For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu weekly roundup : వసుధార ప్రేమ బాసలు.. సాక్షి కుతంత్రాలు.. రిషి కి టెన్షన్ టెన్షన్!

  |

  యూత్ ఫుల్ లవ్ స్టోరీగా సాగుతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఏడాదిన్నర నుంచి సాగుతున్న ఈ సీరియల్ లోవసుధార-రిషి-సాక్షి ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తికరంగా మలుస్తున్నారు. ఇక ప్రతీ ఎపిసోడ్‌లో రకరకాల ట్విస్టుతో సీరియల్ మంచి లవ్ స్టోరీగా ముందుకెళ్తున్నది. గత వారం రోజులుగా అంటే జూలై 18 నుంచి జూలై 23 తేదీ వరకు గుప్పెడంత మనసు సీరియల్ ఎలాంటి మలుపులు తిరిగిందనే వివరాల్లోకి వెళితే..

  జూలై 18వ తేదీ ఎపిసోడ్

  జూలై 18వ తేదీ ఎపిసోడ్

  సాక్షి వసుధారను బట్టలు లేవని అవమానించడంతో రిషి..వసుకి బట్టలు కొంటాడు. వసు రియాక్షన్ ఎలా ఉంటుందో, యాక్సెప్ట్ చేస్తుందా, చేయదా అనుకుంటూనే తను కొనితీసుకోచ్చిన డ్రెస్సులు తీసుకోమని కోరతాడు రిషి. నా డ్రెస్సింగ్ బాలేదని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారా, డైరెక్ట్ గానే చెప్పారా. ఆత్మగౌరవం, సోషల్ స్టేటస్ ఇవన్నీ నాకు లేవనా అంటూ ముందు ఫైర్ అయిన వసుధార సాక్షి వచ్చి ఏంటి ఇదంతా అడగడంతో తానే తీసుకుని రమ్మన్నానని చెబుతుంది. అలా 18వ తారీఖు ఎపిసోడ్ డ్రెస్సులు చుట్టూ తిరిగింది.

  జూలై 19వ తేదీ ఎపిసోడ్

  జూలై 19వ తేదీ ఎపిసోడ్

  ఒక అమ్మాయికి డ్రెస్సులు ఇస్తే ఏమన్నట్టు..అంటే నాకు డ్రెస్సులు లేవనా, బాలేవనా, నేను ఈ మాత్రం కొనుక్కోలేననా అని రిషి బట్టలు కొనిచ్చిన విషయం జగతితో ప్రస్తావిస్తుంది వసుధారా. రిషి ఏం చేసినా ఏదో కారణం, అర్థం లేకుండా చేయడు, దీనికి లింక్ ఎక్కడో ఉందని నా అభిప్రాయం అని అనడంతో సమాధాన పడుతుంది. తరువాత రోజు అదే బట్టలు వేసుకుని కాలేజీకి వెళ్లడంతో రిషి ఆనంద పడతాడు. ఇక ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఉండగా జగతి -మహేంద్ర, రిషి -వసుధార దగ్గరకు రావడంతో ఎపిసోడ్ ముగిస్తారు.

  జూలై 20వ తేదీ ఎపిసోడ్

  జూలై 20వ తేదీ ఎపిసోడ్


  రిషి నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలని సాక్షి అడగడంతో చావు అంచుల వరకూ వెళ్లొచ్చిందన్న దేవయాని మాటలు గుర్తుచేసుకుని రిషి వస్తానంటాడు. ఆమె ఇంటికి ఒక్కడే వెళ్లకుండా గౌతమ్, జగతి, మహేంద్ర, వసుధారలను తీసుకుని వెళ్తాడు. ఆమెకు వంట చేయడం రాదని తెలుసుకుని వసుధారను పంపి వంట చేయమని అంటుంది జగతి. వసుధార పరువు తీయాలని కిచెన్లో ఏమీ లేవు..వంట చేస్తుందట వంట..ఇంతమందికి వంట చేయడం అంటే మాటలా..ఎటూ నాకు వంటరాదని తెలిసిపోతుంది.. కాసేపట్లో బయటకు వస్తుంది తన పరువు పోతుంది నేను రిలాక్స్ అయిపోవచ్చని అనుకుంటూ ఉండగా ఎపిసోడ్ ముగించారు.

