For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu Weekly Roundup: తండ్రి మాటతో వసుధార షాక్.. రగిలిపోయిన దేవయాని, బాధలో రిషి!

  |

  యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్​లో వసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో పాటు కన్నకొడుకుపై తల్లి ప్రేమ, ఆ తల్లి చిన్నప్పుడు విడిచిపెట్టి పోయిందన్న కొడుకు ఆవేదనతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టులతో సీరియల్ మంచి ప్రేమ కథగా ముందుకెళ్తోంది. గత వారం రోజులుగా అంటే డిసెంబర్ 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే వివరాల్లోకి వెళితే..

  డిసెంబర్ 19వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 19వ ఎపిసోడ్ లో..

  నా మనసులో ఉన్న విషయాలు జగతికి చెప్పాలినిపించింది చెప్పాను. అంతే.. నువ్వు వెళ్లు. నీకు జగతి చెబుతుందిలే అంటుంది దేవయాని. ఏమైంది జగతి అని మహేంద్ర అడిగితే.. రిషి, వసుధార పెళ్లి జరగదని చెప్పింది అంటుంది జగతి. ఏదో కొత్త కుట్రతో అక్కయ్య రెడీగా ఉన్నారు. తన కుట్రలను ఎలాగైనా ఛేదించాలని అంటుంది జగతి.

  మరోవైపు బాల్కనీ వద్ద వసుధార, రిషి ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా దేవయాని వస్తుంది. ఏంటీ రిషి ఇక్కడున్నారని అడుగుతుంది. రేపు ప్రయాణం చేయాలి కదా వెళ్లి పడుకోమని రిషికి చెబుతుంది. నువ్వైనా చెప్పాలి కదా వసుధార అంటే.. చలిగా ఉంది మీరు ఈ సమయంలో బయట తిరగకండి.. ఆరోగ్యం జాగ్రత్త అని వసుధార అని వెళ్లిపోతారు.

  రేపే ప్రయాణం.. పెళ్లి సంబంధం కలుపుకోవడానికి.. కాదు కాదు.. సంబంధం తెంపుకోవడానికి అని దేవయాని వెంటనే వసుధార బావ రాజీవ్ కి కాల్ చేస్తుంది శాశ్వతంగా దూరం చేయాలని అంటుంది. దేవయాని ఫోన్ మాట్లాడటాన్ని మహేంద్ర చూస్తాడు. ఈ సమయంలో ఎవరితో మాట్లాడుతుంది అని వచ్చి పలకరిస్తాడు.

  డిసెంబర్ 20వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 20వ ఎపిసోడ్ లో..

  మనం వస్తున్నామని మీ ఇంట్లో వాళ్లకు కాల్ చేసి చెప్పావా అని వసుధారను అడుగుతాడు ఫణీంద్ర. వసుధారను ఏదో ఒకటి అడుగుతుండగా రిషి ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు దేవయాని తెగ హడావిడి చేస్తుంది. తర్వాత క్షమించండి.. మీరు ఎవరు నాతో రావొద్దు అని వసుధార అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

  ఏంటీ వసుధార.. మీరెవరు రావొద్దంటున్నావ్.. అని దేవయాని అంటే.. అవును మేడమ్.. మీరు ఈరోజు రావొద్దు.. అని అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది దేవయాని. వసుధార అందరం వెళ్దాం అనుకున్నాం కదా.. ఇప్పుడు వద్దంటావ్ ఏంటి అని అడుగుతాడు రిషి.

  సర్ మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు. అలాంటిది సడెన్ గా వెళ్లి పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అందుకే నేను ముందుగా వెళ్లి వాళ్లకు చెప్పి ఆ తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని అంటుంది వసుధార.

  డిసెంబర్ 21వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 21వ ఎపిసోడ్ లో..

  మహేంద్ర ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు. వెళ్లాల్సిన సమయం వచ్చింది డాడ్. వసుధార పరిస్థితి నాకు అర్థమైంది. నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదనిపించింది. వసుధార వాళ్లింటికి వెళతాను అని రిషి అంటాడు. రిషి నువ్ వెళ్లడమేంటి అని మహేంద్ర అడిగితే.. వసుధారకి ఎక్కడ కష్టం ఎదురవుతుందో అక్కడ నేనుండాలి.

  తను ఇంటికి పంపించానని నేను నిబ్బరంగా ఉన్నాను. కానీ, తను ఇంట్లో కష్టాలు ఎదుర్కొనేందుకు ఒంటరిగా వెళ్లిందని ఇప్పుడే తెలిసింది అని రిషి అంటాడు. రిషి.. నేను వెళ్లొద్దు అనడం లేదు. ఒక్క నిమిషం ఉండు ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్లి.. నల్లపూసల గొలుసు తీసుకుని వచ్చి ఇస్తుంది జగతి. ఇది వసుకి ఇవ్వు అని చెబుతుంది. ఏంటిది అని రిషి అడిగితే.. నేనిచ్చానని చెప్పు అంటుంది జగతి.

