Gunde Ninda Gudi Gantalu Weekly: ఆకాశానికి మనోజ్ నిచ్చెన.. ఆపదలో బాలు.. న్యాయం కోసం మీనా పోరాటం
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 18వ తేదీ నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
ఆగస్టు 18వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
తన మాజీ లవర్ నుంచి డబ్బులు తిరిగి వచ్చిన తర్వాత మనోజ్ ఆ డబ్బులతో వ్యాపారం చేయాలని చూస్తుంటాడు. ఈ క్రమంలో మనోజ్ కారు కొనుక్కుందామని అనుకుంటాడు. దీంతో వెంటనే కారు కన్సల్జెన్సీకి వెళ్లి కార్లన్నీ చూస్తుంటాడు. అక్కడున్న కార్లలో ఒక కారును సెలెక్ట్ చేస్తాడు. అంతేకాదు తన భార్య రోహిణిని రమ్మని ఆ కారు చూపిద్దామని అనుకుంటాడు. ఈ లోపు బాలు ఆ కారు కన్సల్టెన్సీకి వచ్చి మనోజ్ సెలెక్ట్ చేసిన కారునే సెలెక్ట్ చేస్తాడు. పొలిటిషీన్ ఫ్రెండ్ కోసమని ఆ కారును సెలెక్ట్ చేశానని చెబుతాడు. ఇక మనోజ్ కూడా నేను అదే కారును తీసుకుంటానని చెబితే లేదు వాడు సరిగా ఈఎంఐలు కట్టబోడని కారు కన్సల్జెన్సీ ఓనర్ కు చెబుతాడు. దాంతో ఆ ఓనర్ కారును బాలుకే ఇస్తాడు. ఇక ఆ కారును ఇప్పించినందుకు ఆ పొలిటీషియన్ పార్టీ ఇస్తానని బార్ అండ్ రెస్టారెంట్ కు తీసుకెళ్తాడు. అక్కడ బాలు సమస్యల్లో చిక్కుకుంటాడు.

ఆగస్టు 19వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ఆ పొలిటీషన్స్ తో కలిసి బాలు వెళ్లిన బార్ అండ్ రెస్టారెంట్ లోనే బాలుపై ఎప్పుడు పగ సాధించాలా అని ఫైనాన్షియర్ గుణ ఉంటాడు. ఇక అప్పటికే మీనా గుణను తాగుబోతు అని తిట్టడంతో బాలునే తాగుబోతుగా మార్చాలని ప్రయత్నిస్తాడు. దీంతో బాలు బార్ లో తాగుతున్నాడని, తాగిన మైకంలో అందరితో గొడవ పెట్టుకుంటున్నాడని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తాడు. ఇక ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దాంతో బాలు వీడియోను చూసిన అందరూ బాలుపై దుష్ప్రాచారం చేస్తారు. ఇక ఆ వీడియో కూడా నెట్టింట వైరల్ అవ్వడంతో అటు మీనా, రోహిణి మనోజ్, మౌనికా భర్త సంజూ కూడా ఆ వీడియోను చూస్తారు. దీంతో మీనా ఆ వీడియోను చూసి చాలా బాధ పడుతుంది. మనోజ్ రోహిణి మాత్రం బాలును మరింతగా చెడు చేయాలని ఇంట్లో వాళ్లకు వీడియో పెట్టి చూపిస్తారు. మరోవైపు బాలు కారులో ఎవరూ ప్రయాణించేందుకు ఇష్టపడరు. పైగా బుక్ చేసుకున్న రైడ్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి.
ఆగస్టు 20వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలు వీడియోను చూసిన సంజూ ఏకంగా పోలీస్ కమీషనర్ కు ఫోన్ చేసి బాలు బైక్ ను సీజ్ చేయండి అని, అలాంటి వారి వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదు చేస్తాడు. దాంతో పోలీసులు బాలు కారును సీజ్ చేసి, లైసెన్స్ ను కూడా స్వాధీనం చేసుకుంటారు. ఇక బాలు ఏం చేయలేక ఇంటికి తిరిగి వెళ్తాడు. అప్పటికే ఇంట్లో విషయం తెలియడంతో బాలుపై ఇంట్లో వాళ్లందరూ కోపంగా ఉంటారు. మరోవైపు మీనా, సత్యం కూడా బాలు తాగాడని నమ్ముతారు. బాలు ఇంటికి తిరిగి రాగానే నువ్వు ఇలా పరువు తీసే పనులు ఎందుకు చేస్తున్నావని ప్రశ్నిస్తారు. బాలు అది నేను చేయలేదు. నాకు తెలియదని, ఎవరో కావాలని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెబుతాడు. అయినా ఎవరూ నమ్మకుండా బాలును దూరం పెడుతాడు. ఇక ప్రభావతి బాలును ఏకంగా ఇంట్లో నుంచి వెళ్లిపోమని అంటుంది.
ఆగస్టు 21వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ఇక మీనా బాలు వీడియో వైరల్ అవ్వడంతో ఇంటిపైన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దాంతో బాలు కూడా మీనా దగ్గరికి వెళ్లి నా తప్పేమీ లేదని చెబుతాడు. ఆ వీడియో ఎలా వచ్చిందో కూడా నాకు తెలియడం లేదు. ఎప్పుడూ లేనిది నాన్న కూడా నాపై కోపంగా ఉన్నారు. నువ్వు కూడా నన్ను దూరం పెడుతున్నావని చెబుతూ బాధపడుతాడు. మీనాను పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. దీంతో మీనా మనస్సు కరుగుతుంది. వెంటనే బాలును తాగలేదని అర్థం చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత మీనా బాలును తాగుడు నుంచి మార్చేయాలని అనుకుంటుంది. అందుకోసం ఒక అక్క దగ్గరకు వెళ్లి తాగుడు మాన్పించేందుకు నాటు వైద్యం పౌడర్ ను తీసుకొని వస్తుంది. ఆ పౌడర్ ను బాలు కాకుండా ఇటు ప్రభావతి తాగుతుంది. అవస్థల పాలవుతుంది. వెంటనే మీనా మళ్లి విరుగుడు కూడా తీసుకొని వస్తుంది. దాంతో ప్రభావతికి ప్రాణం తిరిగి వస్తుంది.
ఆగస్టు 22వ తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
మరోవైపు మీనా భర్త బాలు తనతో ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో మౌనికా కూడా ఫోన్ చేస్తుంది. అన్నయ్య తాగాడంటే నువ్వు నమ్ముతున్నావా వదినా అని అడుగుతుంది. ఆ వీడియోకు ముందు, ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోమని చెబుతుంది. దాంతో వెంటనే మీనా బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లి సీసీ టీవీ ఫుటేజీని అడుగుతుంది. అక్కడ యజమానికి మీనాకు సీసీ టీవీ ఫుటేజీని అందిస్తాడు. దాంతో బాలు తప్పు చేయలేదని మీనా తెలుసుకుంటుంది. ఇక వీడియో క్రియేట్ చేసిన వాడిని పట్టుకునేందుకు మీనా ప్రయత్నం చేస్తుంటుంది. ఇక ఆ తర్వా త ఏ జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications










