Gunde Ninda Gudi Gantalu Weekly: మీనా భారీ శపథం.. బ్లాక్‌మనీ స్కాంలో మనోజ్.. కోడలి నగలు కొట్టేసిన ప్రభావతి..
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు జరిగిన'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
సోమవారం (అక్టోబర్ 27) ఎపిసోడ్ లో బాలు పుల్‌గా తాగి ఇంటికి రావడం గమనించిన సత్యం "సంస్కారానికి ఓ గీత ఉంటుంది" అని చెప్పిన మాటలు బాలుని మనసులో మార్మోగుతాయి. అయితే ప్రభావతి వ్యంగ్యంగా మాట్లాడడంతో బాలు కోపంతో స్పందిస్తాడు. ఆ సమయంలో మనోజ్, శృతి, రవి, రోహిణి హాల్లోకి రావడంతో గొడవ పెద్దదవుతుంది. బాలు మీద ప్రభావతి, శృతి మాటలు ఎక్కుపెట్టి మాట్లాడుతారు. దీంతో బాలు ఆవేశంగా "ఇది మీ ఇల్లు కాదు, మీ అత్తగారిల్లు" అని చెబుతాడు. ఈ మాటలతో వాతావరణం ఉద్రిక్తంగా మారినప్పుడు మీనా ముందుకు వచ్చి తన భర్తకు అండగా నిలుస్తుంది. "మీ పెద్దబ్బాయిని ఎవరు ఏమైనా అంటే రోహిణి ఊరుకుంటుందా? మరి నా భర్తను అవమానిస్తుంటే నేను ఎందుకు ఊరుకోవాలి?" అంటూ ధైర్యంగా సమాధానం ఇస్తుంది.

తర్వాత బాలు బాధతో "నాన్న నన్ను అందరి ముందు కొట్టాడు" అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. మీనా ప్రేమతో "మీ నాన్న ప్రేమతోనే మందలించారు. కానీ తాగి రావడం తప్పు" అంటూ ఓదార్చుతుంది. ఆమె మాటలతో బాలు మారిపోతూ "ఇకపై తాగి రానని మాట ఇస్తా. నా నాన్న కోసం ఏదైనా చేస్తా" అని చెబుతాడు.మరుసటి ఉదయం బాలు పూర్తిగా మారిన వ్యక్తిగా కనిపిస్తాడు. భక్తితో పూజలు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. "ఇకపై గొడవలు వద్దు, నా రూమ్ నేనే కట్టుకుంటా" అని మాట ఇస్తాడు. మనోజ్ వ్యంగ్యంగా మాట్లాడినా, మీనా సాహసంగా "మేము ఎవరి దయపై జీవించం. మా కష్టంతోనే రూమ్ కడతాం" అని చెబుతుంది.
మంగళవారం (అక్టోబర్ 28) ఎపిసోడ్ లో బాలు ఆందోళనగా "నువ్వు పదే పదే శపథాలు చేస్తే ఇబ్బంది మనకే వస్తుంది" అంటాడు. కానీ, మీనా ధైర్యంగా "నీ నాన్న పింఛన్ మీద జీవించడం కరెక్ట్ కాదు. మన గదిని మనమే నిర్మించుకోవాలి" అని చెబుతుంది. బంగారం అమ్మి కారు కొని రెంటుకు ఇవ్వాలన్న మీనా ప్లాన్‌కి బాలు "మాట బాగుంది కానీ మార్గం సరిగా లేదు" అని అంటాడు. ఇక మరోవైపు, మనోజ్-రోహిణి ఫర్నిచర్ షాప్‌లో బిజినెస్ గురించి చర్చిస్తారు. రోహిణి "కాస్త రిలాక్స్ అవుదాం" అంటే, మనోజ్ "బిజినెస్ మన బాధ్యత" అని చెప్పి కష్టపడుతాడు.
