Gunde Ninda Gudi Gantalu Weekly: బాలు మీనాలని కలిపిన సుశీల.. కొడుకు కోసం రోహిణి ఆరాటం

Gunde Ninda Gudi Gantalu Weekly: బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రోజురోజు ఆదరణ పెరుగుతోంది.ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో గుండె నిండా గుడి గంటలుకున్న క్రేజ్ మరే సీరియల్ కు ఆ స్థాయిలో లేదనే చెప్పాలి. ఫలితంగానే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి సక్సెస్ సీరియల్స్ జాబితాలో స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే సెప్టెంబర్ 8వ తేదీ నుంచి సెప్టెంబర్ 12వ తేదీ వరకు జరిగిన 'గుండె నిండా గుడి గంటలు' సీరియల్‌లో ఏం జరిగిందో మీరే ఓ లుక్కేయండి మరి!

Gunde Ninda Gudi Gantalu week roundup story september 8th to september 12th Episodes highlights

సెప్టెంబర్ 8వ తేదీ 505వ ఎపిసోడ్‌లో..
బాలు, మీనాల పెళ్లి రోజు సందర్భంగా వారిద్దరూ అందరి ఆశీర్వాదం తీసుకుంటారు. సంజూకి కాఫీ నేనే ఇస్తానని చెప్పి వేడి వేడి కాఫీలో అతని వేళ్లు పెడతాడు బాలు. ఆ దెబ్బకు నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన సంజూపై కాఫీ పడటంతో అతను కేకలు వేస్తాడు. ఆ వెంటనే స్నానానికి మరిగే మరిగే నీళ్లు తీసుకెళ్లడంతో సంజూ బాడీ కాలిపోతుంది. భోజనాల దగ్గర మౌనిక కుటుంబాన్ని నవ్వుల పాలు చేయాలనుకున్న సంజూ మీ ఇంటి ఫుడ్ నాకు వద్దని నేను పిజ్జా ఆర్డర్ చేసుకున్నానని చెబుతాడు. ఇంటికి పిజ్జా డెలివరీ కాగానే దానిపై కారం, మిరియాల పొడి చల్లేయడంతో పిజ్జా డెలివరీ బాయ్ ఆశ్చర్యపోతాడు. పిజ్జాను చూడగానే మనోజ్‌కు కూడా తినాలని అనిపించడంతో బాలు వద్దు అన్నట్లుగా సైగలు చేస్తాడు. అయినా వినిపించుకోకుండా నాకు మీనా చేసిన వంటలు వద్దు నాకు పిజ్జాయే కావాలని తింటాడు. పిజ్జాలో కారం దెబ్బకి మనోజ్, సంజూలకి మండిపోతుంది. అయినప్పటికి తమ పరువు పోకూడదని అలాగే తినేస్తారు. కారం దాటికి మనోజ్ బాత్‌రూమ్‌కి పరుగులు తీస్తాడు. ఇదంతా మన పనేనని, వాడు నా చెల్లెలి వేళ్లు విరిచేస్తాడా? అని బాలు అంటాడు. నీకు మీ అమ్మనాన్న ఎలాగే.. మీనాకి కూడా పుట్టినిల్లు అంతేనని చెప్పి మీనాను తీసుకుని పార్వతమ్మ ఇంటికి వెళ్లమని చెబుతాడు సత్యం.

