Gunde Gudi Gantalu Weekly: మీనా విశ్వరూపం.. రోహిణి పశ్చాత్తాపం.. అగ్గి రాజేసిన శోభ.. బాలును కొట్టిన సత్యం

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్20 వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

గుండె నిండా గుడిగంటలు సోమవారం (అక్టోబర్ 20) ఎపిసోడ్ లో దీపావళి పండుగ సమీపంలో ప్రభావతి ఇంట్లో ఆనందం నెలకొన్నప్పటికీ, చిన్న మాటల గొడవలు పెద్ద సమస్యలుగా మారి కుటుంబంలో ఉద్రిక్తతలు నెలకొంటాయి. ప్రభావతిపై మీనా చురకలు విసురుతూ.. సత్యం "శభాష్" అని మెచ్చుకుంటాడు. అత్తయ్యపై ఇలా చురకలు తిప్పకపోతే సమస్యలు వస్తాయని హెచ్చరిస్తాడు. ప్రతి చిన్న విషయంలో మీనాను టార్గెట్ చేసుకుంటూ ప్రభావతి వ్యవహరించే తీరుతో బాలు, ప్రభావతి, మీనా మధ్య ఉద్రిక్త వాదనలు కొనసాగుతాయి. తదుపరి రోజు సత్యం ఇంటికి బిల్డర్స్‌ను పిలిచి కొత్త రూమ్ కొలతలు నిర్ణయిస్తాడు. ఐదు లక్షల రూపాయల ఖర్చు తెలుసుకున్న ఇంటి సభ్యులు షాక్ అవుతారు.

Gunde Ninda Gudi Gantalu week roundup story October 20th to October 24th Episodes highlights

ప్రభావతి అప్పు తీసుకోవడంలో ఇష్టపడదు, బాలు రూమ్ అవసరం లేదని చెబుతాడు. బాలుని తక్కువగా చూసిన ప్రభావతికి మీనా సవాల్ వేస్తుంది. అయితే సత్యం ముగ్గురు కోడళ్లకు సమానంగా చీరలు, బట్టలు ఇవ్వడం ద్వారా తారతమ్యం లేకుండా నిర్ణయం తీసుకుంటాడు. ప్రభావతి, రోహిణి అసూయగా మారతారు, కానీ చివరికి కుటుంబం ఒకటిగా కొత్త బట్టలలో, ముగ్గులు వేసి, పటాసులు పేలుస్తూ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుంటుంది. అయినప్పటికీ, గత గొడవల కారణంగా కొంత ఉద్రిక్తత ఇంకా మిగిలి ఉంటుంది.

ఇక మంగళవారం ( అక్టోబర్ 21 ) ఎపిసోడ్ లో ప్రభావతి ఇంట్లో దీపావళి సంబరాలు జోరుగా జరుగుతాయి. ప్రభావతి స్వయంగా పూజ నిర్వహిస్తుండగా, కొడుకులు, కోడళ్ళు అందరూ సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొంటారు. పూజ అనంతరం కుటుంబ సభ్యులు ప్రభావతి-సత్యం దంపతుల ఆశీర్వాదం తీసుకుంటూ సంతోషం పంచుకుంటారు. మీనా ప్రత్యేకంగా పాయసం చేసి అందరిద్దరికి అందిస్తుంది. సత్యం తన తల్లి వంటను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతాడు. బాలు సరదాగా, "షీలా డార్లింగ్ చేసిన పాయసం లాగా ఉంది" అంటూ ప్రసంశిస్తాడు. శృతి డబ్బింగ్ పూర్తి చేసి కిందకు వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. ఆమె "నరకాసుర వధ" ఎపిసోడ్‌కి డబ్బింగ్ ఇచ్చానని చెప్పడంతో నవ్వులు పూస్తాయి. సత్యం, బాలు సరదాగా మాట్లాడుకుంటారు.

