Gunde Ninda Gudi Gantalu Weekly: ప్రభావతి ప్రాణాల మీదికి.. మేక మామ కొత్త డ్రామా.. కిచెన్‌లో తోడికోడళ్ల పంచాయతీ
courtesy: Jio hotstar
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 13వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
గుండె నిండా గుడిగంటలు సోమవారం ( అక్టోబర్ 13) ఎపిసోడ్ లో ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతుంది. కానీ ప్రభావతి కావాలని మీనాకు జ్యోతి వెలిగించే అవకాశం ఇవ్వకుండా వత్తి తీసేయడం షాక్‌గా మారుతుంది. దీంతో బాలు ఆగ్రహానికి లోనై తన భార్య రిబ్బన్ కట్ చేయాలంటూ బాలు వాదించినప్పటికీ, ప్రభావతి "నాకు నచ్చని వాళ్లతో నేను స్కూల్ ఓపెన్ చేయించను" అని స్పష్టంగా చెప్పేస్తుంది. దీంతో సత్యం.. ముగ్గురు కోడళ్లు కలిసి రిబ్బన్ కట్ చేయాలని సలహా ఇస్తారు. ప్రభావతికి ఆ విషయం నచ్చకున్నప్పటికీ, ఆమె కొంత అంగీకారం వ్యక్తమవుతుంది.
తర్వాత సత్యం కోరినవిధంగా, ప్రభావతి నాట్యం చేసి అందరిని మంత్రముగ్ధులను చేస్తుంది. ఇంటికి చేరిన తర్వాత కాఫీ విషయంలో బాలు-మనోజ్ మధ్య వాదన తలెత్తుతుంది. ప్రభావతి స్కూల్ ప్రారంభం, ఖర్చులు, కరెంట్ బిల్లు పెరుగుదల వంటి సమస్యలు కారణంగా తీవ్ర నిరాశలో పడింది. "నేను ఏ పని సరిగ్గా చేయలేను" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. సత్యం ధైర్యం చెప్పినా ఆమె ఆపడం లేదు. మీనా భోజనానికి పిలవగానే ప్రభావతి కోపంతో స్పందించి, "ఈ ఊర్లో కళల విలువే లేదు" అని చెప్పి తన కల నెరవేరకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తుంది. చివరగా అన్నింటికి కారణం మీనా, బాలు అని పేర్కొనడంతో ఉద్రిక్తత నెలకొంటుంది.

గుండె నిండా గుడిగంటలు మంగళవారం (అక్టోబర్ 14) ఎపిసోడ్‌లో భారతనాట్యం గురువుగా పేరు తెచ్చుకోవాలనే ఆశతో ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ప్రారంభిస్తుంది. కానీ ఎవ్వరూ చేరకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంది. ఆ నిరాశ కోపంగా మారి కుటుంబ సభ్యులపై విరుచుకుపడుతుంది. మీనాపై కూడా మాటల దాడి చేయడంతో సత్యం ఆమెకు అండగా నిలుస్తాడు. తల్లి మనస్థితి చూసి బాలు బాధపడుతూ, "నా దగ్గర ఓ మాస్టర్ ప్లాన్ ఉంది" అంటూ మీనాతో కలిసి తదుపరి రోజు స్కూల్‌కి వస్తాడు. పండ్లు, పూలతో వచ్చిన వారిని చూసి ప్రభావతి ఆశ్చర్యపోతుంది. "మేము డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాం" అన్నప్పుడు మొదట నిరాకరిస్తుంది. కానీ మీనాక్షి ఒప్పించడం, ఫీజు తీసుకోవడం వల్ల బలవంతంగా ఒప్పుకుంటుంది. నటరాజ స్వామికి ప్రార్థనతో డాన్స్ క్లాస్ మొదలవుతుంది.
అత్త-కోడలు పోటీపడుతూ నాట్యం మొదలుపెడతారు. ఉత్సాహంలో నాట్యం చేసిన ప్రభావతికి ఒక్కసారిగా మెడపట్టుకుంది. దీంతో బాలు, మీనా ఆమెను ఇంటికి తీసుకువెళ్తారు. ఇంట్లోకి వచ్చిన వెంటనే శ్రుతి పొరపాటున ప్రభావతిని తాకడంతో కిందపడిపోతుంది. సత్యం "ఈ వయసులో ఇలాంటి ప్రయోగాలేమిటి?" అంటూ మండిపడతాడు. మీనా తెచ్చిన ఆయుర్వేద వైద్యురాలు చికిత్స చేసినా, ప్రభావతి ఇంకా అస్వస్థంగానే ఉంటుంది. ఈ గందరగోళం మధ్య బాలు మీనాపై "నీ వల్లే మా అమ్మ ఇలా అయింది" అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇంట్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంటుంది.