సెప్టెంబర్ 9వ తేదీ 506వ ఎపిసోడ్‌లో..
పార్వతమ్మ ఇంటికి వెళ్లడం తనకు ఇష్టం లేకపోయినా తండ్రి కోసం సరేనని మీనాని ఆమె పుట్టినింటికి తీసుకెళ్తాడు బాలు. నువ్వు, మా నాన్న నన్ను ఇబ్బంది పెడుతున్నారని కారులో మీనాతో అంటాడు బాలు. పార్వతమ్మ ఇంటికి భార్యాభర్తలిద్దరూ రాగానే.. ఇరుగుపొరుగు వాళ్లు మీనా, బాలులని చూసి సంతోషిస్తాడు. మీరిద్దరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని దీవిస్తారు. మా పెళ్లి రోజుకు మీరు పెట్టిన షర్ట్ బాగుందని, ఎక్కడ కొన్నారని అత్తగారిని బాలు అడగ్గా.. నేను కొనలేదని శివ తీసుకొచ్చాడని చెబుతుంది పార్వతమ్మ. ఆ మాటలతో బాలు రగిలిపోతాడు. ఇంతలో శివ వస్తాడు. మీరు ప్రతి రూపాయి కష్టపడి సంపాదిస్తారు కాబట్టి ఏం ఇచ్చినా తీసుకుంటా.. వీడు మందిని ఇబ్బంది పెట్టి ఆ వచ్చిన డబ్బుతో కొన్నాడని శివపై మండిపడతాడు. నేనంటే ఇష్టం లేనప్పుడు నేను తీసుకొచ్చిన షర్ట్ ఎందుకు వేసుకున్నావని శివ కూడా ఎదురుతిరుగుతాడు. దాంతో బాలు షర్ట్ విప్పేసి శివ ముఖంపై కొట్టి కోపంగా అలాగే ఇంటికి వెళ్లిపోతాడు. షర్ట్‌తో వెళ్లి షర్ట్ లేకుండా వచ్చిన కొడుకుని చూసిన సత్యం, ప్రభావతిలు షాక్ అవుతారు. అత్తగారింట్లో ఏం జరిగిందో చెప్పమని బాలు, మీనాలను నిలదీస్తారు. అత్తగారింటికి వెళితే బట్టలు పెట్టి పంపిస్తారు.. మీ అత్తగారు ఉన్న బట్టలు కూడా లాక్కొని పంపించారని సంజూ సెటైర్లు వేస్తాడు.

సెప్టెంబర్ 10వ తేదీ 507వ ఎపిసోడ్‌లో..
పార్వతమ్మ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని ప్రభావతి ప్లాన్ చేస్తుంది. మీనా దగ్గరికి రోహిణిని పంపుతుంది ప్రభావతి. ఇది మా పర్సనల్ అని మా జోలికి రావొద్దని రోహిణికి మీనా వార్నింగ్ ఇస్తుంది. సుశీల, మీనాలు బుజ్జగించడంతో బాలు షర్ట్ వేసుకుంటాడు. బాలు, మీనాల పెళ్లిరోజు కావడంతో శృతి తల్లి వచ్చి బంగారు గాజుల్ని కానుకగా ఇవ్వడంతో ప్రభావతి, రోహిణిలు షాక్ అవుతారు. కానీ మీనా ఆ గాజుల్ని తీసుకోకుండా శృతి చేతికి తొడుగుతుంది. నా భార్యకి బంగారం మీద పిచ్చి లేదని ఆత్మాభిమానం ఎక్కువని మెచ్చుకుంటాడు బాలు. నేను కూడా ఓ గిఫ్ట్ తెచ్చానని బాలుకి ఓ కవర్ ఇస్తాడు సంజూ. ఆ లెటర్ చదివిన మనోజ్.. బావగారు నీకు పర్సనల్ డ్రైవర్‌గా ఉద్యోగం ఇచ్చారని, నెలకు 50 వేల రూపాయల జీతమని చెప్పడంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. నేను ఎవరి కిందా నేను పనిచేయనని సంజూకి కౌంటరిస్తాడు బాలు. సంజూ వెళ్లి కుర్చీలో కూర్చోగా అది విరిగి నేల మీద పడిపోతాడు. మీకు కొనేంత స్థోమత లేదని నేనే సోఫా కొని పంపిస్తానని చెబుతుంది శృతి తల్లి. ఆ మాటలతో సత్యం, బాలులు రగిలిపోతారు.