అదే సమయంలో మీనాకు విద్య కాల్ చేసి, పండుగ కోసం పూలు తీసుకురావమని అడుగుతుంది. మీనా అంగీకరిస్తుంది. మరోవైపు రోహిణి దినేష్ ఫోన్‌ తీసుకోకుండా, వేరే నంబర్‌ నుంచి కాల్‌ ఎత్తినప్పుడు అసలు విషయం బయటపడుతుంది. దినేష్, రోహిణిపై లక్ష రూపాయల పెనాల్టీ డిమాండ్‌ చేస్తూ బెదిరిస్తాడు. భయంతో రోహిణి విద్య వద్దకు చేరుతుంది. అదే సమయంలో మీనా పూలు తీసుకుని అక్కడ వస్తుంది. రోహిణి అక్కడ ఉండటం వల్ల మీనా ఆశ్చర్యానికి లోనవుతుంది. ఇంట్లో ఉత్కంఠ పెరుగుతుంది, ఎందుకంటే మీనా, రోహిణి రెడ్‌ సారీలు ధరించడంతో రౌడీలు తప్పుగా మీనాను కిడ్నాప్‌ చేస్తారు. మీనా అరవడం విని బాలు షాక్‌లో పడతాడు. వెంటనే విద్యా ఇంటికి చేరి పరిస్థితిని పరిశీలిస్తాడు.

ఇక బుధవారం (అక్టోబర్ 22) ఎపిసోడ్ లో మీనా కనిపించకపోవడంతో బాలు తీవ్రంగా ఆందోళన చెందుతాడు. చుట్టుపక్కల వెతికినా కనబడకపోవడంతో ఆందోళన పెరుగుతుంది. ఇదే సమయంలో మీనా ప్రమాదం ఎదురవుతుందనే భయంతో దారి వెంబడి పూలను క్లూగా వేసుకుంటూ వెళుతుంది. ఆ పూల ఆధారంగా బాలు ఆమెను వెతకడానికి బయలుదేరుతాడు. మరోవైపు రోహిణిని కిడ్నాప్ చేయాలనుకున్న దినేష్ గ్యాంగ్‌ పొరపాటున ఎరుపు చీర కట్టుకున్న మీనాను తీసుకెళ్తుంది. రూమ్‌లో బంధించి దినేష్‌కి సమాచారం ఇస్తారు. కానీ మీనాను చూసి దినేష్ షాక్ అవుతాడు. "ఇది రోహిణి కాదు, బాలుగాడి భార్య" అని చెప్పడంతో అతడు "ఇలాగైనా బాలు మీద పగ తీర్చుకోవచ్చు" అంటాడు. మరోవైపు రోహిణి మాత్రం దినేష్‌ బెదిరింపులతో అల్లాడుతూ డబ్బు కోసం మనోజ్‌ వద్ద అబద్ధం చెబుతుంది. దినేష్ వరుసగా ఫోన్ చేస్తూ "లక్ష రూపాయలు ఇవ్వకపోతే నీ రహస్యం బైటపెడతా" అని హెచ్చరిస్తాడు. రోహిణి భయంతో విద్య ఇంటికి చేరుతుంది.

ఇదిలా ఉండగా బాలు తన భార్యను వెతికే క్రమంలో దినేష్‌ గ్యాంగ్‌ వద్దకు చేరతాడు. దినేష్‌ "నీకు బాకీ ఉన్నందుకే నీ భార్యను తీసుకున్నా" అని చెబుతాడు. కోపంతో బాలు దినేష్‌ గ్యాంగ్‌పై దాడి చేస్తాడు కానీ వెనుకనుంచి కొట్టడంతో స్పృహ కోల్పోతాడు. తన భర్తను రక్షించేందుకు మీనా తాళ్లు తెంచుకుని గుండాలపై సత్యభామలాగా దాడి చేస్తుంది. చివరికి పోలీసులు చేరుకుని దినేష్‌ను అరెస్ట్‌ చేస్తారు. ఈ సంఘటనతో రోహిణి తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుంది. "నా రహస్యం బయటపడింది" అని విద్య వద్ద ఏడుస్తుంది. విద్య "ఇక అయినా నిజం చెప్పి ధైర్యంగా ఎదుర్కో" అని సలహా ఇస్తుంది.

