Gunde Ninda Gudi Gantalu Weekly: పుట్టింటికి మౌనిక.. బాలు దెబ్బకు సంజూకి చుక్కలు, మీనాకు ప్రభావతి ముద్దు

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

సెప్టెంబర్ 1వ తేదీ 500వ ఎపిసోడ్‌లో..
మనోజ్ వ్యాపారం చేయాలని అనుకోవడంతో బాలు మనోజ్ కోసం వూరిలో ఒక ఫర్నిచర్ షాప్ అమ్మకానికి ఉందని అదైతే నీ బిజినెస్‌కు బాగా సెట్ అవుతుందని అంటాడు. బాలు ఇచ్చిన సలహా మేరకు షాప్‌ని ఫ్యామిలీ అంతా చూసి ఓకే చేస్తారు. అయితే షాప్ కు ఎవరి పేరు పెట్టాలి అని తలో ఒక మాట చెబుతారు. దాంతో సుశీలమ్మ గారి పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని చెబుతుంది మీనా. ఇంట్లో వాళ్లంతా దానికి ఓకే చెప్పగా.. ప్రభావతి మాత్రం కుళ్లుకుంటుంది. అయితే రోహిణి మాత్రం ప్రభావతి పేరును పెడదామని భర్తతో చెప్పగా మా అమ్మ పేరు అస్సలు కలిసి రాదని ఇప్పటికీ మన పార్లర్, మీనా పూల కొట్టు మూతపడ్డాయని అంటాడు మనోజ్. వీరి మాటలను బాలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. మరోవైపు శృతి రవితో తన నైటీని వేయించి ఇంట్లో వాళ్ళకు దొరికిపోయేలా చేస్తుంది. దాంతో రవిపై బాలు సెటైర్లు వేస్తాడు.

సెప్టెంబర్ 2వ తేదీ 501వ ఎపిసోడ్‌లో..
రోహిణి, మనోజ్‌లు వ్యాపారం కోసం తిరుగుతుండటంతో వంట విషయంలో మీనాపై మండిపడుతుంది ప్రభావతి. దాంతో మీనా, బాలులు మండిపడుతారు. అక్కడే ఉన్న సత్యం కూడా భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇంకా వ్యాపారమే మొదలు పెట్టలేదు.. అప్పుడే రోహిణి, మనోజ్‌లు ఎలా బిజీ అయిపోయారని ప్రశ్నిస్తాడు బాలు. దాంతో ప్రభావతి బాలుకి వార్నింగ్ ఇస్తుంది. ఇక రోహిణితో మీకు ఏం కావాలంటే అది మీనా వండి పెడుతుందని చెబుతుంది ప్రభావతి. ఇంట్లో కూరగాయలు లేవని మీనా చెప్పడంతో మనోజ్‌ను కూరగాయలు తీసుకు రమ్మని బయటికి పంపిస్తుంది రోహిణి. మార్కెట్‌కు వెళ్తూ 500 పట్టుకెళ్లిన మనోజ్ ఒక్క రూపాయితో తిరిగి వస్తాడు. ఇలాగైతే నువ్వు వ్యాపారం చేసినట్టే అని కుటుంబమంతా సెటైర్లు వేస్తాడు. ఇంతలో మీనా వాళ్ల అమ్మ ఇంటికి రాగా.. పార్వతమ్మను సూటిపోటు మాటలతో ఇబ్బంది పెడుతుంది ప్రభావతి.

Gunde Ninda Gudi Gantalu week roundup story september 1st to september 5th Episodes highlights

సెప్టెంబర్ 3వ తేదీ 502వ ఎపిసోడ్‌లో..
బాలు, మీనాల పెళ్లి రోజు కావడంతో ఎలాంటి ఏర్పాట్లు చేయాలని ఇంటిల్లిపాది చర్చించుకుంటూ ఉంటారు. వాళ్లకు పెళ్లిరోజులు, భారీ ఏర్పాట్లు ఎందుకని ప్రభావతి ప్రశ్నిస్తుంది. కానీ సత్యం, రవి, శృతి మాత్రం బాలు మీనాల పెళ్లి రోజును గ్రాండ్‌గా చేయాల్సిందేనని పట్టుబడతారు. ఇదే సమయంలో ఊర్లో నుంచి సుశీలమ్మ కూడా వచ్చి బాలు, మీనాల పెళ్లి రోజును ఘనంగా నిర్వహించాలని ఆర్డర్స్ వేస్తుంది. బాలు మీనాల పెళ్లి రోజు ఉండటంతో మీనా తల్లి పార్వతమ్మ వచ్చి.. అల్లుడిని, కూతురిని ఇంటికి రమ్మని చెబుతుంది. పార్వతమ్మను చూడగానే ప్రభావతి నానా మాటలతో అవమానిస్తుంది. దాంతో మీనా ఆగ్రహంతో ఊగిపోతూ తన తల్లికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ దెబ్బకు ప్రభావతి నోరు మూసుకుంటుంది.