గుండె నిండా గుడిగంటలు బుధవారం (అక్టోబర్ 15) ఎపిసోడ్‌లో మనోజ్ తన షాప్‌లోని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "డైలీ డ్రెస్సింగ్ పాటించకపోతే సాలరీ నుండి కట్ చేస్తా" అని హెచ్చరించాడు. రోహిణి మాత్రం "కస్టమర్ సర్వీస్ ముఖ్యం, డ్రెస్సింగ్ కాదు" అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ సమయంలో విద్య షాప్‌కి వచ్చి మనోజ్‌పై సరదాగా సెటైర్లు వేస్తూ, "నీ ఐడియాలు సాలిడ్ కానీ కస్టమర్లు తక్కువే" అని సైటైర్ వేస్తుంది. తర్వాత విద్య, రోహిణికి దేవుడి పటాన్ని గిఫ్ట్ ఇస్తూ "రోజూ పూజ చేస్తే ధనాకర్షణ వస్తుంది" అని చెబుతుంది. రోహిణి "పూజ నేను కాదు, మీనా చేస్తుంది" అని సమాధానం ఇవ్వగా, విద్య సలహా మేరకు ఆమె మీనాకు కాల్ చేస్తుంది. పూలు తెచ్చే దారిలో మీనా "మటన్ మాణిక్యం"ను చూసి వెంబడిస్తుంది, కానీ అతను తప్పించుకుంటాడు.
ఇక మాణిక్యం రోహిణి షాప్‌లోకి చేరగా, విద్య అతడిని దాచిపెడుతుంది. అదే సమయంలో బాలు, రాజేష్ బీరువా కొనేందుకు రావడంతో టెన్షన్ పెరుగుతుంది. వారు మాణిక్యం దాగి ఉన్న బీరువానే ఎంచుకోవడంతో రోహిణి, విద్యలు దిగ్భ్రాంతికి గురవుతారు. బాలు కోపంతో షాప్‌లో హంగామా చేసి వెళ్ళిపోతాడు. చివరగా విద్య బీరువా తాళం తీసి తెరిచినప్పుడు మాణిక్యం బయటకు వచ్చి "అబద్ధాలతో కళాకారులను మోసగించడం కరెక్ట్ కాదు" అంటూ రోహిణిని హెచ్చరిస్తాడు. ఇక మీనా మాత్రం మాణిక్యం గురించి ఆలోచనల్లో మునిగిపోతుంది.
గుండె నిండా గుడిగంటలు గురువారం(అక్టోబర్ 16)ఎపిసోడ్‌లో మలేషియా మామ మాణిక్యం చుట్టూ సాగే ఉత్కంఠభరితమైన సంఘటనలతో సాగింది. మీనా అనుమానం బాలు మనసులోనూ సందేహాలు మొదలవుతాయి . "మాణిక్యం రాజమండ్రిలోనే ఉన్నాడు" అన్న మీనా మాటతో రోహిణిపై పాత అనుమానాలు మళ్లీ తలెత్తుతాయి. వెంటనే రోహిణి కొత్త ప్లాన్ వేసి "మలేషియా మామ-దుబాయ్ డ్రామా" మొదలుపెడుతుంది. తర్వాత రోజు మాణిక్యం వీడియో కాల్‌లో కనిపిస్తూ "కొనడం, కోయడం... స్మాల్ పీస్, బిగ్ పీస్" అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.
