Gunde Ninda Gudi Gantalu Weekly: కొంప ముంచిన మనోజ్.. బాలు దయ గుణం.. షాకిచ్చిన రోహిణి
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే ఆగస్టు 25వ తేదీ నుంచి ఆగస్టు 29వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
ఆగస్టు 25వ తేదీన (సోమవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలుపై పడ్డ నిందారోపణను వెంటనే తొలగించాలని అనుకుంటుంది మీనా. అందుకోసం బాలు కనిపించిన బార్ దగ్గరకు వెళ్తుంది. అక్కడ బార్ ఓనర్ ను కలుస్తుంది. సీసీ టీవీ ఫుటేజీలను ఇప్పించండి అని అడుగుతుంది. దాంతో ఆయన సీసీ టీవీ ఫుటేజీలను చూపిస్తాడు. అందులో బాలు తాగలేదని మీనాకు తెలుస్తుంది. ఇక అదంతా చేసింది ఫైనాన్షియర్ గుణ అని తెలుసుకుంటుంది. ఇక వెంటనే ఆ వీడియోను మరిది రవికి పంపిస్తుంది. వెంటనే ఆ వీడియోను వెళ్లి మీ అన్నయ్యకు చూపించమని చెబుతుంది. ఇక రవి వెళ్లి బాలుకు వీడియో చూపించి జరిగిన విషయం చెబుతాడు. ఇక మీనా కూడా బాలు దగ్గరకు చేరుకొని తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించమని అడుగుతుంది. ఆ తర్వాత గుణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.

ఆగస్టు 26వ తేదీన (మంగళవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
ఇక బాలును కుటుంబ సభ్యులంతా నిందిస్తూనే ఉంటారు. బాలు తప్పు చేయలేదని ఎంత చెప్పినా కూడా వినిపించుకోరు. ఇక మరో వీడియో వైరల్ కావడంతో అది కాస్తా సత్యం కంట పడుతుంది. ఇక వెంటనే ఇంట్లో వాళ్లందరినీ పిలిచి వెంటనే ఈ వీడియో చూడండి అని చెబుతాడు. నా కొడుకు బాలు ఎప్పుడూ తప్పు చేయడని నేను ఎంతగానో నమ్ముతాను. కానీ ఫస్ట్ టైమ్ మీ వల్ల బాలును తిట్టాల్సి వచ్చింది. తప్పు చేశాడని అర్థం చేసుకోవాల్సి వచ్చింది. ఇక నీ వల్లే ఇదంతా జరిగిందని భార్య ప్రభావతిపై మండి పడుతాడు. ఇక బాలు తిరిగి రావడంతో క్షమాపణలు చెబుతాడు. నీపై చెయ్యి ఎత్తినందుకు క్షమించమని బాలును అడుగుతాడు. మరోవైపు గుణను పోలీస్ స్టేషన్ లోనూ అరెస్ట్ చేయిస్తారు. అలాగే బాలు కారును పోలీసులు పట్టుకోవడానికి కారణం సంజూనే అని మౌనికా తెలుసుకుంటుంది.
ఆగస్టు 27వ తేదీన (బుధవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలు, మీనా, రవి కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. అక్కడ పోలీసులు తమ కారును పట్టుకోవడంతో వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి, గుణకు తగిన శిక్ష పడేలా చేయమని చెప్పి వేడుకుంటారు. ఆ తర్వాత పోలీసులు బాలు కారును, లైసెన్స్ ను ఇచ్చేస్తారు. ఇక బాలు తన కారును తీసుకునే సమయంలో పోలీస్ స్టేషన్ కు మీనా తమ్ముడు శివ వస్తాడు. శివను చూసిన మీనా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ గుణ గాడి కోసం నువ్వు వచ్చావు కదా మండి పడుతుంది. ఎన్ని సార్లు చెప్పినా కూడా నువ్వు మారడం లేదు. మళ్లీ ఎప్పుడైనా తప్పు జరిగితే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత మీనా నేరుగా సంజూ ఇంటికి వెళ్తుంది. అక్కడ అప్పటికే మౌనికాను సంజూ టార్చర్ చేస్తూ ఉంటాడు. బాలు అన్న కారు పోలీసులకు పట్టుకునేలా చేసినా సంజూపై మౌనికా మండి పడుతుంది. దాంతో సంజూ చేయి చేసుకోబోతాడు. అదే సమయంలో మీనా ఎంట్రీ ఇచ్చి అడ్డుకుంటుంది.
ఆగస్టు 28వ తేదీన (గురువారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
తన అన్న బాలు కారును అనవసరంగా, కుట్ర పూరితంగా పోలీసులకు పట్టించావని సంజూపై మౌనికా ఫైర్ అవుతుంది. అందుకు సంజూ నువ్వు నన్నే ఎదిరించేంత ఉందా అని సంజూ మౌనికాను కొట్టబోతాడు ఇక మీనా వెంటనే అడ్డుకుంటుంది. సంజూకు వార్నింగ్ ఇస్తుంది. నువ్వు మౌనికాను ఎంతలా టార్చర్ పెడుతున్నావో నాకు తెలుసని, పోలీసులకు కార్ ను పట్టించింది కూడా నువ్వేనని నాకు తెలిసిందని అంటుంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మాత్రం బాలుతో చెబుతానని, ఆయన నీ ప్రాణాలు తీసేస్తాడని హెచ్చరిస్తుంది. ఇక మరోవైపు మనోజ్ కొత్త కారు కొంటాడు. ఇంట్లో వాళ్లందరికీ చూపిస్తారు. ఈ సందర్భంగా బాలు, రవికి బీరు పార్టీ ఇస్తాడు. ఈ సమయంలో మనోజ్ మద్యం మత్తులో తనకు 40 లక్షలు కల్పనా ఇచ్చిందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ రోహిణి వచ్చి అడ్డుకుంటుంది. నీ వల్ల కొంపలు అంటుకుంటున్నాయని మనోజ్ ను హెచ్చరిస్తుంది.
ఆగస్టు 29వ తేదీన (శుక్రవారం) ప్రసారమైన ఎపిసోడ్ లో..
బాలు కారులో రైడ్ కు వెళ్లిన సమయంలో ఒక బిజినెస్ అవకాశం లభిస్తుంది. ఫర్నీచర్ షాప్ ఓనర్ బాలు కారులో ప్రయాణం చేస్తాడు. షాప్ దగ్గరకు చేరుకున్నాక ఆ ఓనర్ కు కొందరు రౌడీలు బెదిరిస్తారు. దాంతో బాలు వారిని తన్ని తరిమేస్తాడు. ఇలా సాయం చేసినందుకు ఆ ఓనర్ షాప్ ను అమ్మబోతున్నానని చెబుతాడు. అయితే మా అన్నయ్యకు అమ్మండి బాలు కోరుతాడు. దాంతో మీకైతే ఇంకా తక్కువ ధరకే ఇస్తానని ఆ ఓనర్ చెబుతాడు. ఇక బాలు వెంటనే వెళ్లి ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెబుతాడు. వాళ్లు కూడా ఫర్నీచర్ షాప్ ను చూస్తారు. కొంటామని చెబుతారు. రేటు, ప్రాఫిట్ విషయాలు మేం మళ్లీ వచ్చి మాట్లాడుతామని రోహిణి చెబుతుంది. ఇక ఆ షాపునకు ఏ పేరును పెడుదామని మనోజ్ ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలో సుశీలమ్మ పేరు పెట్టాలని అందరూ అనుకుంటారు. కానీ రోహిణి తర్వాత చెబుతామని షాక్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