సెప్టెంబర్ 4వ తేదీ 503వ ఎపిసోడ్‌లో..
బాలు, మీనాల పెళ్లిరోజు వేడుకలకు మౌనిక, సంజూలను తమ ఇంటికి రావాలని ఆహ్వానిస్తుంది సుశీల డార్లింగ్. మీ ఇంటికి వెళ్లడం నాకు ఏమాత్రం ఇష్టం లేదని అంటాడు సంజూ. అయితే తల్లి చీవాట్లు పెట్టడంతో బాలు ఇంటికి వెళ్లడానికి ఒప్పుకుంటాడు. ఆ బాలుని మరోసారి అవమానిస్తానని మనసులో అనుకుంటాడు సంజూ. మీనా- బాలుల పెళ్లి రోజు గురించి ఇంట్లో వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మౌనిక రావడంతో అంతా ఆనందిస్తారు. తనను ఎవ్వరూ పట్టించుకోక పోవడంతో సంజూ నానామాటలతో బాలుని ఇబ్బంది పెట్టాలని చూడగా.. మీనా, బాలులు రివర్స్‌లో తగులుకుంటారు. అల్లుడుగారికి అన్ని మర్యాదలు సక్రమంగా జరగాలని మీనాకు ప్రభావతి ఆర్డర్స్ వేస్తుంది. అలాగే నోరు అదుపులో పెట్టుకోమని బాలు నుంచి మాట తీసుకుంటుంది మీనా.

సెప్టెంబర్ 5వ తేదీ 504వ ఎపిసోడ్‌లో..
సంజూ, మీనాల కోసం బెడ్ రూం ఖాళీ చేయమని రోహిణిని ప్రభావతి అడుగుతుంది. మీ అబ్బాయికి అక్కడే నిద్రపడుతుందని రోహిణి చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది. భోజనాల దగ్గర మౌనిక కుటుంబాన్ని అవమానించాలని సంజూ అనుకుంటాడు. ఒకరు తిన్న ప్లేట్‌లో నేను భోజనం చేయనని చెప్పడంతో ప్రభావతి వెళ్లి అల్లుడి కోసం వెండి ప్లేట్ తీసుకొస్తుంది. అది నాదేనని, నా సుశీల డార్లింగ్ చేయించిందని చెప్పడంతో సంజూ రగిలిపోతాడు. నాకు విస్తరాకులో పెట్టండి చాలు.. అంటూ ఎక్స్‌ట్రాలు చేస్తాడు. మీరు రెస్టారెంట్‌కి వెళితే.. ఖైదీలు బొచ్చె మోసుకెళ్లినట్లుగా మోసుకెళ్తారా అని బాలు సెటైర్లు వేస్తాడు.

బాలు దెబ్బకు సంజూ నోరుమూసుకుంటాడు. భోజనాల తర్వాత అందరూ మిద్దెపై మాట్లాడుకుంటూ సంజూపై సెటైర్లు వేస్తారు. ఆ మాటలు విన్న సంజూ.. వెంటనే మౌనికను కిందకి లాక్కెళ్లి నువ్వు ఇంటికి వెళ్లాక నిన్ను ఏడిపిస్తానని వార్నింగ్ ఇచ్చి తలుపు సందులో పెట్టి వేళ్లు విరిచేస్తాడు. అది చూసిన బాలు.. వాడిని చంపేస్తానని ఊగిపోతాడు. దాంతో బాలుని మీనా ఓదార్చి పక్కకి తీసుకెళ్తుంది. పెళ్లి రోజు కావడంతో అందరి దగ్గరా ఆశీర్వాదం తీసుకుంటారు బాలు - మీనా. సుశీలమ్మ దెబ్బకి మీనా నుదిటిన ముద్దుపెడుతుంది ప్రభావతి. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X