Gunde Ninda Gudi Gantalu Weekly: వీడిన లెటర్ మిస్టరీ.. కొత్త సమస్యలో రోహిణి.. భరతనాట్యం గురువుగా ప్రభావతి..
Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే అక్టోబర్ 6 వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!
గుండె నిండా గుడిగంటలు సోమవారం అక్టోబర్ 6 ఎపిసోడ్ లో ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మీనా కనిపించకపోవడంతో బాలు తీవ్ర ఆందోళనకు గురవుతాడు. వెంటనే మీనా చెల్లెలికి కాల్ చేసి "అక్క ఎక్కడుందో చెప్పు" అని అడుగుతాడు. "నాకూ తెలియదు" అనే సమాధానం విని బాలు మరింత కంగారు పడతాడు. ఇదంతా విన్న తల్లి పార్వతి, తమ్ముడు శివ కూడా టెన్షన్‌లో పడతారు. శివ "బాలు తాగి గొడవ పడ్డాడేమో" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మరోవైపు ఇంట్లో రోహిణి చేసిన వింత వంటలతో గందరగోళం నెలకొంటుంది. 'కోడలు కనిపించడంలేదనే బాధ్యత కూడా లేకుండా ప్రభావతి వ్యవహరిస్తుంది. దీంతో ప్రభావతిపై సత్యం మండిపడతాడు. కానీ ప్రభావతి మాత్రం "మీనా కోపంతో ఇంటిని వదిలేసి వెళ్లిపోయింది" అంటూ నిర్లక్ష్యంగా స్పందిస్తుంది. ఇదంతా విని మీనాక్షి షాక్ అవుతుంది. "ఒకవేళ మీనా కేసు పెట్టి ఉంటుందేమో లేదా ఏదైనా తప్పు నిర్ణయం తీసుకుందేమో" అంటూ భయపెడుతుంది. ఇద్దరూ మీనా గదిని వెతకడం మొదలుపెడతారు. శృతి, రోహిణి కూడా గదిలోకి వచ్చి ఏమైనా క్లూ దొరుకుతుందేమోనని వెతుకుతుంటారు.

ఇక మంగళవారం ( అక్టోబర్ 7 ) ఎపిసోడ్ లో మీనా కనిపించకపోవడంతో ఇల్లు మొత్తం ఆందోళనలో మునిగిపోయింది. ప్రభావతి, మీనాక్షి, శ్రుతి, రోహిణి గదిని వెతికే సమయంలో శృతికి ఒక లెటర్ దొరుకుతుంది. "నా చావుకి కారణం నా అత్తగారు" అని అందులో రాసి ఉందేమోనని అందరూ భయపడతారు. ప్రభావతి జైలులో ఉన్న దృశ్యాలు ఊహించుకుంటూ కంగారుపడుతుంది. కానీ చివరికి అది కేవలం కూరగాయల లిస్ట్ అని తేలడంతో అందరూ ఊపిరి పీలుస్తారు. ఇక బాలు, రాజేష్‌తో కలిసి మీనాను వెతికినా ఎక్కడా కనపడకపోవడంతో ఎమోషనల్ అవుతాడు. "ఎంత పెద్ద సమస్య వచ్చినా భయపడలేదు కానీ ఈరోజు భయమేస్తుంది"అంటూ కన్నీళ్లు పెడతాడు. రాజేష్ ఓదారుస్తూ, "మీనా తప్పకుండా తిరిగి వస్తుంది" అంటాడు. మరోవైపు మీనా తమ్ముడు శివ, గుణా సలహాతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లి బాలు మీద అనుమానం వ్యక్తం చేస్తాడు. ఎస్ఐ కేసు నమోదు చేయకుండా హెచ్చరిస్తాడు. ఇంతలోనే ఇంట్లోకి మీనా రీ-ఎంట్రీ అవుతుంది. బాలు ఆమెను చూసి ఆనందంతో హత్తుకుంటాడు. కుటుంబం ప్రశ్నలతో ముంచెత్తుతుండగా, "నేను బయటకు వెళ్లే ముందు శృతికి చెప్పాను కానీ ఆమె అర్థం చేసుకోలేదు" అని మీనా క్లారిటీ ఇస్తుంది. అన్ని అపోహలు తొలగిపోతాయి. బాలు తన ఆవేశానికి క్షమాపణ చెబుతాడు. కుటుంబం మళ్లీ ప్రశాంతంగా మారుతుంది.