  జూలై 21వ తేదీ ఎపిసోడ్

  జూలై 21వ తేదీ ఎపిసోడ్

  రిషిని ఇంటికి పిలిచిన సాక్షి గౌతమ్, జగతి, మహేంద్ర, వసుధార కూడా రావడంతో డిసప్పాయింట్ అవుతుంది. బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టి అడ్డంగా దొరికి పోయాక వసుధార అన్నం, పప్పు, ఫ్రై, మజ్జిగ పులుసు చేయడంతో మళ్ళీ షాకవుతుంది. తరువాత తనను డ్రాప్ చేయడానికి వస్తున్న రిషి సాక్షిమీద మీ అభిప్రాయ ఏంటి అని అడుగుతుంది. తను ఏం చెప్పినా ఊ అంటున్నారు, తనకు అనవసరంగా లేనిపోని ప్రాధాన్యత ఇస్తున్నారు. లైబ్రరీలో అంతలా మాట్లాడింది..అలా బ్లాక్ మెయిల్ చేయాలని చూసినా కూడా తనని ఏం జరగనట్టు ఎందుకలా చూస్తున్నారని అడుగుతుంది. అలా ఈ ఎపిసోడ్ ముగించారు.

  జూలై 22వ తేదీ ఎపిసోడ్

  జూలై 22వ తేదీ ఎపిసోడ్

  క్లాస్ రూమ్ లోకి వెళ్లిన రిషిని చూడకుండా వసుధార ఏదో అంటూ ఉండగా ఆ తర్వాత పుష్ప ఫోన్ రింగవడంతో అక్కడి నుంచి వెళ్లమని సైగ చేసిన రిషి...పుష్ప వెళ్లగానే చేతిలో ఉన్న గులాబీ తీసి వసుధార ముందు పెట్టేసి వెళ్లిపోతూ ఆల్ ది బెస్ట్ అని మెసేజ్ చేస్తాడు. జగతి-మహేంద్ర ఈ చదువుల పండుగ సమ్మిట్ ముగిసేసరికి వసు-రిషి కలవాలి అని ప్లాన్ చేయాలని అనుకుంటాడు. వసుని అసిస్టెంట్ గా తీసుకోమని రిషికి నచ్చచెబుదాం అని మహేంద్ర అంటే సరే అంటుంది జగతి. కానీ సాక్షి కూడా పోటీకి రావడంతో ఇద్దరికీ ఒక టెస్ట్ పెట్టడానికి సిద్ధం అవుతాడు రిషి.

  జూలై 23వ తేదీ ఎపిసోడ్

  జూలై 23వ తేదీ ఎపిసోడ్


  వసుధార - సాక్షి మధ్య చిన్న పరీక్ష పెట్టి తన అసిస్టెంట్ ని సెలెక్ట్ చేస్తానంటాడు రిషి. మూడు ప్రశ్నలు ఇద్దర్నీ అడుగుతా, .వారు చెప్పే సమాధానం మీకు నచ్చితే చేయెత్తి ఓటేయండి..ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లని సెలెక్ట్ చేద్దాం అంటాడు రిషి ఇంత ప్రాసెస్ అవసరమా అని గౌతమ్ అంటే ఏ ఒక్కరినీ అగౌరవ పరచడం ఇష్టం లేదని అంటాడు. ఇక అలా చివరికి వసుధార గెలవడంతో ఆమెను తన అసిస్టెంట్ గా, సాక్షిని తన తల్లి అసిస్టెంట్ గా నియమిస్తాడు రిషి.

  English summary
  Guppedantha Manasu is a telugu soap telecasting on star maa. here are the written updates of July 18th to 23rd Episodes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X