అదే సమయంలో పెద్ద కస్టమర్ నుంచి భారీ ఆర్డర్ రావడంతో ఉత్సాహంగా "ఇది మన లైఫ్ ఛేంజింగ్ డీల్!" అని ఆనందపడతాడు. కానీ డబ్బు మీద మోజుతో బ్లాక్ మనీ డీల్‌లోకి అడుగు పెట్టడం అతనికి పెద్ద రిస్క్‌గా మారుతుంది. మరోవైపు బాలు మీనాకు సర్ప్రైజ్ ఇస్తాడు. కారు డిక్కీలో ఇటుకలు చూపిస్తూ "మన ఇల్లు ఇక్కడినుంచే మొదలు!" అని అంటాడు. మీనా నవ్వుతూ "నేను సిమెంట్ తెస్తా!" అని స్పందిస్తుంది. ఈ సరదా సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ ఇంట్లోకి రాగానే ప్రభావతి వ్యంగ్యంగా "ఇంత పెద్ద కలలు కంటారా?" అంటూ విమర్శిస్తుంది. దానికి మీనా చురకతో "మీ దీవెనలతో షష్టిపూర్తికే ఇల్లు కట్టేస్తాం" అని అంటుంది.
బుధవారం (అక్టోబర్ 29)ఎపిసోడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయి శృతి-రవి మధ్య అన్యోన్యతను చూసి ప్రభావతి మండిపోతుంది. "మగాడిచేత కాళ్లు పట్టించుకోవడం ఏంటి?" అంటూ గదిలోకి వెళ్లిపోతుంది. కానీ శృతి మాత్రం సరదాగా "రవి బాగా కాళ్లు పడుతున్నాడు, నెయిల్ పాలిష్ కూడా బాగానే పెడుతున్నాడు" అని అంటుంది. ఈ మాటలు విన్న ప్రభావతి మరింత కోపంతో రగులుతుంది. కానీ, శృతి గంభీరంగా "భర్త అంటే గౌరవం మాత్రమే కాదు, ప్రేమ కూడా ఉండాలి. భయం కాదు" అంటుంది. ఆ మాటలు ప్రభావతిని సైలెంట్‌గా వెళ్లిపోయేలా చేస్తాయి. బాలు ఈ సన్నివేశం చూసి "నీకు భార్యాభర్తలు సుఖంగా ఉంటే నచ్చదా?" అంటూ ప్రభావతిపై సెటైర్లు వేస్తాడు.
రవి కూడా "శృతి కాళ్లకు నెయిల్ పాలిష్ పెడుతున్నానని కోపగించింది" అని వివరిస్తాడు. బాలు ఆ మాట విని "అమ్మా, నేనూ చూపిస్తా!" అంటూ మీనా దగ్గరికి వెళ్లి ఆమె కాళ్లకు పాలిష్ వేస్తాడు. ఆ సమయంలో ప్రేమగా కవితలు చెబుతూ ఆమెను సిగ్గుపడేలా చేస్తాడు. మీనా సిగ్గుతో చిరునవ్వు చిందిస్తే, ప్రభావతి మాత్రం అసహనంతో మండిపోతుంది. ఇక మరోవైపు మనోజ్ బిజినెస్‌లో భారీ డీల్ చేశానంటూ రోహిణితో ఆనందం పంచుకుంటాడు. కానీ ఫేక్ సీఐడీ ఆఫీసర్లు వచ్చి అతన్ని నకిలీ నోట్లతో మోసం చేస్తారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అతనిని గట్టిగా హెచ్చరిస్తూ "బిల్లు లేకుండా డీల్ చేయడం నేరం" అంటాడు. మనోజ్ పశ్చాత్తాపంతో తలవంచుతాడు.
ఇక గురువారం (అక్టోబర్ 30) ఎపిసోడ్ లో ఆసక్తికర మలుపులు చోటుచేసుకున్నాయి. సొంత ఇంటి కల కోసం బాలు-మీనా దంపతులు రూపాయి రూపాయి పొదుపు చేస్తూ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. కాళ్లు నొప్పిగా ఉన్నా విశ్రాంతి లేకుండా పని చేయాలనే బాలు పట్టుదల చూసి, మీనా ప్రేమతో కాళ్లకు కాపడం పెడుతుంది. ఆ దృశ్యం గమనించిన ప్రభావతి, తొలుత మీనా తన భర్తకు సేవలు చేయడం అహంకారంగా తీసుకుంటుంది. కానీ రవి వివరణతో భార్యాభర్తల మధ్య సహాయం సహజమని అర్థం చేసుకుంటుంది. అయినా ఆమెలోని ఈర్ష్య మాత్రం తగ్గదు. ఇదిలా ఉంటే, మనోజ్ వ్యాపారంలో బ్లాక్‌మనీ స్కాంలో చిక్కుకుని భారీ నష్టం చవిచూసిన విషయం వెల్లడవుతుంది. నాలుగు లక్షలు పోగొట్టుకున్న మనోజ్, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడతాడు. తల్లిని సహాయం చేయమని వేడుకుంటాడు. మొదట ఆగ్రహంతో తిరస్కరించిన ప్రభావతి, కుమారుడు కాళ్లపై పడగానే కరిగిపోతుంది. కానీ డబ్బు ఇవ్వడానికి మార్గం లేకపోవడంతో మీనా నగలపై కన్నేసుతుంది. మనోజ్ కోసం ప్రభావతి చివరికి దొంగతనానికి దిగుతుంది. బీరువా తలుపు తెరిచి నగలు తీసుకుంటుండగా సత్యం గదిలోకి రావడంతో ఆమె గుండెల్లో చలించిపోతుంది.కానీ సత్యం గమనించకపోవడంతో ఊపిరి పీల్చుకుంటుంది.