  తర్వాత ఓపెన్ చేద్దాం అనుకుని ఆగిపోతాడు రిషి. వసుధార ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. తనకి కష్టం ఉందని తెలిస్తే తనను ఒంటరిగా వదిలి ఉండలేను అని రిషి అంటే.. వసుధార వాళ్ల ఊరు వెళ్లు.. కానీ వాళ్లింటికి వద్దని జగతి చెబుతుంది.

  డిసెంబర్ 22వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 22వ ఎపిసోడ్ లో..

  వసుధారతో రిషి వెళ్లడాన్ని జీర్ణించుకోలేక పోతుంది దేవయాని. దీంతో ఇంట్లో డిస్కషన్ పెడుతుంది. మహేంద్ర చిన్న పిల్లోడు కాదు.. తనకు వెళ్లాలనిపించింది వెళ్లాడు. ఇందులో మన జోక్యం ఎంతవరకు ఉండాలో అంతే ఉంటే బాగుంటుంది అని మహేంద్ర అంటాడు. నాకు చెప్పే నీతులు రిషికి చెబితే ఆగిపోయేవాడు.

  ఏవండి ఇక్కడ మాట్లాడరేంటి అని ఫణీంద్రను ఉద్దేశించి అంటుంది దేవయాని. మీ వదిన చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తోంది కదా అని ఫణీంద్ర అంటాడు. ఇంతలో అనిపించడం కాదు.. అక్కడ రిషి అవమాన పడేలోగా అందరం కలిసి వెళదాం పదండి అని బలవంతం చేస్తుంది దేవయాని. జరిగిందేదో జరిగిపోయింది. రిషి కాల్ చేసినప్పుడే వెళదాం. ఇప్పుడు హడావిడిగా వెళ్లాల్సిన అవసరం లేదు. రిషి కాల్ చేశాకే వెళదాం అని చెప్పేసి వెళ్లిపోతాడు ఫణీంద్ర.

  డిసెంబర్ 23వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 23వ ఎపిసోడ్ లో..

  జగతి మేడమ్ పై మీకు ఉన్న ద్వేషం పోదా సార్ అని అడుగుతుంది. వసుధార కోపం పోతుందేమో కానీ ద్వేషం అన్నావ్ చూడు.. అది ద్వేషం కాదు.. పెయిన్. కోపాలను, ద్వేషాలను కాలం కలిగిస్తుంది కానీ బాధను కాలం తగ్గించదు అంటాడు రిషి. జగతి మేడమ్ మా డాడ్ కి ప్రాణం. డాడ్ అంటే నాకు ప్రాణం. డాడ్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. మేడమ్ పై నాకు కృతజ్ఞత ఉంది.

  ఎందుకంటే ఓ వైపు డాడ్ విషయంలో, ఇంకోవైపు ఈ ప్రేమబంధం పరోక్షంగా జగతి మేడమ్ ద్వారానే వచ్చింది కాబట్టి. ఓ బంధాన్ని వద్దనుకుంది. ఇంకో బంధాన్ని కలిపింది. ఈ విషయంలో మేడమ్ రుణం తీర్చుకోలేను. ఆ విషయంలో మనససు మార్చుకోలేను అని క్లారిటీగా ఇస్తాడు రిషి. జగతి ఇచ్చిన నల్ల పూసలు గుర్తుకు వచ్చి ఆ బాక్స్ వసుధారకు ఇస్తాడు రిషి. ఏంటీ సార్ అని వసుధార అడిగితే.. నేను చూడలేదని చెబుతాడు రిషి.

  డిసెంబర్ 24వ ఎపిసోడ్ లో..

  డిసెంబర్ 24వ ఎపిసోడ్ లో..

  ఇన్ని రోజులు నా జీవితంతో ఆడుకుని నన్ను మహేంద్రకు కాకుండా దూరం చేశారు. ఇప్పుడు మళ్లీ రిషి జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారు. నేను ఇంటికి రావడం ఇష్టం లేదు. కానీ రిషి మాట మీద వచ్చాను. నన్ను ఏం చేయలేక వసుధారను అడ్డుపెట్టుకుని రిషిని శిక్షించాలని చూస్తున్నారా అని చాలా సీరియస్ గా అంటుంది జగతి.

  దీంతో దేవయాని షాక్ అవుతుంది. మనుషులను, బంధాలను విడదీసి మీరు ఏం బాగుపడతారు అక్కయ్య. ఇన్నిరోజులపాటు మీరు ఏం సాధించారు. ఇప్పుడు ఏం సాధించబోతున్నారు. ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకండి అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తుంది జగతి. నా జోలికి రండి పర్లేదు. నన్ను ఏమైనా చేయండి కానీ, రిషి జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని జగతి అంటుంది.

  జగతి మాటలకు కంగుతిన్న దేవయాని టెన్షన్ తో నీ సంగతి, ఆ వసుధార సంగతి తొందర్లేనే తేలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తల్లి. తండ్రి దగ్గరికి వెళ్లి యూనివర్శిటీ టాపర్ గా వచ్చాను నన్ను దీవించండి అని అడిగితే ఎందకు వచ్చావ్ అని అంటాడు వసుధార తండ్రి. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార.

  English summary
  Guppedantha Manasu Weekly Roundup
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X