ఇక బుధవారం (అక్టోబర్ 8 ) ఎపిసోడ్ లో మీనా కనిపించకపోవడంతో కలకలం రేగిన ఇంట్లో వాతావరణం, ఆమె తిరిగి రాగానే మారిపోయింది. తాను ఆర్డర్ కోసం బయటకు వెళ్లిందని చెప్పినా, ప్రభావతి మాత్రం "మీనా పని దొంగ"అంటూ అవమానించింది. దీంతో మీనా కూడా ఆగకుండా తనకు వచ్చిన డబ్బులు చూపిస్తూ "నేను పని దొంగను కాదు" అని గట్టిగా సమాధానం ఇచ్చింది. ఈ ఘర్షణలో మీనాక్షి కూడా రంగంలోకి దిగి ప్రభావతి, మనోజ్‌లకు క్లాస్ తీసుకుంటూ "ఇంట్లో మనిషి కనిపించకపోతే బాధపడాలి. కానీ, నిందలు వేయకూడదు" అంటూ గట్టిగా హెచ్చరించింది. తరువాత బాలు, మీనా మధ్య భావోద్వేగ సంభాషణ చోటుచేసుకుంది. "నన్ను ఇంత ప్రేమిస్తే అలా మాట్లాడావెందుకు?" అని అడగగా, బాలు "సరదాగా అన్నాను" అంటూ క్షమాపణ చెప్పాడు. ఇక రోహిణి జీవితంలో కొత్త సమస్య మొదలైంది. మాజీ ప్రేమికుడు దినేష్ బ్లాక్‌మెయిల్ చేస్తూ రెండు లక్షల రూపాయల ఫర్నిచర్‌ను ఉచితంగా తీసుకెళ్లాడు. దీనిపై మనోజ్‌తో ఘర్షణకు దారి తీసింది. చివరగా రోహిణి, స్నేహితురాలు విద్యాతో కలిసి దినేష్‌కు పాఠం నేర్పాలని నిర్ణయించుకుంది.
ఇక గురువారం (అక్టోబర్ 9 ) ఎపిసోడ్ లో వంటింట్లో శృతి, మీనా సరదాగా మాట్లాడుకుంటుండగా చిన్న మాట పెద్ద గొడవకు దారి తీసింది. "నువ్వు నిజంగా గ్రేట్ మీనా! ఇంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటావు" అని శృతి చెప్పగా, మీనా నవ్వుతూ "అంటే నువ్వు కంట్రోల్ చేసుకోలేవా?" అని జోక్ చేసింది. ఈ మాటలు విన్న ప్రభావతి కోపంతో వంటింట్లోకి వచ్చి "నాపై కారాలు మిరపాలు నురుతాయా?" అంటూ మండిపడింది. మీనా మాత్రం కూల్‌గా "మజ్జిగ తాగుతారా అత్తయ్య?"అని సరదాగా సమాధానమిచ్చింది. ఇంతలో మీనాకు ఫోన్ రావడంతో "అరుణక్కకు సహాయం చేయడానికి వెళ్తున్నా" అంటూ బయలుదేరుతుంది. అదే సమయంలో రోహిణి, విద్యలు కలిసి దినేష్ బ్లాక్‌మెయిల్ విషయంలో గుణ సాయం కోరతారు. మొదట నిరాకరించిన గుణ, చివరికి వారిని రక్షించేందుకు దినేష్‌పై చర్య తీసుకుంటాడు. ఆ ఘర్షణలో దినేష్ ప్రమాదానికి గురవుతాడు, అటుగా వచ్చిన బాలు పోలీసులకు అతన్ని అప్పగిస్తాడు. ఇక ఇంట్లోకి వచ్చిన ప్రభావతి, మీనా మీద మళ్లీ మండిపడి "నన్ను నీ పని మనిషిలా చూస్తావా?" అని ఆగ్రహిస్తుంది. మీనా ప్రశాంతంగా "మా ఆయన చెప్తేనే ఆపుతా" అంటూ సమాధానం ఇవ్వడంతో వాగ్వాదం పెరుగుతుంది. చివరికి ప్రభావతి "ఇక నేనే కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తా!" అంటూ భరతనాట్యం డాన్స్ స్కూల్ ప్రారంభించాలని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక శుక్రవారం (అక్టోబర్ 10 ) ఎపిసోడ్ లో ప్రభావతి భరతనాట్యం గురువుగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన డ్యాన్స్ స్కూల్ కోసం ఇల్లు అద్దెకు కావాలని మీనాక్షిని అడగగా, మొదట ఆమె నిరాకరించినా చివరికి ఒప్పుకుంటుంది. మరుసటి రోజు ప్రభావతి అందరినీ ఇంటికి పిలుస్తుంది. సత్యం "ఏమైంది ఇంత హడావుడిగా?" అని అడగగా, మీనా "అత్తయ్య కొత్త అవతారంలో కనిపించబోతున్నారు" అని చెప్పడంతో అందరూ కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇంతలోనే గజ్జల శబ్దంతో భరతనాట్యం డ్రెస్‌లో ప్రభావతి మెరిసిపోతూ దిగుతుంది. "ఇది నా అసలు స్వరూపం, నాట్యం నా ప్రాణం!" అంటూ సీరియస్ డైలాగ్ విసురుతుంది. ఆమె లుక్ చూసి అందరూ షాక్ అవుతారు. శృతి "మీరు శ్రీదేవిలా ఉన్నారు" అని పొగడ్తతలో ముంచెత్తుంది. తర్వాతి రోజు డ్యాన్స్ స్కూల్ ప్రారంభోత్సవంలో శృతి తల్లిని ఆహ్వానించలేక సత్యం అసహనం వ్యక్తం చేస్తాడు. అయినా శృతితో దీపం వెలిగింపజేసి రోహిణిని పిలుస్తుంది ప్రభావతి. ఆపై మీనా గురించి వ్యంగ్యంగా మాట్లాడడంతో బాలు కోపంతో "నా భార్యను అవమానించావు!" అంటూ మీనాను తీసుకుని వెళ్లిపోతాడు. సత్యం ఆపడానికి ప్రయత్నించినా, ప్రభావతి "అవసరం లేదు!" అంటూ మళ్లీ తన అహంకారాన్ని ప్రదర్శిస్తుంది.


Click it and Unblock the Notifications