రోహిణి వెంటనే సర్దుబాటు చేస్తూ "మామ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్నారు" అంటుంది. కానీ రవి మాత్రం వదలకుండా "మీ మీద కేసు ఉందని అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారు, ఇప్పుడు ఎలా బయటికి వచ్చారు?" అని ప్రశ్నిస్తాడు. మాణిక్యం "దుబాయ్‌లోనే ఉన్నాను" అని చెప్పడంతో బాలు సరదాగా "మీ ఫ్రంట్ గ్రౌండ్‌లో పొట్ట మాత్రమే కనిపిస్తోంది మేక మామ!" అని జోక్ వేస్తాడు. మాణిక్యం ఐదు లక్షలు పంపిస్తానని చెప్పడంతో ప్రభావతి ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అయితే మీనా మాత్రం ఆలోచనలో పడుతుంది. "అది ఫేక్ కాల్" అని బాలు చెప్పడంతో ఇంట్లో మళ్లీ టెన్షన్ మొదలవుతుంది.
రోహిణి తన ప్లాన్ సక్సెస్ అయిందని విద్యకు చెబుతుండగా, మాణిక్యం "ఒక అబద్ధాన్ని దాచడానికి మరో అబద్ధం చెబితే దొరికిపోతాం" అంటూ హెచ్చరిస్తాడు. ఇక రవి-శృతి రొమాంటిక్ మూమెంట్‌ను సృష్టిస్తుండగా, బాలు-మీనా కూడా సరదాగా జంటగా కనిపిస్తారు. ఆ సమయంలో ప్రభావతి, సత్యం అకస్మాత్తుగా వచ్చి "ఇది ఇల్లు అనుకున్నారా?" అంటూ మీనాపై మండిపడతారు. దానికి మీనా ఘాటుగా "మీ కంటికి నేనే కనిపిస్తున్నానా? మిగతావాళ్లు కనిపించడం లేదా?" అంటూ సమాధానం ఇవ్వడం ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది.
గుండె నిండా గుడిగంటలు శుక్రవారం (అక్టోబర్ 17) ఎపిసోడ్‌లో బెడ్‌రూమ్ విషయంలో మరోసారి పెద్ద వివాదం చెలరేగింది. కొడుకులు తమ భార్యలను ఎత్తుకుని తిరుగుతుండటంపై ప్రభావతి అసహనం వ్యక్తం చేస్తూ, "ఇలాంటివి ఉంటే బెడ్‌రూమ్‌లో పెట్టుకోండి" అంటూ వ్యంగ్యంగా స్పందించింది. దానికి శృతి "ఆ బెడ్‌రూమ్ అగ్గిపెట్టెలా ఉంది" అని వెటకారంగా, మీనా "మాకు రూమ్ కూడా లేదు కదా?" అంటూ సూటిగా సమాధానం ఇచ్చింది. ఈ మాటల యుద్ధంలో రోహిణి అగ్గిరాజేసినట్టు "శృతి తన పుట్టింటికి వెళ్తానంది కదా" అని చెప్పడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ క్రమంలో ఎక్కడ తన రూమ్ ఇవ్వాల్సివస్తుందోనని మనోజ్ అహంకారంగా "నేను బిజినెస్‌మాన్‌ని, నేను ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి. మీలా డ్రైవర్, కూక్ ను కాదు" అని తమ్ములను తక్కువగా చూసాడు.
దానికి శృతి ఘాటుగా "నీలాగా గుడి ముందు మా ఆయన అడుక్కోవడం లేదండి!" అని కౌంటర్ ఇచ్చింది. ఇక సత్యం ఫ్యామిలీ మీటింగ్ పెట్టి, ఇంటి ఖర్చులకు అందరూ సహకరించాలంటూ నిర్ణయించగా, కొత్త వివాదం మొదలైంది. మనోజ్ మొదట 2000 ఇస్తానని చెప్పగా, చివరకు 8000కి పెంచాడు. బాలు, రవి చెరో 10,000 ఇవ్వాలని నిర్ణయించగా, మీనా కూరగాయల కోసం అదనంగా 2000 ఎక్స్ట్రా చెబడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక కిచెన్‌లో రోహిణి, శృతి, మీనా మధ్య మాటల తూటాలు సాగాయి. "గుడ్డు పెట్టే కోడి లేని నొప్పి, ఆమ్లెట్ తినేవాళ్లకు ఎందుకో?" అంటూ మీనా ఇచ్చిన కౌంటర్ హైలైట్‌గా నిలిచింది. చివర్లో ప్రభావతి మీద మీనా వేసిన మాట "మీ దయదక్షిణానే మేము బతుకుతున్నామా?" అందరినీ షాక్‌కు గురి చేసింది.


Click it and Unblock the Notifications