Gunde Ninda Gudi Gantalu week roundup story september 8th to september 12th Episodes highlights

సెప్టెంబర్ 11వ తేదీ 508వ ఎపిసోడ్‌లో..
మీనా, బాలుల పెళ్లి జరిగి ఏడాది పూర్తయ్యిందని.. ఈ సంవత్సరం వారిద్దరి గురించి ఏం తెలుసుకున్నారో ఒక్కొక్కరు చెప్పాలని శృతి అంటుంది. దానిని ఓ బ్యూటిఫుల్ వీడియోగా మార్చేస్తానని చెబుతుంది. దాంతో మీనా, బాలుల గురించి ఇంట్లో వాళ్లంతా గొప్పగా చెబుతారు. ప్రభావతి కూడా మాట్లాడాలని అందరూ పట్టుబట్టడంతో తిట్టుకుంటూనే మీనాను మెచ్చుకుంటూ మాట్లాడుతుంది. బాలు అన్నయ్య, మీనా వదిలన లాగే నేను, నా భర్త ఉండాలని కోరుకుంటున్నామని మౌనిక చెప్పడంతో వారిద్దరి మధ్య సఖ్యత లేదని అందరూ అనుకుంటారు. మౌనిక, సంజూలు ఇంటికి బయల్దేరుతుండగా కారు దగ్గర సంజూ వేళ్లపై డోర్ వేస్తాడు బాలు. నా చెల్లెలు బాధపడితే నేను బాధపడతాను, నేను బాధపడితే నువ్వు రెట్టింపు బాధపడతావని వార్నింగ్ ఇస్తాడు. బాలు, మీనాల పెళ్లి రోజు అందరూ వచ్చినా రోహిణి తరపు నుంచి ఎవరూ రాకపోవడంతో ప్రభావతి కోడల్ని నిలదీస్తుంది. దాంతో రోహిణి తన తల్లికి ఫోన్ చేసి జరిగినదంతా చెబుతుంది. పెళ్లి రోజు కూడా బాలు మీనాలు మేడపైన పడుకోవడానికి వెళ్లడంతో సుశీల డార్లింగ్ మండిపడుతుంది. ఇంట్లో ఏం జరుగుతుందని ప్రభావతిపై ఫైర్ అవుతుంది.

సెప్టెంబర్ 12వ తేదీ 509వ ఎపిసోడ్‌లో..
ముగ్గురు కోడళ్లు, ముగ్గురు కొడుకులను నువ్వు వేరు వేరుగా చూస్తున్నావని ప్రభావతిపై ఫైర్ అవుతుంది సుశీల డార్లింగ్. బాలు, మీనాలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే మేడపైన మరో రూమ్ కట్టించాలని ఇందుకు కావాల్సిన డబ్బు నేనే ఇస్తానని సత్యానికి చెబుతుంది సుశీల. ఉదయాన్నే ఈ విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడతాడు సత్యం. నా పెన్షన్ డబ్బులతో మరో రూమ్ కట్టిస్తానని సత్యం చెప్పడంతో నువ్వు ఈ వయసులో కష్టపడొద్దని.. నేను, మీనాలు సర్దుకుపోతామని చెబుతాడు బాలు. మా నాన్నతో చెబితే నిమిషాల్లో ఇంకో గది కట్టిస్తాడని శృతి చెప్పడంతో సత్యం దానిని అవమానంగా ఫీల్ అవుతాడు. దాంతో ఎవరికి ఇబ్బంది లేకుండా సుశీల ఓ పరిష్కారం చెబుతుంది. గదిని ముగ్గురు కోడళ్లు, ముగ్గురు కొడుకులు సమానంగా వాడుకోవాలని.. వారానికి ఒకరు హాల్‌లో పడుకోవాలని చెబుతుంది. మనోజ్, రోహిణిలు ఫర్నిచర్ షాపుని తమ పేరు మీదకి మార్చుకునే పనిలో బిజీగా ఉంటారు. ఇక హాల్‌లో పడుకోవడానికి మనోజ్ - రోహిణిలు రాకపోవడంతో బాలు వెళ్లి తలుపులు బాదేస్తాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X