ మాజీ లవర్ గానీ దొరకలేదు కదా. అని బాలు ప్రశ్నిస్తాడు. ఆ డబ్బులో నాకు, రవి కూడా వాటా ఉందని అంటాడు. అది ఎక్కడ ఉందే తెలియదు. ఇవి మా నాన్న ఇచ్చిన డబ్బులు. మేం వ్యాపారం చేసి లాభాలు వచ్చాక మామయ్యకు తిరిగి ఇస్తామని రోహిణి సమాధానం ఇస్తుంది. అయినా కూడా బాలుకు ఆ డబ్బులపైనా అనుమానం ఉండే ఉంటుంది. పదేపదే అడుగుతూనే ఉంటాడు. ఈ క్రమంలో మనోజ్ సమాధానం చెప్పబోయి ఇర్కుపోతుంటాడు. దాంతో నువ్వు డబ్బుల గురించి అస్సలు మాట్లాడకు అని రోహిణి హెచ్చరిస్తుంది.
ఆగస్టు 14వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మొత్తానికి 40 లక్షలు తిరిగి రావడంతో రోహిణి ఫుల్ ఖుషి అవుతుంది. ఆ డబ్బులు తన తండ్రి పంపించాడని కొత్త నాటకం మొదలు పెట్టానని తన స్నేహితురాలు విద్యకు చెబుతుంది. ఇక అన్ని సమస్యలు తీరినట్టే అని సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇదే సమయంలో రోహిణి మాజీ ప్రియుడు దినేష్ వచ్చి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తాడు. లేదంటే నీ గుట్టును మీ ఇంట్లో తెలియజేస్తానని బెదిరిస్తాడు. 1లక్ష కావాలని అంటాడు. ఇక వెంటనే రోహిణి ఇంటికి వెళ్లి మనోజ్ దగ్గర డబ్బులు తీసుకుంటుంది. ఇక మరోవైపు మౌనికాను బర్త్ డే పార్టీకి అని తీసుకెళ్లి సంజూ ఘోరంగా అవమానిస్తాడు. తన స్నేహితుడు మౌనికాతో అసభ్యంగా ప్రవర్తించినా పట్టించుకోడు. పైగా మౌనికాను కొట్టి అక్కడి నుంచి వెళ్లగొడుతాడు. దాంతో మౌనికా రోడ్డుపై ఒంటరిగా బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తుంది. వాహనాలు ఎదురుగా వస్తున్నా పట్టించుకోదు. ఇక మీనా చూసి వెంటనే రక్షిస్తుంది. ఏమైందని పూర్తిగా వివరాలు తెలుసుకుంటుంది. నువ్వు తిరిగి వెళ్లడానికి నేను ఒప్పుకోను అని అంటుంది.
ఆగస్టు 15వ తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మౌనికా తన పరిస్థితిని మొత్తం మీనాకు వివరిస్తుంది. సంజూ ఫుల్ టార్చర్ చేస్తున్నాడని చెబుతుంది. కానీ ఇప్పుడే నేను ఇంటికి రాలేనని అంటుంది. మా అన్నయ్య బాలును నువ్వు ఎలా మార్చుకున్నావో అలాగే నేను కూడా మార్చుకుంటానని చెబుతుంది. ఒక మీనా ఇదే చివరి అవకాశం అని అంటుంది. మరోసారి నిన్ను కన్నీళ్లతో చూస్తే మీ అన్నయ్యకు నిజం చెబుతానని అంటుంది. దాంతో సరేనని మౌనికా తిరిగి ఇంటికి వెళ్తుంది. అదే సమయంలో సంజూ తిరిగి వచ్చి మౌనికాపై మంచి పచ్చిబూతులు మాట్లాడుతాడు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోమని అంటాడు. దాంతో మౌనికా బాధపడుతుంది. మరోవైపు బాలుకు ముప్పు ఉందని సోదీ చెప్పేవాళ్లు జ్యోష్యం చెబుతాడు. కానీ బాలు పట్టించుకోడు. తనకు రాజకీయ నాయకుడి నుంచి ఫోన్ రావడంతో వెళ్లిపోతాడు. ఇక అక్కడ బాలు సరిగానే ఉన్నప్పటికీ గుణ చేసిన పనికి అవమానం పాలు అవుతాడు.


Click it and Unblock the Notifications