ఇక గురువారం (అక్టోబర్ 23 ) ఎపిసోడ్ లో రోహిణి భయంతో వణుకుతుంది. తన రహస్యం బయటపడిందేమోనని ఆందోళన చెందుతూ ఉంటుంది. ప్రభావతి, మనోజ్ వరుస ఫోన్లు చేయడంతో ఆమె మనసు గజిబిజిగా మారుతుంది. విద్య ధైర్యం చెబుతూ "నిజం దాచడం కంటే ఎదుర్కోవడం మంచిది" అని సలహా ఇస్తుంది. ఇదే సమయంలో ప్రభావతి ఇంట్లో దీపావళి పూజ ఏర్పాట్లు జోరుగా జరుగుతుంటాయి. కానీ మీనా కనిపించకపోవడంతో ప్రభావతి చిరాకు వ్యక్తం చేస్తుంది. కొద్దిసేపటికి బాలు, మీనా ఇంటికి వస్తారు. రోహిణి ఫోన్‌ ఎత్తకపోవడంతో ప్రభావతి ఆందోళన చెందుతుంది. సత్యం "రోహిణి పెద్దింటి కోడలు కాబట్టి ఆగుతున్నావా?" అని అడగగా, బాలు "అన్ని కోడళ్లు సమానమే" అంటూ కౌంటర్ ఇస్తాడు.

తర్వాత రోహిణి టెన్షన్‌తో ఇంటికి వస్తుంది. ప్రభావతి పరోక్షంగా విమర్శలు చేయగా, బాలు-మనోజ్ ఇద్దరూ ఆమె తరఫున నిలబడతారు. చివరకు సత్యం "పండగ పూట గొడవ వద్దు" అంటూ సీన్ కూల్ చేస్తాడు. పూజ సమయంలో ప్రభావతి మీనాను దూరం పెట్టి రోహిణితోనే దీపం వెలిగించమని చెప్పడంతో బాలు ఆగ్రహిస్తాడు. చివరికి అందరూ కలిసి పూజ పూర్తిచేస్తారు. ఇంతలో కొత్త ట్విస్ట్‌గా శృతి తల్లి శోభ ఎంట్రీ ఇస్తుంది.

ఇక శుక్రవారం (అక్టోబర్ 24 ) ఎపిసోడ్ లో శృతి తల్లి శోభ ఇచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్కు చుట్టూ సీరియల్ మొత్తం తిరిగింది. శోభ అహంకారంతో ఇచ్చిన ఆ చెక్కు సత్యం ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తుంది. "నాకు మీ సహాయం అవసరం లేదు, నా కష్టంతోనే ఇల్లు కట్టుకున్నాను" అంటూ సత్యం గట్టిగా చెబుతాడు. ఆ మాటలకు శోభ "మీరు రూమ్ కట్టలేరు" అంటూ హేళన చేయడంతో బాలు ఆగ్రహంతో "మా నాన్న కష్టాన్ని తక్కువ చేయొద్దు"అంటూ ఎదురుదాడి చేస్తాడు. ఈ వాదనలో రవి మధ్యలోకి వచ్చి బాలుతో వాగ్వాదం పెట్టుకుంటాడు. దీంతో బాలు ఆవేశంతో "ఇక మా ఇంట్లో నుంచి వెళ్లిపోండి" అంటూ ఘాటుగా స్పందిస్తాడు.

దీనిపై సత్యం కోపంతో బాలుపై చేయి వేస్తాడు. "ఆమె నీ అత్తగారు, ఇలాగే మాట్లాడతావా?" అని మందలిస్తాడు. ఈ సంఘటనతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. శోభ అవమానంతో వెళ్ళిపోతుంది. దీంతో ప్రభావతి కోపంతో బాలుపై మండిపడుతుంది. రోహిణి, రవి, శృతి అందరూ బాలుపై విరుచుకుపడతారు. తండ్రి కొట్టాడన్న బాధతో బాలు ఇంటి బయటకు వెళ్లి మందు తాగేస్తాడు. రాజేష్ అతన్ని ఓదారుస్తాడు. ఇదే సమయంలో మీనా ధాబా పైకెక్కి ఏడుస్తూ సత్యంతో మాట్లాడుతుంది. సత్యం తన తప్పు ఒప్పుకుంటూ "నాన్న కోపం కొడుకుపై కాదు, పరిస్థితులపై" అని చెబుతాడు. చివరగా బాలు ఇంటికి తిరిగి వచ్చి తూలిపడుతాడు. సత్యం పరుగెత్తి అతన్ని పట్టుకొని లేపి ప్రేమగా అడుగుతాడు "నామీద కోపమా?". బాలు "లేదు నాన్నా" అని చెబుతాడు. ఆ క్షణంలో తండ్రి-కొడుకు మధ్య అపార్థాలు కరిగిపోతాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X