ఇక శుక్రవారం (అక్టోబర్ 31)ఎపిసోడ్‌లో ప్రభావతి మీనా బంగారం దొంగతనం చేయడం హైలైట్ అయింది. మనోజ్ కోరిక మేరకు ప్రభావతి నగలు దొంగతనం చేస్తుంది. బీరువా తలుపు తెరిచి, నగలు బ్లాక్ కవర్‌లో వేసుకుని బయటకు వస్తుంటే సత్యం ఎదురవుతాడు. "మారవా నువ్వు, ఇంత వయసు వచ్చినా మారవా?" అని పంచ్ వేస్తాడు. ప్రభావతి భయంతో "బీరువా తలుపు మూయడం మర్చిపోయా" అని నటిస్తూ బయటపడుతుంది. సత్యం అడిగిన కవర్ విషయానికీ "ఇది నా బ్లౌజ్ పీస్" అని అబద్ధం చెబుతుంది. ఇక మరోవైపు బాలు కూడా అలాంటి బ్లాక్ కవర్‌లో చేప ముక్కలు తెచ్చి మీనాకు ఇస్తాడు. "ఈరోజు కూర అదిరిపోవాలి" అని చెబుతాడు. మీనా ఆ కవర్ పట్టుకుని వెళ్తుండగా, ప్రభావతితో గుద్దుకోవడంతో ఇద్దరి చేతిలోని కవర్స్ మారిపోతాయి.
మీనా చేప ముక్కలు అనుకుని నగల కవర్ వంటగదిలో పెడుతుంది. ప్రభావతి మాత్రం చేప ముక్కల కవర్‌ని మనోజ్‌కి ఇచ్చి "జాగ్రత్తగా ఉండు, బంగారం ఎలా ఉందో అలాగే ఇవ్వాలి" అని చెబుతుంది.మనోజ్ ఆ కవర్‌తో సేటు దగ్గరకు వెళ్లి తాకట్టు ధర అడగగా, సేటు కవర్ తెరిచి చూడగానే బంగారం బదులు చేపముక్కలు కనిపిస్తాయి. ఇదే సమయంలో ఇంట్లో ప్రభావతి కవర్ తెరిచి నగలు కనిపించడంతో షాక్ అవుతుంది. దీంతో దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. సత్యం "ఇదిగో అమ్మా చేప ముక్కలు ఎత్తుకెళ్తున్న పిల్లి" అంటూ వ్యంగ్యంగా అంటాడు. ఇంతలో మనోజ్ తిరిగి వచ్చి అసలైన కవర్ తెచ్చి ఇవ్వడంతో ప్రభావతి వెంటనే కవర్లు మార్చేసి తప్పు దాచేస్తుంది. బాలు మాత్రం పక్కనే ఉండి "తప్పు ఎవరిదో అందరికీ అర్థమైంది" అని చురక వేస్తాడు. చివర్లో మనోజ్ నగల ఫోటో తీసి సేటు దగ్గర నాలుగు లక్షలు అడుగుతాడు. తాకట్టు కాదు, అమ్మేస్తేనే 4 లక్షలు ఇస్తా అని సేటు చెప్పడంతో మనోజ్ కూడా అంగీకరిస్తాడు.


Click it and Unblock the Notifications










